ముహమ్మద్ & అయిషా

ముహమ్మద్ & అయిషా

April 4, 2021 ఇస్లాం ముహమ్మదు విశ్వాసాలు 0

ఇస్లామీయ గ్రంథాలు తెలియచేస్తున్న ప్రకారం*, ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ తాను 50 యేండ్ల వయస్సులో ఉండగా 6 సంవత్సరాల అయిషా అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. కాని, ఆ అమ్మాయికి 9 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాతే ముహమ్మద్ గారు ఆమెతో వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టాడు.

*{[సహిహ్ అల్-బుఖారి, వాల్యూం 5, బుక్ 58, నంబర్ 234 & వాల్యూం 9, బుక్ 87, నంబర్ 140,139 & వాల్యూం 7, బుక్ 62, నంబర్ 64, 65, & 88], [సహిహ్ ముస్లీం, బుక్ 008, నంబర్ 3309 & 3310], [సునన్ అబు దావుద్, బుక్ 41, నంబర్ 4915 & బుక్ 13, నంబర్ 2380]}

అనుచితం

పై విశయాన్ని ముస్లీమేతరులు విశ్లేషిస్తూ అతర్కమైన, అసందర్భమైన, మరియు ఎగతాళిచేసే విధానంలో అనుచితమైన వ్యాఖ్యలు చేయటం అప్పుడప్పుడు చూస్తుంటాము. ఇది గర్హనీయం!

ముహమ్మద్ మరియు అయిషాల వివాహాన్ని గురించి సరియైన అవగాహనకు రావటానికి యదార్థంగా మరియు నిస్పక్షపాతంగా ఆలోచిస్తూ కొన్ని వాస్తవాలను గమనములో ఉంచుకోవటం మరిచిపోకూడదు:

  • ఒక మానవునిగా ముహమ్మద్ గారు పెళ్ళి చేసుకోవటం తప్పు కాదు
  • ముహమ్మద్ గారు బలవంతానో లేక దొంగతనంగానో అయిషాను పెళ్ళి చేసుకోలేదు
  • అయిషా తల్లిదండ్రుల అనుమతితోనే ఆమెను ముహమ్మద్ గారు పెళ్ళి చేసుకున్నాడు
  • ముహమ్మద్ గారు అయిషాను పెళ్ళి చేసుకున్నది ఈమధ్య కాలములో కాదు
  • ముహమ్మద్ గారు అయిషాల పెళ్ళి దాదాపు 1400 సంవత్సరాల క్రితం అంటే 7వ శతాబ్ధములో జరిగిన సంఘటన
  • ఈ ఆధునిక యుగంలో అభ్యంతరకరంగా కనిపిస్తున్న వారి వివాహం సాంఘీకంగా ఎంతో వెనకబడి ఉన్న అరబ్బు జాతీయుల మధ్య జరిగిన పురాతన ఘటన

పై వాస్తవాల వెలుగులో, యేడవ శతాబ్ధములో ముహమ్మద్ గారు అయీషాను పెళ్ళి చేసుకోవటం అన్న దాన్ని గురించి ఈనాటి ప్రమాణాలతో కొలవటం, చర్చించటం, తీర్పుతీర్చటం అన్నవి అతర్కం, అసందర్భం, మరియు అవివేకం.

అసలు సమస్య

అయితే, ముస్లీం విశ్వాసులు ముఖ్యంగా దావా ప్రచారకులు ఆనాటి ముహమ్మద్ మరియు అయీషాల వివాహాన్ని ఈనాటి ప్రమాణాలతో సమర్ధించుకునే ప్రయత్నం చేస్తుండటమేగాక, ముహమ్మద్ గారు చూపిన ‘మాదిరి’ అన్నది మానవాళికంతా ఈనాడు కూడా మార్గదర్శకం అంటూ చెప్పుకోవటమే పెద్ద సమస్య!

ఆ మాదిరిని ఈనాడు కూడా యెమెన్ వంటి ముస్లీం దేశాలలోని ముస్లీంలు పాటించిన సందర్భాలలో అమాయక ఆడపిల్లలు మొదటి రాత్రే ప్రాణాలు కోల్పోతున్నారు అన్నది అంతర్జాతీయ వార్త.

అనేక ముస్లీం దేశాలలో పెద్ద వయస్సులో ఉన్న మగవాళ్ళు తమకన్న ఎంతో చిన్న వయస్సులో ఉన్న అమ్మాయిలను పెళ్ళి చేసుకోవటం ఈనాటికీ ఆనవాయితిగా వస్తున్నది. ఈ సాంప్రదాయం ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ గారి ‘మాదిరి’ నుండి నేర్చుకున్నదే. దీని పర్యవసానంగా ఎంతోమంది అమాయక ఆడపిల్లల జీవితాలు మొగ్గలోనే త్రుంచబడుతున్న పుష్పాలుగా మారుతున్నాయి. ఇవి తెలంగాణ నడిబొడ్డునకూడా సంభవిస్తున్న దుర్ఘటనలు.

ఇస్లాం బోధకులకు ప్రశ్నలు

జంతు సంభోగం, శవసంభోగం అలాగే వృద్ధులు చిన్నపిల్లలతో కామకలాపాలు జరిగించటం వంటివాటికి సభ్యసమాజంలో స్థానం లేదు. అవి లైంగిక వక్రబుద్ధి [sexual perverts] గలవారి విపరీత స్వభావాలకు నిదర్శనాలు. వాటి నిశేధం ప్రత్యేకంగా ధార్మిక గ్రంథాలలో పేర్కొన నవసరం లేదు. సభ్యసమాజములో జీవిస్తూ ఇంగిత జ్ఙానం ఉన్న ఎవరైనా అలాంటి విపరీత బుద్దులను ఖండిస్తూ వాటి దరిదాపులకు కూడా వెళ్ళరు. అలాంటి వాటిని జరిగించే వారిలో నీతి, మాదిరి, అర్థం, పరమార్థం అంటూ వెతికే ప్రయత్నం అజ్ఙానానికి పరాకాష్ఠలాంటిది.

ఈ సందర్భంగా, ముహమ్మద్ గారు దైవ ప్రవక్త అని విశ్వసించటమేగాక ఆయన జీవన విధానం ఈనాడు కూడా మానవాళికి మార్గదర్శకం అంటూ బోధించే ముస్లీంలకు కొన్ని ప్రశ్నలు:

(1) చిన్న వయస్సులో అమ్మాయిలకు వివాహం చేయటం పాతకాలములోనే కాదు ఈనాడు కూడా దాదాపు అన్ని దేశాలలో జరిగే ఆస్కారం ఉంది. అయితే, అమ్మాయి మరియు అబ్బాయి యిద్దరి వయస్సుల మధ్య ఓమోస్తరు తేడా ఉంటే ఆ పెళ్ళి ఓ పెద్ద సమస్యేకాదు. కాని, ఒక యాభై సంవత్సరాల మగవాడు ముక్కుపచ్చలారని పది సంవత్సరాలైనా నిండని అమ్మాయిని పెండ్లిచేసుకొని ఆమెతో కాపురం చేయటం మొదలుపెట్టడం ఏవిధంగా మంచిది మరియు అభినందనీయమైనది…?

(2) అయిషా విశయములో ముహమ్మద్ గారు చేసింది మాదిరికరమైనదైతే, మీరు కూడా ఈనాటి సమాజములో ముహమ్మద్ గారి ‘మాదిరి’ని పాటిస్తూ అలాంటి ఆచారాన్ని యిప్పుడుకూడా కొనసాగించగలరా? మీ 9 సంవత్సరాల ముద్దుల బిడ్డను యాభై యేండ్లు దాటిన తోటి ముస్లీం విశ్వాసికిచ్చి పెండ్లిచేసి కాపురం చేయించగలరా…?

(3) ఇలాంటి సాంఘీక దురాచారాలను రూపుమాపేది పోయి వాటి ప్రారంభానికి నాంది పలికే వ్యక్తి ఒక దైవ ప్రవక్త అవునా కాదా అన్నది అటుంచి ఆయన జీవితం ఏవిధంగా సామాజికపరంగా మరియు సాంసృతికపరంగా అభివృద్ది పథంలో కొనసాగుతున్న ప్రపంచ మానవ సమాజానికి మాదిరి లేక మార్గదర్శకం అవుతుంది…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *