అబద్ధ ప్రవక్తలు

అబద్ధ ప్రవక్తలు

November 3, 2021 Uncategorized 0

“అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.” (మత్తయి.7:15)

“అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు;” (మత్తయి.24:11)

ఈలోకంలో దేవుని మార్గం వైపు నడిపించే సత్యప్రవక్తలే కాకుండా మోసంచేస్తూ భ్రష్టమార్గంలోకి నడిపించే అబద్ధప్రవక్తలుకూడా ఉన్నట్లు సంపూర్ణదైవగ్రంథమైన బైబిలు బోదిస్తున్నది.

అబద్ధ ప్రవక్తలను గుర్తించి వారి బోధలలోనుండి, ప్రభావంలోనుండి తమను తాము కాపాడుకోవటం నిజమైన విశ్వాసుల కర్తవ్యం! మరి, అబద్ధ ప్రవక్తలను గుర్తించటం ఎలా…?!

అమాయకులను మోసం చేసే క్రమంలో అబద్ధ ప్రవక్తలు సత్యప్రవక్తల బోధలతో సరితూగగల కొన్ని బోధలను ఉపయోగించటం సహజమైన విషయం. అయితే, ప్రవక్తగా తననుతాను ప్రకటించుకున్న వ్యక్తి లేక యితరులచేత ప్రవక్తగా పరిచయం చేయబడిన వ్యక్తి యొక్క సందేశం సత్యప్రవక్తలద్వారా యివ్వబడిన క్రింది దైవసందేశాలలో ఏఒక్కదానితో వ్యతిరేకించినా ఆ వ్యక్తి అబద్ధ ప్రవక్త అన్నది తేటతెల్లమవుతుంది.

సత్యప్రవక్తలద్వారా అందించబడిన దైవసందేశాలు:

  1. సృష్టికర్త
    (అ) దేవుడు అద్వితీయుడు. అంటే ఆయనకు సాటిగా, పోటిగా, ధీటుగా వేరొక దేవుడు లేడు. [ద్వి.కాం.6:4; యెషయా.40:25-26, 44:8, 46:9]
    (ఆ) దేవుడు అందరిని సృష్టించిన తండ్రి. అంటే సృష్టికర్త పరలోకమందున్న తండ్రి.
    (ఇ) దేవుడు పరిశుద్ధుడు, న్యావర్తనుడు, మరియు ప్రేమాస్వరూపి
    (ఈ) దేవుడు తాను సృష్టించిన విశ్వంలోకి ప్రవేశించి సృష్టి వీక్షించగల విధానంలో తననుతాను సృష్టికి ప్రత్యక్షం చేసుకోగల స్వాతంత్రం, సామర్థ్యం, మరియు సార్వభౌమత్వం ఉన్నవాడు
  2. మానవులు
    (అ) దేవుడు స్త్రీపురుషు లిద్దరిని ఒకే ఉద్దేశంతో, విలువతో సృష్టించాడు
    (ఆ) దేవుడు ప్రవక్తలను, యాజకులను, మరియు రాజులను నియమించాడు
    (ఇ) దేవుని దృష్టిలో మానవులందరు పాపులుగా మారారు
  3. వివాహం
    (అ) వివాహం ఒక పురుషునితో ఒక స్త్రీకి మధ్య
    (ఆ) విడాకులు దేవునికి అయిష్టం.
  4. మోక్షం
    (అ) దేవుని యెదుట బలుల ద్వారానే అంటే రక్తం చిందించట ద్వారానే పాపులైన మానవులకు క్షమాపణ లభిస్తుంది
    (ఆ) దేవుడే మానవుల విమోచనా క్రయధనాన్ని చెల్లించాడు.
    (ఇ) రక్షించబడినవారు దేవుని మహిమలో ప్రవేశింతురు (కీర్తన.73:24); వారు ప్రకాశమానముతో వెలుగుతూ నిత్యజీవమును అనుభవింతురు (దానియేలు.12?:1-3); వారు వివాహములోని లైంగికపరమైన సుఖాలకు అతీతమైన దేవదూతల స్థితిని పొందుదురు (మార్కు.12:24-25).
    (ఈ) పరలోకములో ఆకలి, దప్పిక, దుఖం వంటి ఐహిక అనుభూతులు ఉండవు ().
    (ఉ) పరలోకం దేవుని సన్నిధి మరియు దర్శనం అనుభవించే స్థలం ().
  5. ప్రవర్తన
    (అ) పొరుగువారిపట్ల:
    “నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.” (ని.కాం.20:16)
    “నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు…” (ని.కాం.20:17)
    “కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.” (లే.కాం.19:18)
    “మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు, మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింప వలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.” (లే.కాం.19:33-34)
    “నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను…” (మత్తయి.19:19)
    “ధర్మశాస్త్ర మంతయు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమైయున్నది.” (గలతి.5:14)
    “నీవలె నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యీ ఆజ్ఞను మీరు నెరవేర్చినయెడల బాగుగనే ప్రవర్తించువారగుదురు.” (యాకోబు.2:8)
    (ఆ) శత్రువుపట్ల:
    “నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము.” (సామెతలు.25:21)
    “…మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.” (మత్తయి.5:44)
    “నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము.” (రోమా.12:20-21)