బైబిలుపై ఖురాను & హదీసులు

బైబిలుపై ఖురాను & హదీసులు

October 3, 2019 ఇస్లాం ఖుర్'ఆన్ గ్రంథం పరిశుద్ధ గ్రంథము విశ్వాసాలు 20

ముస్లీముల ధార్మిక గ్రంథమైన ఖుర్’ఆన్ లో యూదులు మరియు క్రైస్తవుల ధార్మిక గ్రంథాలకు ఎంతో ప్రత్యేకమైన ఉన్నత స్థానం యివ్వబడింది. ఆ గ్రంథాల ప్రామణికత్వానికి వత్తాసుపలుకుతూ ముస్లీముల దృష్టిలో తన ప్రమాణికత్వాన్ని ఖుర్’ఆన్ రుజువుపరచుకుంటున్నది. ఖుర్’ఆన్ బోధ ప్రకారం పూర్వగ్రంథాల ప్రామాణికత్వమే ఖుర్’ఆన్ ప్రామాణికత్వానికి ప్రధాన ఆధారం.

యూదులు మరియు క్రైస్తవుల ధార్మిక గ్రంథాలైన తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ సమిష్టిగా ఈనాడు బైబిల్ [పరిశుద్ధ గ్రంథము] అని పిలివబడుతున్నాయి.

క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్థములోనే యూదులు మరియు క్రైస్తవులు తమ ధార్మిక గ్రంథాలను అంటే ఈనాడు సమిష్టిగా బైబిల్ అని పిలివబడుతున్న తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ లేఖన గ్రంథాలను అరేబియా ద్వీపకల్పములోనేగాక మద్యధరా సముద్ర ప్రాంతము అంతటిలోకూడా తమతమ సమాజములలో కలిగివుండటమేగాక వాటిని ధ్యానిస్తూ తమ ధార్మిక జీవనం కొనసాగించారు. ఆనాటి యూదు మరియు క్రైస్తవ సమాజాలు ఉపయోగించిన ఈ లేఖన గ్రంథాలు పూర్తిభాగాలుగా అలాగే అసంపూర్ణభాగాలుగా ఈనాటికి కొన్ని వందల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. మానవుల మరియు ప్రభుత్వాల నియంత్రణక్రింద లేకున్నా ఆబ్బురపరచే ఖచ్చితత్వముతో ఎత్తిరాయబడిన ఈగ్రంథాల నఖలులు సంఖ్యాపరంగా విస్తరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఖురాను ప్రబోధాల ప్రకారంకూడా యూదులు మరియు క్రైస్తవులు దైవగ్రంథాలుగా లెక్కించే తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాలు దేవుని తరపున అవతరించిన గ్రంథాలన్నది ముస్లీము విశ్వాసులు గ్రహించాలి.

ఖురాను: తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ [బైబిలు] గ్రంథాలు అల్లాహ్ ఇచ్చిన గ్రంథాలు 

“మేము తౌరాతు   గ్రంథాన్ని   అవతరింపజేశాము.   అందులో   మార్గదర్శకత్వము,   జ్యోతీ   ఉండేవి.   ఈ   తౌరాతు   ఆధారంగానే   ముస్లిములైన   ప్రవక్తలు,   రబ్బానీలు,   ధర్మవేత్తలు      యూదుల   సమస్యలను   పరిష్కరించేవారు.   ఎందుకంటే   దేవుని   ఈ   గ్రంథాన్ని   రక్షించవలసిందిగా   వారికి   ఆజ్ఞాపించటం   జరిగింది.   దీనికి   వారు   సాక్షులుగా   ఉండేవారు.      కాబట్టి      మీరు      మనుషులకు      భయపడకండి.      నాకు    మాత్రమే   భయపడండి.   నా   వాక్యాలను   కొద్దిపాటి   వెలకు   అమ్ముకోకండి.   ఎవరు   అల్లాహ్‌   అవతరింప   జేసిన   వహీ   ప్రకారం   తీర్పు   చెయ్యరో   వారే   (కరడుగట్టిన)   అవిశ్వాసులు.” (ఖురాను – 5 : 44)

“దైవాదేశాలు   పొందుపరచబడి   వున్న   తౌరాతు   గ్రంథం   తమ   వద్ద   ఉన్నప్పటికీ   వారు   నిన్ను   ఎట్లా   న్యాయనిర్ణేతగా   చేసుకుంటున్నారు?   (ఇది   ఆశ్చర్యకరం   కదూ?!)   ఆ   తరువాత   మళ్ళీ   తిరిగి   పోతున్నారు.   యదార్థమేమిటంటే   వారసలు   విశ్వాసులే   కారు.” (ఖురాను – 5 : 43) 

“మేము   తౌరాతు   గ్రంథంలో   యూదుల   కోసం   ఒక   శాసనాన్ని   లిఖించాము:   (దీని   ప్రకారం)   ప్రాణానికి   బదులు   ప్రాణం,   కన్నుకు   బదులు   కన్ను,   ముక్కుకు   బదులు   ముక్కు,   చెవికి   బదులు   చెవి,   పంటికి   బదులు   పన్ను.      అలాగే   కొన్ని   ప్రత్యేక   గాయాల   కోసం   కూడా   (సరిసమానంగా)   ప్రతీకారం   ఉంది.   కాని   ఎవరయినా   క్షమాభిక్ష   పెడితే   అది   అతని   పాలిట   పరిహారం   (కప్ఫారా)   అవుతుంది.   అల్లాహ్‌   అవతరింపజేసిన దానికనుగుణంగా   తీర్పు   ఇవ్వనివారే   దుర్మార్గులు.” (ఖురాను – 5 : 45)

“ఆ   ప్రవక్తల   తరువాత      మేము   మర్యమ్‌   కుమారుడగు      ఈసాను   పంపాము.   అతను   తనకు   పూర్వం   వచ్చిన   తౌరాతు   గ్రంథాన్ని   సత్యమని   ధృవీకరించేవాడు.   మేమతనికి   ఇంజీలు      గ్రంథాన్ని   వొసగాము.   అందులో   మార్గదర్శకత్వమూ,   జ్యోతీ   ఉండేవి.   అది   తనకు   ముందున్న   తౌరాతు   గ్రంథాన్ని   ధృవీక   రించేది.   అంతేకాదు, అది దైవభీతి కలవారికి ఆసాంతం మార్గదర్శిని మరియు   హితబోధిని   కూడా.” (ఖురాను – 5 : 46

“ఇంజీలు   గ్రంథం   గలవారు   కూడా,   అల్లాహ్‌   ఇంజీలులో   అవతరింపజేసిన   దానికనుగుణంగానే   తీర్పు   చెయ్యాలి.   అల్లాహ్‌   అవతరింపజేసిన   దాని   ప్రకారం   తీర్పుచెయ్యని   వారే   పాపాత్ములు.” (ఖురాను – 5 : 47)

“సజ్జనులైన   నా   దాసులే   భూమికి   వారసులవుతారని   మేము   జబూర్‌   (గ్రంథం)లో   హితబోధ   అనంతరం   వ్రాసిపెట్టాము.” (ఖురాను – 21 : 105)

యూదులు మరియు క్రైస్తవులు దైవగ్రంథాలుగా లెక్కించే తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాలు అల్లాహ్ తరపున అవతరించబడిన గ్రంథాలయితే మరి అల్లాహ్ గ్రంథాలను లేక మాటలను మానవమాత్రులు మార్చగలరా…? ఈ ప్రశ్నకు ఖురాను జవాబును పరిశీలించాలి. 

ఖురాను: అల్లాహ్ మాటలు మార్చలేరెవ్వరు 

“నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు ధిక్కరించబడ్డారు. అయితే వారు (ప్రజల) ధిక్కారవైఖరికి, తమకు పెట్టబడిన బాధలకు సహనం వహించారు. కడకు వారికి  మా సహాయం  అందింది. అల్లాహ్‌ వాక్కులను మార్చేవాడు ఎవడూ లేడు.  కొంతమంది  ప్రవక్తలకు  సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికే నీ వద్దకు చేరాయి.” (ఖురాను – 6 : 34)

“సత్యం రీత్యా, న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు సంపూర్ణ మైనది. ఆయన వాక్కులను మార్చగలవాడెవడూ లేడు. ఆయన ప్రతిదీ వినేవాడు, ప్రతిదీ తెలిసినవాడు.” (ఖురాను – 6 : 115)

“ప్రాపంచిక జీవితంలోనూ, పరలోకంలోనూ వారికి శుభవార్త కలదు. అల్లాహ్‌ వాక్కుల్లో  మార్పు ఉండదు. ఇదే గొప్ప విజయం.” (ఖురాను – 10 : 64)

ఖురాను: తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాలు యూదులు మరియు క్రైస్తవుల యొద్ద వున్నాయి

“క్రైస్తవులు సత్యంపై లేరని యూదులు అంటున్నారు. యూదులు సత్యంపై లేరని క్రైస్తవులంటున్నారు. మరి చూడబోతే వారంతా గ్రంథాన్ని చదువుతున్నారు. జ్ఞానం లేనివాళ్ళు   కూడా ఇలాంటి మాటే అంటున్నారు. కనుక అల్లాహ్ ప్రళయదినాన వీళ్ళ భేదాభిప్రాయం గురించి వీళ్ళ మధ్య తీర్పు చేస్తాడు.” (ఖురాను – 2 : 113)

“ఈ   సందేశహరుణ్ణి,   నిరక్షరాసి   అయిన   ఈ   ప్రవక్తను   అనుసరించేవారు   (కరుణించబడతారు),   అతని   ప్రస్తావన   తమ   వద్ద   ఉన్న   తౌరాతు,   ఇంజీలు   గ్రంథాలలో   లిఖితపూర్వకంగా   లభిస్తుంది.   ఆ   ప్రవక్త   మంచిని   చెయ్యమని   వారికి   ఆదేశిస్తాడు.   చెడుల   నుంచి   వారిస్తాడు.   పరిశుద్ధమైన   వస్తువులను   ధర్మ   సమ్మతంగా   ప్రకటిస్తాడు.   అశుద్ధమైన   వాటిని   నిషిద్ధంగా   ఖరారు   చేస్తాడు.   వారిపై   ఉన్న   బరువులను   దించుతాడు.   వారికి   వేయబడి   వున్న   సంకెళ్లను   (విప్పుతాడు).   కనుక   ఎవరు   ఈ   ప్రవక్తను   విశ్వసించి,   అతనికి   ఆదరువుగా   నిలుస్తారో,   తోడ్పాటునందిస్తారో,   ఇంకా   అతనితోపాటు   పంపబడిన   జ్యోతిని   అనుసరిస్తారో   వారే   సాఫల్యం   పొందేవారు.” (ఖురాను – 7 : 157)

“దైవాదేశాలు   పొందుపరచబడి   వున్న   తౌరాతు   గ్రంథం   తమ   వద్ద   ఉన్నప్పటికీ   వారు   నిన్ను   ఎట్లా   న్యాయనిర్ణేతగా   చేసుకుం   టున్నారు?   (ఇది   ఆశ్చర్యకరం   కదూ?!)   ఆ   తరువాత   మళ్ళీ   తిరిగి   పోతున్నారు.   యదార్థమేమిటంటే   వారసలు   విశ్వాసులే   కారు.” (ఖురాను – 5 : 43)

“మరి   మేము   నీ   వద్దకు   పంపిన   దానిపై   ఏమాత్రం   సందేహమున్నా నీకు పూర్వపు గ్రంథాన్ని పారాయణం చేస్తున్నవారిని అడిగిచూడు. నిశ్చయంగా నీ వద్దకు నీ   ప్రభువు తరఫు నుంచి సత్యం (తో కూడిన గ్రంథం) వచ్చింది. కనుక నువ్వు ఎంత మాత్రం శంకించేవారిలో చేరకు.” (ఖురాను – 10 : 94)

“తౌరాతు   గ్రంథం   అవతరించక   పూర్వం,   ఇస్రాయీల్‌   (యాఖూబు)   తన   కోసం   నిషేధించుకున్న   వస్తువులు   తప్ప   ఇతర   ఆహార   పదార్థాలన్నీ   ఇస్రాయీల్‌   వంశస్థుల   కొరకు   ధర్మసమ్మతంగానే   ఉండేవి.   ‘మీరు   సత్యవంతులే   అయితే   తౌరాతును   తీసుకుని   రండి,   దాన్ని   చదివి   వినిపించండి’   అని   (ఓ   ముహమ్మద్‌!)   వారికి  చెప్పు.” (ఖురాను – 3 : 93)

ఖురాను: తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాలలోమార్గదర్శకత్వం మరియు వెలుగు వున్నాయి

“మేము   తౌరాతు   గ్రంథాన్ని   అవతరింపజేశాము.   అందులో   మార్గదర్శకత్వము,   జ్యోతీ   ఉండేవి.   ఈ   తౌరాతు   ఆధారంగానే   ముస్లిములైన   ప్రవక్తలు,   రబ్బానీలు,   ధర్మవేత్తలు      యూదుల   సమస్యలను   పరిష్కరించేవారు.   ఎందుకంటే   దేవుని   ఈ   గ్రంథాన్ని   రక్షించవలసిందిగా   వారికి   ఆజ్ఞాపించటం   జరిగింది.   దీనికి   వారు   సాక్షులుగా   ఉండేవారు.      కాబట్టి      మీరు      మనుషులకు      భయపడకండి.      నాకు    మాత్రమే   భయపడండి.   నా   వాక్యాలను   కొద్దిపాటి   వెలకు   అమ్ముకోకండి.   ఎవరు   అల్లాహ్‌   అవతరింప   జేసిన   వహీ   ప్రకారం   తీర్పు   చెయ్యరో   వారే   (కరడుగట్టిన)   అవిశ్వాసులు.” (ఖురాను – 5 : 44)

“ఆ   ప్రవక్తల   తరువాత      మేము   మర్యమ్‌   కుమారుడగు      ఈసాను   పంపాము.   అతను   తనకు   పూర్వం   వచ్చిన   తౌరాతు   గ్రంథాన్ని   సత్యమని   ధృవీకరించేవాడు.   మేమతనికి   ఇంజీలు  గ్రంథాన్ని   వొసగాము.   అందులో   మార్గదర్శకత్వమూ,   జ్యోతీ   ఉండేవి.   అది   తనకు   ముందున్న   తౌరాతు   గ్రంథాన్ని   ధృవీక   రించేది.   అంతేకాదు, అది దైవభీతి కలవారికి ఆసాంతం మార్గదర్శిని మరియు   హితబోధిని   కూడా.” (ఖురాను – 5 : 46)

ఖురాను: తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాలను అనుసరించాలి 

“ఇంజీలు గ్రంథం గలవారు కూడా, అల్లాహ్‌ ఇంజీలులో అవతరింపజేసిన దానికనుగుణంగానే తీర్పు చెయ్యాలి. అల్లాహ్‌ అవతరింపజేసిన దాని ప్రకారం తీర్పుచెయ్యని వారే   పాపాత్ములు.” (ఖురాను – 5 : 47)

“(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ”ఓ గ్రంథవహులారా! మీరు తౌరాతునూ, ఇంజీలునూ, మీ ప్రభువు   తరఫున   మీ   వద్దకు   పంపబడిన   దానినీ (మీ జీవితాలలో)   నెలకొల్పనంతవరకూ మీరు ఏ ధర్మంపైనా లేనట్లే.” నీ ప్రభువు తరఫున నీపై అవతరింపజేయబడినది వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని, తిరస్కార వైఖరిని మరింత   అధికం చేస్తుంది. కనుక నీవు ఈ తిరస్కారులపై దిగులు చెందకు.” (ఖురాను – 5 : 68)

ఖురాను: ముస్లిములు తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాలను ఖురాను గ్రంథముకు సమానంగా గౌరవించాలి

“(ముస్లిములారా!)   మీరు   ఇలా   ప్రకటించండి   :”మేము   అల్లాహ్ను   విశ్వసించాము.   మాపై   అవతరింపజేయబడిన   దానినీ,   ఇబ్రాహీం,   ఇస్మాయీల్,   ఇస్హాఖ్,   యాఖూబ్   మరియు   వారి   సంతతిపై   అవతరింపజేయబడిన   దానినీ,   మూసా,   ఈసా   ప్రవక్తలకు   వారి   ప్రభువు   తరఫున   వొసగబడిన   దానిని   కూడా   మేము   విశ్వసించాము.   మేము   వారిలో   ఎవరి   మధ్య   కూడా   ఎలాంటి   విచక్షణ   (వివక్ష)ను   పాటించము.   మేము   ఆయనకే   విధేయులము.’’” (ఖురాను – 2 : 136)

“ఓ   విశ్వాసులారా!   అల్లాహ్ను,   ఆయన   ప్రవక్త   (స)ను,   ఆయన   తన   ప్రవక్త   (స)పై   అవతరింపజేసిన   గ్రంథాన్నీ,   అంతకు   మునుపు   ఆయన   అవతరింపజేసిన   గ్రంథాలన్నిటినీ   విశ్వసించండి.   ఎవడు   అల్లాహ్ను,   ఆయన   దూతలను,   ఆయన   గ్రంథాలను,   ఆయన   ప్రవక్తలను,   అంతిమ   దినాన్ని   తిరస్కరిం   చాడో   వాడు   మార్గం   తప్పి   చాలాదూరం   వెళ్ళిపోయాడు.” (ఖురాను – 4 : 136) 

ఖురాను: తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాలను దృవీకరించడానికే ఖురాను అవతరించబడింది 

“మీ   వద్దనున్న   గ్రంథాలకు   ధృవీకరణగా   నేను   అవతరింప   జేసిన   ఈ   గ్రంథాన్ని   (ఖుర్ఆన్ను)   విశ్వసించండి.   దీని   పట్ల   అందరికంటే   ముందు   మీరే   తిరస్కారులు   కాకండి.   ఇంకా   నా   ఆయతులను   కొద్దిపాటి   ధరకు   అమ్ముకోకండి.   నాకు   మాత్రమే   భయపడండి.” (ఖురాను – 2 : 41)

“వారి   వద్ద   (ముందు   నుంచే)   ఉన్న   దైవగ్రంథాన్ని   ధృవీకరించే   గ్రంథం   అల్లాహ్   వద్ద   నుంచి   వచ్చినప్పుడు,   తెలిసి   కూడా   వారు   దానిని   తిరస్కరించసాగారు   –   మరి   చూడబోతే   దీని   రాకకు   మునుపు   తమకు   అవిశ్వాసులపై   విజయం   చేకూరాలని   వారు   స్వయంగా   అభిలషించేవారు.   ఇటువంటి   తిరస్కారులపై   అల్లాహ్   శాపం   పడుగాక!” (ఖురాను- 2 : 89)

”ఇంకా నేను నాకు పూర్వం అవతరించిన తౌరాతు (గ్రంథము) ను ధృవపరుస్తున్నాను. మీ కొరకు నిషేధించబడిన కొన్ని వస్తువులను ధర్మసమ్మతం గావించటానికి కూడా నేను వచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభువు సూచనను తీసుకు వచ్చాను. కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి.” (ఖురాను – 3 : 50)

“ఓ గ్రంథవహులారా! మేము అవతరింపజేసిన దానిన విశ్వసించండి. అది మీ వద్ద ఉన్నదానిని   ధృవీకరిస్తుంది. మేము ముఖాలను వికృతం చేసి, వీపు వైపుకు తిప్పకముందే లేక శనివారం వాళ్లను   శపించినట్లుగా మేము వారినీ శపించక ముందే దీనిని (ఈ గ్రంథాన్ని) విశ్వసించండి. అల్లాహ్ తలచుకున్న   పని ఇక అయిపోయినట్లే.” (ఖురాను- 4 : 47)

మర్యమ్‌ కుమారుడైన ఈసా, “ఓ ఇస్రాయీలు సంతతి వారలారా! నేను మీ వైపు అల్లాహ్ తరఫున పంపబడిన ప్రవక్తను. నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. నా తరువాత రాబోయే ఒక ప్రవక్తను గురించి శుభవార్తను ఇస్తున్నాను. అతని పేరు అహ్మద్‌” అని చెప్పినప్పటి సంగతి (కూడా స్మరించదగినదే). తీరా అతను స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు, “ఇది పచ్చి ఇంద్రజాలం” అని వారు అన్నారు (తేలిగ్గా కొట్టి పారేశారు). (ఖురాను – 61 : 6)

గమనించండి, ఖురానులోని పై ఆయలన్నీ కూడా పూర్వగ్రంథాలను [తౌరాత్, జబూర్, ఇంజీల్] దృవీకరించటానికే అంటే అవి సత్యమని లేక దైవగ్రంథాలని సాక్ష్యము చెప్పటానికె ఖురాను/ముహమ్మదు పంపబడినట్లు ప్రకటిస్తున్నాయి. అంతేగాని, పూర్వగ్రంథాలను సరిచేయటానికో లేక పూర్వగ్రంథాలను తప్పులుదిద్దటానికో లేక పూర్వగ్రంథాలను తీసివేయటానికో పంపబడినట్లు బోధించడము లేదు.

ఖురాను: ప్రవక్తలద్వారా యివ్వబడిన తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాలను ధిక్కరించినవారికి తీవ్ర శిక్ష సిద్దపరచబడింది 

“వారు గ్రంథాన్ని, మా ప్రవక్తలతోపాటు పంపినదానిని [తౌరాత్, జబూర్, ఇంజీల్] కూడా ధిక్కరించారు. వారు త్వరలోనే (యదార్థం ఏమిటో) తెలుసుకుంటారు. అప్పుడు వారి మెడలలో (ఇనుప) పట్టాలు వేయబడి ఉంటాయి, సంకెళ్లుకూడా ఉంటాయి. మరి వారు ఈడ్వబడతారు. సలసలాకాగే నీళ్లలోకి. తరువాత నరకాగ్నిలో కాల్చబడతారు.” (ఖురాను – 40 : 70-72)

తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాల “మార్పులపై” ఖురాను వ్యాఖ్యానం 

“(ముస్లిములారా!) వారు మీ మాటను నమ్ముతారనే (ఇప్పటికీ) మీరు ఆశపడ్తున్నారా? వాస్తవానికి వారిలో, అల్లాహ్ వాక్కును విని, అర్థం చేసుకుని కూడా ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్చి వేసేవారు ఉన్నారు.” (ఖురాను – 2 : 75)

“తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవగ్రంథమని చెప్పి, ప్రాపంచిక తుచ్ఛ ప్రయోజనాన్ని పొందజూసే  వారికి ‘వినాశం’ కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారితీస్తుంది. వారి ఈ  సంపాదన  కూడా వారి నాశనానికి కారణభూతం అవుతుంది.” (ఖురాను – 2 : 79)

“వారిలోని   మరికొందరు   గ్రంథాన్ని   పఠిస్తూ   తమ   నాలుకలను   త్రిప్పుతారు   –   అది   గ్రంథంలోని   భాగమే   అని   మీరు   భావించా   లన్న   ఉద్దేశ్యంతో   వారలా   చేస్తారు.   కాని   వాస్తవానికి   అది   గ్రంథంలో   అంతర్భాగం   కానేకాదు.   ”అది   అల్లాహ్‌   తరఫు   నుంచి   వచ్చినది”   అని   వారు   అంటారు.   యదార్థానికి   అది   అల్లాహ్‌   తరఫునుండి   వచ్చినది   కాదు.   వారు   ఉద్దేశ్యపూర్వకంగా   అల్లాహ్‌కు   అసత్యాన్ని   అంటగడుతున్నారు.” (ఖురాను – 3 : 78)

“ఆ   తరువాత   వారు   తమ   వాగ్దానాన్ని      భంగపరచిన      కారణంగా   మేము   వారిని   శపించాము. వారి   హృదయాలను   కఠినం   చేశాము.   (తత్కారణంగా)   వారు   పదాలను   వాటి   (అసలు) స్థానం   నుంచి   తారుమారు   చేస్తున్నారు.   అంతేకాదు,   తమకు   బోధించబడిన      ఉపదేశంలో చాలా  భాగం వారు మరచి పోయారు.(ఓ   ప్రవక్తా!)   వారు   పాల్పడే   ఏదో   ఒక ద్రోహానికి సంబంధించిన   సమాచారం   నీకు   అందుతూనే   ఉంటుంది.   అయితే   వారిలో   కొద్దిమంది   మాత్రం అలాంటివారు   కారు.   అయినా సరే   నువ్వు   వారిని   మన్నిస్తూ,   ఉపేక్షిస్తూ   ఉండు.   నిస్సందేహంగా      అల్లాహ్‌      ఉత్తమంగా వ్యవహరించేవారిని      అమితంగా   ప్రేమిస్తాడు.” (ఖురాను – 5 : 13)

“తమను   తాము   ‘నసారా’   (క్రైస్తవులు)గా      చెప్పుకునేవారి   నుండి   కూడా   మేము   వాగ్దానం   తీసుకున్నాము.   అయితే   వారు   కూడా      తమకు   చేయబడిన      ఉపదేశంలోని      ఎక్కువ   భాగాన్ని   విస్మరించారు.   ఈ   కారణంగా      మేము   వారి   మధ్య   విరోధాన్ని,   విద్వేషాలను   తగిలించాము.      అవి   ప్రళయ   దినం   వరకూ   ఉంటాయి.      వారు   చేస్తూ   ఉండిన   పనులన్నింటినీ   అల్లాహ్‌   త్వరలోనే   వారికి   తెలియజేస్తాడు.” (ఖురాను – 5 : 14)

”అల్లాహ్‌ ఏ మానవమాత్రునిపైనా ఎలాంటి విషయాన్నీ అవతరింపజేయలేదు” అని పలికినప్పుడు ఈ (అవిశ్వాస) జనులు అల్లాహ్‌ను అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకోలేదు. వారిని అడుగు: ”మరి మూసా తెచ్చిన ఆ గ్రంథాన్ని ఎవరు అవతరింపజేసినట్టు? ఆ గ్రంథం ఒక జ్యోతి. మానవుల కొరకు మార్గదర్శకత్వం. మీరు దాన్ని వేర్వేరు కాగితాలుగా విభజించి చూపుతున్నారు. ఎన్నో విషయాలను దాచేస్తున్నారు. మీకుగానీ, మీ పెద్దలకుగానీ తెలియని ఎన్నో విషయాలు (ఇందు మూలంగా) మీకు నేర్పబడ్డాయి.” దాన్ని అవతరింపజేసిన వాడు అల్లాహ్‌యే అని చెప్పు. ఆ తర్వాత వాళ్లను వారి వ్యర్థ  విషయాలలోనే ఆడుకోనివ్వు.” (ఖురాను – 6 : 91)

“వారిలోని   దుర్మార్గులు   తమకు   ఇవ్వబడిన   వాక్కును   మరొక   మాటతో   మార్చివేశారు.   అందువల్ల   మేము   వారిపై   ఆకాశం   నుంచి   ఆపదను   పంపాము.   ఎందుకంటే   వారు   చాలా   అన్యాయంగా   ప్రవర్తించేవారు.” (ఖురాను – 7 : 162)

“కొంతమంది   యూదులు   పదాలను   వాటి   నిజస్థానం   నుంచి   తారుమారు   చేస్తారు.   ”మేము   విన్నాము,   అవిధేయులం   అయ్యాము”   అని   వారంటారు.   అంతేకాదు   –   ”విను.   నీకేమీ   వినపడకూడదు.   రాయినా”   అని   పలుకుతారు.   అలా   అనే   టప్పుడు   వారు   తమ   నాలుకను   మెలి   తిప్పుతారు.   (ఇస్లాం)   ధర్మాన్ని   ఎగతాళి   చేయాలన్నది   అసలు   వారి   ఉద్దేశం. ఇలా అనే బదులు వారు,   ”మేము   విన్నాము.   విధేయులమయ్యాము”   అనీ,   ”వినండి.   మా   వంక   చూడండి”   అని   పలికి   ఉంటే   అది   వారి   కొరకు   ఎంతో   శ్రేయస్కరంగా,   సమంజసంగా   ఉండేది. కాని అల్లాహ్   వారి   అవిశ్వాసం   మూలంగా   వారిని   శపించాడు.   ఇక   వారిలో   విశ్వసించేది   బహుకొద్దిమంది   మాత్రమే.” (ఖురాను – 4 : 46)

“(జ్ఞాపకం   చెయ్యి,)   అల్లాహ్‌   గ్రంథవహుల   నుంచి,   ”మీరు   గ్రంథజ్ఞానాన్ని   ప్రజలకు   తప్పకుండా   వివరించాలి.   దానిని   దాచకూడదు”   అని   వాగ్దానం   తీసుకున్నాడు.   అయినప్పటికీ   వారు   ఈ   వాగ్దానాన్ని   తమ   వీపు   వెనుక   పడవేయటమేగాక   అతి   తక్కువ   మూల్యానికి   దాన్ని   అమ్మివేశారు.   వారు   చేసిన   ఈ   వర్తకం   బహు   చెడ్డది.” (ఖురాను – 3 : 187)

“ఓ   గ్రంథవహులారా!   మీ   వద్దకు   మా   ప్రవక్త      (సఅసం)      వచ్చేశాడు.      మీరు   కప్పిపుచ్చుతూ   ఉండిన   గ్రంథంలోని   ఎన్నో   విషయాలను   అతను   మీ   ముందు   విపులీకరిస్తున్నాడు.   మరెన్నో   విషయాలను   ఉపేక్షిస్తున్నాడు.   అల్లాహ్‌   తరఫు   నుంచి   మీ   వద్దకు   జ్యోతి   వచ్చేసింది.   అంటే,   స్పష్టమైన   గ్రంథం   వచ్చేసింది.” (ఖురాను – 5 : 15)

“మేము   అవతరింపజేసిన   నిదర్శనాలను   మరియు   సన్మా   ర్గాన్ని   ప్రజల   కొరకు   గ్రంథంలో   విశదపరచిన   తరువాత   కూడా   వాటిని   దాచిపెట్టే   వారిని   అల్లాహ్   శపిస్తాడు.   ఇంకా,   వేరే   శపించే   వారు   కూడా   వారిని   శపిస్తారు.” (ఖురాను – 2 : 159)

“అల్లాహ్   తన   గ్రంథంలో   అవతరింపజేసిన   విషయాలను   దాచేవారు,   వాటిని   కొద్దిపాటి   ధరకు   అమ్ముకునేవారు   వాస్తవానికి   తమ   పొట్టలను   అగ్నితో   నింపుకుంటున్నారు.   ప్రళయ   దినాన   అల్లాహ్   వారితో   అస్సలు   మాట్లాడడు.   వారిని   పరిశుద్ధపరచడు.   పైపెచ్చు   వారికి   బాధాకరమైన   శిక్ష   కలదు.” (ఖురాను – 2 : 174)

పై ఖురాను ఆయాతులలోని ఒక్కటికూడా క్రింది విధంగా ప్రకటించడము లేదు:

– యూదులు మరియు క్రైస్తవుల యొద్ద వున్న దైవగ్రంథాలన్నీ మార్చబడ్డాయి

– అల్లాహ్ అవతరింపచేసిన తౌరాత్, జబుర్, మరియు ఇంజీల్ గ్రంథాలలోని వ్రాతలు మార్చబడ్డాయి

– లోకములో వున్న తౌరాత్, జబుర్, మరియు ఇంజీల్ అనే అల్లాహ్ అవతరింపచేసిన గ్రంథాలన్ని యిప్పుడు మార్చబడ్డాయి

– తౌరాత్, జబుర్, మరియు ఇంజీల్ గ్రంథాలను యిక చదవకండి లేక ధ్యానించకండి లేక పాటించకండి 

ఇంకా చెప్పాలంటే ఇస్లాము ప్రవక్త ముహమ్మదుగారు కూడా పై మాటలలో ఒక్కటికూడా చెప్పలేదు. అయినా ముస్లీము మతపెద్దలు మరియు దావా ప్రచారకులు పై విధంగా బోధిస్తుండటము అన్నది సర్వసాధరణంగా ముస్లీము సమాజాలలో జరుగుతున్న అతి పెద్ద శోచనీయమైన విశయం. ఈవిధంగా బోధించడమన్నది ఖురానుకు, అల్లాహ్ కు, మరియు ఇస్లాము ప్రవక్త ముహమ్మదు గారికి వ్యతిరేకంగా చేయబడుతున్న దుష్టప్రచారమని సత్యాన్ని ప్రేమించే ముస్లిములంతా గ్రహించాలి. 

పూర్వ గ్రంథాలను “ధృవీకరిస్తుంది” లేక “ధృవీకరించటానికి” ఖురాను అవతరించింది అంటూ ఖురాను ఆయతులలో వుపయోగించబడిన అరబ్బీ పదం “ముసద్ధిక్కాన్.” ఈ పదము యొక్క భావాలు: ధృవపరుచుట; విశ్వసింపచేయుట; సత్యమని తెలుపుట. ఈ పదాన్ని ముహమ్మదు గారు వుపయోగించినప్పుడు ఆయన యూదులు మరియు క్రైస్తవులు విశ్వచించే గ్రంథాలు [తౌరాత్, జబుర్, ఇంజీల్ = బైబిలు]  దేవుని గ్రంథాలు అని విశ్వసించాడు. ఆయన యూదులు మరియు క్రైస్తవుల యొద్ద వున్న బైబిలు గ్రంథము దేవుని గ్రంథము అని ధృవపరచాడు.  

ముస్లీము దావా ప్రచారకులు పూర్వ దైవగ్రంథాలను నిందిస్తూ అవన్నీ మార్చబడ్డాయి కనుక వాటిని విశ్వసించకూడదు మరియు చదువకూడదు అంటు అమాయక ముస్లీము ప్రజలను మోసపరచే ప్రయత్నములో తమను సమర్థించుకోవటానికి పేర్కొంటున్న ఖురాను ఆయతులేవి వారి దుష్ట ప్రయత్నాలను సమర్థించటము లేదన్నది చదువరులు యిట్టే గమనించగలరు. 

పూర్వ గ్రంథాలపై హదీసుల వ్యతిరిక్తవ్యాఖ్యలు

ముస్లీములు తమ అచంచల విశ్వాసానికి ఆధారంగా లెక్కించే దాదాపుగా 20,000 కంటే ఎక్కువైన ప్రామాణిక హదీసులు ఉన్నాయి. వీటన్నిటిలో కేవలం రెండు హదీసులు మాత్రమే అల్లాహ్ అవతరింపచేసిన మునుపటి గ్రంథాలను [తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్] గురించి ప్రతికూలసందేశాన్ని తెలియచేస్తున్నాయి.

ఆ రెండు హదీసులు ఇక్కడ ఉన్నాయి:

(i) ఉబైదుల్లా తెలియచేసింది: ఇబ్న్ అబ్బాస్ ఇలా అన్నారు, “అల్లాహ్ యొక్క అపొస్తలునికి వెల్లడించిన మీ పుస్తకం (ఖురాన్) క్రొత్తది మరియు తాజాది ఉండగాగా మీరు దేనిగురించి అయినా గ్రంథ ప్రజలను ఎందుకు అడుగుతారు? గ్రంథ ప్రజలు (యూదులు మరియు క్రైస్తవులు) తమ గ్రంథాన్ని మార్చుకొని దానిని వక్రీకరించారని, మరియు వారు తమ చేతులతో గ్రంథాన్ని వ్రాసి, కొద్ది లాభం కోసం ‘ఇది అల్లాహ్ నుండి వచ్చినది’ అని చెప్పే వారు అంటూ అల్లాహ్ చెప్పాడు కదా! మీకు వచ్చిన జ్ఞానం మీరు దేని గురించి అయినా ఎవరినైనా అడగకుండా నిరోధిస్తుంది కదా? లేదు, అల్లాహ్ సాక్షిగా, మీకు వెల్లడించబడిన విషయాల గురించి వారిలోని ఒక్కరుకూడా మిమ్మల్ని అడగడాన్ని మేము ఎప్పుడూ చూడలేదు!” (బుఖారీ వాల్యూమ్ 9, పుస్తకం 92, సంఖ్య 461)

(ii) ఉబైదుల్లా బిన్ అబ్దుల్లా తెలియచేసింది: అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ ఇలా అన్నారు, “ముస్లింల సమూహమే! అల్లాహ్ మీ ప్రవక్తకు వెల్లడించిన స్వచ్చమైన మరియు వక్రీకరించబడని మీ పుస్తకంలో ఇటీవలి వార్తలు ఉండగా మీరు దేని గురించి అయినా గ్రంథాల ప్రజలను ఎలా అడుగగలరు? లేఖనాల ప్రజలు అల్లాహ్ పుస్తకాలలో కొన్నింటిని మార్చారని మరియు దానిని వక్రీకరించి, తమ చేతులతో ఏదో వ్రాసి, “దీనిద్వారా కొంత లాభం పొందేందుకు ఇది అల్లాహ్ నుండి వచ్చింది” అని చెప్పారంటూ అల్లాహ్ చెప్పాడుకదా? మరి మీ వద్దకు వచ్చిన జ్ఞానం వారిని అడగకుండా ఎందుకు ఆపడం లేదు? లేదు, అల్లాహ్ సాక్షిగా, వారి నుండి ఒక వ్యక్తి మీకు తెలియచేయబడిన గ్రంథమును (అల్-ఖురాన్ పుస్తకం) గురించి మిమ్మల్ని అడగడాన్ని మేము ఎప్పుడూ చూడలేదు. (బుఖారీ వాల్యూమ్ 9, పుస్తకం 93, సంఖ్య 614)

పై రెండు హదీసులలో గమనించాల్సిన ప్రాముఖ్యమైన విశయాలు:

1. రెండు హదీసులలోని పూర్వగ్రంథాలకు వ్యతిరిక్తమైన వ్యాఖ్యలు చెప్పింది…

  • ఖురాను కాదు
  • ముహమ్మదు కాదు
  • అల్లాహ్ కాదు

2. పై హదీసులోని పూర్వగ్రంథాలకు వ్యతిరిక్తమైన వ్యాఖ్యలు ఖురానులోని మాటలకు పూర్తి వ్యతిరిక్తమైనవి…
“మరి మేము నీ వద్దకు పంపిన దానిపై ఏమాత్రం సందేహమున్నా నీకు పూర్వపు గ్రంథాన్ని పారాయణం చేస్తున్నవారిని అడిగిచూడు. నిశ్చయంగా నీ వద్దకు నీ ప్రభువు తరఫు నుంచి సత్యం (తో కూడిన గ్రంథం) వచ్చింది. కనుక నువ్వు ఎంత మాత్రం శంకించేవారిలో చేరకు.” (ఖురాన్ – 10 : 94)

3. పై రెండు హదీసులుకూడా “పూర్వగ్రంథాలన్నింటిని గ్రంథప్రజలు మార్చివేశారు కనుక అవి అన్ని యిప్పుడు చదువకూడదు” అని చెప్పే సాహసం చేయడం లేదు.

4. ఖురాను “అల్లాహ్ మాటలను మార్చే వారు లేరు” (ఖురాను – 6 : 34,115; 10:64) అని ఘంటాపథంగా ప్రకటిస్తుండగా పై రెండు హదీసులు అల్లాహ్ అవతరింపచేసిన పూర్వ గ్రంథాలలోని కొన్నింటిని గ్రంథప్రజలు మార్చారని ఖురాను ప్రకటనకే వ్యతిరేకంగా చెపుతుండటాన్నిబాట్టి వాటి సందేశం సత్యమో కాదో విజ్ఙులైన ముస్లీములే తేల్చుకోవాలి. ఖురాను ప్రకటననా లేక పై రెండు హదీసుల మాటలనా దేన్ని నమ్మాలో ముస్లీములు నిర్ణయించుకోవాలి.

5. పై రెండు హదీసులలోని పూర్వగ్రంథాలకు వ్యతిరేకమైన వ్యాఖ్యలు తర్కానికి మరియు లేఖనాలకు విరుద్ధమైనవి. ఉదాహరణకు, తవురాత్ గ్రంథము తరువాత అవతరించిన జబూర్ గ్రంథము పూర్వగ్రంథమైన తౌరాత్ వక్రీకరించబడినందుకు/మార్చబడినందుకు రాలేదు. అలాగే, జబూర్ గ్రంథము తరువాత అవతరించిన ఇంజీల్ గ్రంథము పూర్వ గ్రంథాలైన తవురాత్ మరియు జబూర్ గ్రంథాలు మార్చబడినందుకు/వక్రీకరించబడినందుకు రాలేదు. కనుక, పూర్వగ్రంథాలైన తవురాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాల సరసన ఖురాను కూడా వస్తె అది పూర్వగ్రంథాలు మార్చబడినందుకో లేక వక్రీకరించబడినందుకో రాలేదు అన్నది గుర్తుంచుకోవాలి. నిజానికి ఖురాను ఒక్కసారికూడా “పూర్వ గ్రంథాలు మార్చబడ్డాయి గనుక వాటిని సరిచేయటానికి ఖురాను వచ్చింది” అని ఎక్కడా ప్రకటించడము లేదు.

ముహమ్మదు మరియు పూర్వగ్రంథాలు

పై రెండు హదీసుల పై ముస్లిం బోధకులు విరివిగా చేస్తున్న తప్పుడు వ్యాఖ్యానాలకు విరుద్ధంగా ఇస్లాము ప్రవక్త ముహమ్మద్ గారు మొదటి ముస్లీముల సాక్ష్యం ప్రకారం పూర్వ గ్రంథాలను ఏదృక్పథంతో చూశారో మరియు వాటియెడల ఏరకంగా ప్రవర్తించారో క్రింది హదీసులు తెలియచేస్తున్నాయి: 

సునన్ అబూ దావుద్ [పుస్తకం 38, సంఖ్య 4434]

అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ కథనం: యూదుల బృందం వచ్చి అల్లాహ్ అపొస్తలుడిని (ఆయనకు శాంతి కలుగునుగాక) కుఫ్‌కు ఆహ్వానించింది. కాబట్టి అతను వెల్లి వారిని వారి విధ్యాలయములో సందర్శించాడు. వారు అన్నారు: అబుల్ ఖాసిమ్, మా పురుషులలో ఒకడు ఒక స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు; కాబట్టి వారిపై తీర్పు ప్రకటించండి. వారు కూర్చోవటానికై అల్లాహ్ యొక్క అపొస్తలుని (ఆయనకు శాంతి కలుగునుగాక) కోసం ఒక మెత్తని దిండు ఉంచారు. ఆయన దానిపై కూర్చొని అన్నాడు: తోరాను తీసుకురండి. అది తేబడింది. అప్పుడు అతను తన క్రింద నుండి మెత్తని దిండును తీసి దానిపై తోరాను ఉంచి అన్నాడు: నేను నిన్ను మరియు నిన్ను అవతరింపచేసిన వ్యక్తిని విశ్వసిస్తాను. ఆతరువాత అతను యింకా ఇలా అన్నాడు: మీలో విధ్యాబుద్ధులున్న వ్యక్తిని నా ముందుకు తీసుకురండి. అప్పుడు ఒక యువకుడిని తీసుకువచ్చారు. అప్పుడు నఫిక్ నుండి మాలిక్ ప్రసారం చేసిన మాదిరిగానే రాళ్ళు కొట్టే సంప్రదాయాన్ని హదీసు ప్రసారికుడు [ransmitter] పేర్కొన్నాడు (నం. 4431). 

సహి బుఖారీ [సంపుటి 4, పుస్తకం 56, సంఖ్య 829]

‘అబ్దుల్లా బిన్‘ ఉమర్ కథనం: యూదులు అల్లాహ్ అపొస్తలుడి వద్దకు వచ్చి వారిలో ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ అక్రమ లైంగిక సంబంధం కలిగి ఉన్నారని చెప్పాడు. అల్లాహ్ అపొస్తలుడు వారితో, “అర్-రజ్మ్ (రాళ్ళు రువ్వడం) యొక్క చట్టపరమైన శిక్ష గురించి తోరా (పాత నిబంధన) లో మీరు ఏమి తెలుసుకున్నారు?” అని ప్రశ్నించాడు. అందుకు వారు సమాధానమిస్తూ అన్నారు, (కాని) మేము వారి నేరాన్ని ప్రకటించి వారిని కొరడాలతో కొట్టుతాము. అబ్దుల్లా బిన్ సలాం అన్నాడు , “మీరు అబద్ధం చెబుతున్నారు; తోరాలో రజ్మ్ (రాళ్ళు రువ్వడం) యొక్క క్రమం ఉంది.”వారు తోరాను తెచ్చి తెరిచారు మరియు వారిలో ఒకడు రజ్మ్ వాక్యముపై (రాళ్ళు రువ్వడం) చేయి పెట్టి దానికి ముందు మరియు దానికి తరువాతి వాక్యాలను చదివాడు. అబ్దుల్లా బిన్ సలాం అతనితో, “నీ చేయి ఎత్తు” అని అన్నాడు. అతను చేయి ఎత్తగానే దాని క్రింద వ్రాయబడివున్న రజ్మ్ వాక్యము కనిపించింది. వారు, “ముహమ్మద్ నిజం చెప్పాడు; తోరాలో రజ్మ్ (రాళ్ళు రువ్వడం) వాక్యం ఉంది. అప్పుడు ప్రవక్త వారిద్దరిపై రాళ్ళు రువ్వాలని ఆదేశించారు. (‘అబ్దుల్లా బిన్ ఉమర్ అన్నాడు, “ఆ పురుషుడు స్త్రీని రాళ్ళ నుండి కాపాడటానికి ప్రయత్నించటం నేను చూశాను.”)

ఇబ్న్ ఇషాక్ 

రఫీ బి. హరితా మరియు సల్లం బి. మిష్కం మరియు మాలిక్ బి. అల్-సయెఫ్ మరియు రఫీ బ్. హురైమిలా అతని వద్దకు [ముహమ్మద్] వచ్చి ఇలా అన్నారు: ‘మీరు అబ్రాహాము మతాన్ని అనుసరిస్తున్నారని మరియు దేవుని వద్దనుండి వచ్చిన సత్యం అని మేము సాక్ష్యం చెప్పే మా వద్ద ఉన్న తోరానుకూడా విశ్వసిస్తున్నరని చెప్పుకోవడం లేదా? అతను, ‘ఖచ్చితంగా, కానీ మీరు పాపం చేసి అందులో ఉన్న ఒడంబడికను విచ్ఛిన్నం చేసారు. అంతేగాక మనుష్యులకు స్పష్టంగా ప్రకటించమని మీకు ఆదేశించిన వాటిని దాచిపెట్టారు. నామట్టుకు నేను మీ పాపాలనుండి దూరంగా వుంటాను.’ వారు అన్నారు, ‘మా దగ్గర ఉన్నదానిని మేము పట్టుకుంటాము. మేము మార్గదర్శకత్వం మరియు సత్యం ప్రకారం జీవిస్తున్నాము. మేము నిన్ను నమ్మము మరియు మేము నిన్ను అనుసరించము.’ కాబట్టి దేవుడు వారి గురించి ఇలా అవతరింపచేశాడు: ‘జవాబు చెప్పండి ఓ గ్రంథప్రజలారా, తోరా మరియు సువార్తను మరియు మీ ప్రభువు నుండి పంపబడిన వాటిని మీరు పాటించే వరకు మీకు యే నిలకడా లేదు. నీ ప్రభువునుండి నిపై అవతరింపచేయబడినది ఖచ్చితంగా వారిలోని చాలా మందినిలోని తప్పును మరియు అవిశ్వాసాన్ని పెంచుతుంది. కాని నీవుమాత్రం అవిశ్వాసులను బట్టి బాధపడకు.'(The Life of Muhammad: A Translation of Ibn Ishaq’s Sirat Rasul Allah, with introduction and notes by Alfred Guillaume [Oxford University Press, Karachi, Tenth impression 1995], p. 268)

ఖురాన్ మరియు హదీసుల యొక్క పై విశ్లేషణ వెలుగులో కొంతమంది ఆధునిక ముస్లింలు విస్పష్టంగా అల్లాహ్ గ్రంథాలు [తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్] వక్రీకరించబడ్డాయి అంటూ అల్లాహ్, ఖురాన్ మరియు ముహమ్మద్ ల కంటే ఎక్కువ జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ పంథాలోని కొంతమంది ముస్లింలు మొదటి హదీసు (సునన్ అబూ దావూద్ పుస్తకం 38, సంఖ్య 4434) ప్రామాణికమైనది కాదని అంటే నిజం కాదని స్వంతభాష్యం చెబుతుంటారు. అయితే, యూదులు మరియు క్రైస్తవులు విశ్వసించే పుస్తకాలను అందలమెక్కించేందుకై మొదటితరం ముస్లింలు తమ ప్రియతమ ప్రవక్తకు అబద్ధాలు ఎందుకు అంటగట్టే ప్రయత్నం చేస్తారో ఆధునిక ముస్లింలు వివరించాలి.

20,000 కంటే ఎక్కువగా వున్న ప్రామాణిక హదీసులలోనుండి పూర్వ గ్రంథాలు [తౌరాత్, జబూర్ మరియు ఇంజిల్] పాడైపోయాయని ముహమ్మద్ గారే స్వయంగా ప్రకటించిన ఒక్క హదీసునైనా ఆధునిక దావాప్రచారకులు చూపించగలగాలి. వాస్తవానికి అలాంటి హదీసులు ఎవీ లేవు. అయినా, అల్లాహ్ గ్రంథాలైన తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాలను తప్పుబడుతూ వాటిపై అబద్ద ప్రచారాలను చేస్తూ అమాయక ముస్లిం సమాజాన్ని తప్పుత్రోవపట్టిస్తున్న దావాప్రచారకుల దుష్టప్రయత్నాలు మాత్రం దురదృష్టవశాత్తు నిరాటంకంగానే కొనసాగుతూనే వున్నాయి!

ముస్లిం పండితులు మరియు పూర్వగ్రంథాలు

చివరగా, కొంతమంది మొదటి ముస్లిం పండితులు [సహబ/الصحابة‎=ముహమ్మదు సహచరులు] కూడా పూర్వ గ్రంథాలు [తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్] అక్షరార్థంగా లేక లిఖితరూపములో పాడైపోలేదని బోధించారు. 

ఇబ్న్ అబ్బాస్ (619-687):

అల్-బుఖారీ నివేదించిన ప్రకారం ఇబ్న్ అబ్బాస్ వివరించాడు, అల్లాహ్ యొక్క సృష్టిలో ఎవరూ అల్లాహ్ యొక్క పదాలను అతని పుస్తకాల నుండి తొలగించలేరు కాని వారు ఆయ  యొక్క అర్థం మార్చడం మరియు జతచేయడం అంటే వాటి స్పష్టమైన అర్థాలను మార్చారు మరియు వక్రీకరించారు. వహ్బ్ బిన్ మునాబ్బిహ్ ఇలా అన్నాడు, “తౌరాత్ మరియు ఇంజీల్ అల్లాహ్ వాటిని వెల్లడించినట్లుగానే మిగిలి ఉన్నాయి, మరియు వాటిలోని ఏ పదముకూడా తొలగించబడలేదు. అయితే, ప్రజలు తమకు తాము వ్రాసుకున్న పుస్తకాలపై ఆధారపడి, అదనంగా వ్రాసుకున్న వాటిద్వారా మరియు తప్పుడు వ్యాఖ్యానాల ద్వారా ఇతరులను తప్పుదారి పట్టించారు. (ఇస్మాయిల్ బి. కతీర్, “యూదులు అల్లాహ్ మాటలను మారుస్తారు,” ఖురాన్ తఫ్సీర్ ఇబ్న్ కతీర్ [సేకరణ తేదీ 24 సెప్టెంబర్ 2016], http://www.qtafsir.com/index.php…) 

ఇబ్న్ తెమియ్య (1263-1328):

“తవ్రత్ మరియు ఇంజల్ లలో దేవుడు వెల్లడించినదానికి అనుగుణంగా ఒక్క కాపీ/నఖలు [లేఖనాల  సంస్కరణ] కూడా ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పబడుతున్నది. అంతేగాక, ఉన్నవన్నీ మార్చబడ్డాయి (ముబద్దల్), ఇక తవ్రాత్ విషయానికొస్తే ఆ గ్రంథం అనేకులనుండి అనేకులకు జరిగే ప్రసారం ఆగిపోయింది, ఇంజోల్ గ్రంథమేమో నలుగురు వ్యక్తుల నుండి తీసుకోబడింది అంటు చెప్పబడుతున్నది.     

“అప్పుడు, ఈ ప్రజలలో [ముస్లింలు] తవ్రాత్ మరియు ఇంజిల్ [ఈ రోజు] లో ఉన్నవి చాలావరకు తప్పుడు (బాటిల్) ఇది దేవుని వాక్యం (కలాం అల్లాహ్) కాదు అని ఆరోపించేవారు (జామా) ఉన్నారు. వారిలో కొందరు, ‘అసత్యం అన్నది అంత ఎక్కువగా లేదు ‘ అన్నారు. ఇది [కూడా] చెప్పబడింది: ఎవరూ గ్రంథంలోని ఏ వచనాన్ని మార్చలేదు. నిజానికి వారు [యూదులు మరియు క్రైస్తవులు] కేవలం తమ [తప్పుడు] వ్యాఖ్యానాల ద్వారా వాటి అర్థాలను తప్పుగా ప్రచారం చేశారు. అనేకమంది ముస్లింలు ఈ రెండు అభిప్రాయాలను కలిగి ఉన్నారు. అయితే, సరైన [దృశ్యము] మూడవది, అంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలం వరకు ప్రపంచంలో నిజమైన కాపీలు/నఖలులు [సంస్కరణలు] ఉండేవి మరియు వక్రీకరించబడిన కాపీలు/నఖలులు కూడా ఉండేవి. ఎవరైతే ప్రస్తుతమున్న కాపీలలో/నఖలులలో వక్రీకరించబడినవి లేవు అని అంటారో వారు తిరస్కరింపజాలనిదాన్ని తిరస్కరించారు. ఎవరైనా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తరువాత అన్ని కాపీలు [సంస్కరణలు] పాడైపోయాయి (హరిఫాట్) అని చెప్పినా వారు స్పష్టమైన అబద్ధం (ఖాటా) చెప్పినట్లే. తవ్రత్ మరియు ఇంజిల్లో అల్లాహ్ పునరుద్ఘాటించిన దానితో తీర్పు తీర్చుకోమని ఖుర్ఆన్ వారికి ఆజ్ఞాపించింది. రెండింటిలో జ్ఞానం (హిక్మా) ఉందని [అల్లాహ్] తెలియజేశాడు. వారు అన్ని కాపీలు/నఖలులు [సంస్కరణలు] మార్చారని సూచించడానికి ఖుర్ఆన్ లో ఏ ఆధారము లేదు (సయీద్, “యూదు మరియు క్రైస్తవ లేఖనాల వక్రీకరణ ఆరోపణ,” 430.)  

ఈ రోజు క్రైస్తవులు చదివే బైబిల్ ఇస్లాంకు పూర్వంనుండి ఉండిన వ్రాతప్రతుల కాపీల/నఖలుల నుండి వచ్చింది. పురాతన కాపీలలో/నఖలులలో కొన్ని వైవిధ్యాలు ఉన్నాయని బైబిలు పండితులు నిజాయితీగా అంగీకరిస్తారు [ఇటువంటి నిజాయితి అన్నది ఖురాను పండితులలో కొరవడింది]. అయితే, ఆ కారణాన్నిబట్టి ప్రతి పురాతన కాపీ/నఖలు ఖచ్చితంగా పాడైపోయిందని మరియు అది అసలైనదానికి భిన్నంగా ఉందని చెప్పడం మాత్రం అహంకారపూరిత ప్రకటన మాత్రమే కాదు, దైవ ప్రేరణతో మరియు రక్షణతో వచ్చిన దైవ గ్రంథాలకు వ్యతిరేకంగా తీర్చే తీర్పు.

దేవుడు తన గ్రంథాలను కనీసం ఒక పురాతన కాపీ/నఖలు రూపములో అసలుకు మాదిరిగా సంపూర్ణ పరిపూర్ణతతో ఉంచడం అన్నది సర్వశక్తిమంతుడైన దేవునికి చాలా చిన్న విషయం, అయితే పండితుల పరిశోధన అటువంటివి ఒకటి కంటే ఎక్కువ కాపీలు/నఖలులు ఉన్నాయని ధృవీకరిస్తున్నది. ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవునికి సమస్త ఘనత మరియు మహిమ కలుగును గాక!

ఆయన తనచేత ప్రేరేపించబడిన రచయితల ద్వారా తన గ్రంథాలను అవతరింపచేసాడు, అంతేగాక ‘ప్రభువు మాట శాశ్వతంగా ఉంటుంది’ అంటూ వాగ్ధానం చేసి దాన్ని నెరవేరుస్తున్నాడు.     

గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.” (యెషయా.40: 8)
గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.” (1పేతురు.1:25)

తన వాక్కు యొక్క భద్రత విశయములో దేవుడే చేసిన వాగ్ధానాన్ని శంకిస్తూ అసత్యప్రేలాపనలను చేస్తున్న వారు అవిశ్వాసులేగాక సాతానుని ప్రియతమ దాసులు. అలాంటివారు నిత్యనాశనానికి పాత్రులు. దేవుడు అలాంటి ప్రమాదములోనుండి మిమ్ములను కాపాడును గాక!

 

20 Responses

  1. Althaf says:

    అయితే బైబిల్ లో ఎటువంటి మార్పులు జరగలేదని అంటారు.
    అయితే నాకు చిన్న doubt : ఇబ్రహీం (అ) భలి కొరకు తీసుకుని వెళ్ళింది ఇస్మాయిల్ (అ) నా? ఇసాఖ్(అ) నా!?

    • telugui says:

      బ్రదర్ అల్తాఫ్,

      మీరు రెండు ప్రశ్నలను లేవనెత్తారు. వాటికి వేరువేరుగా జవాబు చెప్పల్సి వస్తుంది. అయితే, ఈ ప్రయత్నములో మీరు కూడా జవాబులు చెప్పాల్సిన ప్రశ్నలు వున్నాయి. వాటికి మీస్పందన తెలుయచేయగలరు.

      మీ మొదటి ప్రశ్న: “అయితే బైబిల్ లో ఎటువంటి మార్పులు జరగలేదని అంటారు?”
      జవాబు: అవును దైవగ్రంథమైన బైబిలులో మార్పులు లేవు. ఒకవేల వున్నాయని మీరు భావిస్తే…
      – అవి ఎక్కడ వున్నాయి ఏవింధగా అవి మార్పులని మీరు గుర్తించగలిగారు?
      – ఒకవేల బైబిలు [తౌరాత్, జబూర్, ఇంజీల్] ను మానవులు మార్చి వేస్తే దాని బట్టి ఖురాను చెప్పింది అబద్దమని తేలిపోతుందికదా? దానికి మీ జవాబు ఏమిటి?
      – ఒకవేల ఖురానులోని పూర్వగ్రంథాలు [తౌరాత్, జబూర్, ఇంజీల్] బైబిలులోనివి కాదు అని మీరు అభిప్రాయపడితే మరి ఖురాను తెలియచేసిన పూర్వ గ్రంథాలు ఖురాను తెలియచేస్తున్న ప్రకారము క్రైస్తవులతో వుండాలి. వాటినే సమిష్టిగా ఈనాడు క్రైస్తవులు ‘బైబిలు’ అని పేర్కొంటారు.! ఈ సత్యాన్ని మీరు విశ్వసించకపోతే మరి మీరే ఖురాను తెలియచేస్తున్నా యూదు మరియు క్రైస్తవ గ్రంథాలు [పూర్వగ్రంథాలు] ఎక్కడున్నాయో తెలియచేయండి?

      మీ రెండవ ప్రశ్న: “ఇబ్రహీం (అ) భలి కొరకు తీసుకుని వెళ్ళింది ఇస్మాయిల్ (అ) నా? ఇసాఖ్(అ) నా!?”
      జవాబు: ఇబ్రహీం భలి కొరకు తీసుకుని వెళ్ళింది ఇసాఖ్ నే, కాని ఇస్మాయిల్ ను కాదు. ఒక వేల మీరు అది ఇసాఖ్ కాదు ఇస్మాయిల్ అని అభిప్రాయపడుతున్నట్లయితే అందుకు స్పష్టమైన సాక్ష్యాలను గ్రంథాలలోనుండి చూపించండి.

      అలాగే, అది ఇస్సాఖ్ [ఇస్సాకు] అని నేను దైవగ్రంథమైన బైబిలులోనుండి అనేక స్థలాలలో ఇస్సాఖ్ పేరుతో చూపించగలను, మరి మీరు నమ్మే ఖురానులోనుండి అది ఇస్మాయిల్ [ఇష్మాయేలు] అని విస్పష్టంగా ఒక్క స్థలములోనైనా ఇస్మాయిల్ పేరుతో చూపించగలరా?

      సలాం,
      అడ్మిన్

  2. Althaf says:

    ఒకసారి కింది ఆయత్ లను పరిశీలించండి

    “నా ప్రభూ! నాకు గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు” (అని ప్రార్థించాడు).

    అందువల్ల మేమతనికి, సహనశీలుడైన ఒక అబ్బాయి గురిం చిన శుభవార్తను అందజేశాము.

    (Quran – 37 : 100-101)

    ఇంకా ఇస్మాయీలు, ఇద్రీసు, జుల్‌కిఫ్ల్‌ (లను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి). వారంతా సహనశీలుర కోవకు చెందినవారు.

    (Quran – 21 : 85)

    ఇంకా ఒకసారి సూరహ్ 37 లోని ఆయాత్ 101 నుండి 111 వవరకు ఇబ్రహీం (అ) గారి ఖుర్బానీ సంఘటన తరువాత ఆయత్ 112 లో ఆయన కుమారుడు ఇస్సాఖ్(అ) వారి ప్రస్తావన వచ్చింది.

    దీన్ని బట్టి చూస్తే, ఇంతకు ముందు జిబాహ్ చెయ్యమని అల్లాహ్ ఆజ్ఞ ఇస్మాయిల్ (అ) గురించే. అప్పటికి ఇస్మాయిల్ (అ) ఇబ్రహీం (అ) ఏకైక పుత్రుడు. ఆ తరువాతే ఇస్సాఖ్(అ) పుట్టారు. కనుక ఇస్సాఖ్(అ) ద్వితీయ పుత్రుడు.

    • telugui says:

      Bro.Altaf,

      Assalam-valeikum!

      మీ ప్రశ్నకు మా మొదటి సమాధానము:

      నేను యిచ్చిన సవాలు [challenge] కు మీరు జవాబు యివ్వలేక పోయారు.
      నేను అడిగింది “అది ఇస్సాఖ్ [ఇస్సాకు] అని నేను దైవగ్రంథమైన బైబిలులోనుండి అనేక స్థలాలలో ఇస్సాఖ్ పేరుతో చూపించగలను, మరి మీరు నమ్మే ఖురానులోనుండి అది ఇస్మాయిల్ [ఇష్మాయేలు] అని విస్పష్టంగా ఒక్క స్థలములోనైనా ఇస్మాయిల్ పేరుతో చూపించగలరా?”

      పైన నేను యిచ్చిన సవాలు ప్రకారము బైబిలులోనుండి మూడు స్థలాలో నుండి విస్పష్టమైన “ఇస్సాకు/ఇస్సాఖ్” అన్న పేరుతోకూడిన బైబిలు సాక్ష్యాన్ని మీముందు వుంచుతున్నాను:

      అ) “ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలి పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.” (తౌరాత్: ఆదికాండము.22:9)
      ఆ) “అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.” (ఇంజీల్: హెబ్రీయులకు.11:17)
      ఇ) “మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించినప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొంద లేదా?” (ఇంజీల్: యాకోబు.2:21)

      మీరు నమ్మే ఖురానులోనుండి పైన నేను బైబిలులోనుండి యిచ్చిన విధంగా విస్పష్టమైన “ఇస్సాకు/ఇస్సాఖ్” అన్న పేరుతోకూడిన ఖురాను సాక్ష్యాన్ని మీరు యివ్వలేకపోయారు. దానికిగల కారణం ఖురానులో “అబ్రహాము బలిగా తీసుకువెళ్ళిన కుమారుడు ఇస్మాయిల్/ఇష్మాయేలు” అంటూ విస్పష్టంగా ఎక్కడా చెప్పడము లేదు! ఖురానులో లేనిదాన్ని మీరేకాదు ఏ ముస్లీముకూడా ఖురానులో చూపించలేడు. అయినా, ఖురానులో లేనిదాన్ని ఊహించుకుంటూ ఖురానుకు వ్యతిరేకంగా నమ్మే ముస్లీములు అనేకమంది. అది శోచనీయము!

      Shalom,
      Admin

    • telugui says:

      Bro.Altaf,

      Assalam-valeikum!

      మీ ప్రశ్నకు మా రెండవ సమాధానము:

      ఖురానులోని 37:99-113 వరకుగల ఆయతులు ఇబ్రహీం మరియు ఆయన కుమారుడైన ఇస్సాకు/ఇషాఖ్ గురించి వ్రాయబడివున్నాయి. ఇది ఇబ్రాహీము బలిగా తీసుకువెళ్ళిన అతని కుమారుని గురించి వివరించబడిన సందర్భము. ఈ సందర్భములోనే ఇబ్రహీము కుమారుడు ఇస్సాకు/ఇషాఖ్ యొక్క పేరు విస్పష్టముగా ఖురానులో ప్రస్తావించబడింది. ఈ సందర్భములోని ఆయతులలో ఇష్మాయేలు/ఇస్మాయీలు పేరు అసలు లేనేలేదు. ఖురాను 37:99-113

      “అతను (ఇబ్రాహీమ్‌) ఇలా అన్నాడు : “నేను నా ప్రభువు వైపుకే పోతాను. ఆయన తప్పకుండా నాకు మార్గం చూపుతాడు.”
      “నా ప్రభూ! నాకు గుణవంతుడైన [الصَّالِحِينَ/l-ṣāliḥīna] కుమారుణ్ణి ప్రసాదించు” (అని ప్రార్థించాడు). అందువల్ల మేమతనికి, సహనశీలుడైన [ḥalīmin] ఒక అబ్బాయి గురించిన శుభవార్తను అందజేశాము [فَبَشَّرْنَاهُ/fabasharnāhu].
      మరి ఆ కుర్రాడు అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, “ఒరేయ్‌ చంటీ! నేను నిన్ను ‘జిబహ్‌’ చేస్తున్నట్లు కల చూస్తున్నాను! మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు” అని అతను (ఇబ్రాహీం) అన్నాడు. “నాన్న గారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని (నిస్సంకోచంగా) నెరవేర్చండి. అల్లాహ్‌ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా [ḥalīmin] పొందుతారు” అని ఆ బాలుడు అన్నాడు.
      మరి వారిరువురూ (దైవాజ్ఞను) శిరసావహించినప్పుడు అతను తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు.
      అప్పుడు మేమతన్ని పిలిచాము – “ఓ ఇబ్రాహీం! నువ్వు కలను నిజంచేసి చూపావు.”
      నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. యదార్థానికి అదొక బహిరంగ పరీక్ష!
      మేము ఒక పెద్ద బలిపశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాము. ఇంకా భావితరాల వారిలో అతని సచ్చరిత్రను మిగిల్చి ఉంచాము. ఇబ్రాహీంకు శాంతి కలుగుగాక!
      సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాము. నిస్సందేహంగా అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు. మరి మేమతనికి, సద్వర్తనులలో [الصَّالِحِينَ/l-ṣāliḥīna] ఒకడైన ఇస్‌హాఖ్‌ ప్రవక్త గురించిన శుభవార్తను ఇచ్చాము [فَبَشَّرْنَاهُ/fabasharnāhu].

      ఈ సందర్భములో ఖురాను చెప్పిన పేరును అంటే ఇస్సాకు/ఇషాఖ్ ను వదిలి ఖురాను చెప్పని పేరును అంటే ఇష్మాయేలును వూహించుకోవటం ఎంతవరకు అల్లాహ్ దృష్టికి అంగీకారమో విజ్ఙులు అయిన ముస్లీములు గ్రహించాలి!

      Shalom,
      Admin

    • telugui says:

      Bro.Altaf,

      Assalam-valeikum!

      మీ ప్రశ్నకు మా నాలుగవ సమాధానము:

      ఖురాను 37:99-113

      “అతను (ఇబ్రాహీమ్‌) ఇలా అన్నాడు : “నేను నా ప్రభువు వైపుకే పోతాను. ఆయన తప్పకుండా నాకు మార్గం చూపుతాడు.”
      “నా ప్రభూ! నాకు గుణవంతుడైన [الصَّالِحِينَ/l-ṣāliḥīna = righteous; doer of good deeds] కుమారుణ్ణి ప్రసాదించు” (అని ప్రార్థించాడు). అందువల్ల మేమతనికి, సహనశీలుడైన [حَلِيمٍ/ḥalīmin] ఒక అబ్బాయి గురించిన శుభవార్తను అందజేశాము [فَبَشَّرْنَاهُ/fabasharnāhu].
      మరి ఆ కుర్రాడు అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, “ఒరేయ్‌ చంటీ! నేను నిన్ను ‘జిబహ్‌’ చేస్తున్నట్లు కల చూస్తున్నాను! మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు” అని అతను (ఇబ్రాహీం) అన్నాడు. “నాన్నగారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని (నిస్సంకోచంగా) నెరవేర్చండి. అల్లాహ్‌ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా [الصَّابِرِينَ/l-ṣābirīna = patient; steadfast] పొందుతారు” అని ఆ బాలుడు అన్నాడు.
      మరి వారిరువురూ (దైవాజ్ఞను) శిరసావహించినప్పుడు అతను తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు.
      అప్పుడు మేమతన్ని పిలిచాము – “ఓ ఇబ్రాహీం! నువ్వు కలను నిజంచేసి చూపావు.”
      నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. యదార్థానికి అదొక బహిరంగ పరీక్ష!
      మేము ఒక పెద్ద బలిపశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాము. ఇంకా భావితరాల వారిలో అతని సచ్చరిత్రను మిగిల్చి ఉంచాము. ఇబ్రాహీంకు శాంతి కలుగుగాక!
      సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాము. నిస్సందేహంగా అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు.
      మరి మేమతనికి, సద్వర్తనులలో [الصَّالِحِينَ/l-ṣāliḥīna = righteous; doer of good deeds] ఒకడైన ఇస్‌హాఖ్‌ ప్రవక్త గురించిన శుభవార్తను ఇచ్చాము [فَبَشَّرْنَاهُ/fabasharnāhu].
      ఇంకా మేము అతని (ఇబ్రాహీము)పైనా, ఇస్‌హాఖ్‌పైనా శుభాలను కురిపించాము. వారిద్దరి సంతతిలో కొందరు సజ్జనులైతే, మరికొందరు తమ ఆత్మలకు తీరని అన్యాయం చేసుకున్నారు.”

      పై ఖురాను ఆయాతులలో గమనించాల్సిన విశయాలు…

      1. ఇబ్రహీము తనకు “గుణవంతుడైన” [الصَّالِحِينَ/l-ṣāliḥīna] కుమారున్ని ప్రసాదించమంటూ ప్రార్థించాడు

      2. అల్లాహ్ అతనికి “సహనశీలుడైన” [حَلِيمٍ/ḥalīmin] బాలుని యిచ్చాడు

      3. అల్లాహ్ ఇబ్రహీముకు కలుగబోయే కుమారుని గురించిన “శుభవార్తను అందజేశాడు” [فَبَشَّرْنَاهُ/fabasharnāhu] (Quran – 37:101)

      4. అల్లాహ్ ఇబ్రహీముకు పుట్టబోయే ఇస్సాకు/ఇషాఖ్ గురించిన “శుభవార్తను అందజేశాడు” [فَبَشَّرْنَاهُ/fabasharnāhu] (Quran – 37:112)

      5. అబ్రహాము తనకు “الصَّالِحِينَ “[l-ṣāliḥīna = righteous; doer of good deeds] కుమారున్ని అనుగ్రహించమని ప్రార్థించగా అల్లాహ్ అతనికి “الصَّالِحِينَ “[l-ṣāliḥīna = righteous; doer of good deeds] కుమారునిగురించిన శుభవార్తన అందించాడు (Quran – 37:112).

      పై కారణాలను బట్టి ఖురాను 37:99-113 వరకు గల ఆయతులలోని సంఘటన ఇస్సాకు/ఇషాఖ్ ను గురించినదేగాని ఇష్మాయేలును/ఇస్మాయిల్ ను గురించి ఎంతమాత్రము కాదు.

      Shalom,
      Admin

  3. Althaf says:

    ఇబ్రహీం అలైహిస్సలం వారికి సహనశీలుడైన అబ్బాయి గురించి శుభవార్త ఇవ్వడం జరిగింది. 37:101లో

    ఇంకా 21:85 లో ఇస్మాయిల్ అలైహిస్సలం వారు సహనశీలుర కోవకు చెందినవారు అని చెప్పబడింది

    • telugui says:

      Bro.Altaf,

      Assalam-valeikum!

      మీ ప్రశ్నకు మా మూడవ సమాధానము:

      Quran – 37 : 100-101 మరియు Quran – 21 : 85 లలోని ఆయతులను గురించి మీరిచ్చిన వివరణలో సమస్యలు/తప్పులు వున్నాయి. దయచేసి మీరు ఖుర్ ‘ఆన్ లోని సమిష్టిబోధను పరిశీలించి చూడండి. క్రింద యివ్వబడిన ఖుర్’ఆన్ లోని ప్రాముఖ్యమైన అంశాలను పరిశీలించి అబ్రహాము/ఇబ్రాహీమ్ బలిగా తీసుకువెళ్ళిన కుమారుని గుర్తింపును గురించి ఖుర్’ఆన్ తెలియచేస్తున్న సత్యాన్ని గ్రహించండి:

      “నా ప్రభూ! నాకు గుణవంతుడైన [الصَّالِحِينَ/l-ṣāliḥīna] కుమారుణ్ణి ప్రసాదించు” [అని ప్రార్థించాడు]. (Quran – 37 : 100)

      “అందువల్ల మేమతనికి, సహనశీలుడైన [حَلِيمٍ/ḥalīmin = forbearing; tolerating] ఒక అబ్బాయి గురించిన శుభవార్తను అందజేశాము.” (Quran – 37 : 101)

      “మరి ఆ కుర్రాడు అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, “ఒరేయ్‌ చంటీ! నేను నిన్ను ‘జిబహ్‌’ చేస్తున్నట్లు కల చూస్తున్నాను! మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు” అని అతను (ఇబ్రాహీం) అన్నాడు. “నాన్న గారూ!మీకు ఆజ్ఞాపించబడిన దానిని (నిస్సంకోచంగా) నెరవేర్చండి. అల్లాహ్‌ తలిస్తే మీరు నన్ను సహనశీలిగా [الصَّابِرِينَ/l-ṣābirīna = patient; steadfast] పొందుతారు” అని ఆ బాలుడు అన్నాడు.” (Quran – 37 : 102)

      “ఇంకా ఇస్మాయీలు, ఇద్రీసు, జుల్‌కిఫ్ల్‌ (లను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి). వారంతా సహనశీలుర [الصَّابِرِينَ/l-ṣābirīna = patient; stadfast] కోవకు చెందినవారు.” (Quran – 21 : 85)

      ఖురాను – 37:101 లో వున్న “సహనశీలుడు” అన్న తెలుగు అనువాదం “హలమీన్” [حَلِيمٍ/ḥalīmin] అన్న అరబ్బీ పదపు అనువాదము.

      అయితే, మీరు పేర్కొన్న ఖురాను – 21 : 85 ఆయలోని “సహనశీలుడు” అన్న తెలుగు అనువాదం “ఇ – షబిరీన” [الصَّابِرِينَ] అన్న అరబ్బీ పదపు అనువాదము.

      దయచేసి పై రెండు ఆయలలో అరబ్బీ భాషలోని ఖురానులో రెండు వేరు వేరు పదాలున్నాయన్న సత్యాన్ని అలాగే వాటి వ్యత్యాసాన్ని కూడా గమనించగలరు.

      పై కారణాలను బట్టి ఖురాను 37:99-113 వరకు గల ఆయతులలోని సంఘటన ఇస్సాకు/ఇషాఖ్ ను గురించినదేగాని ఇష్మాయేలును/ఇస్మాయిల్ ను గురించి ఎంతమాత్రము కాదు.

      Shalom,
      Admin

      • Althaf says:

        I have one more doubt

        According to you which bible is word of god

        I mean catholic or protestant

        • telugui says:

          Dear Althaf,

          Assalam veliakum! I assume your previous doubts have been cleared by now. Thanks to God!

          దయచేసి మీరు ఒక ముస్లీముగా వుంటూ ఖురానులో లేని వాటిని ఖురానుకు అంటగట్టి ఖురానులో వున్న వాటిని లేవంటూ ఖురానుకు, ఖురానును యిచ్చిన ముహమ్మదు గారికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున దావాప్రచారకులను వారి బోధలను పట్టుకొని వ్రేలాడకండి.

          ఇక ప్రస్తుతం మీకోచ్చిన మరొక ప్రాముఖ్యమైన ప్రశ్నకు వివరణ:

          మీ ప్రశ్న “According to you which bible is word of god? I mean catholic or protestant!”

          ఈ ప్రశ్నను అనేకమంది ముస్లీములు అడుగుతుంటారు. అందుకుగల కారణాలు…

          1. ఖురానులో సమస్యలు చూపి వివరణ అడిగితే సమాధానాలు లేక పై ప్రశ్న అడుగే ప్రయత్నం చేస్తారు
          2. దావా ప్రచారకుల దుష్ప్రచారాన్ని నమ్మి మోసపోయి బైబిలును చదవకుండానే పై ప్రశ్నను అడుగుతుంటారు.
          3. అమాయక క్రైస్తవులను మోసం చేసి అసత్యములోకి నడిపే ప్రయత్నములో పై ప్రశ్నను అడుగుతుంటారు.
          4. బైబిలును గురించి సరియైన అవగాహన లేక తెలుసుకోవాలనుకునే ఆసక్తితో కూడా అడుగుతుంటారు.
          5. ఖురాను గురించి ఇబ్బందికరమైన ప్రశ్నలకు జవాబు చెప్పలేక టాపిక్ ను మార్చేందుకు [divert] అడుగుతుంటారు.

          మీరు ఏ వుద్దేశంతో అడిగారో యితరులకు తెలియకపోయినా మీకు తెలుసు…!

          మీ ప్రశ్నకు మా జవాబు:

          సంపూర్ణ దైవగ్రంథము బైబిలు దేవుని వాక్యము. ఈ దైవగ్రంథము 66 [39-యూదు లేఖనాలు + 27 క్రైస్తవ లేఖనాలు] లేఖన గ్రంథాల సంపుటి. కాథోలిక్కులు 66 లేఖన గ్రంథాల సరసన 7 చరిత్ర/అపోక్రిఫ గ్రంథాలను చేర్చుకొని చదువుకుంటారు.

          ఉదాహరణకు, 114 సురాలకు ఎవరైనా వేరే 10 గ్రంథాలను కలిపి చదువుకుంటే అన్నీ కలిపి ఖురాను అవుతుందా…?! కేవలం 114 సురాల వరకే ఖురాను గ్రంథము అన్నది ఇంగితజ్ఙానమున్న వారికి వివరించనవసరములేదు. అలాగే 66 లేఖన గ్రంథాల సరసన మరో 7 గ్రంథాలనో లేక 13 గ్రంథాలనో కలుపుకున్నంతమాత్రాన అన్నీ బైబిలు లేక దేవునిగ్రంథము కాదు.

          Shalom,
          Admin

          • Althaf says:

            అయితే రెండు ఒకటే కాని catholic bible లో 7 books extra ఉన్నాయి అంటారు?
            అయితే నాది ఇంకొక ప్రశ్న

            అబ్రహం
            ఇస్మాయిల్ ను, హాగరు ను అరణ్యం లో వదిలినప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలం వారికి వయస్సు ఎంత?

  4. Althaf says:

    అయితే రెండు ఒకటే కాని catholic bible లో 7 books extra ఉన్నాయి అంటారు?
    అయితే నాది ఇంకొక ప్రశ్న

    అబ్రహం
    ఇస్మాయిల్ ను, హాగరు ను అరణ్యం లో వదిలినప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలం వారికి వయస్సు ఎంత?

    • telugui says:

      Dear Althaf,
      Assalam veliakum!

      మీ ప్రశ్న: అయితే రెండు ఒకటే కాని catholic bible లో 7 books extra ఉన్నాయి అంటారు?

      మా జవాబు: అవును. అయితే, యిక్కడ విజ్ఙులు గమనములో వుంచుకోవలసిన విశయాలు:

      1) ప్రొటెస్టాంటు బైబిలు మరియు కాథొలిక్కు బైబిలు [7 అపోక్రిఫ గ్రంథాలు] రెండూ హీబ్రూ బైబిలు యొక్క వేరు వేరు అనువాదాలు.
      2) హీబ్రూ బైబిలును ఒకే భాషలోకి అనువదించినా [ఉదాహరణ: ఆంగ్లము, తెలుగు మొదలైన భాషలు] వేరు వేరు వ్యక్తులు ప్రొటెస్టాంటు బైబిలును కాథొలిక్కు బైబిలును అనువదించారు.
      3) అనువాదాలలో తేడాలుంటాయి. బైబిలు అనువాదాలలో అలాగే ఖురాను అనువాదాలలోకూడా తేడాలుంటాయి. ఇది సహజమైన భాషలమధ్య జరిగే అనువాదాల సమస్య.
      4) అసలు అర్థాన్ని తెలుసుకోవటానికి మూలభాషలోని అంటే హీబ్రూ భాషలోని బైబిలును అందులో వాడబడిన పదాలను వ్యాకరణాన్ని పరిశోధించి చూడాలి.

      మీ ప్రశ్న: అయితే నాది ఇంకొక ప్రశ్న. అబ్రహం ఇస్మాయిల్ ను, హాగరు ను అరణ్యం లో వదిలినప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలం వారికి వయస్సు ఎంత?

      మా జవాబు: మీ ప్రశ్న బాగుంది. మరి మా స్పందన…

      మీరు నమ్మే ఖురానులో ఈ ప్రశ్నకు జవాబు ఉందా లేక లేదా? ఉంటే వివరించండి. మీ వివరణ చూసి కేవలం బైబిలుపైనే ఆధారపడి చక్కటి వివరణ యిస్తాను. ఒకవేల ఆ వివరాలు ఖురానులో లేవు అన్నది మీరు గ్రహించి ఒప్పుకుంటే అదికూడా సరిపోతుంది. నేను బైబిలులోనుండి వివరిస్తాను.

      Shalom,
      Admin

      • Althaf says:

        సరే ముందు మీ బైబిల్ నుండి సమాధానం ఇవ్వండి
        Straight గా సమాధానం చెప్పండి

        • telugui says:

          ఇష్మాయిల్/ఇస్మాయిల్ వయసు వివరాలు ఖురానులో లేవు అన్నది మీరు గ్రహించి స్పష్టముగా [clear/straight] ఒప్పుకుంటున్నారా లేదా?

          Shalom,
          Admin

  5. Althaf says:

    వయసు వివరాలు ఖురానులో లేవు అన్నది నిజమే ఇప్పుడు చెప్పండి

    • telugui says:

      Dear Althaf,
      Assalam valeikum!

      ఇష్మాయిల్/ఇస్మాయిల్ వయసు వివరాలు ఖురానులో లేవు అన్నది మీరు గ్రహించి ఒప్పుకున్నందుకు మీకు నా అభినందనలు.

      మీ ప్రశ్న: అబ్రహం ఇస్మాయిల్ ను, హాగరు ను అరణ్యం లో వదిలినప్పుడు ఇస్మాయిల్ అలైహిస్సలం వారికి వయస్సు ఎంత?

      మా జవాబు:

      (1) హాగరు ఇష్మాయేలును/ఇస్మాయిలును కనినప్పుడు అబ్రహాము వయస్సు 86 సంవత్సరాలు (ఆదికాండము.16:15)

      (2) శారాకు ఇస్సాకు/ఇషాఖ్ జన్మించిన సమయానికి అబ్రహాము వయస్సు 100 సంవత్సరాలు (ఆదికాండము.21:5)

      (3) పై రెండు వాస్తవాలను బట్టి ఇస్మాయిల్ ఇస్సాకు కన్నా 14 సంవత్సరాలు పెద్దవాడు అన్ని తెలుస్తున్నది.

      (4) ఇస్సాకు పాలువిడిచిన సమయములో [దాదాపుగా 1 లేక 2 సంవత్సరాల వయసులో] హాగరు మరియు ఇస్మాయిల్ పంపించివేయబడ్డారు (ఆదికాండము.21:9-14)

      (5) బయటికి పంపించబడిన సమాయానికి ఇస్మాయిల్ వయస్సు 15 లేక 16 సంవత్సరాలుగా గ్రహించవచ్చు.

      దైవగ్రంథమైన బైబిలు ప్రకారము అబ్రహాము హాగరును మరియు ఆమెద్వారా పుట్టిన కుమారుడైన ఇష్మాయేలు/ఇస్మాయిల్ ను పంపించివేసిన సమయానికి ఇష్మాయేలు/ఇస్మాయిల్ యొక్క వయసు రమారమి 15/16 సంవత్సరాలు.

      Shaloam,
      Admin

      • Althaf says:

        ఈ వాక్యాన్ని catholic bible నుండి ఇవ్వడం జరిగింది

        14. అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. అతడు రొట్టెల మూటను, నీళ్ల తిత్తిని తెచ్చి, హాగారుకిచ్చి కుమారుని ఆమె భుజముల మీదనుంచి, ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి, బెర్షబా అరణ్యములో దిక్కుతోచక తిరుగాడుచుండెను.

        14 So Abraham rose early in the morning, and took bread and a skin of water, and gave it to Hagar, putting it on her shoulder, along with the child, and sent her away. And she departed, and wandered about in the wilderness of Beer-sheba.

        ఆదికాండము 21 : 14

        ఇక్కడ కుమారున్ని భుజముల మీద నుంచి అన్నారు మరి 15/16 సంవత్సరాల వయసు కలిగిన అబ్బాయిని భుజముల మీద వేసె అంత చిన్న వానిగా ఎలా మారాడు అన్నది నా ప్రశ్న

        • telugui says:

          Dear Althaf,
          Assalam valeikum!

          పైన మీరిచ్చిన కాథొలిక్కు అనువాదాన్ని చదివిన మీకే కాదు ఆ సందర్భజ్ఙానమున్న ఎవరికైనా ఆ ప్రశ్న రావలసిందే.

          ఆ ప్రశ్న మేమూ అడుగుతాము. ఎవరిని? మిమ్మల్ని కాదు! అనువాదం చేసిన వారిని లేక దాన్ని సరియైన అనువాదముగా విశ్వసించే వారిని. మీరు చూపించిన ఆదికాండము 21:14 వ వచనము ఎక్కడిది? కాథొలిక్కులు చేసుకున్న తెలుగు అనువాదములోనిది. మరి ఆ ప్రశ్నను ఎవరిని అడగాలి? విజ్ఙులైన వారు అనువాదం చేసినవారినైనా లేక ఆ అనువాదాన్ని నమ్మేవారినైనా అడుగుతారు. ఆ అనువాదాన్ని మేము చేయలేదు లేక దాన్ని మేము నమ్మముకూడా. మరి మీరు ఆ ప్రశ్నను మాకు వేయడములో భావమేమిటి…?! ఆ ప్రశ్నను ఎవెరికి వేయాలోకూడా తెలియదా మీకు…?!

          కాథొలిక్కులు చేసుకున్న ఆదికాండము.21:14 యొక్క తెలుగు అనువాదము సరియైన అనువాదము కాదు అన్నది సందర్భజ్ఙానము అలాగే యింగితజ్ఙానము ఉన్న ఎవరైనా యిట్టే చెప్పవచ్చు. ఇంతకు ఆ అనువాదాన్ని మీరు సరియైన అనువాదమంటారా లేక లోపభూయిష్టమైన అనువాదమంటారా…?

          Shalom,
          Admin

        • telugui says:

          Dear Althaf,

          కాథొలిక్కులు చేసుకున్న ఆదికాండము.21:14 యొక్క తెలుగు అనువాదము సరియైన అనువాదము కాదు అన్నది సందర్భజ్ఙానము అలాగే యింగితజ్ఙానము ద్వారా అర్థము చేసుకునే సామర్థ్యము లేనివారికి లేఖన పరిశోధన కొంతవరకు సహాయం చేసే అవకాశముంది. ఆ కారణాన్ని బట్టి ఆదికాండము 21:14 యొక్క అనువాదము గురించి చేయబడిన లేఖన పరిశోధన నుండి క్రింది సారాంశాలను మీముందు/చదువరులందరిముందు వుంచుతున్నాము. సత్యాన్వేషకులకు మరియు దైవసంబంధులకు సత్యాన్ని గ్రహించి స్వీకరించాల్సిందిగా మా ప్రేమపూర్వక ఆహ్వానం:

          “అయితే దేవుడు ఈ చిన్న వానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకువలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతా నమే గనుక అతనికూడ ఒక జనముగా చేసెదనని అబ్రాహాముతో చెప్పెను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసికొని ఆ పిల్లవాని [హీబ్రూ మూల పదం: יֶלֶד/యెలెద్ = బాలుడు; కుమారుడు; యువకుడు] తోకూడ హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొదక్రింద ఆ చిన్నవాని [יֶלֶד/యెలెద్] పడవేసి యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటి వేతదూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను. దేవుడు ఆ చిన్నవాని [హీబ్రూ మూల పదం: נַעַר/నాహ్’ర్ = బాలుడు; యువకుడు] మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచిహాగరూ నీకేమివచ్చినది? భయపడకుము; ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు; నీవు లేచి ఆ చిన్నవాని [נַעַר/నాహ్’ర్] లేవనెత్తి నీ చేత పట్టుకొనుము; వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడైయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను.” (ఆదికాండము.21:12-20)

          (1) అబ్రాహాము బాలుడిని [హీబ్రూ మూల పదం: יֶלֶד/యెలెద్ = బాలుడు; కుమారుడు; యువకుడు] హాగర్ భుజంపై ఉంచాడని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. హీబ్రూ: יֶלֶד, యెలెద్ = బాలుడు; కుమారుడు; యువకుడు. ఆదికాండము 21: 14-16లో ఉపయోగించిన పదం ఇది. ఇదే సందర్భములో మరొక హీబ్రూ పదంకూడా ఉపయోగించబడింది. נַעַר/నాహ్’ర్ = బాలుడు; యువకుడు.

          (2) అయితే, హీబ్రూ భాషలో చంటిపిల్లలకు లేదా ఎత్తుకొని వెళ్ళాల్సిన శిశువులను సూచించేందుకు వేరే పదాలు వున్నాయి. హీబ్రూ: יָנַק,/యనఖ్ = పసివాడు; చంటిపిల్ల; శిశువు. (ఉదా. 1 సమూయేలు.22:19; విలాపవాక్యములు.2:11) & హీబ్రూ: עוּל/ఉల్ = పసికందు; శిశువు (యోబు.24:9; యెషయా.49:15). ఈ హీబ్రూ పదాలు ఆదికాండము 21: 14-16లో ఉపయోగించబడలేదు.

          “నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది. శిశువులును చంటిబిడ్డ[יָנַק,/యనఖ్]లును పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు.” (విలాపవాక్యములు.2:11)

          “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను [עוּל/ఉల్] మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.” (యెషయా.49:15)

          (3) అబ్రాహాము హాగరు భుజాలపై ‘ఆహారం మరియు చర్మపు నీటి తిత్తిని’ ఉంచి కొడుకును అప్పగించి ఆమెను పంపివేసాడు.

          (4) నిజానికి, ఇష్మాయేలు అప్పటికి 15/16 సంవత్సరాలు. అబ్రాహాము ఇష్మాయేలును [బాలుడిని] హాగర్ భుజాలపై వేయలేడు. ఆమాటకొస్తే చంటిపిల్లలనైతే తల్లులు బుజాలపై కాదు వీపుపైనో లేక చేతిక్రింద నడుము పైనో మోస్తారు!

          (5) యుక్తవయస్సులో ఉన్న యోసేపును/యూసుఫ్ కూడా బైబిల్లో יֶלֶד,/యెలెద్ [బాలుడు; కుమారుడు; యువకుడు] అని పిలువబడ్డాడు

          “మరియు రూబేను ఈ చిన్నవాని [יֶלֶד,/యెలెద్] యెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాప రాధము మనమీద మోపబడుచున్నదని వారి కుత్తరమిచ్చెను.” (ఆదికాండము.42:22).

          (6) దానియేలు మరియు అతనితోకూడా వుండిన స్నేహితులు יֶלֶד,/యెలెద్ అని సంబోధించబడ్డారు.

          “తత్వజ్ఞానము తెలిసినవారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను [יְלָדִ֣ים/యెలెదిం = బాలురు] రప్పించి, కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము.” (దానియేలు.1:4)

          (7) హాగర్ ఇష్మాయేలుతో ఇజ్రాయెల్ యొక్క నైరుతి భాగంలో ఉన్న బెయేర్షెబా అరణ్యములో [తోటలోనో లేక పచ్చని అడవి నీడలలోనో కాదు సుమా] తిరుగులాడింది (ఆదికాండము.21:14). ఈ ప్రాంతములో ఎండవేళల ఉష్ణొగ్రత 50 డిగ్రీల సెల్సీయస్సు కన్నా ఎక్కువగా వెళ్ళుతుంది!

          (8) బెయేర్షెబా అరణ్యములో తిరుగుతున్నప్పుడు బాలుడు [יֶלֶד,/యెలెద్] గా వుండిన ఇష్మాయేల్ 50 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరిగే ఈ ప్రంతములోని సూర్యరశ్మిలో వడదెబ్బ కారణంగా వాడిపోయాడన్నది యిట్టే అర్థం చేసుకోవచ్చు. ఈలాంటి పరిస్థితిలోనే అతని తల్లి హాగర్ ఇస్మాయిల్‌ను ఒక పొద క్రింద వదిలి [గమనించాలి, ఇది చెట్లు కూడా లేని కేవలం పొదలున్న ఎడారిలాంటి ప్రాంతము], అతను చనిపోతాడని ఎదురుచూసింది. వడదెబ్బ తగిలితే ఎంతపెద్ద వయసున్నవారైనా నిర్వీర్యులై చిన్న పిల్లలకంటే అద్వాన్నంగా మారిపోతారు అన్నది అలాంటి వ్యక్తులను చూసినవారికే అర్థమవుతుంది.

          ఇంగితజ్ఙానమునుగాని లేక లేఖన పరిశోధననుగాని ఉపయోగించి సత్యాన్ని పై రీతిలో అర్థం చేసుకునే సామర్థ్యం లేనివారు తోరా/తౌరాత్ [బైబిలు] ను యూదులు క్రైస్తవులు మార్చి వేసారు అంటున్నారు, ముఖ్యంగా ముస్లీములుగా చలామణి అవుతున్నవారు. అలాంటివారు “నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు ధిక్కరించబడ్డారు. అయితే వారు (ప్రజల) ధిక్కారవైఖరికి, తమకు పెట్టబడిన బాధలకు సహనం వహించారు. కడకు వారికి మా సహాయం అందింది. అల్లాహ్‌ వాక్కులను మార్చేవాడు ఎవడూ లేడు. కొంతమంది ప్రవక్తలకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికే నీ వద్దకు చేరాయి” (ఖురాను – 6:34) అన్న ఖురాను ప్రకటనను అసత్య ప్రకటనగా రూపిస్తున్నారు. ఇలాంటివారిలో మీరు ఒకరు కాకూడదని మా ఆశ!

          విజ్ఙులైన ముస్లీములారా, ఎవరి ప్రకటనను మీరు విశ్వసిస్తారు…?

          “తోరా/తౌరాత్ అల్లాహ్ యొక్క మాటలు” అలాగే “అల్లాహ్ మాటలను ఎవరు మార్చలేరు” అన్న ఖురాను ప్రకటననను విశ్వసిస్తారా లేక “తోరా/తౌరాత్ ను యూదులు/క్రైస్తవులు మార్చారు” అంటున్న వారి ప్రకటనను విశ్వసిస్తారా?

          Shalom,
          Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *