ముస్లీంల విశిష్టత

ముస్లీంల విశిష్టత

January 5, 2020 Uncategorized 0

ప్రపంచవ్యాప్తంగా వున్న దాదాపు 180 కోట్ల మంది ముస్లీంలలో అనేక తెగలు, శాఖలు, మరియు విభాగాలు వున్నా ఇస్లాము మతస్తులైన ముస్లీం ప్రజలను చూసి ఇతర మతస్థులు, ముఖ్యంగా క్రైస్తవులుగా చెప్పుకునేవారు, మెచ్చుకోదగిన మరియు నేర్చుకొదగిన విశయాలు ఎన్నో వున్నాయి. ముస్లీంల ప్రత్యేకతలలో కొన్ని ఈ క్రింద యివ్వబడినవి:

 • దైవగ్రంథము బైబిలు తెలియచేస్తున్న విధంగా మానవులందరివలె ముస్లీంలు కూడా దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డారు.
 • పక్షపాత రహితుడైన దేవుని ప్రేమ అందరికి యివ్వబడిన విధంగా ముస్లీములకు కూడా సమాంతరస్థాయిలో యివ్వబడింది.
 • ప్రభువైన యేసు శ్రమలను అనుభవించి, మరణించి, తిరిగి లేచింది ముస్లీములకొరకు కూడా. ముస్లీంలు సర్వసాధారణంగా తమ విశ్వాస విషయములో తీవ్రమైన ఆస్తక్తి కలిగినవారు. ప్రపంచ గణాంకాల ప్రకారం క్రైస్తవ మతానికి చెందినవారి సంఖ్య ఇస్లాం మతానికి చెందిన వారి సంఖ్య కన్నా ఎక్కువే. కాని, ప్రపంచవ్యాప్తంగా మత విశ్వాసాలను పాటిస్తున్న క్రైస్తవుల సంఖ్య కన్నా మత విశ్వాసాలను పాటిస్తున్న ముస్లీంల సంఖ్యే ఎక్కువ.
 • సర్వసాధారణంగా చెప్పుకోవాలంటే తమ మత విశ్వాసాలను ప్రచారం చేయటములో క్రైస్తవులకన్నా ముస్లీంలే ముందడుగు వేస్తున్నారు.
 • ప్రాశ్చ్య దేశాలకు చెందిన బైబిలులోని సామాజిక సాంఘీక సంస్కృతులకు మరియు విలువలకు ముస్లీంల విలువలు సంస్కృతి దగ్గరగా వున్నాయన్నది త్రోసివేయలేని వాస్తవము.
 • అధిక శాతం ముస్లీంలు బైబిలులోని ప్రవక్తల పేర్లను గూర్చిన పరిజ్ఙానము కలిగినవారు మాత్రమేగాక ప్రవక్తలను అత్యున్నతంగా గౌరవించే సంస్కారం కలిగిన వారు.
 • ఆధునికత వెర్రితలలువేస్తున్న పాశ్చాత దేశాలలో సహితం ముస్లీంలు చాలావరకు తమ విలువలను సంస్కృతిని కాపాడుకుంటూ వస్తున్నారు.
 • సాధారణంగా ముస్లీం సమాజాలు తమ మధ్య సామాజిక ఐక్యతను, సహోదరభావాన్ని, అలాగే క్రమాన్ని కలివుండటాన్ని చూడగలము.
 • అనేక ముస్లీం సంస్కృతులలో అపరిచితులకు ఆతిథ్యం యివ్వడమన్నది ఆనవాయితిగా వస్తున్నది.
 • తమ మతవిశ్వాసాలను గురించి, ప్రవక్త గురించి, అలాగే గ్రంథాలను గురించి అరమరిక లేకుండా ధైర్యంగా మాట్లాడటములో ముస్లీములదే పైచేయి.
 • అధిక శాతము ముస్లీంల తమ జీవితకాలమంతా అల్లాహ్ [దేవుని] యెడల భయము కలిగి జీవిస్తారు.