చరిత్రలో ముహమ్మద్
మానవ సంస్కృతి మరియు అభివృద్ది దిశను అనూహ్యంగా ప్రభావితం చేసి చరిత్రకెక్కిన వారు కొద్దిమందే. అలాంటివారిలో పేర్కొనదగిన వ్యక్తి ముహమ్మద్ బిన్ అబ్దుల్లా. ఆరవ శతాబ్దం చివరలో [570 క్రీ.శ.] అరేబియాలోని ఖురేషి అనబడిన ఒక ప్రధానమైన తెగలోని బాను హషిం అనే వంశములో అబ్దుల్లా మరియు అమీనాలకు జన్మించిన ఏకైక కుమారుడు ముహమ్మద్.
ముహమ్మదు జననానికి ఆరునెలల ముందు తండ్రి అబ్దుల్లా బిన్ ముత్తాలిబ్ మరణించాడు. ముహమ్మదుకు ఆరు సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు తల్లి అమీనా కూడా మరణించటముతో అతను అనాధగా పెరగాల్సి వచ్చింది.
మొదట తాత సమ్రక్షణలో అంటే అబ్దుల్లా తండ్రి అయిన అబ్దుల్ ముత్తాలిబ్ సమ్రక్షణలో అటుతరువాత పినతండ్రి అబు తాలిబ్ సమ్రక్షణలో పెరిగాడు.
ముహమ్మదు అరేబియాలోని మక్కా నగరములో జన్మించిన సమయానికి ఆ ప్రాంతములోని స్థానిక అరబ్బు తెగలన్ని విగ్రహారాధనలో అలాగే బహుదేవతారాధనలో మునిగి తేలుతున్నాయి. ఆ సమయములో మక్కాలోని ‘కాబ’ అనే గుడిలో ప్రతిష్టించబడిన 360 విగ్రహాలను అరబ్బులు పూజిస్తూ తమ మతవిశ్వాసాలకు ఆ గుడిని కేంద్రముగా మలచుకున్నారు.
విగ్రహాలకు ఆలయమైన కాబ యొక్క సమ్రక్షణ ముహమ్మదు తాత అయిన అబ్దుల్ ముత్తాలిబ్ చేతిలో వుండింది. ఆ సమయములో అబ్దుల్ ముత్తాలిబ్ మరియు బాను హషిం వంశస్థులు లేక ఖురేషి తెగలోని వారు మక్కాలోని కాబ గుడిలో జరుగుతున్న విగ్రహారాధనలో పాలుపొందుతుండటమేగాక కాబాను ఆ ప్రాంతమంతటిలోని ఒక ప్రధానమైన పుణ్యక్షేత్రముగా మలిచి దాని ఖ్యాతిని విస్తరింపచేసెసందుకు నడుముకట్టిన వారే.
చరిత్రలో ముహమ్మద్ యొక్క ప్రత్యేకతలు
(i) అరబ్బు తెగలను బహుదేవతోపాసననుండి ఏకదేవతోపాసనవైపు మళ్ళించాడు:
(ii) తవ్రాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాల ప్రామాణికత్వాన్ని నిర్ధారిస్తూ వాటి ఉత్కృష్ట స్థానాన్ని అరబ్బులకు తెలియచేయశాడు:
(iii) అరబ్బుల మధ్యనున్న అనేక సాంఘీక దురాచారాలలోని కొన్నింటిని రూపుమాపాడు:
(iv) కక్షలతో కలహాలతో కూడిన నిరంతపోరాటాలలో జీవిస్తున్న అరబ్బు తెగలమధ్య సమాధానాన్ని సామరస్యాన్ని సాధించి వారందరిని ఏకతాటిపై నడిపించగలిగాడు:
(v) ఆరవ శతాబ్దం వరకు అనామకులుగా అనాగరికులుగా కొనసాగిన అరబ్బులను ప్రపంచములో సామ్రాధిపతుల స్థాయికి హెచ్చించాడు:
(vi) ప్రపంచ మతవిశ్వాసాలన్నింటిలోనే సంఖ్యా పరంగా ద్వితీయస్థానానికి చేరగలిగిన రెండవ అతిపెద్ద మతాన్ని స్థాపించాడు:
(vii) తాను ఒక పామరుడైన వ్యక్తిగా జీవించినా కొట్లాది ముస్లీములు అరబ్బీ భాషలో శ్రద్ధభక్తులతో చదువుకునే ఇస్లామీయ ధార్మిక గ్రంథం ఖుర్’ఆన్ ను అందించాడు:
…to be continued –>
అబు తాలిబ్ అబ్దుల్ ముత్తాలిబ్ అబ్దుల్లహ్ అబ్దుల్లాహ్ అమీనా ఇస్లాము చరిత్ర జననం ప్రత్యేకతలు ప్రవక్తగా పిలుపు బాను హషిం మత స్థాపకుడు ముహమ్మదు