ముహమ్మద్ Vs. ఈసా
ప్రపంచంలోనే అతి పెద్ద మాతాలు క్రైస్తవ్యం మరియు ఇస్లాం. మొదటిస్థానంలో ఉన్న క్రైస్తవ్యం ప్రభువైన యేసుక్రీస్తుద్వారా స్థాపించబడి ఆయననే మాదిరిగా కలిగి విస్తరిస్తున్నది. రెండవస్థానంలోని ఇస్లాం ముస్లీం ప్రవక్త ముహమ్మద్ ద్వారా స్థాపించబడి ఆయననే మాదిరిగా కలిగి విస్తరిస్తున్నది. ఈ రెండు మతాలలో అనేక వైవిధ్యాలుండటమేగాక వాటి స్థాపకుల మధ్య కూడా అనేక భేదాలున్నాయి. ఆ భేదాలే రెండు మతాలను/మార్గాలను విభజించటమేగాక రెండింటి గమ్యాలుకూడా వేరువేరు అన్న సత్యాన్ని నిర్దేశిస్థున్నాయి. ఆ భేదాలలోని కొన్ని క్రింద యివ్వబడినవి.
1. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అరబ్బు వంశస్థుడు
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు ఇశ్రాయేలు వంశస్థుడు
2. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ పుట్టుక మరియు మరణాలు సాధారణమైనవే. వాటిలో ఎలాంటి అద్భుతం చోటుచేసుకోలేదు.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు పుట్టుక మరియు మరణము రెండింటిలోను దేవుని అద్భుత కార్యం చోటుచేసుకుంది. తద్వారా దైవప్రవక్తలందరిలోనూ అత్యంత విశిష్టమైనవ్యక్తిగా గొప్పవానిగా నిరూపించబడ్డాడు.
3. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అరబ్బు దేశములో అరబ్బులమధ్య అరబ్బులను హెచ్చరిస్తు వచ్చిన ఇస్లాము మతప్రవక్త.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు ఇశ్రాయేలీయుల దేశములో, ఇశ్రాయేలీయుల మధ్య, ఇశ్రాయేలీయులకు దేవుని రాజ్యసువార్తను ప్రకటిస్తూ వారికి ప్రవక్తగా లోకానికి రక్షకునిగా వచ్చిన అల్-మసీహి [మెస్సయ్య].
4. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ జిన్నులచేత [దురాత్మలచేత] పీడించబడిన సందర్భాలున్నాయి.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు దురాత్మలను [జున్నులను] శాసించాడు మరియు అణగద్రొక్కాడు. అంతేగాక, తన అనుచరులకు దురాత్మలపై అధికారాన్ని అనుగ్రహించాడు [లూకా.4:31-37, 7:21; 10:17-20]
5. ముహమ్మద్ బిల్ అబ్దుల్లాహ్ తనకు కలిగిన దర్శనము/పిలుపు విశయములో సందేహించిన సందర్భాలున్నాయి.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు తాను ఈ లోకములో నిర్వర్తించాల్సిన విధి/పిలుపు/దర్శనము విశయములో ఎలాంటి సందేహాలు లేని వాడు.
6. ఖురాను ప్రకారం ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ చేసిన అద్భుతం ఖురాను గ్రంథాన్ని తీసుకురావటమే.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు పండితులు పామరులు అన్న తేడా లేకుండా అందరు చూసి అనుభవించి గ్రహించగలిగిన అద్భుతాలు ఎన్నో చేశాడు!
7. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ దైవ ప్రవక్త అని ఆయనే తెచ్చిన గ్రంథం ఖుర్’ఆన్ ప్రకటిస్తున్నది.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు దేవుని చేత మానవాళి మోక్షము కొరకు పంపబడిన ప్రత్యేకమైన లోకరక్షకుడు అన్న సత్యం సమకాలీన ప్రవక్త అయిన బాప్తీస్మమిచ్చు యోహాను ప్రకటించాడు.
8. సమాజము ఎదుట ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ తరుపున సాక్ష్యం ఆయన భార్య ఖదీజ యిచ్చింది.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుని తరపున సమాజము ఎదుట దేవుడే తన స్వరాన్ని వినిపింపచేస్తూ సాక్ష్య మిచ్చాడు.
9. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ ద్వారా యివ్వబడిన సుస్పష్టమైన ప్రవచనాలేవీ ఖురానులో లేవు.
ఈసా [యేసు] కన్య మరియ కుమారుని ద్వారా యివ్వబడిన సుస్పష్టమైన ప్రవచనాలు అనేకం బైబిలులో [ఇంజీల్] లో ఉన్నాయి. అవి చరిత్రలో నిరూపించబడ్డాయి.
10. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ తనకు సంభవించబోతున్న మరణము గురించి ముందే తెలియదు.
ఈసాకు [యేసు] కన్యమరియ కుమారుడు తనకు సంభవించబోతున్న మరణము గురించి, సంభవించబోతున్న ఆ మరణము యొక్క విధానము గురించి, అలాగే మరణము తరువాతి సంభవాలను గురించికూడా ముందే తెలుసు.
11. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ 622 క్రీ.శ. లో మరణించాడు.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు 30 క్రీ.శ. మరణించి తిరిగి సజీవుడై ఇప్పటికీ అమరుడై జీవిస్తున్నాడు! [లూకా.24:1-10; ప్రకటన.1:17-18]
12. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ తన బోధలద్వారా మాదిరిద్వారా మానవులు జీవించాల్సిన కొన్ని మంచి మార్గాలనుగురించి తెలియచేసాడు.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు తన బోధలద్వారా మాదిరిద్వారా మానవులు జీవించాల్సిన మంచి మార్గాలనుగురించి తెలియచేయటమేగాక ఆ విధానంలో జీవించే నూతన జీవితాన్ని శక్తిని అందిస్తాడు.
13. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ ఒక నల్లరాయిని ముద్దుపెట్టుకొని దానికి తాను ప్రారంభించిన మతములో ఒక ప్రత్యేకస్థానాన్ని యివ్వటముద్వారా అనేకులను ఆ రాయిని భక్తిభావాలతో ముద్దుపెట్టుకునే సాంప్రదాయములోకి మార్చాడు.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు అలాంటి రాళ్ళకు చూపే భక్తితోకూడిన సాంప్రదాయాలేవీ ప్రవేశపెట్టలేదు.
14. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ తన మరణము తరువాత తనకు తనను వెంబడించే వారికి ఏమి సంభవిస్తుందోనన్నది తెలియదు అని ఒప్పుకున్నాడు. [సురాహ్ 46:9; సాహిహ్ అల్-బుఖారీ, వాల్యూమ్ 5, పుస్తకం 58, సంఖ్య 266]
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు తాను అలాగే తనను వెంబడించే వారు వెళ్ళే స్థలం మరియు ఉండే స్థలం ఎరిగినవాడు మాత్రమేగాక వాటిగురించి తనను వెంబడించే వారికి ముందే వివరించాడు. [లూకా.10:20; యోహాను.14:1-3]
15. ఖురాను ప్రకారం, ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ వకీలు కాదు.
బైబిలు ప్రకారం, ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు వకీలు/ఉత్తరవాది! [1యోహాను.2:1-2]
16. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ మరియు ఆయన అనుచరులు [సహాబ] యుద్దాలు చేసిన వారు మరియు ఇతరుల ప్రాణాలను తీసినవారు.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు మరియు ఆయన శిష్యులు యుద్దాలు చేయలేదు మరియు ఎవరి ప్రాణాలు తీయలేదు. అంతేగాక, చనిపోయినవారిని బ్రతికించారు అలాగే యితరులకొరకు సత్య ప్రకటనకొరకు తమ ప్రాణాలను పెట్టారు.
17. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ “శత్రువులను సంహరించాలి” అంటూ బోధించాడు, చూపించాడు.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు “శత్రువులను ప్రేమించాలి మరియు వారికొరకు ప్రార్థించాలి” అంటూ బోధించాడు చూపించాడు. [మత్తయి.5:43-48; లూకా.23:34]
18. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ దేవున్ని చూడలేదు.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు దేవున్ని/తండ్రిని చూసినవాడు. [యోహాను.6:46]
19. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బానిసలను కొన్నాడు, అమ్మాడు, మరియు కొందరు బానిసలను కలిగి జీవించాడు. [సహిహ్ బుఖారి, వాల్యూం 8, బుక్ 73, సంఖ్య 182; సహిహ్ ముస్లీం, బుక్ 10, సంఖ్య 3901]
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు బానిసలను కొనలేదు, అమ్మలేదు, లేక బానిసలను కలిగి జీవించలేదు
20. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ తన పాపాల విశయములో అల్లాహ్ [దేవుడు] నుండి క్షమాపణను వేడుకుంటూ ప్రార్థించాడు.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు పాపరహితుడు మాత్రమేగాక పాపుల క్షమాపణ కొరకు తననుతాను బల్యర్పణ చేసుకొని పాపులకు క్షమాబిక్ష అనుగ్రహిస్తున్నాడు.
21. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ దేవునితో ఒక కుమారునికి ఉండే అన్యోన్యతను, అనుబంధాన్ని మరియు అనుభూతిని పొందలేదు. అంతేగాక, ఆయన దేవున్ని “తండ్రి” అంటూ సంబోధించలేకపోయాడు.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు లోకములోనికి రాకముందే దేవుని యొక్క స్వంత కుమారునిగా ఉండటమేగాక దేవుని యొక్క అద్వితీయ కుమారునిగా ఉనికిని కలిగి ఉన్నవాడు. అందుకే, ఆయన దేవుడు నా తండ్రి అని ప్రకటించగలిగాడు, అంతేగాక దేవున్ని “తండ్రీ” అంటూ సంబోధించగలిగాడు. ఆ కారణాన్ని బట్టి ఆయనద్వారా దేవున్ని సమీపించేవారందరికి సృష్టికర్తను “పరలోకమందున్న మా తండ్రి” అంటూ సంబోధించే ఆధిక్యతను అనుబంధాన్ని అన్యోన్యతను దత్తపుత్రాత్మద్వారా అనుగ్రహిస్తున్నాడు! [మత్తయి.6:9; యోహాను.1:12; 5:17-18; 17:1]
22. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ తాను ఏపాపికి దేవుని తరపున క్షమాపణను అందించలేదు.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు పాపులకు దైవక్షమాపణను అందించాడు. ఆయన పాపులకు దైవక్షమాపణను అందిస్తూ అందుకు తనకున్న స్థాయి అంధికారాలను నిరూపిస్తూ ఆ సందర్భాలలో సూచక క్రియలనుకూడా చేసాడు [మత్తయి.9:2; లూకా.7:48]
23. ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ తనకు ముందు అల్లాహ్ [దేవుడు] గ్రంథాలను అంటే, తవ్రాత్, జబూర్, మరియు ఇంజీల్ లను అవతరింపచేసాడు అన్నది ఒప్పుకున్నాడేగాని వాటి నెరవేర్పు స్థిరత్వాలను నొక్కి వక్కాణించలేకపోయాడు.
ఈసా [యేసు] కన్యమరియ కుమారుడు తవ్రాత్ మరియు ప్రవక్తల గ్రంథాలు నెరవేర్చబడుతాయి అన్న సత్యాన్ని ప్రకటించటమేగాక వాటిలో ఒక పొల్లయినను లేక సున్న అయినను తప్పిపోదు అంటూ తిరుగులేని దైవసత్యాన్ని నొక్కి చెప్పగలిగాడు [మత్తయి.5:17-19]
అల్-మసీహి ఇస్లాం ఈసా ఖురాను తెలుగుఇస్లాం ప్రవక్త. ప్రవక్తలు బైబిలు ముహమ్మదు యేసు యోహాను లోకరక్షకుడు వకీలు