ఖురాను దేవుడు Vs. బైబిలు దేవుడు

ఖురాను దేవుడు Vs. బైబిలు దేవుడు

December 3, 2019 సృష్టికర్త 4

దేవుని వ్యక్తిత్వము మరియు ఆయన స్వభావమును గురించి బైబిల్ మరియు ఖురాన్‍లలో ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి?

బైబిల్‍లోని దేవుడు మనుష్యుల “దగ్గరకు వస్తాడు”, పరలోకము విడిచి మన కొరకు “క్రిందకు వస్తాడు” మరియు మనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడు. బైబిలంతా కూడా “దేవుడు మనిషికై చేసిన అన్వేషణ” యొక్క కథ.

బైబిల్‍లోని మొదటి అధ్యాయములలో మానవుని యొక్క సృష్టి మరియు అతడి పతనాన్ని గురించిన విషయాలను మనము చదువుతాము. అక్కడ మొదటి పాపము/ఆజ్ఞ ఉల్లంఘనము చేసిన తరువాత ఆదాము మరియు హవ్వ తమ మనస్సాక్షి చేత నిందించబడినవారై దేవుని నుండి దాగుకొనడానికి ప్రయత్నించారు. అప్పుడు దేవుడు ఏదెను తోటలో ఆదాము వద్దకు వచ్చి “నీవు ఎక్కడ ఉన్నావు?” అని పిలిచాడు. (ఆదికాండము 3:9)

మనుష్యుడు దేవుని సముఖము నుండి పారిపోయాడు, ఎందుకంటే అతను దేవుని ఎదుట అపరాధి అని అతనికి తెలిసిపోయింది కాబట్టి. అయినప్పటికి దేవుడే దిగివచ్చి మనలను వెతికి మనతో కూడా ఆ పరస్పరమైన ప్రేమ సంబంధాన్ని తిరిగి స్థాపించాలని కోరాడు. దానికై అవసరమైన అన్ని పనులు దేవుడే స్వయంగా చేశాడు. ఇదే బైబిల్‍లోని మొదటి పుస్తకం నుండి చివరి పుస్తకం వరకు ఉన్న కథ. మరియు చివరి పుస్తకంలో మనము క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని గూర్చి చదువుతాము:

“అప్పుడు – ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.” (ప్రకటన 21:3)

దేవుని యొక్క కోరిక తుదకు నెరవేరింది. ప్రకటన గ్రంథము 21వ అధ్యయము పూర్తిగా చదవండి, ఇది ఒక అద్భుతమైన అధ్యాయము.

నిజానికి మనదేవుడు మనలను వెతికే దేవుడై ఉన్నాడు, మనదగ్గర ఉండాలని ఆయన పైనుండి కిందకు దిగివస్తాడు. ఆయన తన వ్యక్తిత్వాన్ని, తన హృదయాన్ని, మరియు తన సృష్టితో ఒక ప్రేమపూర్వకమైన సంబంధాన్ని స్థాపించాలనే తన చిత్తాని బయలుపరిచే దేవుడై ఉన్నాడు. మరి ప్రకటన గ్రంథం 21:3 లో చెప్పబడ్డ తన ప్రజలలో మీరు కూడా ఉంటారా? ఇదే బైబిల్‍లోని ముఖ్య విషయము. ఈ బైబిల్ గ్రంథం మనకు దేవుడిని బయలుపరుస్తుంది, మనము దేవుని మాట విని ఆయన ప్రజలముగా మారులాగున మనకు దేవుడిని బయలుపరుస్తుంది.

దీనికి విరుద్ధంగా ఖురాన్, దేవుడు మనుష్యులతో కలవకుండా దూరంగా ఉంటాడని, ఆయనను మనుష్యులు అర్థం చేసుకోలేని వాడిగా ఉంటాడని వర్ణిస్తుంది. ఒక ముస్లిం పండితుడు ఈ విధంగా తెలియచేశాడు, “దేవుడు కేవలం ఆయన చిత్తాన్ని మాత్రమే బయలుపరుస్తాడు కాని తనను తానూ ఎప్పుడు బయలుపరుచకొనడు. ఆయన ఎప్పటికీ మరుగై ఉంటాడు”. ఆయన మన మెడలోని పెద్ద నెత్తుటి నాళముకన్నా మనకు దగ్గరగా ఉన్నాడని ఖురాన్ సెలవిస్తున్నది, కాని ఇది కేవలం “పారిభాషికమైన సామీప్యమే” గాని మరొకటికాదు. ఎందుకంటే మన మెడలో ఒక పెద్ద నెత్తుటి నాళము ఉన్నదని మనకు తెలిసినా దానితో మనము ఎలాంటి వ్యక్తిగత సంబంధాన్ని కలిగియుండము, అది కూడా మనతో ఎలాంటి వ్యకిగతమైన సంబంధాన్ని ఎన్నడూ కలిగియుండదు కదా! అదే విధంగా దేవుడు కూడా “అన్ని చోట్లలో” ఉంటాడు (దూరముగాను మరియు దగ్గరగా) అని ఎవరైనా అంటే – ఏ విధంగానైతే గాలి మన చుట్టూ ఉంటుందో అదే విధంగా దేవుడు అన్ని చోట్లా ఉన్నాడు అని మాత్రమే అర్థం. ఐతే బైబిల్‍లోని దేవుడు, తాను సర్వవ్యాపి మరియు సర్వజ్ఞుడు అయిన కారణంగా మనతో ఉన్నానని చెప్పటంలేదు, ఎందుకంటే, ఆయన దేవుడు కాబట్టి మనం అవునన్నా కాదన్నా ఎలాగైనా ఆయన అన్ని చోట్ల ఉంటాడు.

అలాకాదు, దగ్గరగా ఉన్నానని చెప్పుకుంటూ మనకు దూరంగా ఉండాలని ఆయన కోరుకోవటం లేదుగాని ఆయన మనకు నిజంగానే దగ్గరగా ఉండాలని కోరుకొంటున్నాడు. మనచే ప్రేమింపబడే వ్యక్తిలా మనతోనే ఎల్లప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాడు.

మానవుడు దేవుని చిత్తాన్ని శిరసావహిస్తూ ఆయనను సంతోషపెట్టడానికి ప్రయత్నించడమే ఇస్లాం, కాని బైబిల్‍లోని దేవుడు మాత్రం ఆయనే మొదటి అడుగు వేసి మనలను వెతికి రక్షించడానికి కిందకు దిగి వచ్చాడు. ఈ గమనము ఖుర్‍ఆన్‍లోని అల్లాహ్‍ యొక్క గమనానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్నది

వ్యాస రచన: షేఖ్ అజాద్

 

4 Responses

 1. Laxmi kanth says:

  Praise the Lord brother
  My question is why 2nd kings 19 chapter and Isaiah 37 chapter are same , some people believe that they corrupted or copying same text.
  explain in telugu sir for clear understanding

  • telugui says:

   దేవుని స్త్రోత్రం, బ్రదర్ లక్ష్మికాంత్!

   మీరు పేర్కొన్నట్లే 2రాజులు 19వ అధ్యాయం అలాగే యెషయా 37వ అధ్యాయం ఒకేవిధంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇది అసాధారణమైన విశయం కాదు. సంపూర్ణ దైవగ్రంథమైన బైబిల్లో ఇంకా అలాంటి సమాంతర అధ్యాలు కొంత వైవిధ్యాలతో ఉన్నట్లు చూడవచ్చు. అలాంటివాటిలో కొన్ని క్రింద యివ్వబడినవి:

   – కీర్తనలు 14 మరియు 53
   – 2 సమూయేలు 24వ అధ్యాయము మరియు 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయము
   – 2రాజులు 18:13–20:12 మరియు యెషయా 36:1–39:8

   ఆ మాటకొస్తే క్రొత్త నిబంధన గ్రంథములోని నాలుగు సువార్తలు సమాంతర అంశాలు లేక సంఘటనలను వివరిస్తుండటం చూస్తాము. అయితే, వాటిలో వాడబడిన పదజాలములో చాలా వైవిధ్యాలున్నాయి.

   ఇందులో సమస్య లేదు. కారణం, లేఖనాలను వ్రాసిన వారిని ప్రేరేపించిన దేవుని పరిశుద్ధాత్మ తన చిత్తం ప్రకారం ఒకేవిధంగా లేక వేరువేరుగా వ్రాయించే స్వాతంత్రం మరియు అధికారం ఉన్నవాడు.

   • Laxmi kanth says:

    Thank you brother for your response and మీరు ఇలాగే కంటిన్యూ చేయండి కురాన్ లో ఉన్నటివంటి విషయాలు అందరికీ తెలియజేయండి , ఇస్లామ్ స్వికరిద్దం అనుకున్నప్పుడు మీరు రెహమాన్ గారితో చేసినా డిబేట్ చూశాక ఇస్లామ్ లోకి వెళ్ళలనికొలెడు , యేసు వంటి పరిశుద్ధ దేవుడు ఇంకొకరు లేదు అని తెలుసుకున్న.
    Praise the lord brother

    • telugui says:

     దేవునికి స్తోత్రం!

     బ్రదర్, నిజదేవుడు మీ యెడల తన అపార కృపాకనికరాలను చూపి మిమ్మల్ని అసత్యమార్గములో పడకుండా కాపాడినందుకు ఆయనకు వేలాది వందనాలు, కృతజ్ఙతలు!

     ఈ వెబ్సైట్ టీం లోని సభ్యుడు చేసిన డెబేటును జీవంగల దేవుడు ఉపయోగించుకొని తనకు ప్రశస్తమైన బిడ్డగా వున్న మిమ్మల్ని అసత్యంలోకి పడిపోకుండా కాపాడిన విశయం మీ సాక్ష్యం ద్వారా విని మేము ఉత్సహిస్తున్నాము హర్శిస్తున్నాము! ఆ అద్వితీయ దేవునికే సమస్త మహిమా, ఘనతా, ప్రభావములు కలుగును గాక!

     క్రైస్తవులు దావా ప్రచారకుల దుర్బోధలచేత మోసపోకుండా ఇస్లాం గురించిన అసలు విశయాలు తెల్సుకోవటానికి అలాగే సత్యాన్ని గురించిన సరియైన అవగాహనను కలిగించటానికి ఈ వెబ్సైట్ ప్రారంభించబడింది. దయచేసి ఈ వెబ్సైటును యితరులకు పరిచయం చేసి దేవుని దీవెనలు పొందండి.
     ప్రభువు నందు మీకు వందనాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *