ఖుర్’ఆన్

ఖుర్’ఆన్

July 24, 2020 Videos 0

ఖుర్’ఆన్ వాస్తవాలు

ముస్లీములు ముఖ్యంగా దావా ప్రచారకులు తాము విశ్వసించే ఇస్లామీయ ధార్మిక గ్రంథమైన ఖురాను గత 1400 సంవత్సరాల వ్యవధిలో ఏమార్పులకు గురికాలేదు అని విశ్వసించటమేగాక తమ విశ్వాసాన్ని శాయాశక్తులా ఇతరులనుకూడా నమ్మబలికేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నములో “ఖురానులోని వాక్యాలలో, పదాలలో, ఇంకా అక్షరాలలో కూడా ఏ మార్పూ లేదు అంతేకాదు ప్రపంచములోని అన్ని స్థాలాలలో ఒకే ఖురాను ఉంది” అంటూ వీరావేశంతో గొంతుచించుకొని మరీ ప్రకటిస్తుంటారు.

చాలావరకు ఈ రకమైన వీరవిశ్వాసానికి గల కారణం వాస్తవాధారాలుగాని లేక పరిశోధనా పరిజ్ఙానంగాని కాదు. అది కేవలం ఖురానులోని కొన్ని ప్రకటనలను బట్టి ఏర్పరచుకొన్న భావోద్రేకం [ఖుర్ ‘ ఆన్–సురాహ్.10:15; 15:9; 18:27]. ధార్మిక గ్రంథాల విశయములో ముస్లీం లే కాదు, యితర మతస్థులుకూడా చాలా వరకు యిలాంటి భావోద్రేకాలనే వ్యక్తపరుస్తుంటారు.

ముస్లీం వక్తల ప్రకటనలను పరిశీలీంచేందుకు ముందు ఖురాన్ చరిత్రను తెలుసుకోవటం సమంజసం. క్రింది వీడియోలో ఆ వివరాలున్నాయి గమనించండి:

ఖురాన్ గ్రంథ చరిత్ర part -1

వాస్తవ పరిశీలన

ఖురాను విశయములో వాస్తవాలు ముస్లీము వక్తలు ప్రకటించే మాటలకు వ్యతిరేకంగా ఉన్నాయి అన్న సత్యం ఇంగిత జ్ఙానమున్న ఎవరికైనా క్రింది తేడాలను గమనిస్తే ఇట్టే అర్థమయిపోతుంది:

అరబ్బీ ఖురానులోని మొత్తం పదాల సంఖ్య 77,439? లేక 77,430? లేక 77,797? లేక 1,57,935? లేక 86,430 [సిరాజ్ లెక్క]?
అరబ్బీ ఖురానులోని మొత్తం అక్షరాల సంఖ్య 3,20,015? లేక 3,32,837? లేక 3,30,709? లేక 6,68,684? లేక 3,23,760 [సిరాజ్ లెక్క]?

ప్రపంచమంతా ఒకే ఖురాను ఉంది అన్నది సత్యమయితే పై లేక్కలలో అన్ని తేడాలు ఎందుకని…?
ఇస్లాము మతప్రచారానికై యిలాంటి పచ్చి అబద్దాలతో కూడిన ప్రయత్నాలు దేనికని…??

ప్రపంచములో పట్టుమని పది దేశాలకుకూడా వెళ్ళని దావా ప్రచారకులు ప్రపంచమంతా ఒకే ఖురాను ఉంది అంటూ ఆవేశాలతో డంభాలు ప్రకటించుకునే స్థాయికి దిగజారుతుండటాన్నిబట్టి వారి ఆత్మీయ దుస్థితే ఆధారాలు లేని వారి విశ్వాసాలకు అద్దంపడుతోంది.

ఇస్లాం పండితుల ఒప్పుకోలు

పైవే కాకుండా, ఖురాను విశయములోని వాస్తవాలు ముస్లీముల యొక్క అనేక విశ్వాసాలకు ప్రతికూలంగా ఉన్నాయి అన్నది ఆధారాలను పరిశీలించి చెప్పిన ముస్లీము పండితుల మాటలే నిర్ధారిస్తున్నాయి. ఈ విశయములో ముస్లీము పండితులే తెలియజేస్తున్న అసలు విశయాలు వారి నోటినుండే విని దావా ప్రచారకుల డంభాల తీవ్రత యేస్థాయిలో ఉందో మీరే తేల్చుకోండి:

(1) డాక్టర్ షెహ్జద్ సలీం [Dr. Shehzad Saleem] పాకిస్థానులో జన్మించి గ్రేట్ బ్రిటనులో స్థిరపడ ముస్లీం పండితుడు.

ఈయన దాదాపు 15 సంవత్సరాలు ఖురాను యొక్క చరిత్రను ధ్యానించి తెలిసుకున్న విశయాలు క్రింది వీడియోలో తెలియచేస్తున్నాడు…

(2) డాక్టర్ షబ్భీర్ అలి [Dr.Shabir Ally] భారతజాతికి చెంది గయానలో జన్మించి కెనడా దేశములో స్థిరపడిన ముస్లీము పండితుడు.

ముస్లీముల ధార్మిక గ్రంథమైన ఖురాను ప్రపంచదేశాలన్నిటిలో ఒకే విధంగా ఉందా లేక వేరు వేరుగా ఉన్నదా అన్న అంశముపై తెలియచేస్తున్న విశయాలు క్రింది వీడియోలు తెలిసుకోవచ్చు…

(3) డాక్టర్ యాసిర్ ఖాధి పాకిస్థాని కుటుంభానికి చెంది అమెరికా దేశస్థునిగా ఉన్న ముస్లిము పండితుడు.

ఇతను సౌది అరేబీయాలో అలాగే అమెరికాలోని అత్యంత పేరుప్రఖ్యాతలున్న విశ్వవిధ్యాలయాలలో ఇస్లామిక్ విధ్యను అభ్యసించి అమెరికాలోని ఒక ప్రాముఖ్యమైన మస్-జీదులో ముస్లీము ప్రసంగికునిగా పనిచేస్తున్నాడు.

ముస్లీము ప్రజాధారణను విశేషంగా పొందిన ఒక ముస్లీము వెబ్సైటుకు ఆన్లైన్ ఇంటర్వీవ్ ఇస్తూ డాక్టర్ యాసిర్ గారు అందులో ముస్లీముల ధార్మిక గ్రంథమైన ఖురానులో మార్పులు అన్న దానిపై అడగబడిన ప్రశ్నకు అసలు సత్యాన్ని వివరించాడు.

(4) ముస్లీముగా పుట్టిపెరిగి ఇస్లామును అధ్యయనం చేసి చివరకు ఇస్లామును వదిలి ప్రస్తుతం ఒక నాస్తికునిగా జీవిస్తున్న అబ్దుల్ సమీర్ అనే వ్యక్తి డాక్టర్ యాసిర్ ఖాధి తెలియచేసిన వివరాలను గూర్చి చేసిన విశ్లేషణే క్రింది వీడియో…

(5) ముస్లీము పండితులలో కొందరికి ఈమధ్యే ఖురానును గూర్చిన సత్యాన్ని ఒప్పుకునే ధైర్యం మరియు యదార్థతలు వచ్చాయి.

ఖురాను పరిపూర్ణంగా సంరక్షించబడిందా లేదా అన్న అంశాన్ని గురించి ముస్లీముల మధ్య అంటే గుడ్డిగా నమ్మే ముస్లీములకు మరియు పరిశోధించి తెలిసుకున్న ముస్లీము పండితులకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయలున్నాయో క్రింది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది…

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *