అల్లాహ్ ప్రణాళిక

అల్లాహ్ ప్రణాళిక

June 19, 2019 ఇస్లాం ఖుర్'ఆన్ గ్రంథం ఖుర్'ఆన్ దేవుడు విశ్వాసాలు సృష్టికర్త 0

ఖురానులో వ్యక్తం చేయబడిన ప్రకారం పాపుల ఎడల ఖురానులోని అల్లాహ్ [الله‎/Allah] యొక్క దృక్ఫథం, ప్రవృత్తి, మరియు ప్రణాలికలు విస్పష్టంగా తెలియచేయబడ్డాయి:  

(1) సన్మార్గంలో వెళ్ళేవారిని అలాగే అపమార్గంలో వెళ్ళేవారిని ఆవిధంగా నడిపించేవాడు ఖురానులోని అల్లాహ్ తానే. 

అల్లాహ్ ఎవడికి సన్మార్గం చూపుతాడోఅతడే సన్మార్గం పొందినవాడవుతాడు. మరెవరిని ఆయన అపమార్గం పట్టిస్తాడో వారే నష్ట పోయినవారవుతారు.” (సూరాహ్ 7:178) 

(2) ఎంతోమంది జిన్నాతులను మరియు మానవులను తానే నరకం కొరకు పుట్టించానంటూ తన అసలు ప్రణాలికను ఖురానులోని అల్లాహ్ ప్రకటిస్తూన్నాడు.    

ఎంతోమంది జిన్నులను, మానవులను మేము నరకం కోసం పుట్టించాము. వారికి హృదయాలున్నాయి. కాని వాటితో వారు ఆలోచించరు. వారికి కళ్లున్నాయి. కాని వాటితో వారు చూడరు. వారికి చెవులున్నాయి. కాని వాటితో వారు వినరు. వారు పశువుల్లాంటివారు. కాదు,   వాటికన్నా ఎక్కువగానే దారి తప్పారు. పరధ్యానంలో పడిపోయిన వారంటే వీరే.” (సూరాహ్ 7:179)

(3) మానవులు సృష్టించబడకముందే వారి విధిని అంటే వారి జీవితాన్ని, విశ్వాసాన్ని, మరియు వారి నిత్యత్వపు గతిని ఖురానులోని అల్లాహ్ వ్రాయించిపెడతాడు గనుక వారికి ఈలోకములో ఖురానులోని అల్లాహ్ వ్రాయించిపెట్టినవన్నీ యధాతథంగా సంభవిస్తాయి అన్నది ఇస్లాము బోధ. ఈ విషయాన్ని హదీసులు ఇంకా స్పష్టంగా వివరిస్తున్నాయి-

‘అబ్దుల్లా బిన్ ముస్’ఉద్’ కథనం:
నిజమైన మరియు నిజంగా ప్రేరేపించబడిన అల్లాహ్ యొక్క అపొస్తలుడు చెప్పాడు, “(మానవుని సృష్టి యొక్క విషయం) మనిషి తల్లి గర్భంలో నలభై రోజులలో సమకూర్చబడుతాడు, ఆపై అతను ఇదే కాలానికి మందపాటి రక్తపు గడ్డగా మారుతాడు, మరియు ఇదే కాలానికి ఒక మాంసం ముక్క అవుతాడు. అప్పుడు అల్లాహ్ ఆ మనిషిని గురించి నాలుగు విషయాలు రాయమని ఆదేశించి ఒక దేవదూతను పంపుతాడు. ఆ దూత ఆ మనిషి (అనగా క్రొత్త జీవి) యొక్క పనులు, అతని జీవనోపాధి, అతని మరణదినం, మరియు అతను ఆశీర్వదించబడతాడ లేక దౌర్భాగ్యుడు అవుతాడ అన్న వాటిని వ్రాస్తాడు. అప్పుడు ఆత్మ [soul] అతనిలోకి ఊదబడుతుంది. కాబట్టి, మీలో ఒక వ్యక్తి మంచి పనులు చేయవచ్చు. అతనికి మరియు స్వర్గానికి మధ్య ఒక మూర మాత్రమే ఉండే వరకు అతడు మంచి పనులు చేసి, ఆ తరువాత అతని కోసం వ్రాయబడినది అతనిని ప్రభావితం చేయడాన్నిబట్టి అతడు (నరకం) అగ్నికి నడిపే (చెడు) పనులు చేయడం ప్రారంభిస్తాడు. అదేవిధంగా, మీలో ఒక వ్యక్తి (చెడు) పనులు చేయవచ్చు, అతనికి మరియు (నరకానికి) అగ్నికి మధ్య ఒక మూర మాత్రమే ఉన్న సమయములో అతను ఏమి చేయాలని వ్రాయబడిందో అది అతని ప్రవర్తనను నిర్ధారిస్తుంది గనుక అతను స్వర్గ ప్రజల లక్షణాలకు చెందిన పనులను చేయడం ప్రారంభిస్తాడు.” (సహీ బుఖారి (4:54:430)
[సహీ బుఖారి (4:54:430); (2:23:444); (6:60:473); (9:93:641) & సహీ ముస్లీము (33:6436); (33:6406)] 

అల్లాహ్ మాకు రాసిపెట్టింది తప్ప మరొకటి మాకు జరుగదు.ఆయనే మా సంరక్షకుడు. విశ్వాసులైనవారు అల్లాహ్ నే నమ్ముకోవాలి”  అని (ఓ ప్రవక్తా) వారికి చెప్పు” (సురాహ్ 9:51).

మేము ప్రతి మనిషి యొక్క మంచి చెడులను అతని మెడలోనే వ్రేలాడదీశాము. ప్రళయ దినాన మేము అతని కర్మల పత్రాన్ని (అతని సమక్షంలో) బయటపెడతాము. దాన్ని అతను తెరచిన పుస్తకంలా చూసుకుంటాడు.” (సూరాహ్ 17:13) 

మరి (చూడబోతే) మిమ్మల్నీ, మీరు చేసిన వాటినీ సృష్టించినవాడు అల్లాహ్‌యేకదా!” (సురాహ్ 37:96)

(4) ఇస్లాము బోధ ప్రకారం ఒక వ్యక్తి మంచి చేయాలని లేక సన్మార్గములో నడవాలని తనకుతానుగా కోరుకోలేడు. కారణం, అలా ఆవ్యక్తి కోరుకోవాలని ఖురానులోని అల్లాహ్ కోరుకుంటే తప్ప ఆవ్యక్తి ఆవిధంగా కోరుకోలేడు.  

అల్లాహ్ కోరనిదే మీరు కోరలేరు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడు.” (సూరాహ్ 76:30) 

(5) ఇస్లాము బోధ ప్రకారం మానవులు సన్మార్గమైనా లేక అపమార్గమైనా తమకు తాము ఏదీ కోరుకోలేరు. ఖురానులోని అల్లాహ్ వారు ఏది కోరుకోవాలని కోరుకుంటే అదే వారు కోరుకుంటారు. 

సర్వలోక ప్రభువు అయిన అల్లాహ్ కోరనంతవరకు మీరేదీ కోరలేరు.” (సూరాహ్ 81:29)

(6) ఇస్లాము బోధ ప్రకారం ఒక వ్యక్తి సత్యాన్ని విశ్వసించడమన్నది జరగాలంటే దానికి ఖురానులోని అల్లాహ్ యొక్క ఆజ్ఙ ఉండాలి. అది లేకపోతే ఆ వ్యక్తి సన్మార్గాన్ని కోరుకోలేడు.

వాస్తవానికి దైవాజ్ఙ కానంతవరకూ ఎవడూ విశ్వసించడు.బుద్ధిహీనులపై అల్లాహ్ అశుద్ధతను వేస్తాడు.” (సూరాహ్ 10:100) 

(7) ఇస్లాము బోధ ప్రకారం సన్మార్గములో నడవడమటుంచి ఒక వ్యక్తి తాను సన్మార్గాన్ని కోరుకోవడానికికూడా ఖురానులోని అల్లాహ్ చిత్తము మరియు ఆజ్ఙ కావాలి. అవి వుంటేనే ఆవ్యక్తికి సన్మార్గ భాగ్యం దొరుకుతుంది. మరోమాటలో చెప్పలంటే ఆ భాగ్యం ఖురానులోని అల్లాహ్ తాను కోరుకున్న వ్యక్తులకే కలిగిస్తాడు.  

బాధ్యత నీపై లేదు. వాస్తవానికి సన్మార్గ భాగ్యాన్ని అల్లాహ్ తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు. మీరు దైవ మార్గంలో ఏ మంచి వస్తువును వ్యయపరచినా, దాని లాభాన్ని స్వయంగా మీరే పొందుతారు. కాకపోతే మీరు కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ఖర్చు చేయాలి. మీరు ఎంత ఖర్చుచేసినా దాని పూర్తి ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది. మీకు ఎంతమాత్రం అన్యాయం జరగదు.” (సూరాహ్ 2:272)

(8) ఖురానులోని అల్లాహ్ తాను కోరుకున్న వ్యక్తులు సన్మార్గాన్ని కోరుకునేటట్లు చేస్తాడు. అదేవిధంగా తాను కోరుకున్న వ్యక్తులు అపమార్గాన్ని కోరుకునేటట్లు చేస్తాడు. 

మేము ఏ  ప్రవక్తను పంపినా, అతడు విషయాన్ని   స్పష్టంగా  విడమరచి  చెప్పడానికి  వీలుగా తన జాతి  వారి భాషలో మాట్లాడే వానిగా చేసి పంపాము. ఆపైన అల్లాహ్‌  తాను  కోరినవారిని అపమార్గం పట్టిస్తాడు, తాను కోరిన వారికి సన్మార్గం చూపిస్తాడు.ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు.” (సూరాహ్ 14:4)

(9) పై నేపథ్యంలో ఖురానులోని అల్లాహ్ దారితప్పించి అపమార్గములో నడిపిస్తున్న వ్యక్తికి ఆదుకునే నాధుడెవరూ లేరు.  

అల్లాహ్ ఎవరినయినా దారితప్పిస్తే, ఇక ఆ తరువాత అతన్ని ఆదుకునే వాడెవడూ ఉండడు. మరి నువ్వే చూద్దువు గాని, దుర్మార్గులు శిక్షను చూచినపుడు, “మేము తిరిగి వెళ్ళే మార్గం ఏదైనా ఉందా?!” అని అంటూ   ఉంటారు.” (సూరాహ్ 42:44)

(10) ఖురానులోని అల్లాహ్ తానే తన ప్రణాలిక చొప్పున కొందరు వ్యక్తులను దారితప్పిస్తాడు. అలాంటి వారు తప్పించుకునే వేరే మార్గమంటూ ఏదీలేదు. 

అల్లాహ్‌ తప్ప వారిని ఆదుకునే మిత్రులెవరూ ఉండరు. అల్లాహ్‌ దారి తప్పించినవారికి మరేమార్గమూ ఉండదు.” (సూరాహ్ 42:46)

(11) తన ప్రణాళిక ప్రకారం ఒక పట్టణాన్నంతా నాశనం చెయ్యాలని ఆశించిన సందర్భములో ఖురానులోని అల్లాహ్ దాన్ని మూడు అడుగులలో సాధిస్తాడు…
మొదటి అడుగు: ఆ పట్టణములోని వారికి కొన్ని ఆజ్ఙలను ఇస్తాడు. 
రెండవ అడుగు: ఆ పట్టణములోని వారు అల్లాహ్ ఇచ్చిన ఆ అజ్ఙలను మీరుతారు. అందుకు కారణం, వారు అలా మీరాలని అల్లాహ్ వారివిధిని ముందే వ్రాసి ఉంచాడు [సురాహ్ 9:51].
మూడవ అడుగు: తాను నిర్ణయించిన విధి ప్రకారం ఆ పట్టణములోని వారు తన ఆజ్ఙలను మీరి దోశులయినతరువాత వారి దోశాలనుబట్టి వారిని అల్లాహ్ నాశనము చేస్తాడు. ఈ విధంగా అల్లాహ్ తాను ఆశించినదాన్ని నెరవేరుస్తాడు.      

మేము ఏదైనా ఒక పట్టణాన్ని నాశనం చెయ్యాలని సంకల్పిం చుకున్నప్పుడు,అక్కడి స్థితిమంతులకు (కొన్ని)   ఆజ్ఞలు జారీ చేస్తాము. కాని వారేమో అందులో అవిధేయతకు పాల్పడతారు. ఆ విధంగా వారిపై (శిక్షకు సంబంధించిన) మాట నిరూపితమవుతుంది. ఆపై మేము ఆ పట్టణాన్ని సర్వనాశనం చేసేస్తాము.” (సూరాహ్ 17:16)   

 అదే ఖురాను అల్లాహ్ యొక్క గుణగణాలను వివరిస్తూ ఇలా అంటున్నది…

“భూమ్యాకాశాల సర్వసత్తాధికారం అల్లాహ్‌దే. తాను కోరిన వారిని ఆయన క్షమిస్తాడు, తాను కోరినవారిని శిక్షిస్తాడు. అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడు.” (సురాహ్ 48:14)

మరి ఇంతచేసి, ఒక పట్టణాన్ని నాశనం చేయాలని సంకల్పించిన సందర్భములో భూమ్యాకాశాల సర్వసత్తాధికారం ఉన్న అల్లాహ్ కు సురాహ్ 17:16 లో వివరించబడిన విధంగా మూడు అడుగుల కపటముతో కూడిన బృహత్ప్రణాలికను ఉపయోగిస్తూ నాశనం చేయటానికి అపసోపాలు పడాల్సిన అవసరమేమిటో అంతుబట్టని అంశము!

(12) ఇస్లాము బోధ ప్రకారం అల్లాహ్ తాను ఉద్దేశించినవారిపై దయచూపిస్తాడు గనుక అలాంటివారు అపమార్గములో నశించరు. కారణం, వారిని అల్లాహ్ పుట్టించింది వారు సన్మార్గములో బ్రతికి జన్నతులో ప్రవేశించాలన్న ప్రణాలికతోనే. అదేవిధంగా, ఖురానులోని అల్లాహ్ తన ఉద్దేశము ప్రకారము దయచూపించనివారు అపమార్గములో వెళ్ళి నరకములో నాశనమవుతారు. కారణం, వారిని అల్లాహ్ తన ప్రణాలిక ప్రకారం పుట్టించింది వారు అలా అపమార్గములో పయనించి నాశనము కావాలన్న ఉద్దేశంతోనే. నిజానికి అలాంటి ఆశను మరియు ఉద్దేశాన్ని ఖురానులోని అల్లాహ్ వ్యక్తపరచటాన్ని ఖురాను క్రింది ఆయత్ లో స్పష్టపరుస్తున్నది:  

కాని నీ ప్రభువు దయచూపినవారు మాత్రం అలా చేయరు. ఆయన వారిని పుట్టించిందే అందుకోసం.నేను నరకాన్ని జిన్నాతులు, మనుషులు – అందరితోనూ నింపుతాను” అని నీ ప్రభువు అన్నమాట నెరవేరింది.” (సూరాహ్ 11:119) 

మేము గనక తలచుకుంటే, ప్రతి ఒక్కరికీ సన్మార్గంప్రసాదించి ఉండేవాళ్ళం. అయితే, నేను నరకాన్ని జిన్నులతోనూ, మనుషులతోనూ తప్పకుండా నింపుతాను” అన్న నా మాట నిజమయింది.” (సూరాహ్ 32:13)

ఖురాను బోధల ప్రకారము ఖురాను ప్రకటించే అల్లాహ్ మానవులను సృష్టించక ముందే ప్రతివ్యక్తి యొక్క పుట్టుక, తీసుకునే నిర్ణయాలు, చేసే కార్యాలు (మంచి మరియు చెడులు), స్వీకరించే విశ్వాసము/మతము, మరియు పొందబోయే నిత్యగతి (జన్నతులో లేక నరకములో) అన్నవి అన్నీ తానే వ్రాయించి పెడుతాడు. ఆతరువాత వ్యక్తిని సృష్టించి ఆ వ్యక్తి నరకము కొరకు సృష్టించబడితే అతనిని/ఆమెను దారితప్పించి అపమార్గములోకి నడిపించి పాపము చేసేటట్లు చేస్తాడు. చివరకు ఆవ్యక్తిని చేసిన పాపాలను బట్టి తీర్పు తీర్చి నరకములో పడవేస్తాడు. ఇంతచేసినా ‘అల్లాహ్ అపార కరుణామయుడు’ అని అలాగే ‘అల్లాహ్ అత్యంత న్యాయవంతుడు’ అని ఖురాను ప్రకటించడం అంతుబట్టని అశం!

మరోమాటలో చెప్పాలంటే ఖురానుబోధల ప్రకారం ఈ ప్రపంచ పయనములోని కథ, పాటలు, మాటలు, సంగీతం, నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే, నటులు, డిస్ట్రిబ్యూటర్స్, చివరికి ప్రేక్షకుడు కూడా ఖురానులో పేర్కొనబడ్డ అల్లాహ్ యే అన్నది ప్రస్పుటమవుతున్నది!

ఇస్లాము మతములోని ఈ బోధ కొందరు ముస్లీములలో కూడా తీవ్రమైన సంశయాలను లేవనెత్తుతున్నది.

పరిపూర్ణమైన పరిశుద్ధత (Holiness), న్యాయం/నీతి (Justice/Righteousness), మరియు ప్రేమ (Love) అన్నవి నిజదేవునికి వున్న నైతిక గుణలక్షణాలు (Moral Attributes). ఇందులో ఏగుణలక్షణం లేని దేవుడైనా అబద్ధ దేవుడైనా అయివుండాలి లేక మాటలకు ఊహాగానాలకు మాత్రమే పరిమితమయిన ఊహాజనిత దేవుడైనా అయివుండాలి. అలాంటి దేవుడి వలన ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదు! 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *