ఇస్లామీయ సైన్స్
ఇస్లాం మతగ్రంథాలలో ఆధునిక శాస్త్రం ఉందన్నది ముస్లీంల అచంచల విశ్వాసం. ఆ విశ్వాసానికి ఆధారాలను ఇస్లాం ధార్మిక గ్రంథాలలోనే చూడాలి.
సూర్యుడు అస్తమించే స్థలం
“ఓ ప్రవక్తా!) వారు నిన్ను జుల్‌ఖర్‌నైన్ గురించి అడుగు తున్నారు. “నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తాన”ని వారికి చెప్పు. మేము అతనికి భువిలో అధికారం ఇచ్చాము. అన్ని రకాల సాధన సంపత్తుల్ని కూడా అతనికి సమకూర్చాము. అతను ఒక దిశలో పోసాగాడు. చివరకు అతను సూర్యుడు అస్తమించే ప్రదేశానికి చేరుకుని, సూర్యుడు ఒక బురద చెలమలో అస్తమిస్తుండగా చూశాడు. దాని సమీపంలో అతను ఒక జాతి వారిని కూడా కనుగొన్నాడు. “ఓ జుల్‌ఖర్‌నైన్! నువ్వు వీళ్లను శిక్షించవచ్చు. లేదా వీరి విషయంలో మరేదయినా ఉత్తమ వైఖరిని అవలంబించవచ్చు” అని మేమతనికి సెలవిచ్చాము.” (ఖుర్‘ఆన్ – 18 :83-86)
పై వాక్యములో ఖుర్ ఆన్ రచయిత వివరిస్తున్న ప్రకారం జుల్‌ఖర్‌నైన్ అనే వ్యక్తి ఒక దిశలో సాగిపోతూ చివరకు “సూర్యుడు అస్తమించే ప్రదేశానికి” చేరుకున్నాడట! ఆ “సూర్యుడు అస్తమించే ప్రదేశం” ఏదయ్యా అంటే, అది ఒక బురద చెలమ అట!! ఆ బురద చెలమలో సూర్యుడు అస్తమించటాన్ని జుల్‌ఖర్‌నైన్ చూసాడంటూ ఖుర్’ఆన్ లోని అల్లాహ్ యొక్క కథనం!!!
ఇది వాస్తవానికి యేడవ శతాబ్ధపు అరాబ్బు కవుల శాస్త్రీయ పాండిత్యం.
గమనిక: సూర్యుడు అస్తమించే సమయానికి ఒక బురద చెలమక్కు చేరుకున్నాడు అనికాదు. లేక, ఒక బురద చెలమలోనుండి చూస్తున్న అతనికి అస్తమిస్తున్న సూర్యుడు కనిపించాడు అనికూడా పై ఖుర్’ఆన్ వాక్యం చెప్పటం లేదు.
అయినా సరే, పై వాక్య సందేశాన్ని “సూర్యుడు అస్తమించే సమయానికి జుల్‌ఖర్‌నైన్ ఒక బురద చెలమను చేరుకున్నాడు” అ ని అర్థం చేసుకోవాలంటూ దావా ప్రచారకులు తమ స్వంత వక్రవ్యాఖ్యానం ద్వారా ఖుర్’ఆన్ లోని శాస్త్రీయ సమస్యకు లౌకిక పరిష్కారం చెపుతుంటారు. మరోమాటలో వారు చెప్పేదేమిటంటే, ఖుర్’ఆన్ రచయితకు జుల్‌ఖర్‌నైన్ అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనను స్పష్టంగా వివరించటం రాదు. కాని, తమకు స్పష్టంగా చెప్పటం వచ్చు!
దయ్యాలపై బాణాలు
నిశ్చయంగా మేము (భూమికి) సమీపంలో ఉన్న ఆకాశాన్ని దీపాలతో (నక్షత్రాలతో) ముస్తాబు చేశాము. ఇంకా వాటిని (ఆ దీపాలను) షైతానులను తరిమికొట్టే సాధనాలుగా చేశాము. షైతానుల కొరకైతే మేము మండే నరకాగ్ని శిక్షను కూడా సిద్ధపరచి ఉంచాము. (ఖుర్ ఆన్ – 67:5)
పై వాక్యము రాత్రిపూట ఆకాశములో కనిపించే నక్షత్రాలను గురించి కాదుగాని వాటిమధ్య వెలుగు చిమ్ముతూ వేగంగా పయనించే ఉల్కా పాతాని గురించి వివరిస్తున్నది అన్నది అర్థమవుతుంది. ఏడవ శతాబ్ధపు అరాబ్బు కవుల ఊహాగానం ప్రకారం [ఉల్కలను] “వాటిని (ఆ దీపాలను) షైతానులను తరిమికొట్టే సాధనాలుగా చేశాము” అనటంలో వారి శాస్త్ర పరిజ్ఙానస్థాయి అర్థమవుతున్నది!
అస్తమయం తరువాత సూర్యుని పడిగాపులు
అబు ధర్ కథనం:
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వా సల్లం) నన్ను సూర్యాస్తమయం వద్ద అడిగారు, “సూర్యుడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా (సూర్యాస్తమయం సమయంలో)?” నేను, “అల్లాహ్ మరియు అతని అపొస్తలుడు బాగా తెలుసు” అని నేను బదులిచ్చాను. అతను ఇలా అన్నాడు, “ఇది సింహాసనం క్రింద సాష్టాంగపడి, మళ్ళీ పైకి లేవడానికి అనుమతి తీసుకునే వరకు (అంటే ప్రయాణిస్తుంది), మరియు అది అనుమతించబడుతుంది మరియు తరువాత (ఒక సమయం వస్తుంది) అది సాష్టాంగ నమస్కారం చేయబోతుంది, కానీ దాని సాష్టాంగ నమస్కారం జరగదు అంగీకరించాలి, మరియు అది దాని మార్గంలో వెళ్ళడానికి అనుమతి అడుగుతుంది, కానీ అది అనుమతించబడదు, కానీ అది ఎక్కడి నుండి వచ్చిందో తిరిగి ఆదేశించబడుతుంది మరియు అది పశ్చిమాన పెరుగుతుంది. మరియు ఇది అల్లాహ్ యొక్క ప్రకటన యొక్క వివరణ : “మరియు సూర్యుడు దాని స్థిర కోర్సును నడుపుతాడు ఒక పదం కోసం (డిక్రీడ్). అది (అల్లాహ్) యొక్క ఉత్తర్వు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు.” [సహిహ్ బుఖారి 3199; వాల్యూం 4, బుక్ 54, హదిథ్ 421]
సూర్యాస్తమయం తరువాత సూర్యుడు ఎక్కడికి వెళుతాడు ఏమిచేస్తాడు అన్న విషయాలను పై హదిథ్ లో ముహమ్మద్ వివరిస్తున్నాడు. ఆ వివరణ ఆయన యొక్క శాస్త్రీయ పరిజ్ఙానాన్ని సూచిస్తున్నది. ఏడవ శతాబ్ధం లోని అరబ్బు వ్యక్తులకు అది ఎంతో సంతృప్తిపరచే సమాచారం! అలాంటి వ్యక్తులు ఈనాడుకూడా మన సమాజములో ఉండటం విచారకరం.
ఒంటెమూత్ర ఔషధం
అనాస్ చెప్పిన కథనం:
“మదీనా యొక్క వాతావరణం కొంతమందికి సరిపోలేదు, కాబట్టి ప్రవక్త తన గొర్రెల కాపరిని, అంటే తన ఒంటెలను అనుసరించమని మరియు వాటి పాలు మరియు మూత్రాన్ని (ఔషధంగా) త్రాగమని ఆదేశించాడు. కాబట్టి వారు ఒంటెల కాపరిని అనుసరించారు, మరియు వారి శరీరాలు ఆరోగ్యంగా మారే వరకు వాటి పాలు మరియు మూత్రాన్ని తాగారు. అప్పుడు వారు గొర్రెల కాపరిని చంపి ఒంటెలను తరుముకొని పారిపోయారు. ఈ వార్త ప్రవక్తకు చేరినప్పుడు కొంతమంది వారిని వెంబడించారు. వారిని తీసుకువచ్చినప్పుడు, అతను వారి చేతులు మరియు కాళ్ళను నరికించాడు మరియు వారి కళ్ళు వేడిచేసిన ఇనుపముక్కలతో పొడిపించాడు.” [సహిహ్ అల్-బుఖారి, బుక్ 76, హదిథ్ 9; 5686]
కాపరులను చంపి ఒంటెలను ఎత్తుకుపోయినందుకు బదులుగా వారి చేతులు నరికేయటమేగాక వారి కళ్ళను వేడిచేసిన ఇనుపముక్కలతో పొడవటం సరియైన శిక్ష అయితే మరి లొంగిపోయిన దాదాపు 700 మంది యూదు [బాను ఖురేజ] మగవారి తలలు నరికించి వారి ఆస్తులను భార్యాబిడ్డలను దోచుకున్న పాపానికి ఏశిక్ష సరిపోతుంది…?! [ఖుర్’ఆన్ 33:26-27; సహిహ్ బుఖారి 5:59:362; సహిహ్ ముస్లీం 19:4364]
ఒంటె మూత్రం మెర్స్ [MERS: Middle East Respiratory Syndrome] అనే ప్రాణాంతకమైన వ్యాధి కారకాలలో ఒకటని వైధ్య ఆరోగ్య శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంటే, మరోమాటలో చెప్పాలంటే ముహమ్మద్ చెప్పినట్లు ఒంటెమూత్రం రోగాలకు ఔషధం కాదుగాని అది ప్రాణాలకు ముప్పుతేగల నీచద్రవం!
ఈగలు మోసే మందు
అబు హురైరా చెప్పిన కథనం:
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “మీలో ఎవరికైనా ఒక ఈగ పానీయంలో పడితే, అతను దానిని పూర్తిగా ముంచివేసి, దానిని తీసివేయాలి, ఎందుకంటే దాని రెక్కలలో ఒకదానిపై వ్యాధి మరియు మరొక దానిపై నివారణ ఉంది.” [సహిహ్ అల్-బుఖారి, బుక్ 59, హదిథ్ 126; 3322/5782]
పై ముహమ్మద్ మాటలలోని శాస్త్రపరమైన సమస్యలు:
ఈగలు ప్రమాదకరమైన వ్యాధికారక సుక్ష్మజీవులమధ్య తిరుగాడుతూ దాదాపు 351 రకాల సూక్ష్మజీవులను తమ శరీరాలద్వారా ఒక ప్రాంతమునుండి మరో ప్రాంతానికి చేరవేస్తుంటాయి. ఆ కారణాన్నిబట్టి వాటి శరీరాలలో వ్యాధినిరోధక సూక్ష్మజీవులుండటం సహజం.
- ఈగలు మోసే వ్యాధికారక సూక్ష్మజీవులు వాటి శరీరమంతట ముఖ్యంగా శరీరంలోని కాళ్ళపై ఉంటాయి.
- ఈగలు మోసే వ్యాధికారక సూక్ష్మజీవులు కేవలం ఈగలోని రెక్కలపైనే ఉంటాయనటం, అందునా అవి కేవలం ఒక రెక్కపైనే ఉంటాయనటం అశాస్త్రీయం, హాస్యాస్పదం, మరియు అజ్ఙానం.
- అలాగే, ఈగలకున్న వ్యాధినిరోధక సూక్ష్మజీవులు రెక్కలపైన అందునా ఒకే రెక్కపైనే ఉంటాయనటం అశాస్త్రీయం, హాస్యాస్పదం, మరియు అజ్ఙానం!
- ఒకవేళ ముహమ్మద్ తెలియచేసిన విధంగా ఈగ “రెక్కలలో ఒకదానిపై వ్యాధి మరియు మరొక దానిపై నివారణ ఉంది” అన్నది సత్యమైతే ఒక రెక్కలోని వ్యాధికారక సుక్ష్మజీవులు కలిగించే వ్యాధికి మరోరెక్కలోని నివారణ లేక వ్యాధినిరోధక సూక్ష్మజీవులు అందించే నివారణ ససేమిరా సరిపోదు!
- వ్యాధికారక సూక్ష్మజీవులను మోస్తున్న ఈగ గనుక పానములో పడితే అంతమాత్రమే కాకుండా దాన్ని ఆసాంతం పానీయములో ముంచి తీసిపడవేస్తే ఈగలోని “వ్యాధి నివారణ” అది మోసుకొస్తున్న “వ్యాధి కారకాన్ని” నిర్మూలించలేదు!
- ముహమ్మద్ యిచ్చిన పై సలహా వ్యాధుల నివారణకు కాదు వ్యాధుల విస్తారణకు పనికొస్తుంది!
- ముహమ్మద్ ను దైవ ప్రవక్తగా విశ్వసించే ముస్లీంలలో మీరు ఒకరైతే, ఆయన యిచ్చిన పై సలహాను పాటించారా? పాటించగలరా?!
- అలాంటి సలహాలను యిచ్చిన వ్యక్తి దైవప్రవక్త అవునాకాదా అన్నది అటుంచి ఆవ్యక్తి అసలు ఒక మంచి సలహాలను అందించే వ్యక్తి అని ఎలా అనుకోగలరు…?!
MERS ఆధునిక శాస్త్రం ఈగలు ఒంటె మూత్రం జుల్‌ఖర్‌నైన్ సూర్యుడు