క్రైస్తవ దృక్కోణములో

వాస్తవాలు & అవాస్తవాలు

ముస్లీముల విశిష్టత

ప్రపంచవ్యాప్తంగా వున్న దాదాపు 180 కోట్ల మంది ముస్లీములలో అనేక తెగలు, శాఖలు, మరియు విభాగాలు వున్నా ఇస్లాము మతస్తులైన ముస్లీము ప్రజలను చూసి ఇతర మతస్థులు, ముఖ్యంగా క్రైస్తవులుగా చెప్పుకునేవారు, మెచ్చుకోదగిన మరియు నేర్చుకొదగిన విశయాలు ఎన్నో వున్నాయి. వాటిలో కొన్ని ఈ క్రింద యివ్వబడినవి:

  • దైవగ్రంథము బైబిలు తెలియచేస్తున్న విధంగా మానవులందరివలె ముస్లీములుకూడా దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డారు.
  • పక్షపాత రహితుడైన దేవుని ప్రేమ అందరికి యివ్వబడిన విధంగా ముస్లీములకు కూడా సమాంతరస్థాయిలో యివ్వబడింది...


ఒక ముస్లీముకొచ్చిన సందేహం!

ఒకవేళ ఒక ఫలాని వ్యక్తి సృష్టించబడితే ఆ వ్యక్తి తన మరణానంతరము నరకంలో నిత్యయాతనను అనుభవించబోతున్నాడు అన్న వాస్తవం అల్లాహ్ కు ముందే తెలిసి కూడా ఆవ్యక్తిని అల్లాహ్ సృష్టిస్తే ఇక అల్లాహ్ అనంత కరుణామయుడు ఎలా అవుతాడు...?

ఒక అబ్దుల్లా విధిని నిత్యనరకంలో యాతనను అనుభవించాలని, ఒక అహ్మద్ విధిని జన్నతులో నిత్యసంతోషాలతో సుఖించాలని అల్లాహ్ నిర్ణయిస్తున్నట్లయితే అల్లాహ్ అత్యంత న్యాయవంతుడెలా అవుతాడు...?
ఒక అబ్దుల్లా విధిని నిత్యనరకంలో...


బైబిలుపై ఖురాను & హదీసులు

ముస్లీముల ధార్మిక గ్రంథమైన ఖుర్'ఆన్ లో యూదులు మరియు క్రైస్తవుల ధార్మిక గ్రంథాలకు ఎంతో ప్రత్యేకమైన ఉన్నత స్థానం యివ్వబడింది. ఆ గ్రంథాల ప్రామణికత్వానికి వత్తాసుపలుకుతూ ముస్లీముల దృష్టిలో తన ప్రమాణికత్వాన్ని ఖుర్'ఆన్ రుజువుపరచుకుంటున్నది. ఖుర్'ఆన్ బోధ ప్రకారం పూర్వగ్రంథాల ప్రామాణికత్వమే ఖుర్'ఆన్ ప్రామాణికత్వానికి ఆధారం.

యూదులు మరియు క్రైస్తవుల ధార్మిక గ్రంథాలైన తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ సమిష్టిగా ఈనాడు బైబిల్ [పరిశుద్ధ గ్రంథము] అని పిలివబడుతున్నాయి. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్థములోనే యూదులు మరియు క్రైస్తవులు తమ ధార్మిక గ్రంథాలను అంటే ఈనాడు సమిష్టిగా బైబిల్...


మిగతా వివరాలు...

ఆహ్వానం!

సృష్టికర్త అయిన అద్వితీయ సత్యదేవుడు తన స్వరూపమందు తన పోలికచొప్పున సృష్టించబడిన మానవులందరిని ప్రేమించి ఎవరూ నశించటం యిచ్చయించక అందరూ సత్యాన్ని తెలుసుకొని మారుమనస్సు పొంది తన అనాదికాల సంకల్పాన్ని బట్టి తన అంశతో పుట్టిన మెస్సయ్య [మసీహ్] నందు మానవాళి పాపక్షమాపణకొరకై తానే నిర్వర్తించిన పాపపరిహారార్థ బలియాగాన్ని విశ్వసించి తద్వారా దైవ క్షమాపణను పొంది నిత్యజీవానికి వారసులు కావాలంటూ అందరిని అహ్వానిస్తున్నాడు. ఆయన ఆహ్వానాని స్వీకరించి మోక్షాన్ని పొందటమా లేక తిరస్కరించి నాశనములో ప్రవేశించటమా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం!

      దేవుడు అద్వితీయుడు

సమస్తాన్ని సృష్టించి పోషించి పాలిస్తున్న సృష్టికర్త ఒక్కడు లేక అద్వితీయుడు. ‘దేవుడు ఒక్కడు’ అన్న సత్యం సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులో పదహారుసార్లు విస్పష్టంగా పేర్కొనబడింది.

“దేవుడు ఒక్కడు” [God is one] అన్న పదజాలములోని ‘ఒక్కడు/ఒక్కటి ‘ [one] అన్నది గణితశాస్త్రపరమైన గుర్తు లేక అంఖ్య లేక పరిధి కాదు. గణితశాస్త్ర పరిధులు సృష్టికే అన్వయించతగును, సృష్టికర్తకు కాదు. రాయి ఒక్కటి, చెట్టు ఒక్కటి, చీమ ఒక్కటి, పంది ఒక్కటి, కుక్క ఒక్కటి....


మిగతా వివరాలు...

అవిశ్వాసి అపనింద

“సోదరీ, సోదరులైన ప్రపంచ క్రైస్తవ బోధకులారా!విశ్వాసులారా!!…
"నేను బైబిల్ చదవగా (మత్తయి 26:24,28,56 మార్కు9:12,13 లూకా24:25-27,44-48 అ; కార్య3:8,10:43 &1వ కోరింథీ15:3-5) లలో చెప్పిన మారుమనస్సు, పాపక్షమాపన, చనిపోయి లేచుట, అను విషయాలు గురించి సమస్త ప్రవక్తలు ముందే రాసారని, చెప్పారని ఉంది. అయితే (ఆది-మలాకి వరకు) యే ఒక్క ప్రవక్త ఒక్క చోటగాని, ఒక్కమాటగాని చెప్పిన దాఖలాలు లేవు. ఎక్కడా ఒక్కలేఖనం లేదు. దేవుని వాక్కు అసలే లేదు.అయితే నాలాంటివాడు మిమ్ములను అడిగినప్పుడు ఆధారాలు చూపాలి. ఆడిగినవాటికి లేఖనాలు లేనట్లా? ఉన్నట్లా? …

ఖుర్'ఆన్ లోని అల్లాహ్ ప్రవృత్తి

ఖురానులో వ్యక్తం చేయబడిన ప్రకారం పాపుల ఎడల ఖురానులోని అల్లాహ్ [الله‎/Allah యొక్క దృక్పదం, ప్రవృత్తి, మరియు ప్రణాలికలు విస్పష్టంగా తెలియచేయబడ్డాయి:

(1) సన్మార్గంలో వెళ్ళేవారిని అలాగే అపమార్గంలో వెళ్ళేవారిని ఆవిధంగా నడిపించేవాడు అల్లాహ్ తానే.
"అల్లాహ్ ఎవడికి సన్మార్గం చూపుతాడోఅతడే సన్మార్గం పొందినవాడవుతాడు. మరెవరిని ఆయన అపమార్గం పట్టిస్తాడోవారే నష్ట పోయినవారవుతారు." (సూరాహ్ 7:178)...


మిగతా వివరాలు...

ముస్లీములకు...

ఖుర్'ఆన్ ప్రబోధం

"విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, ఆయన తన ప్రవక్తపై అవతరింపజేసిన దానిని, అంతకు పూర్వం అవతరింపజేసిన వాటిని [తౌరాత్, జబూర్, ఇంజీల్] విశ్వసించండి. దేవుడ్ని, ఆయన దూతల్ని, ఆయన గ్రంథాల్ని, ఆయన ప్రవక్తల్ని, ప్రళయదినాన్ని విశ్వసించడానికి నిరాకరించినవాడు మార్గభ్రష్టత్వంలో పడి బహుదూరం కొట్టుకుపోయినట్లే." (ఖుర్'ఆన్, సూరాహ్.4:136)

"వారు ఈ గ్రంథాన్ని, గతంలో మా ప్రవక్తల ద్వారా మేము పంపిన గ్రంథాలన్నిటినీ [తౌరాత్, జబూర్, ఇంజీల్] తిరస్కరిస్తున్నారు. త్వరలోనే వారికి తెలుస్తుంది. అప్పుడు వారి మెడలకు గుదిబండలు కట్టి, సంకెళ్ళతో బంధించి సలసల మరిగే నీటి దగ్గరకు ఈడ్చుకెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత నరకాగ్నిలో విసరి వేయబడుతారు." (ఖుర్'ఆన్, సూరాహ్ 40:70-72)

ఇన్'జీల్ ప్రకటన

"దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను [ఈసా అల్-మసీహ్] నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనినిగూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును." (ఇంజీల్, 1తిమోతి.2:5-6)

"ప్రభువైన యేసు [రబ్ ఈసా] తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు [రబ్ ఈసా] సువార్తకు లోబడని వారికిని [బైబిలు బోధకు లోబడనివారిని] ప్రతిదండన చేయునప్పుడు...ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును, ప్రభువు [రబ్] వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. (ఇంజీల్, 1థెస్సలో.1:6-10)