ఇస్లాం సమస్యలు

ఇస్లాం సమస్యలు

July 31, 2021 Uncategorized 0

బైబిల్ పై ముస్లీంలకు ప్రశ్నలు

? (1) తవ్రాత్, జబూర్, మరియు ఇజీల్ గ్రంథాలు యూదులవద్ద అలాగే క్రైస్తవులవద్ద ఉన్నాయి అన్న సత్యాన్ని ఖురాన్ గ్రంథం నిర్ధారిస్తూ అదేసమయంలో అవి మార్చబడ్డాయి అనిగాని లేక వాటి సమయం అయిపోయిందనిగాని బోధించటం లేదు. అయినా ఖురాన్ బోధకు వ్యతిరేకంగా తలంచటం, విశ్వసించంటం లేక వాదించటం మీకు క్షేమమా?

? (2) అల్లాహ్ యిచ్చిన తవ్రాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాలు బైబిల్ లో ఉన్నాయన్నది గ్రహించారా లేదా? ఒకవేళ, లేకపోతే అవి ఎక్కడ ఉన్నాయి?

? (3) అల్లాహ్ యిచ్చిన తవ్రాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాలను మారిపోకుండా/అంతరించిపోకుండా కాపాడుకోలేని అసమర్దుడా మీరు నమ్మే అల్లాహ్?

? (4) అల్లాహ్ యిచ్చిన తవ్రాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాలు మారిపోయాయి అనిగాని లేక అంతరించిపోయాయి అనిగాని ఖురాన్ గ్రంథములో ఎక్కడ ఉంది?

? (5) ఖురాన్ గ్రంథం చెప్పకున్నా అల్లాహ్ గ్రంథాలకు వ్యతిరేకంగా మీరు పలుకుతున్న మాటలనుబట్టి మీరు పొందబోయే నరకశిక్ష గురించి మీకు చింతలేదా?

ఇస్లాం పై ముస్లీంలకు ప్రశ్నలు

? (1) కేవలం ఇస్లాం మతాన్ని స్వీకరించినందుకు లేక ఇస్లాం మతములో కొకొనసాగుతున్నందుకు మాత్రమే ప్రస్తుతం మీరు ఈలోకములోనే పొంది అనుభవిస్తున్న మేళ్ళు ఏవి?

? (2) ఇస్లాం మతాన్ని పాటిస్తున్న మీజీవితంలో యింతవరకు మీరు చేసిన పాపాలను అల్లాహ్ క్షమించాడా, లేదా?

? (3) ఇస్లాం మతాన్ని మీరు పాటిస్తూ యితరులకుకూడా బోధిస్తున్న మీరు ఈ క్షణములో తనువు చాలించాల్సి వస్తే మీరు నిత్యత్వాన్ని పరదైసులో గడుపుతారా లేక నరకంలో గడుపుతారా?

? (4) చనిపోయిన వెంటనే ఇస్లాం మతం అసత్యమార్గమని క్రైస్తవ్యమే నిజమైన దైవమార్గమని తెలిస్తే మీ స్పందన, అనుభూతి ఎలావుంటాయి?

? (5) ఇస్లాం మతబోధల ప్రకారం వ్యక్తుల జీవితాలను గమ్యాన్ని అల్లాహ్ ముందే నిర్ణయిస్తాడట. మరి, మీరు మరణం తరువాత నరకంలో గడపబోతున్నారని అల్లాహ్ ముందే నిర్ణయించి ఉంటే దానినుండి తప్పించుకునే మార్గం ఏదైనా మీకు ఉందా? తప్పించుకునే మార్గం లేకపోతే ప్రస్తుతం మీ మతప్రయాసంతా వ్యర్థమేకదా?

యేసు క్రీస్తు పై ముస్లీంలకు ప్రశ్నలు

? (1) యేసు క్రీస్తును చావకుండా కాపాడటం గొప్ప అద్భుతమా లేక యేసు క్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను తిరిగి బ్రతికించటం గొప్ప అద్భుతమా?

? (2) మరణాన్ని జయించి సజీవునిగా దేవుని సన్నిధికి వెళ్ళిన యేసు క్రీస్తు గొప్పవాడా లేక మరణించి సమాధిలో ఉంచబడిన ముహమ్మద్ వారు గొప్పవారా?

? (3) పాపములేనివాడు సాతానుడు ముట్టనివాడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడా లేక రోజుకు అనేక పర్యాయాలు తమ పాపాలకు క్షమాపణను వేడిన ముహమ్మద్ వారు పరిశుద్ధుడా?

? (4) పరలోకమునుండి వచ్చాను తిరిగి పరలోకమునకు వెళుతున్నాను అక్కడ మీకొరకు స్థలం సిద్ధపరచబోతున్నాను అంటూ తనను వెంబడించిన వారికి భవిశ్యత్తును విస్పష్టంగా తెలియచేసిన యేసుకీస్తు నమ్ముకోదగినవాడా లేక నాకు మరియు నన్ను వెంబడించే మీకు జరుగబోయేది ఏమిటో నాకు తెలియదు అంటూ తెలియచేసిన ముహమ్మద్ వారు నమ్ముకోదగినవాడా?

? (5) తన పుట్టుకలో, తన జీవితంలో చేసిన కార్యాలలో, అలాగే తన జీవితపు అంతంలో దేవుని అద్భుతశక్తి యొక్క ప్రత్యక్షతను చూపించిన యేసుక్రీస్తు నిజమైన గొప్ప ప్రవక్తా లేక ఇవేవి లేని ముహమ్మద్ వారు గొప్ప ప్రవక్తా?

అల్లాహ్ పై ముస్లీంలకు ప్రశ్నలు

? (1) అరాబిక్ భాషా పండితుల వివరణ ప్రకారం ‘అల్లాహ్’ అంటే అరాబిక్ భాషలో ప్రధానమైన దేవుడు [అల్ + ఇలాహ్ = అల్లాహ్] అని భావం. మరి, ముస్లీంల అభిప్రాయం ప్రకారం అది సృష్టికర్తకున్న పేరు. అయితే, ఖురాను అంతటిలో ఎక్కడైనా “ఇలాహ్ నామము అల్లాహ్” అనిగాని లేక “నా నామము అల్లాహ్” అనిగాని చెప్పబడిందా?

? (2) మీరు నమ్మే ఖురాన్ లోని అల్లాహ్ తాను సృష్టించిన విశ్వంలోకి తాను కోరిన ఆకారములో ప్రత్యక్షం కాగల సామర్థ్యం ఉన్నవాడా లేనివాడా?

? (3) అల్లాహ్ తన అస్తిత్వంలో ఎలాంటి మార్పుచేర్పులు లేకుండానే సృష్టికి ప్రత్యక్షం కాగల సామర్థ్యం మరియు స్వాతంత్ర్యం ఉన్నవాడా లేనివాడా?

? (4) అల్లాహ్ ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువైన స్థలాలో ప్రత్యక్ష్యం కాగల సామర్థ్యం మరియు స్వాతంత్ర్యం ఉన్నవాడా లేనివాడా?

? (5) అల్లాహ్ ఒక్కడు. మరి, ఒక్కడుగా ఉన్న ఆ అల్లాహ్ యొక్క అంతర్ వాస్తవంలో బహుళత్వం లేదని ఎలా చెప్పగలరు?

? (6) ఖురాన్ లోని అల్లాహ్ తనకు ఎంతో ఆప్తుడు మరియు ప్రముఖుడు అయిన ప్రవక్త ముహమ్మద్ యొక్క మరణం గురించి, “ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే” (సురాహ్.3:144) అంటూ అడిగాడే కాని ఆయన మరణం ఎలా ఉండబోతున్నదో నన్నది ఇదమిద్దంగా చెప్పలేకపోయాడు ఎందుచేత?

? (7) సమాజములోని సంస్కారవంతులు మంచివారు స్వంత తండ్రిని, పెద్దవారిని, లేక అధికారులను పేరుపెట్టి పెలవరు. మరి, ‘అల్లాహ్’ అన్నది నిజంగానే సృష్టికర్త యొక్క వ్యక్తిగత నామమైతే అల్లాహ్ అంటూ సృష్టికర్తను మీరు పేరుపెట్టి పిలవటం సమంజసమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *