పౌలు “అబద్ధ ప్రవక్త”

పౌలు “అబద్ధ ప్రవక్త”

July 7, 2021 క్రైస్తవ్యం పరిశుద్ధ గ్రంథము విశ్వాసాలు 0

యూదులలోని పరిసయ్యుల గుంపుకు చెందినవాడు సౌలు. మోషే ధర్మశాస్త్రాన్ని అవసోపనపట్టి, యూదు మతనిష్ఠకు సమర్పించుకొని, యూదుమత పునః స్థాపనకు కంకణం కట్టుకున్న వ్యక్తి సౌలు.

యూదుమతాన్ని సవాలు చేస్తున్న క్రైస్తవ్యాన్ని అడ్డుకొని తుదముట్టించాలన్న తపనతో నడుముకట్టిన సౌలుకు యేసు ప్రభువు దర్శనాన్ని అనుగ్రహించి నిజమైన సత్యంలోకి, వెలుగులోకి, మరియు నిత్యజీవంలోకి నడిపించాడు.

ఆ దర్శనం మతచాందసంత్వంతో మతమౌడ్యంతో క్రైస్తవులను చంపాలనే ద్వేశంతో రగిలిపోతున్న సౌలును పరిణామం పొందిన పౌలుగా మార్చింది. ఆ కారణంచేత మంచిని, దేవుని ప్రేమను, మరియు క్రీస్తునందలి నిత్యజీవాన్ని ప్రకటిస్తూ పరిశుద్ధమైన త్యాగజీవితం గడపటమేగాక ఆ సందేశం కోసం తన తలనే ఫణంగాపెట్టి నిజమైన హతసాక్షిగా మారాడు పౌలు.

అలాంటి మహోన్నత వ్యక్తి అపోస్తలుడైన పౌలును తప్పుబట్టుతూ సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా బోధిస్తున్న దావా ప్రచారకులు “పౌలు ఒక అబద్ద బోధకుడు/ప్రవక్త” అంటూ పౌలుపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకు కారణం, పౌలులో ఉండిన ఈ క్రింది లక్షణాలే కారణమై వుండవచ్చు…

 1. పౌలు అరబ్బు జాతీయులమధ్య కాకుండా ఇశ్రాయేలు వంశములో పుట్టడం
 2. పౌలు పూర్వ గ్రంథాలను ఉటంకిస్తూ వ్రాసే సామర్థ్యం లేని పామరుడుగా ఉండక తోరా [తవ్రాత్] మరియు కీర్తనలు [జబూర్] వంటి దైవగ్రంథాలను ధ్యానించిన పండితుడు కావటం
 3. అందరికి ప్రేమను పంచుతూ మంచితో చెడును జయించమని పౌలు బోధించటం
 4. దమస్కులో పౌలు తనకు కలిగిన దర్శనములో తాను చూసింది దయ్యమేమోనని అనుమానంతో భయపడకపోవటం
 5. పౌలు అప్పుడప్పుడు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటూ ఉండకపోవటం
 6. విగ్రహారాధికుల కుటుంభములో పుట్టి 360 విగ్రహాల ఆరాధనలో పాల్గొని ముష్కరుల ఆచారాలలో తలమునకలైన జీవితాన్ని జీవించకుండా, పౌలు నిజదేవుని ఎరిగిన ఇశ్రాయేలు కుటుంభములో జన్మించి నిజదేవుని ఆరాధనలో పెరగుతూ విగ్రహాలకు దూరంగా ఉండటం
 7. పౌలు యుద్దంలో లొంగిపోయిన వారిని నికృష్ఠునిగా తలలు నరికించకపోవటం
 8. పౌలు ముఠా నాయకునిగా మారి దారిదోపిడీలకు కారవాను దోపిడీలకు పాల్పడకపోవటం
 9. పౌలు తనను అవమానపరచినవారిని తనవారిచేత హత్య చేయించకపోవటం
 10. పౌలు దేవుని పేరు చెప్పి మొదట తన పెంపుడు కొడుకుచేత అతని భార్యకు విడాకులిప్పింపజేసి ఆ తరువాత దేవుని పేరు చెప్పుకుంటూ ఆ విడనాడబడిన స్త్రీని పెండ్లిచేసుకోవటమన్న నీచమైన పనికి ఒడిగట్టకపోవటం
 11. పౌలు దేవుని పేరు చెప్పుకొంటూ 50 యేళ్ళ ప్రాయంలో 6 యేండ్ల పసిపిల్లను పెండ్లిచేసుకోకపోవటం
 12. ఇతరులకేమో నలుగురుకంటే ఎక్కువమంది భార్యలను పెండ్లిచేసుకోకూడదు అని బోధిస్తూ తనకు మాత్రం ఈ విశయములో ప్రత్యేక రాయితీ దేవుడిచ్చాడు అంటూ ఓ డజను భార్యలను పౌలు కట్టుకోకపోవటం
 13. పౌలు వ్యాధులకు విరుగుడుగా ఒంటె మూత్రాన్ని సూచించకుండా ద్రాక్షారసాన్ని సూచించటం
 14. పౌలు దయ్యాల ప్రభావాన్ని బట్టి తాను చేయనివి చేసినట్లు అలాగే దేవుడు చెప్పనివాటిని చెప్పినట్లు భ్రమపడే స్థితిలో జీవించకుండా యితరులను పట్టిపీడిస్తున్న దయ్యాలను సహితం యేసుక్రీస్తు నామములో వెళ్ళగొట్టగలిగిన సామర్థ్యం ఉండటం
 15. మీకేమి జరుగుతుందో నాకేమి జరుగుతుందో నాకు తెలియదు అంటూ చెప్పకుండా పౌలు తన పేరు జీవగ్రంథములో వ్రాయబడి ఉందని చెప్పి తాను దేహాన్ని విడిస్తే ప్రభువుతో ఉంటాను అన్న నిరీక్షణ నాకుందని ఖచ్చితంగా చెప్పటం
 16. తనకు దర్శనమిచ్చిన యేసు ప్రభువు బోధలను ఇతరులకు ప్రకటిస్తూ తాను పాటిస్తూ పరిశుద్ధ జీవితం జీవించటం
 17. పౌలు యేసే క్రీస్తు అని ప్రకటిస్తూ దేవున్ని తండ్రిగా యేసును ఆయన కుమారునిగా పరిచయం చేస్తూ యేసు అందరికి ప్రభువు ఆయన బలియాగముద్వారానే మానవాళికి పాపక్షమాపణ అంటూ యేసును మహిమపరచటం
 18. ప్రేమా మరియు పరిశుద్ధ జీవితాన్ని గూర్చిన సందేశాన్ని బోధిస్తూ ఆ ప్రయత్నములో తన ప్రాణాన్నే ఫణంగా పెట్టడం
 19. నిషిద్ధ మాసాలు గడిచిపోగానే ముష్రిక్కులను [విగ్రహారాధికులను] ఎక్కడ కనబడితే అక్కడే చంపండి అంటూ రక్తపాతానికి నాంది పలుకకుండా, “మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను, ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక” అంటూ పౌలు నిజమైన హితబోధ చేయటం
 20. పౌలు ఒక నల్ల రాయిని ముద్దుపెట్టుకొని దానికి స్థావరంగా ఉన్న గుడివైపు రోజుకు ఐదుసార్లు సాగిలపడి ఆరాధించండి అంటూ విగ్రహారాధికుల ఆచారాన్ని ఏకదేవతోపాసనగా యేమార్చి ప్రవేశపెట్టకుండా నిజదేవునిలోని వాక్కుగా ఉండి శరీరాన్ని ధరించి వచ్చిన యేసుద్వారా దేవున్ని ఆరాధించండి అంటూ బోధించటం

అపోస్తలుడైన పౌలులో పై లక్షణాలు గనుక లేకపోయింటే దావా ప్రచారకుల ‘తర్కం’ ప్రకారం ఆయన ప్రపంచానికే మాదిరిగా వచ్చిన “అంతిమ దైవప్రవక్త” స్థానం అలంకరించేవాడు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *