వివాహాలు

వివాహాలు

December 7, 2020 ప్రశ్నలు వాదప్రతివాదాలు 0

బైబిల్

ప్రవక్తల పరంపరద్వారా మానవాళికి అందించబడిన తవ్రాత్, జబూర్, ఇంజీల్ వంటి దైవగ్రంథాలతోకూడిన సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ బోధ ప్రకారం స్త్రీపురుషులమధ్య వివాహ బాంధవ్యాన్ని ప్రభువైన దేవుడే రూపకల్పన చేశాడు.

వివాహ బాంధవ్యం ఒకే పురుషుడు మరియు ఒకే స్త్రీ మధ్య అన్నది ప్రభువైన దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రారంభ సంకల్పం. పాపప్రవేశముద్వారా సంభవించిన మానవ పతనము తరువాత ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను వివాహము చేసుకోవటం ప్రారంభమైంది.

ఆ రకమైన పతన స్థితి తన పరిపూర్ణ చిత్తానికి వ్యతిరేకమైనా దాన్ని కొంత కాలము వరకు ప్రభువైన దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. క్రొత్త నిబంధన యొక్క ఆవిష్కరణతో ఒకే భర్తకు ఒకే భార్య అన్న ప్రభువైన దేవుని సంపూర్ణ సంకల్పం తిరిగి పునరుద్ధరించబడింది. దినికి వ్యతిరేకమైన బోధ నిజదేవునికి వ్యతిరేకమైన అబద్ధబోధ.

ప్రభువైన దేవుడు పాతనిబంధ కాలములోకూడా తాను ఏర్పరచుకున్న తన ప్రజలకు మాదిరిగా ఉంటూ వారిని నడిపించే నాయకులు అనేకమంది భార్యలను వివాహము చేసుకోకూడదు అన్న తన ఉత్కృష్టమైన పరిపూర్ణ నియమాన్ని తెలియచేసాడు [ద్వి.కాం.17:15-17]. కాని, కొందరు రాజులు/ప్రవక్తలు ఈ దైవ నియమాన్ని ఉల్లంఘించి దేవుని సంపూర్ణ దీవెనలను పొందలేకపోయారు. నిజమైన ప్రవక్తలద్వారా లేక అపోస్తలులద్వారా యివ్వబడిన సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలు ఎక్కడా కూడా ఒక పురుషుడు ఒకరికంటే ఎక్కువ భార్యలను పెళ్ళిచేసుకోవచ్చు అనిగాని లేక ప్రవక్తలు/రాజులకు ఈ విశయములో ప్రత్యేకమైన రాయితీలు యివ్వబడ్డాయి అనిగాని నియంత్రీకరించటం లేదు.

ప్రభువైన యేసుక్రీస్తు [ఈసా అల్-మసీహ్] వారి బలియాగముద్వారా పాతనిబంధన స్థానములో చేయబడిన క్రొత్త నిబంధనను బట్టి ఈనాడు దేవుని ప్రజలుగా ప్రత్యేకపరచబడుతున్న విశ్వాసులు [నిజ క్రైస్తవులు] దేవుని సంపూర్ణ సంకల్పాన్ని ప్రతిభింబిస్తూ వివాహాన్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీకి మధ్యే నియంత్రించబద్దులై ఉన్నారు [మత్తయి.19:4-6; 1తిమోతి.3:2; తీతుకు.1:6].

వివాహము తరువాత విడాకులువ్వటమన్నది బైబిలు దేవునికి అసహ్యమైన కార్యము [మలాకి.2:15-16]. ఒకవేళ విడాకులివ్వాల్సి వస్తే అది కేవలం వ్యభిచార కారణాన్ని బట్టే అన్నది అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన బైబిలు దేవుని విస్పష్ట బోధ [ద్వి.కాం.24:1-4; మత్తయి.19:1-9]. యే కారణము చేతనైనను భార్యభర్తలు కలిసి సంసారము చేయలేకపోతే వారు వేరువేరుగా జీవిచవచ్చేగాని విడకులు తీసుకొని వేరే వివాహాలు చేసుకోకూడదు అన్నది బైబిల్ బోధ [1కొరింథీ.7:8-11].

ఖురాన్

వివాహ విశయములో బైబిలు బోధకు వ్యతిరేకంగా ఖురాను బోధ ఉండటం గమనార్హం. ప్రవక్తల పరంపరలోని ఏఒక్క ప్రవక్త అందించిన బోధతో ఏకీభవించకుండా ఒకే పురుషుడు నలుగురు భార్యలవరకు పెళ్ళిచేసుకోవచ్చు అంటూ ఖురాన్ బోధిస్తూ బైబిలు దేవుని పరిపూర్ణ సంకల్పానికి వ్యతిరేకమైన బోధను అందిస్తున్నది. అంతేకాకుండా, అదే ఖురాన్ ను అందించిన ఇస్లాము మతనాయకుడైన ముహమ్మద్ గారికి ఈ విశయములో ప్రత్యేకమైన రాయితిని ఏర్పరచటం అన్నది ఈసందర్భములోని మరో ఆసక్తికరమైన అంశం! [ఖురాన్ – సురాహ్ 4:3; 33:50-52]

నిజప్రవక్తల బోధకు వ్యతిరేకమైన మరొక విపరీతమైన బోధను ఖురాన్ ప్రవేశపెట్టింది. ఒక వ్యక్తి తన భార్యకు విడాకులిచ్చిన తరువాత ఆ స్త్రీ వేరొక వ్యక్తికి భార్యగా మారి ఆ రెండవ వ్యక్తి చేతకూడా విడాకులు పొందిన తరువాత మొదటి వ్యక్తి అస్త్రీని తన భార్యగా చేసుకోకూడదు. అది దేవునికి అసహ్యమైన కార్యము [ద్వి.కాం.24:1-4 & యిర్మీయ.3:1-2]. మొదటి వ్యక్తి విడాకులిచ్చిన తరువాత ఆ స్త్రీ వేరొక వ్యక్తిని పెళ్ళాడకముందే ఆమెను ఆమె భర్త తిరిగి పెళ్ళాడవచ్చు. దీనికి పూర్తిగా వ్యతిరేకమైన దిశలో, ఒకవ్యక్తి విడాకులు యిచ్చిన తరువాత ఆ వ్యక్తికి భార్యగా ఉండిన స్త్రీ అదే వ్యక్తికి భార్య కావాలంటే ఆమె తప్పకుండా మరొక వ్యక్తికి భార్యగా జీవించి అతనితో విడాకులు పొందిన తరువాతే మొదటివ్యక్తికి భార్య అయ్యే అర్హత పొందుతుంది. ఇది ఖురాన్ బోధ [సూరాహ్.2:229-230].

విడాకుల విశయములో ఖురాన్ పూర్తి హక్కును పురుషులకిస్తున్నది. విడాకులిచ్చే అవకాశాన్ని పురుషులకిస్తూ అందుకుగల కారణాలను మాత్రం నిర్దేశించటం లేదు. అంటే, భర్త ఏకారణము చేతనైనను తన భార్యకు విడాకులు యివాలనుకుంటే యివ్వవచ్చు. ఎలాంటి నియంత్రణ లేక కారణాన్ని భర్తకు ఖురాను సూచించటము లేదు అన్నది గమనార్హం. ఈ రకమైన అసమాన విలువలతో కూడిన ఖురాన్ బోధలు మానవాళికి అందించబడిన అంతిమ దైవ సూక్తులు అంటూ దావా ప్రచారకులు ప్రకటించటము ఎంత సత్యదూరమైనదో విజ్ఙులైన వారికి వేరే వివరించనవసరము లేదు.

వాదప్రతివాదన

ముస్లీం: ఆల్లహ్ క్షమించుగాక నన్ను; ప్రవక్తలు ఎలాంటి తప్పు చేయరు, ఖురాన్ ప్రకారం అక్రమ సంభందాలు పెట్టుకోరు.
క్రైస్తవుడు: “ప్రవక్తలు తప్పు చేయరు మరియు అక్రమ సంబంధాలు పెట్టుకోరు” అని ఖురానులో ఎక్కడుందో రెఫరెన్సు పెట్టండి…! చాలావరకు ఖురాన్ లో లేని వాటినే కదా మీరు నమ్మేది?! పైగా, అక్రమసంబంధాలను సైతం అల్లాహ్ పేరుతో సక్రమసంబంధాలుగా చిత్రీకరించటం మానవ ప్రయత్నం!  

ముస్లీం: బైబిల్ ప్రకారం వివాహాలు.
క్రైస్తవుడు: బైబిల్ ప్రకారం ఒక భర్తకు ఒక భార్య అన్నది దేవుని సంపూర్ణ చిత్తం [Perfect Will]. ఒక భర్తకు అనేక భార్యలు అన్నది కేవలం దేవుని ‘అనుమతి’ చిత్తం [Permissive Will] మాత్రమే. బైబిలు బోధలోని యిలాంటి సుక్ష్మమైన భేదాలు ఎన్నో ఉన్నాయి. అవి విశ్వాసులకైతే అర్థమవుతాయి.     

ముస్లీం:
1) సొలొమోను: భార్యలు-700; వుంచుకున్నవాళ్ళు-300; టోటల్-1000 
క్రైస్తవుడు: 
సంస్కారవంతులు ‘వుంచుకున్న వాళ్ళు ‘ అని అనరు. వారిని ఉపపత్నులు అంటారు! సొలోమోను దేవుని ఆజ్ఙకు వ్యతిరేకంగా ఆ పని చేసాడు. [ద్వితీయోపదేశకాండము 17:15-17]     

ముస్లీము:
2) యాకోబు(ఇజ్రాయెల్): భార్యలు -2; వుంచుకున్నవాళ్ళు -2; టోటల్ – 4. వీళ్ళ నుండి ఇజ్రాయెల్  12 తెగలు వచ్చాయి.
క్రైస్తవుడు: 
మీరు వ్రాసిన దానిలో మీకు తగినట్లే అసత్య పదజాలము కనిపిస్తున్నది. అల్లాహ్ యే మీకు ప్రతిఫలం యిచ్చును గాక! యాకోబుకు నలుగురు భార్యలు. వారిలో యిద్దరు దాసీలుగా ఉండి ఆయనకు భార్యలుగా చేయబడ్డారు [ఆదికాండము 30:4-9]. సరిగ్గా చదవటం రాకపోయినా లేక అసత్యమార్గములో జీవిస్తున్నా యిలాగే ఉన్నదాన్ని లేనట్లుగా లేనిదాన్ని ఉన్నట్లుగా చేసేది.   

ముస్లీం:
4) అబ్రహం:3 భార్యలు
క్రైస్తవుడు: 
అది దేవుడు తన ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు అందించక ముందు జరిగిన విశయం.   

ముస్లీం:
5) మోషే: 3 భార్యలు
క్రైస్తవుడు: 
మోషేకు భార్యలు ముగ్గురా…? ఎవరు చెప్పారు? వారి పేర్లు ఏవి…? బైబిలు ప్రకారం, మోషేకు యిద్దరు భార్యలు. బైబిలును బాగా ధ్యానించి చూస్తే మొదటి భార్య చనిపోయిన తరువాతే రెండవ భార్యను చేసుకున్నట్లు గ్రహించవచ్చు.  

ముస్లీం:
6) ఐసాక్ కుమారుడు ఐసాక్ భార్యతో (పిన్నితో) సెక్స్ చేసాడు. 
క్రైస్తవుడు: 
ప్రవక్తల గురించి వ్రాస్తున్నప్పుడు జాగ్రత్తగా సరిచూసుకోవాలి. ఐసాక్ లేక ఇస్సాకుకు ఒకే భార్య. ఆమె పేరు రిబ్కా. పిన్నితో సెక్ష్ చేసింది యాకోబు కుమారుడైన రూబేను. అందుకే అతను తన జేష్ఠ స్థానాన్ని కోల్పోయి శపించబడ్డాడు.

ముస్లీం:
7) దావీదు (దావూద్): తన సైన్యంలో పనిచేసి వాడి పెళ్ళాంతో సెక్స్ చేసాడు.  
క్రైస్తవుడు: 
అవును, అది వ్యభిచార పాపము. అందుకే దేవుడు దావీదును శిక్షించాడు. ఆ పాపాన్ని చేసిన దావీదు “యిది దేవుడే నాతో చేయించాడు” అంటూ అందరి నోర్లు దేవుని పేరట మూయించి తన పాపాన్ని సమర్ధించుకునే మాటలేవీ జబుర్ లో వ్రాయకుండా దాన్ని ఒప్పుకొని యిహలోకములోనే తగిన శిక్షను పొంది క్షమాబిక్షను అందుకున్నాడు.

ముస్లీం:
8) యూదా (యహుదా): తన కూతురితో సెక్స్ చేసాడు.
క్రైస్తవుడు: 
మీ స్వభావానికి ప్రతీకగా మీ అభియోగాలు కనిపిస్తున్నాయి. ప్రవక్తల విశయములో అసత్యాలు ప్రచురిస్తున్న మీకు అల్లాహ్ యే ప్రతిఫలమిచ్చును గాక! యూదా సెక్స్ చేసింది కూతురుతో కాదు, కోడలితో [తామారు]. ఆ సంఘటన సందర్భము: 
– ధర్మశాస్త్రానికన్నా ముందు జరిగిన సంఘటన 
– యూదా కుమారుడు అంటే తామారు యొక్క భర్త చనిపోయిన తరువాత జరిగిన సంఘటన
– యూదాకు ఆమె తన కోడలు అన్న విశయం తెలియని సమయములో జరిగిన సంఘటన
గమనించాలి, యూదా లేక ఆయన చేసిన కార్యం మానవాళికి మాదిరి కాదు అన్నది అటుంచి ఆయనగాని లేక ఆయన కార్యం కాని యూదులకు క్రైస్తవులకు మాదిరి కానేకాదు. యూదా కూడా తాను చేసిన కార్యాన్ని సమర్ధించుకుంటూ ఇది దేవుడే [అల్లాహ్] చేయించిన కార్యం అంటూ తనను తప్పుబట్టే పొరుగువారిని మభ్యపెట్టే ప్రయత్నం చేయలేదు.

ముస్లీం:
9) లుతు (లోతు): తన 2 కూతుళ్లతో సెక్స్ చేసి పిల్లల్ని కన్నాడు. 
క్రైస్తవుడు: 
జరిగిన సందర్భము…
– ధర్మశాస్త్రము యివ్వకముందు జరిగిన సంఘటన
– లోతు మత్తులో అంటే తనకు స్పృహ తెలియని సమయములో ఆయన కుమార్తెలు తొందరపడి చేసిన సంఘటన.
మరో విశయం, లోతు ప్రవక్త కాదు! ఆయన ప్రవక్త అయిన అబ్రహాము యొక్క బందువుడు. లోతుగాని లేక లోతు చేసిన కార్యం కాని లోకానికి మాదిరి కాదు. పైపెచ్చు, ఆయన చేసినదాన్ని దేవుడు సమర్ధించటం లేదు. బైబిల్ అబ్రహాము బంధువుని యింటిలో సంభవించిన పాపకార్యాన్ని బహిర్గతం చేస్తున్నది.      

ముస్లీం: అల్లాహ్ నన్ను క్షమించుగాక ఇవి క్రైస్తవులకు కనిపించట్లే. వీళ్ళను ప్రవక్తలుగా ఒప్పుకున్నా మీకు ముహమ్మద్ ప్రవక్త పెళ్లి అడ్డొస్తుందా? 
క్రైస్తవుడు: మీరు పేర్కొన్న వారిలో కొందరు అసలు ప్రవక్తలే కాదు. ప్రవక్తలైనంతమాత్రాన పాపరహితులని నియమమేదీ లేదు. క్రైస్తవులకు అవి అన్నీ సంపూర్ణదైవ గ్రంథమైన బైబిలులో కనిపించాయి. అందుకే క్రైస్తవులు లోకానికి అలాంటివారు మాదిరి అని లేక మార్గదర్శకులు అని వారిని వారి కార్యాలను సమర్ధించుకుంటూ జీవించటము లేదు. అలాంటివారంతా పరిశుద్ధ దేవుని దృష్టిలో పాపులే, కాని ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే పాపరహితుడు మరియు లోకానికి మాదిరి రక్షకుడు అన్న దైవసత్యాన్ని మేము ప్రకటిస్తాము. మేము ప్రకటించే ‘మానవాళికి మాదిరి’ అన్నది ప్రవక్తలు కాదు, ప్రవక్తలు ప్రవచించి చెప్పిన ప్రభువు మరియు మెస్సయ్య అయిన యేసు [ఈసా]! అది అర్థం చేసుకోలేక వ్యర్థ ప్రేలాపనలను అసత్య అభియోగాలను చేస్తారు మీలాంటివారు.       

ముస్లీం: ముహమ్మద్ ప్రవక్త  3-5 చిన్న చిన్న పిల్లలుండి యుద్ధంలో భర్తలను పోగొట్టుకొని ఎడారిలో బ్రతకలేని విధవరాలను చేసుకొని పిల్లలకు ఆమెకు లైఫ్ ఇస్తే అబ్బో పెద్ద తప్పు. ఇది అసలు కారణం ప్రపంచంలో ఆడవారు ఎక్కువగా ఇస్లాంలో రావడానికి.  
క్రైస్తవుడు: 
ఇస్లాం ప్రవక్త ముహమ్మద్: భార్యలు – 13; ఉపపత్నులు 4. 
బ్రదర్, ముహమ్మద్ గారు తాను 50 యేండ్లున్నప్పుడు 50 ఏండ్ల విధవరాలిని [సౌదా బింత్ జామ్’ఆ] తన కుటుంభ అలనాపాలనా చూసుకోవటానికి పెళ్ళిచేసుకున్నాడు. అదే సమయములో ఆమెకు తాను సహాయం చేయగలిగాడు. అక్కడితో ఆగిపోతే బావుండేది. కాని అలా జరుగలేదు. తాను 53 యేండ్ల వయస్సులో ఉండగా 9 యేండ్ల అమ్మాయిని [అ’యీషా బింత్ అబు’బాకర్] ముహమ్మద్ గారు పెండ్లిచేసుకున్నాడు.
58 సంవత్సరాల వయస్సులో ముహమ్మద్ గారు తన దత్తత కుమారుడైన జైద్ కు భార్యగా ఉండి విడాకులు తీసుకున్న జైనాబ్ ను పెళ్ళి చేసుకున్నాడు. ఇవన్నీ ఆయన ఇష్టం!
ఈనాటి సమాజిక విలువల ఆధారంగా 7వ శతాబ్ధములోని అనాగరిక అరబ్బుల మధ్య ఆయన జివించిన విధానాన్ని బేరిజువేస్తూ విమర్శించటం సరికాదు. ఆయన నివసించిన కాలానికి, ఆయన జీవించిన ప్రాంతానికి, ఆయన ఉండిన పరిస్థితులకు, ఆయన శారీర అవసరతలకు ఆయన ప్రవర్తన ఒక సామాజిక సమస్య కాకపోయి ఉండవచ్చు. ఇప్పుడు దాన్ని పరిశీలించటం అసందర్భం.
అయితే, ఆయన అంతిమ ప్రవక్త అని, ఆయన గొప్ప విలువలున్న వ్యక్తి అని, ఆయన మాదిరి మానవాళీకే మార్గదర్శకమని ఇస్లాం మతస్తులు భావించటం వారి విజ్ఙతకే వదిలేస్తాం. వివాహ విశయములో ముహమ్మద్ గారి ప్రవర్తన ఈనాడు మీకు మాదిరిగా ఉంది అని చెప్పుకుంటే, అదీ మీ ఇష్టం! కాని, అలాంటి విపరీత ప్రవర్తనలు ఈనాడుకూడా మానవాళికే మాదిరి అంటూ మానవత్వానికి తలవంపును మాత్రం తేకండి, దయచేసి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *