ఇస్లాంలో చిక్కుముడులు

ఇస్లాంలో చిక్కుముడులు

December 25, 2020 ఖుర్'ఆన్ గ్రంథం ప్రశ్నలు 0

ముస్లీంల విశ్వాసమైన ఇస్లాంలో తేల్చుకోజాలని అనేక చిక్కుముడులున్నాయి. వాటిని కప్పిపెడుతూ మతమార్పిడులకొరకు క్రైస్తవ విశ్వాసంలోని మర్మాలను తప్పుబట్టే ప్రయత్నాలను దావా ప్రచారకులు అనేక విధాలుగా చేస్తూ అమాయక క్రైస్తవులను అలాగే ముస్లీములను మోసం చేస్తూ తప్పు మార్గం పట్టిస్తున్నారు.

ముస్లీం దావా ప్రచారకుల మోసాలను అడ్డుకునేందుకు సహాయకరంగా ఇస్లాంలోని అతర్క అంశాలలో అలాగే పరస్పర వ్యతిరేక విశ్వాసాలలోని కొన్ని ఈ వ్యాసంలో మీముందు ఉంచుతున్నాము.

అల్లాహ్ గురించి

(1) సృష్టిని ప్రారంభించకముందు అల్లాహ్ తప్ప మరెవరు లేరు మరేదీ లేదు. ఉనికిలోకి వచ్చిన ప్రతిదాన్ని ప్రతివారిని అంటే ఆకాశాలను భూమిని వాటిలోఉన్న సమస్తాన్ని అవి భౌతికమైనవైనా లేక్ అభౌతికమైనవైనా అల్లాహ్ యే సృష్టించాడు. అల్లాహ్ తాను చేసిన సృష్టి అంతటిని తనకు బయట/వెలుపల సృష్టించి ఉంచాడు. అయినా, అల్లాహ్ అంతటిని అందరిని ఎరిగిన వాడు. సృష్టితో అల్లాహ్ కు ఎలాంటి సామీప్యత లేదు. [సాంప్రదాయ ముస్లీంలు]

సమస్యలు
పై ఇస్లామీయ ధార్మిక విశ్వాసములోని “అల్లాహ్ తాను చేసిన సృష్టి అంతటిని తనకు బయట/వెలుపల సృష్టించి ఉంచాడు” అన్న భాగంలో ఉంది పెద్ద సమస్య.

మొదటి సమస్య: సృష్టి లేనప్పుడు ఉనికిలో ఉన్నది అల్లాహ్ ఒక్కడే అయితే, అల్లాహ్ కు బయట/వెలుపల అన్న స్థలం [space] ఎక్కడిది? ఒకవేళ, అల్లాహ్ నిత్యత్వమంతా స్థలంలో ఉనికిని కలిగి ఉంటే ఆ స్థలం అల్లాహ్ కంటే పెద్దదవుతుంది, కాదా? పైపెచ్చు, అల్లాహ్ ఉండే ఆ స్థలాన్ని సృష్టించిందెవరు? ఒకవేళ, ఆ స్థలాన్నికూడా అలాహ్ యే సృష్టించాడని అనుకుంటే దాన్ని సృష్టించక ముందు అల్లాహ్ ఎక్కడుండేవాడు…?!

రెండవ సమస్య: అల్లాహ్ కు సృష్టితో ఎలాంటి సామీప్యం లేనట్లయితే సృష్టి యొక్క పరిధిలోపల అల్లాహ్ యొక్క ఉనికి లేనట్లే. అదే వాస్తవమైతే అలాహ్ అనంతుడు [Infinite] కాదు, ఎక్కడ సృష్టి యొక్క పరిధి/ఉనికి ప్రారంభమవుతుందో ఆక్కడ అల్లాహ్ యొక్క పరిధి/ఉనికి అంతమవుతుంది. అలాంటి పరిధిగల [finite] అల్లాహ్ అనంతుడైన నిజదేవుడు కాజాలడు.

(2) సృష్టిని ప్రారంభించకముందు అల్లాహ్ తప్ప మరెవరు లేరు మరేదీ లేదు. ఉనికిలోకి వచ్చిన ప్రతిదాన్ని ప్రతివారిని అంటే ఆకాశాలను భూమిని వాటిలోఉన్న సమస్తాన్ని అవి భౌతికమైనవైనా లేక్ అభౌతికమైనవైనా అల్లాహ్ యే సృష్టించాడు. అల్లాహ్ తాను చేసిన సృష్టి అంతటిని తనలోపలే సృష్టించాడు. అకారణాన్నిబట్టి అల్లాహ్ సృష్టి అంతటిలో మమేకమై యున్నాడు [జహ్మీలీ ముస్లీంలు]

సృష్టికి ముందు కేవలం అల్లాహ్ మాత్రమే ఉన్నాడు. స్థలంగాని, అంతరిక్షంగాని, లేక శూన్య ప్రదేశం అన్నది ఏదీ లేదు. కనుక, అల్లాహ్ సృష్టిని తనలోనే చేసాడు అన్నది తర్కబద్దమేగాని ఆ కారణాన్నిబట్టి సృష్టిలో అల్లాహ్ మమేకమై యున్నాడు అన్నది సమస్యాత్మకమైన విశయం. సృష్టికంటే గొప్పవాడు మరియు పెద్ద అస్థిత్వాన్ని కలిగిన అల్లాహ్ తనకంటే చిన్నదైన సృష్టిలో ఎలా ఇమడగలడు? ఎలా అనుసంధానం కలిగి ఉండగలడు…? అదే వాస్తవమైంతే అల్లాహ్ మానవ శరీరాకారములో రావటమన్నది ఒక సమస్య కానేరదు!

(3) సృష్టిని ప్రారంభించకముందు అల్లాహ్ తప్ప మరెవరు లేరు మరేదీ లేదు. ఉనికిలోకి వచ్చిన ప్రతిదాన్ని ప్రతివారిని అంటే ఆకాశాలను భూమిని వాటిలోఉన్న సమస్తాన్ని అవి భౌతికమైనవైనా లేక్ అభౌతికమైనవైనా అల్లాహ్ యే సృష్టించాడు. అల్లాహ్ తాను చేసిన సృష్టి అంతటిని తనకు బయట/వెలుపల సృష్టించాడు. అయినా, అల్లాహ్ తాను ఉనికిలోకి తెచ్చిన సృష్టిలో వసిస్తున్నాడు. ఉదాహరణకు, యేడవ ఆకాశములో కుర్చీపై/అర్ష్ పై అల్లాహ్ ఉన్నాడు. [సాంప్రదాయ ముస్లీంలు]

ఖుర్’ఆన్ గురించి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *