కుక్కకాటుకు చెప్పుదెబ్బ

కుక్కకాటుకు చెప్పుదెబ్బ

December 19, 2020 ప్రశ్నలు వాదప్రతివాదాలు 0

క్రైస్తవులను క్రైస్తవ విశ్వాసాలను కించపరిచే విధంగా కొందరు ముస్లీంలు ముఖ్యంగా దావా ప్రచారకులు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అలాంటివారి మాటలలోని అజ్ఙానాన్ని అలాగే ద్వంద్వ నీతిని బహిర్గతం చేసే ప్రతిస్పందనను క్రింది సంకలనములో చూడవచ్చు.

ముస్లీం: ఏసువారు మంచి ‘గొర్రెల’ కాపరి. దేవునికి స్తోత్రం.
క్రైస్తవుడు: ముహమ్మద్ గారు ‘బక్రాలకు’ తగిన మకరీన్. అల్‌హమ్‌దులిల్లా!

ముస్లీం: మీరు యేసును దేవుడు అంటూ ఆరాధిస్తారు కనుక మీరు బహుదైవారాధికులు.
క్రైస్తవుడు: మీరేమో నల్లరాయి వైపు [ముక్కలైన ఉల్కకు] సాగిలపడి దానికి ముద్దుపెట్టి మీ ప్రార్థన/ఆరాధనాక్రమాన్ని జరిపిస్తుంటారు కనుక మీరు పచ్చి విగ్రహారాధికులు!

ముస్లీం: మీ బైబిల్ లో టన్నులకొద్దీ ‘దేవుని కుమారులు ‘ ఉన్నారు.
క్రైస్తవుడు: మీ ఖురాన్ లో మందలకొద్దీ ‘బానిసలున్నారుగా!’ అయినా, కుమారులుగా మారాలనుకున్నా లేక బానిసలుగానే ఉండిపోవాలనుకున్నా మీ వ్యక్తిగత నిర్ణయమే!

ముస్లీం: మీ బైబిల్ ప్రవక్తలను పాపులుగా అక్రమ సంబంధాలు కలిగినవారిగా చిత్రీకరిస్తుంది.
క్రైస్తవుడు: మీ ఖురాన్ పాపాలను అక్రమసంబంధాలను మీ ప్రవక్తకు అల్లాహ్ వలన కలిగిన రాయితీలుగా మార్చి కితాబు యిస్తుందే!

ముస్లీం: మీ బైబిల్ లో “నేను దేవున్ని నన్ను ఆరాధించండి” అని యేసు వారు ఎక్కడన్నాడో ఆయన మాటలలోనే చూపించండి?
క్రైస్తవుడు: మీ ఖురాన్ లో “నేను అల్లాహ్ పంపిన అంతిమ ప్రవక్తను మరియు చివరి సందేశకున్ని” అని ముహమ్మద్ చెప్పినట్లు లేక అల్లాహ్ ఆవిధంగా ముహమ్మద్ ను చెప్పమని అన్నట్లు ఎక్కడుందో చూపించండి మొదట?

ముస్లీం: యేసుక్రీస్తు దేవుడా లేక దేవుని కుమారుడా?
క్రైస్తవుడు: ముందు నాకు ఈ విశయం చెప్పండి. మీరు నరుడా లేక నరుని కుమారుడా…?

ముస్లీం: మీరు విశ్వసించే దేవునిలోని బహుళత్వాన్ని గురించి వివరించమంటే అది “దైవ మర్మం” అంటూ తప్పించుకుంటారేమిటి?
క్రైస్తవుడు: మీరు విశ్వసించే ఖురానులో పేర్కొనబడిన కేవలం అరబ్బీ పదాలను [الم/المص/المر/كهيعص/طسم] వివరించమంటేనే అవి మర్మాలతో కూడిన పదాలు [ముఖత్తా’త్] అంటూ జారుకుంటారేమిటి?!

ముస్లీం: బైబిల్ పోర్న్ బుక్. అందులో అశ్లీల సాహిత్యముంది!
క్రీస్తవుడు: అశ్లీలసాహిత్యానికి అలవాటుపడిన వారికి వైద్యుల శారీరశాస్త్ర గ్రంథముకూడా అశ్లీలసాహిత్యంలాగే అగుపడుతుంది మరి! అయినా, పరలోకాన్నే పోర్నాలోకంగా మార్చుకొని ఆశగా ఎదురుతెన్నులుచూస్తున్న మీకు పాపాన్ని ఎండగడుతూ బైబిల్ వాడిన అలంకారభాషకూడా పోర్న్ గానే అనిపించక మరేవిధంగా కనిపిస్తుందిలేండి!

ముస్లీం: బైబిల్ లోని గబ్బును తెలిసుకోవాలి మీరు!
క్రైస్తవుడు: బైబిల్ లో లేని గబ్బు గాధలను అటుంచి ముందు ఖురాన్ లో ఉన్న కంపు కథలను వివరించండి!

ముస్లీం: పౌలు కడుపునొప్పికి ద్రాక్షారసం తాగమన్నాడేటి…?
క్రైస్తవుడు: ముహమ్మద్ రోగానికి ఒంటె మూత్రం పాలు కలుపుకొని తాగమంటే బాగుందా…?!

ముస్లీం: బైబిలు ప్రకారం యేసువారు ‘దొంగలా’ రాబోతున్నాడట…!
క్రైస్తవుడు: అవునుగాని, దాని భావం యేడవ శతాబ్ధములో కారవానులను దోచుకున్న అరబ్బు దొంగలా అని కాదు!

ముస్లీం: బైబిల్ లోని కొన్ని భాగాలను ఎవరు వ్రాసారో అన్నదికూడ తెలీదు!
క్రైస్తవుడు: మరి మీ ఖురానులోని 114 సురాలలోని ఒక్క సురానైనా ఎవరు వ్రాసిపెట్టారో ఎవరూ చెప్పలేరే!

ముస్లీం: మా ప్రవక్త ముహమ్మద్ గారు ప్రపంచ చరిత్రలో అత్యధిక సంఖ్యలో ప్రజలను ప్రభావితం [influenced] చేసిన వ్యక్తిగా గుర్తించబడ్డాడు!
క్రైస్తవుడు: నిజమా! మరి ప్రభావితం చేసింది ఏవిశయములో? శత్రువులను సహితం ప్రేమించి వారికి కూడా మేలుచేయటములోనా లేక వారిని ద్వేశించి సంహరించటములోనా?!

ముస్లీం: క్రైస్తవులకు వారు నమ్మే దేవుని విశయములో వేరు వేరు అభిప్రాయాలున్నాయి.
క్రైస్తవుడు: మరి ముస్లీంలకు అల్లాహ్ ఎక్కడున్నాడో అన్న విశయములోకూడా ఏకాభిప్రాయం లేదు. అల్లాహ్ సృష్టి బయట ఉన్నాడని కొందరు, అంతటా ఉన్నాడని కొందరు, అర్ష్/కుర్సీ పై ఉన్నాడని కొందరు, కాదు కాదు అర్ష్/కుర్సీకి పైగా ఉన్నాడని మరికొందరు!!!

ముస్లీం: క్రైస్తవుల గ్రంథం మరియు విశ్వాసం ప్రకారం దేవుడు దేవునితో ఉన్నాడంట!
క్రైస్తవుడు: ముస్లీంల గ్రంథం మరియు విశ్వాసం ప్రకారం మాత్రం అల్లాహ్ తో పెన్ను, పలక, అంతేగాక ఖురాన్ కూడా (తన దత్తపుత్రుడు విడాకులిచ్చిన స్త్రీని ముహమ్మద్ పెళ్ళాడవచ్చు అంటూ చేసిన బోధ) ఉందంట!!!

ముస్లీం: బైబిల్ లోని పరమగీతాలు అలాగే యెహెజ్కేలు గ్రంథాలలో అశ్లీల సాహిత్యముంది!
క్రైస్తవుడు: అందుకేనా మీ ప్రవక్త ఆ గ్రంథాలలో పెరుతో [హీబ్రూ: మఖ్మదిం] ప్రవచించబడ్డాడు అంటూ గగ్గోలు పెడుతున్నారు?!

ముస్లీం: బైబిల్ లో యూదులుకాని అన్యులందరు, అంటే మీరు మీరుకూడా కుక్కలు మరియు పందులు అంటూ చెప్పబడ్డారు!
క్రైస్తవుడు: బైబిల్ లేఖనాలను వక్రీకరించటములో మీకు మీరే సాటి. సరే, మీరు చెప్పిందే సత్యమనుకుందాము. “కుక్కలు మరియు పందులు” వంటి అన్యులు, అంటే మీరు మేము అందరము, యేసు క్రీస్తును రక్షకునిగా మరియు ప్రభువుగా విశ్వసించటముద్వారా దేవుని పిల్లలుగా మార్చబడుతారు. అదే జరిగింది మావిశయములో. మీరూ ఆవిశ్వాసములోకి వస్తే మీకు కూడా లభిస్తుంది ఆభాగ్యము. లేదు “మాకు ఆభాగ్యము అక్కరలేదు, అన్యులకున్న స్థితి వర్ణనలే మాకు బాగుంది” అని మీరు పట్టుబడితే అది మీయిష్టం, అలాగే ఉండిపోవచ్చు మీరు!

ముస్లీం: క్రైస్తవులు దేవుడు అద్వితీయుడు అంటూనే దేవునితోపాటు మరో యిద్దరిని అంటే యేసుక్రీస్తును మరియు పరిశుద్ధాత్మను దేవుళ్ళను చేసారు!
క్రైస్తవుడు: ముస్లీంలు అల్లాహ్ ఒక్కడు అంటూనే అల్లాహ్ ప్రక్కన ముహమ్మద్ ను అలాగే ఖురానును చేర్చటమేగాక రోజుకు బోలెడుమార్లు కాబా వైపు దానిలోని ముక్కలైన నల్లరాయివైపు సాగిలపడి మ్రొక్కి అల్లాహ్ కు మ్రొక్కినట్లు చంకలు గుద్దుకుంటుంటారు!

ముస్లీం: బైబిల్లో పౌలు దేవునిలో వెఱ్ఱితనముందంటూ బోధించాడు.
క్రైస్తవుడు: బైబిల్ బోధను అర్థంచేసుకోలేక వక్రీకరించటమేగా మీ ప్రత్యేకత. మరి, ఖురాన్ లో ముహమ్మద్ అల్లాహ్ ను అతిగొప్ప మోసగానిగా [అల్-మకరీన] చిత్రీకరిస్తే నచ్చిందా మీకు?

ముస్లీం: బైబిల్ దేవుడు సర్వశక్తిమంతుడు కాదు. అందుకే ఆయన పాపులను క్షమించటానికి అమాయకుడైన తన కుమారుని పంపి ఆ కుమారుని చిత్రహింసపాలు చేసి చంపాల్సి వచ్చింది. ఖురాన్ లోని అల్లాహ్ సర్వశక్తిమంతుడు గనుక అలాంటి అవసరత లేకుండానే పాపులు పశ్చత్తపపడి క్షమాభిక్ష కోరితే చాలు వారిని క్షమించగలడు.
క్రైస్తవుడు: సృష్టికర్త సర్వశక్తిమంతుడేగాక ఆయన పరిపూర్ణ న్యాయవంతుడు. అది బైబిల్ దేవుని లక్షణం. క్షమించాలనుకున్న వారిని క్షమించటం శిక్షించాలనుకున్న వారిని శిక్షించటం అన్నది పరిపూర్ణ న్యాయం మాట అటుంచి అలాంటిది అసలు న్యాయమే కాదు. అయినా, సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక పాపిని క్షమించటానికి పరిపూర్ణ న్యాయం అన్న ప్రసక్తే లేకపోతే మరి ఆ పాపి పశ్చత్తాపపడి క్షమాభిక్ష కోరాల్సిన ఆవశ్యకతకూడా దేనికి? ఆ పాపి వాటిని చేయకపోతే క్షమించటం ఖురాన్ లోని అల్లాహ్ కు చాతకాదనే కదా! అలాంటి అల్లాహ్, పరిపూర్ణ న్యాయతత్వం లేని అల్లాహ్ నిజదేవుడు కానేరడు!

ముస్లీం: బైబిల్ దేవునికి పేరు ఉంది అంటారు క్రైస్తవులు. బైబిల్ దేవుడు బారసాల చేసుకున్నాడా?
క్రైస్తవుడు: ఖురాన్ లోని అల్లాహ్ కు 99 పేర్లు ఉన్నాయంటారు ముస్లీంలు. మరి ఖురాన్ లోని అల్లాహ్ కు 99 సార్లు బారసాల జరిగిందా…?!

ముస్లీం: యోహాను సువార్త 14-16 అధ్యాయాలలో ప్రవచించబడిన ‘వేరొక ఆదరణకర్త’ క్రైస్తవులు విశ్వసించే పరిశుద్ధాత్మ కాదు, అది రాబోతున్న ముహమ్మద్ ప్రవక్త గారు.
క్రైస్తవుడు: అక్కడ వాగ్ధానం చేయబడిన ‘వేరొక ఆదరణకర్త’ యేసు ప్రభువు శిష్యుల వద్దకు పంపబడబోతున్నాడని విస్పష్టంగా తెలియచేయబడింది. మరి, అరేబియా దేశములో 570 క్రీ.శ. లో పుట్టి 632 క్రి.శ. లో మరణించిన ముహమ్మద్ గారు మొదటి శతాబ్ధములో అంటే తనకంటే దాదాపు 500 సంవత్సరాల ముందు ఇశ్రాయేలు దేశములో జీవించి మరణించిన యేసు ప్రభువు శిష్యుల వద్దకు ఎలా వెళ్ళాగలిగాడు? భూతకాలంలోకి ముహమ్మద్ గారు బురాఖ్ [రెక్కల గుర్రం] పై వెళ్ళాడా లేక కాలయంత్రం [Time Machine] ద్వారా వెళ్ళాడా…?!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *