శుభవార్త!

శుభవార్త!

July 3, 2020 క్రైస్తవ్యం పరిశుద్ధ గ్రంథము వార్తలు 0
బంధకాలనుండి విడుదల

ఈ లోకములో అశాంతికి అరిష్టాలకు గురి అవుతూ నిరుత్సాహములో ఉన్నారా…?

దురలవాట్లకు మరియు దుష్టక్రియలకు జీవితములో బానిసలై మీరు కష్టపడుతున్నారా…?

జీవితములోని విరక్తిచేత లేక జిన్నులనబడే దురాత్మలచేత మానసిక వేదనను అనుభవిస్తున్నారా…?

రాబోవు లోకములో పాపుల కొరకు సిద్ధపరచబడిన నరకయాతనను తప్పించుకోలేను అని భయపడుతున్నారా…?

భయపడకండి! వీటన్నిటినుండి మీకు విడుదలను అందించే ఒక శుభవార్తను దేవుని [الله‎/אֱלֹהִ֑ים/Θεὸς/God] తరపున మీ ముందుంచుతున్నాము. ఈ శుభవార్తను ఆసాంతం చదివి గ్రహించి పాటించి దేవుని మేళ్ళు పొందండి…

(1) దేవుడు అద్వితీయుడు. ఆయన ద్వితీయములేనివాడు అంటే ఆయనలాంటివాడు ఆయనను పోలినవాడు ఆయనకు సాటిగా, పోటిగా, ధీటుగా మరొక దేవుడు లేడు. ఆయనే సమస్థాన్ని సృష్టించి కొనసాగిస్తూ సమ్రక్షిస్తూ పోశిస్తున్నఅపారకృపామయుడు. సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధమైనవాడు, న్యాయతత్వమున్నవాడు, అంతేగాక ఆయన ప్రేమాస్వరూపుడు.

(2) మానవులందరు పాపులు. మానవులందరము మనకివ్వబడిన నిర్ణయస్వేచ్ఛను బట్టి సృష్టికర్తకు వ్యతిరేకమైన తలంపులు, మాటలు, చేతలద్వారా పాపములో పడి అపవిత్రులుగా మారాము. ఈ కారణాన్నిబట్టి పరిశుద్ధుడైన దేవునికి మరియు ఆయన సన్నిధికి మనమందరము దూరపరచబడ్డాము.

సృష్టికర్త సన్నిధికి దూరపరచబడటమేగాక ఆయన న్యాయతత్వాన్ని బట్టి మనమందరము ప్రళయదినపు తీర్పునుబట్టి తగిన శిక్షను నరకములో పొందబోతున్నాము.

అయితే, ప్రేమాస్వరూపుడైన సృష్టికర్త ఎవరూ నశించటము యిచ్చయించక తన నిత్యసంకల్పములోని బృహత్ప్రణాళికను అనుసరిస్తూ మానవాళికి క్షమాపణ శాంతి మోక్షాలతోకూడిన రక్షణ మార్గాన్ని తానే సిద్ధం చేసాడు.

(3) మోక్షమార్గము. దేవున్ని చేరటానికి, ఆయన ఎదుట నీతిమంతులుగా లెక్కించబడటానికి, మరణించిన తదుపరి మోక్షాన్ని పొంది నిత్యత్వమంతా దేవుని సన్నిధిలో పరలోక దూతలవలె నిత్యజీవాన్ని అనుభవించటానికి దైవ గ్రంథాలు సూచిస్తున్నదాని ప్రకారం రెండే మార్గాలు ఉన్నాయి. అవి:

i. స్వంత ప్రయత్నాలతో సృష్టికర్త అయిన దేవుని ఆజ్ఙలకు పరిపూర్ణంగా లోబడి ఏపాపము చేయకుండా నీతిమార్గములోనే బ్రతికిన దినాలన్నీ జీవించగలగాలి. అలా జీవించగలిగిన వ్యక్తే పరిశుద్ధునిగా లెక్కించబడి తన నీతిని బట్టి మోక్షాన్ని పొంది దేవుని సన్నిధిలోకి ప్రవేశించగలడు.
[కాని, మానవమాత్రులెవరూ ఈ విధానములో మోక్షం పొందిన దాఖలాలు లేవు. ప్రవక్తలుకూడా ఎప్పుడో ఒకప్పుడు పాపముచేసినవారే!]

ii. దేవుడే సిద్ధపరచిన మోక్ష కార్యాన్ని విశ్వసించి ఆ మార్గాన్ని అనుసరించాలి. ఈ రకమైన విశ్వాసములోనికి వచ్చిన ప్రతి వ్యక్తి ఎంత పాపియైనా పరిశుద్ధునిగా తీర్చబడి దేవుడే ఆపాదించే నీతిని పొంది తద్వారా ఆ వ్యక్తి మోక్షాన్ని స్వతంత్రించుకొని దేవుని సన్నిధిలో నిత్యత్వాన్ని గడపగలడు లేక గడపగలదు.

(4) సృష్టికర్త సంకల్పం. దేవుడొక్కడే! అలాగే దేవునికి మరియు నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆ మధ్యవర్తి పేరు ఈసా అల్-మసీహ్ [యేసు క్రీస్తు]. దేవుడే తన న్యాయతత్వం మరియు ప్రేమాతత్వాలను బట్టి సంకల్పించి నిర్వర్తించిన ఈసా మసీహ్ వారి శ్రమలు, మరణం, మరియు పునరుత్థానాలద్వారా మానవాళికంతా సరిపోయే మోక్షమార్గాన్ని సిద్ధపరచాడు. ఈ మార్గములోకి ప్రవేశించటానికి కావలసింది స్వంత నీతిపై, స్వంత భక్తిపై ఆధారపడకుండా పశ్చత్తాప హృదయముతో దేవుడు ఈసా మసీహ్ ద్వారా చేసిన కార్యాన్ని విశ్వసించి ఆయనద్వారా దేవునికి హృదయాన్ని మరియు జీవితాన్ని సమర్పించుకోవటం!

(5) మీ మొదటి అడుగు. ఈసా మసీహ్ ద్వారా దేవుని మోక్షమార్గములో ప్రవేశించటం అన్న అద్భుతమైన అనుభవం కేవలం యదార్థంగా పశ్చత్తాప హృదయముతో దేవుని యెదుట వ్యక్తిగతంగా మీరు చేసే ప్రార్థనతో మొదలవుతుంది. ఈ ప్రార్థనను మీరు మీ స్వంత మాటలతో ఎక్కడ ఎప్పుడు ఏభాషలో చేసినా దేవుడు ఆలకించి మిమ్మును క్షమించి పవిత్రపరచి మీకో నూతన జీవితాన్ని అనుగ్రహించి తన ఆత్మీయ కుటుంభములో చేర్చుకుంటాడు.

పై విధానములో దేవుని బిడ్డలుగా మారిన మీరు సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలును [తవ్రాత్, జబూర్, మరియు ఇంజీల్] ధ్యానిస్తూ అందులోని బోధల ప్రకారం దేవుని కుటుంభములో ఇదివరకే చేరిన నిజమైన విశ్వాసులతో కలిసి దేవుని మార్గములో కొనసాగుతూ ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. ఈ ప్రయాణములో దేవుడు [الله‎/אֱלֹהִ֑ים/Θεὸς/God] మీకు తన ఆత్మ శక్తి చేత జయజీవితాన్ని అనుగ్రహిస్తాడు. అటుపిమ్మట, ఈ లోకాన్ని విడిచిన వెంటనే మిమ్మల్ని పరదైసులోని తన సన్నిధికి చేర్చుకుంటాడు.

ఈ విశయములో మీకు సందేహాలున్నా లేక యింకా వివరాలు తెలుసుకోవాలనుకున్నా మాకు వ్యక్తిగతంగా వ్రాయండి…
మా E-mail: [email protected]

సృష్టికర్త మిమ్మల్ని దర్శించి కనికరించి మీకు క్షమాపణ, శాంతి మరియు మోక్షాన్ని ప్రసాదించి ఆశీర్వదించును గాక!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *