అవధులులేని కౄరత్వం!

అవధులులేని కౄరత్వం!

July 7, 2021 ఇస్లాం ఖుర్'ఆన్ గ్రంథం ఖుర్'ఆన్ దేవుడు విశ్వాసాలు 0

అల్లాహ్ యొక్క అధర్మ ప్రణాళిక

I. అల్లాహ్ తానే విధిరాత రాసి మనుషులను సృష్టిస్తాడట! [సురాహ్ 9:51 & 37:96; సహీ బుఖారి (4:54:430); (2:23:444); (6:60:473); (9:93:641) & సహీ ముస్లీము (33:6436); (33:6406)]

  • అల్లాహ్ మాకు రాసిపెట్టింది తప్ప మరొకటి మాకు జరుగదు.ఆయనే మా సంరక్షకుడు. విశ్వాసులైనవారు అల్లాహ్ నే నమ్ముకోవాలి” అని (ఓ ప్రవక్తా) వారికి చెప్పు” (సురాహ్ 9:51).
  • “మరి (చూడబోతే) మిమ్మల్నీ, మీరు చేసిన వాటినీ సృష్టించినవాడు అల్లాహ్‌యేకదా!” (సురాహ్ 37:96)”

II. ఆ అల్లాహ్ నే మనుషులను సన్మార్గములో నడవమంటూ అదేశిస్తాడట!! [సురాహ్ 5:93; 32:19]

  • “విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు (ఇంతకు మునుపు) తిన్నదానికి, తాగినదానికి వారిపై ఎటువంటి పాపం ఉండదు. కాకపోతే వారు ఇక మీదట భయభక్తులతో మెలగాలి, విశ్వసించి మంచిపనులు చెయ్యాలి. మళ్లీ భయభక్తుల వైఖరిని అవలం బించాలి, విశ్వసించాలి. మళ్ళీ అల్లాహ్‌కు భయపడుతూ సద్వర్తనులుగా మసలుకోవాలి. ఇటువంటి సద్వర్తనులనే అల్లాహ్‌ ప్రేమిస్తాడు.” (సురాహ్ 5:93)
  • “ఎవరు విశ్వసించి,సత్కార్యాలుకూడాచేశారో వారుచేసు కున్న కర్మలకుబదులుగా వారికిశాశ్వతమైనస్వర్గనివాసం ఆతిథ్యంగా లభిస్తుంది.” (సురాహ్ 32:19)

III. ఆ అల్లాహ్ నే వారిని దారి తప్పిస్తాడట, పాపం చేయిస్తాడట!!! [సూరాహ్ 14:4; 42:44,46]

  • “మేము ఏ  ప్రవక్తను పంపినా, అతడు విషయాన్ని  స్పష్టంగా విడమరచి చెప్పడానికి  వీలుగా తన జాతి వారి భాషలో మాట్లాడే వానిగా చేసి పంపాము. ఆపైన అల్లాహ్‌  తాను  కోరినవారిని అపమార్గం పట్టిస్తాడు, తాను కోరిన వారికి సన్మార్గం చూపిస్తాడు.ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు.” (సూరాహ్ 14:4)
  • అల్లాహ్ ఎవరినయినా దారితప్పిస్తే, ఇక ఆ తరువాత అతన్ని ఆదుకునే వాడెవడూ ఉండడు. మరి నువ్వే చూద్దువు గాని, దుర్మార్గులు శిక్షను చూచినపుడు, “మేము తిరిగి వెళ్ళే మార్గం ఏదైనా ఉందా?!” అని అంటూ   ఉంటారు.” (సూరాహ్ 42:44)

IV. ఆ అల్లాహ్ తానే రాసిపెట్టిన కార్యాలను చేసిన వారిని వాటిని చేసినందుకు నాశనం చేస్తాడట!!!! [సూరాహ్ 17:16]

  • “మేము ఏదైనా ఒక పట్టణాన్ని నాశనం చెయ్యాలని సంకల్పిం చుకున్నప్పుడు,అక్కడి స్థితిమంతులకు (కొన్ని)  ఆజ్ఞలు జారీ చేస్తాము. కాని వారేమో అందులో అవిధేయతకు పాల్పడతారు. ఆ విధంగా వారిపై (శిక్షకు సంబంధించిన) మాట నిరూపితమవుతుంది. ఆపై మేము ఆ పట్టణాన్ని సర్వనాశనం చేసేస్తాము.” (సూరాహ్ 17:16) 

v. ఇంతా చేసి, ఆ అల్లాహ్ తాను అపారకృపామయున్ని అంటూ సూక్తులుకూడా చెపుతాడట!!!!! [సూరాహ్ 39:53]

  • “నిశ్చయంగా అల్లాహ్‌ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించే వాడు, అపారంగా కరుణించేవాడు.” [సూరాహ్ 39:53]

అత్యంత దుష్టత్వంతో అన్యాయంతో కూడిన పై ప్రణాళిక పరిశుద్ధుడు, న్యాయవర్తనుడు, మరియు అపార కృపాకనికరాలు గల నిజదేవుడు విరచించే ప్రణాళిక ఎంతమాత్రము కాదు.

పై ప్రణాళికను ఉద్దేశించే ‘దేవుడు’ నిజదేవుడుకాదు, కాజాలడు. అలాంటి స్వభావం మానవుని ఊహలలో పుట్టిన దేవునికే చెల్లుతుంది. అనాగరిక అరబ్బులను భయపెట్టేందుకు ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ తన ఊహా పటిమకు కవితా చాతుర్యాన్ని జోడించి పుట్టించిన ఖురానులోని అల్లాహ్ కు మాత్రమే ఆ ప్రణాళిక చెల్లుతుంది. ఈ అవధులులేని అతర్కం, అధర్మం, మరియు కౄరత్వం దేవునికి బద్దశత్రువైన సాతానునికే సరిపోతాయని వేరే చెప్పనవసరం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *