మసీహ్ మొదటి ఆగమనానికి గల కారణాలు
ఈసా అల్-మసీహ్ దేవుని యొద్దనుండి [అల్లాహ్ యొద్దనుండి] ఈ లోకములోనికి రెండు పర్యాయాలు రావలసి ఉన్నది. అందులో మొదటిది 2000 సంవత్సరాల క్రితమే జరిగి పోయింది. అదే ఆయన మొదటి ఆగమనము. ఆ మొదటి ఆగమనానికి గల ముఖ్య కారణాలు ఇంజీలు గ్రంథములో పేర్కొనబడ్డాయి. అందులో కొన్ని క్రింద యివ్వబడినవి:
(1) ధర్మశాస్త్రము క్రింద వున్న వారిని విడిపించుటకు (గలతీ.4:4-5) ?
(2) మన పాపములకు ప్రాయశ్చిత్తముగా వుండుటకు (మార్కు.10:45; 1యోహాను.4:10) ?
(3) లోకమును/పాపులను రక్షించటకు (లూకా.19:5; యోహాను.3:17; 1తిమోతి.1:15; 1యోహాను.4:14) ?
(4) భూమిమీద అగ్నివేయుటకు (లూకా.12:49)
(5) తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు (యోహాను.6:38; హెబ్రీ.10:7) ?
(6) సమృద్ధి అయిన జీవము కలుగుటకు (యోహాను.10:10)
(7) లోకమునకు వెలుగుగా వుండుటకు (యోహాను.12:46)
(8) అపవాది క్రియలను లయపరచుటకు (హీబ్రూ.2:14; 1యోహాను.3:8)
(9) సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు (యోహాను.18:37)
(10) దేవుని రాజ్యసువార్త ప్రకటించుటకు (యోహాను.4:42)
(11) ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల వచనములను నెరవేర్చుటకు (మత్తయి.5:17) ?
(12) మారుమనస్సు పొందవలెనని పాపులను పిలుచుటకు (మార్కు.2:17)
(13) ఘోర మరణాన్ని పొందుటకు (యోహాను.12:24-27) ?
(14) సత్యవంతుని ఎరుగుటకు కావలసిన వివేకమనుగ్రహించుటకు (1యోహాను.5:20)
(15) మాదిరిగా వుండుటకు (ఫిలిప్పీ.2:5; హెబ్రీ.12:1-2; 1పేతురు.2:21) ?