ప్రవక్తలు Vs. ముహమ్మద్
సృష్టికర్త ప్రత్యక్షతలను పొందుతు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, మానవాళికి దైవ సందేశాలను అందించేవారే ప్రవక్తలు. ప్రవక్తల పరంపర మూడు దఫాలుగా మానవాళికి అందించబడింది.
మొదటి పరంపర అబ్రహాముతో మొదలై యోసేపు వరకు నిరాటంకంగా కొనసాగింది. రెండవది, మోషేతో మొదలై మలాకి వరకు కొనసాగింది. మూడవది మరియు చివరిది అయిన నిజప్రవక్తల పరంపర యేసుక్రీస్తుతో మొదలై యేసు శిష్యుడైన యోహానుతో అంతమైంది.
ఈ నిజప్రవక్తల పరంపర ముగిసిన తదుపరికూడా చరిత్రలో అనేక మంది వ్యక్తులు, సంస్కర్తలు, నాయకులు, మతబోధకులు బయలుదేరి తాముకూడా ప్రవక్తల పరంపరకు చెందినవారమే అంటూ ప్రకటించుకున్నారు, ప్రకటించబడుతున్నారు.
ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ముహమ్మద్ [ఇస్లాం/మహ్మదీయ మతం], జోసెఫ్ స్మిథ్ [లాస్ట్ డే సెయింట్స్/మార్మన్లు], బహ ఉల్లాహ్ [బహాయి మతం], మిర్జా గులాం అహ్మద్ [అహ్మదీయ/ఖదియాని మతం] మొదలైన వారు కూడా ప్రవక్తల పరంపరకు చెందినవారుగా బోధించబడుతున్నారు.
నిజప్రవక్తల పరంపరద్వారా మానవాళికి అందించబడిన సంపూర్ణ దైవగ్రంథం బైబిల్లో పైన పేర్కొనబడిన వ్యక్తులు వాస్తవంగానే ప్రవక్తలుగా రాబోతున్నారని పేర్కొనబడి, అలాగే వారి బోధలు నిజప్రవక్తల బోధలతో పరిపూర్ణంగా సమ్మతిస్తున్నట్లయితే వారిని దైవప్రవక్తలుగా అంగీకరించవలసిందే. అలా కానిపక్షంలో వారిని అబద్ధ ప్రవక్తలుగా గుర్తించి తిరస్కరించాలి.
ఈ వ్యాసంలో కేవలం ఇస్లాం మత ప్రవక్త ముహమ్మద్ గురించి మాత్రమే పరిశీలించి చూద్ధాం.
అరేబియా ప్రాంతములో ఆరవ శతాబ్ధములో జన్మించి ఏడవ శతాబ్ధములో మరణించిన ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లా ను ముస్లీంలు దైవప్రవక్తగా విశ్వసిస్తారు. నిజానికి, ముహమ్మద్ గారే తీసుకువచ్చిన ఖుర్’ఆన్ గ్రంథం ఆయనను ప్రవక్తగా ప్రకటిస్తూ ఆయన దైవప్రవక్త అన్న ముస్లీంల విశ్వాసానికి నాందిపలుకుతుంది.
అయితే, అంతకుముందే ప్రమాణీకరించబడిన దైవగ్రంథాలలో అంటే తౌరాత్, జబూర్, మరియు ఇజీల్ గ్రంథాలలో మాత్రం ముహమ్మద్ గారికి ప్రవక్త స్థానం యివ్వబడలేదు. అయినా, ముస్లీం బోధకులు లేక దావా ప్రచారకులు తౌరాత్, జబూర్, మరియు ఇంజీల్ గ్రంథాలతో కూడిన సంపూర్ణ దైవగ్రంథమైన బైబిల్లో ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ గారి ప్రస్థావనను చూపించేందుకు తమదైన శైలిలో విశ్వప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నారు. నిజనిర్ధారణకై వారి వాదనా విధానాన్ని విశ్లేశిస్తూ వ్రాయబడిన వ్యాసాలను చదివి ఈ విశయములోని సత్యాసత్యాలను మీరే తేల్చుకోండి.
ఈ వ్యాసంలో అబ్రహాము [ఇబ్రహీం], ఇస్సాకు [ఇస్సాక్], యాకోబు [యాకూబ్]లు సేవించిన నిజదేవుడు పంపిన ప్రవక్తల బోధలకు మరియు ఇస్లాం మత ప్రవక్త ముహమ్మద్ గారి బోధలకు మధ్య ఉన్న తేడాలను లేఖనాల ఆధారంగా మీముందు ఉంచుతున్నాము. వాటి వెలుగులో మీ విశ్వాస గమనాన్ని సరియైన దిశలోకి మార్చుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. దేవుడు మిమ్ములను దీవించి సర్వసత్యములోనికి నడిపించును గాక!
బోధలలో భేదాలు
(1) స్త్రీపురుషులు
ప్రవక్తలు: స్త్రీపురుషు లిద్దరు దేవుని పోలికలో మరియు దేవుని స్వరూపములో సృష్టించబడ్డారు. భూమిపై ఉన్న వాటిని పాలించేందుకు దేవుడు స్త్రీపురుషు లిద్దరిని ఉద్దేశించాడు. [ఆది.కాం.1:26-28; 5:1-2; 9:6]
పురుషుడు స్త్రీపై అధికారిగా నియమించబడ్డాడు. స్త్రీ పురుషుని కొరకు సృష్టించబడింది. అయినా, విశ్వాసులైనవారి మధ్య స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. [1కొరింథి.11:3-12]
స్త్రీలలో కూడా నాయకులు, ప్రవక్తలు ఉన్నారు. [ని.కాం.15:20-21; న్యాయాధిపతులు.4:4; 2రాజులు.22:14-20]
యిరువురి సాక్ష్యం ఒకే విలువను కలిగి ఉంటుంది. [ద్వి.కాం.19:15; 1రాజులు.3:22-27]
కుటుంభములో మరియు విశ్వాసుల సమాజములో [దేవాలయం/చర్చి] పురుషులు నాయక లేక బోధక పాత్ర వహిస్తారు, స్త్రీలు ఈ రెండు విశయాలలో సహాయక పాత్రకే పరిమితం. [1కొరింథి.14:34]
ఇహలోకములో శారీరకంగా/మానసికంగా స్త్రీలు బలహీనులు. అయినా, ఆత్మీయంగా దేవుని యెదుట యిరువురు సమానులే మరియు పరలోకంలో యిరువురు సమాన స్థానాలను పొందుతారు. [గలతీ.3:28-29; 1పేతురు.3:7]
భర్తలు భార్యలను ప్రేమించాలి [అగాపె=త్యాగపురితమైన ప్రేమ] మరియు గౌరవించాలి; భార్యలు భర్తలకు లోబడాలి మరియు ప్రేమించాలి [ఫిలోస్=స్నేహపూరితమైన ప్రేమ]. [ఎఫెసి.5:25,28; 1పేతురు.3:7; కొలొస్సీ.3:18-19; తీతుకు 2:4-5]
ముహమ్మద్: స్త్రీపురుషులిద్దరు తమ పనులలో మరియు తాము సృష్టించబడిన విధానములో సమానత్వాన్ని కలిగి ఉన్నారు. [ఖుర్’ఆన్ 3:195 & 4:1]
పురుషుడు/ఆదాము దేవుని తరపున భూమిపైనున్న వాటిని పాలిస్తాడు. [ఖుర్’ఆన్ 2:30]
భర్తలకు తమ భార్యలపై హక్కులున్నాయి. అలాగే, భార్యలకు తమ భర్తలపై హక్కులున్నాయి. కాని, భర్తల హక్కులు భార్యల హక్కులకన్నా ఒకింత పైస్థాయి. [ఖుర్’ఆన్ 2:228; 4:34]
సాక్ష్యమివ్వటములో ఒక పురుషునికి ఇద్దరు స్త్రీలు సమానం. సాక్షులుగా ఉండటములో ఇద్దరు పురుషులు అందుబాటులో లేకపోతే ఒక పురుషుని స్థానంలో ఇద్దరు స్త్రీలు సాక్షులుగా ఉండవచ్చు. [ఖుర్’ఆన్ 2:283= సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 1, బుక్ 6, హదిథ్ సంఖ్య 601]
స్త్రీలలో అధిక శాతం కృతఘ్నులే. [సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 1, బుక్ 2, హదిథ్ 29]
స్త్రీలు వంకర స్వభావులు. [సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 7, బుక్ 62, సంఖ్య 113]
స్త్రీలు జ్ఙానంలో పురుషులకన్న నిమ్నస్థాయిలో ఉన్నారు. [సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 1, బుక్ 1, సంఖ్య 301]
నరకంలో అత్యధిక సంఖ్యాకులు స్త్రీలు. [సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 1, బుక్ 6, సంఖ్య 301;]
2) వివాహము
ప్రవక్తలు: వివాహము పరిశుద్ధమైనది. అది జీవితాంతం ఉండాల్సింది. [హెబ్రీ.13:4; మలాకి.2:13-14]
విశ్వాసుల సమాజములో నాయక పాత్రను వహిస్తున్న పురుషుడు ఒకే భార్యకు భర్త అయివుండాలి. [ఆది.కాం.2:24; మత్తయి.19:5; ద్వి.కాం.17:17; 1కొరింథి.7:2; 1తిమోతి.3:2,12; తీతుకు.1:6; యోబు 31:1]
వైవాహిక జీవితములో భర్త భార్యకు భార్య భర్తకు తమతమ ధర్మాలను నెరవేర్చవలెను. భర్త దేహముపై భార్యకు, అలాగే భార్య దేహముపై భర్తకు అధికారము కలదు. [1కొరింథి7:3-4]
విశ్వాసులైన భార్యాభర్తలు ఏకారణము చేతనైనా కలిసి జీవించలేకపోతే, కొంత కాలము వరకు యిరువురు వేరువేరుగా జీవించేందుకు నిర్ణయించుకోవాలి, విడాకులు తీసుకోరాదు లేక వేరే వివాహాలు చేసుకోకూడదు. [1కొరింథి.7:3-11]
ముహమ్మద్: న్యాయం చేయగల నమ్మకం ఉన్న వ్యక్తి నలుగురు స్త్రీల వరకు వివాహం చేసుకోవచ్చు [ఖుర్’ఆన్ 4:3], కాని తానుమాత్రం అంతకన్నా యెక్కువ భార్యలను కలిగి ఉండవచ్చు అంటూ తనకు తాను అల్లాహ్ పేరుతో ప్రత్యేకమైన రాయితీలు ప్రకటించుకున్నాడు [ఖురాన్.33:50].
భర్తకు భార్యను కొట్టి దండించే హక్కు ఉంది. [ఖుర్’ఆన్ 4:34; సునన్ అబు దావుద్, బుక్ 11, హదిస్ సంఖ్య 2141, హదిస్ సంఖ్య 2142]
భార్య భర్తకొరకు సృష్టించబడిన జత. [ఖుర్’అన్ 26:166]
భార్యలు పొలం లాంటివారు. కనుక, భర్త కోరినప్పుడెల్ల ఏవైపునుండి అయినా తన భార్యతో సంభోగించవచ్చు. [ఖుర్’ఆన్ 2:223 = సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 6, బుక్ 60, హదిథ్ సంఖ్య 51]
ముత్’ఆ వివాహ విధానాన్ని ప్రవేశపెట్టి కొంతకాలానికి దాన్ని తిరిగి నిశేధించాడు. ఈ విధానం ప్రకారం ఇద్దరు స్త్రీపురుషులు అంగీకారముతో మూడు రాత్రులు భార్యాభర్తలుగా గడపవచ్చు. ఆ తరువాత వారికిష్టమైతే కొనసాగవచ్చు లేకపోతే విడిపోవచ్చు. [సహిహ్ అల్-బుఖారి, వాల్యూం 7, బుక్ 62, సంఖ్య 52]
3) విడాకులు
ప్రవక్తలు: వ్యభిచార కారణాన్నిబట్టి కాకుండా విడాకులివ్వటం నిజదేవునికి వ్యతిరేకం. [ద్వి.కాం.24.1-4; మలాకి.2:14-16; మత్తయి.5:31-32].
“నేను మీతో చెప్పునదేమనగావ్యభిచారకారణమునుబట్టి గాక, తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు; విడనాడబడినదానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు.” (మత్తయి.5:32)
ముహమ్మద్: భర్తలు భార్యలకు విడాకులివ్వవచ్చు. అయితే, విడాకులివ్వటానికి మాత్రం ఏకారణాన్ని పేర్కొనలేదు. [2:232, 226]
తానుకూడా పై ప్రవక్తల బోధకు వ్యతిరేకంగా తన దత్తపుత్రుడైన జయీద్ ఆయన భార్య అయిన జైనాబ్ కు విడాకులిచ్చేందుకు జయీద్ కు అనుమతినివ్వటమేగాక, విడవబడిన జైనాబ్ ను తానే పెండ్లిచేసుకున్నాడు. తాను తెచ్చిన ఖురాన్ గ్రంథములో దైవవ్యతిరేకమైన వీటికి అల్లాహ్ పేరుతో తనకు అనుమతినికూడా ప్రకటించుకున్నాడు [ఖురాన్.33:37]
(4) రెండవ వివాహము
ప్రవక్తలు: ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లిచేసి కొనిన తరువాత ఆమెయందు మానభంగసూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమెమీద అతనికి ఇష్టము తప్పినయెడల, అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమెచేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని యింటనుండి వెళ్లినతరు వాత ఆమె వేరొక పురుషుని పెండ్లిచేసికొనవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేసినయెడల నేమి, ఆమెను పెండ్లిచేసికొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయినయెడల నేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లిచేసికొనుటకై ఆమెను మరల పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండునట్లు మీరు ఆలాగు చేయకూడదు. (ద్వి.కాం.24:1-4; యిర్మీయ.3:1)
ముహమ్మద్: మరి ఆమెకు (మూడవసారి) గనక విడాకులిస్తే, ఆ స్త్రీ ఇతనిని తప్ప వేరొక వ్యక్తిని వివాహం చేసుకోనంతవరకూ ఇతని కోసం ఆమె ధర్మసమ్మతం కాజాలదు. ఆ తరువాత అతను (రెండవ భర్త) కూడా ఆమెకు విడాకులిస్తే, మళ్ళీ వీరిద్దరూ అల్లాహ్ (విధించిన) హద్దులకు కట్టుబడి ఉండగలమన్న నమ్మకం ఉండి వివాహ బంధంలోకి రాదలిస్తే అందులో తప్పులేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు. తెలుసుకోగలవారికి ఆయన వీటిని స్పష్టపరుస్తున్నాడు. (ఖుర్’అన్ 2:230)
(5) దేవాలయము
ప్రవక్తలు:
ముహమ్మద్:
(6) నేరాలు-శిక్షలు
ప్రవక్తలు:
ముహమ్మద్:
(7) పాపక్షమాపణ
ప్రవక్తలు:
ముహమ్మద్:
(8) పరలోకము
ప్రవక్తలు:
ముహమ్మద్:
(9) మెస్సయ్య
ప్రవక్తలు:
ముహమ్మద్:
(10) శాస్త్రీయ ఆవిష్కరణలు
ప్రవక్తలు:
ముహమ్మద్: