ఒక ముస్లీం కొచ్చిన క్లిష్ట సందేహం!

ఒక ముస్లీం కొచ్చిన క్లిష్ట సందేహం!

June 18, 2019 ఖుర్'ఆన్ గ్రంథం ఖుర్'ఆన్ దేవుడు ప్రశ్నలు 6

ఇస్లాము విశ్వాసములో ఉండి తర్కబద్దంగా అలోచించగలిగే ఏ వ్యక్తికైనా రావలసిన కొన్ని క్లిష్ట సందేహాలున్నాయి. అందులో ఒకటి దేవుని సంపూర్ణ నిర్ణయానికి మరియు మానవుల స్వేచ్చకు సంబంధించినది.

కొంతకాలం క్రితం ఒక ఇస్లాము ఫోరంకు చెందిన వెబ్ సైటులో ఒక ముస్లీము అడిగిన ప్రశ్నను చదివాను. నిజానికి అది తర్కబద్దంగా యదార్థహృదయంతో అలోచించగలిగే ప్రతి ముస్లీమును ఎంతో కలతపెట్టే క్లిష్ట సందేహం. ఆ వెబ్ సైటులో పాఠకుల స్పందన భాగంలో ఆవేశపూరితసలహాలు మరియు  గుడ్డివిశ్వాసంతోకూడిన ప్రకటనలు తప్ప ఆ ప్రశ్నకు అర్థవంతమైన జవాబుగాని లేక తర్కబద్దమైన వివరణగాని ఇచ్చే ప్రయత్నం ముస్లీములెవరు చేయలేదు.

యదార్థంగా చెప్పాలంటే తమ తోటి ముస్లీముకు వచ్చిన ఆ సందేహానికి ముస్లీములు జవాబు చెప్పలేకపోవడానికి కారణం వారికి వివరించే చెప్పే సత్తా లేక కాదు, కాని ఆ ప్రశ్నకు జవాబు చెప్పడమన్నది ఇస్లామీయ ధర్మం సత్యమని భావించే ఎవరివల్లా కాని పని. ఇస్లాము ధర్మములో ఆ ముస్లీము వ్యక్తపరచిన సందేహానికి సమాధానము లేదు!

అయినా, ఈ ప్రశ్న కేవలము ఇస్లాము ధర్మాన్ని అనుసరించేవారికి మాత్రమే వర్తిస్తుందని అపోహపడకూడదు. ఇది ఆస్తిక వర్గానికి చెందిన అన్ని విశ్వాసాలకు వర్తించే ప్రశ్న. ఈ క్రింద యివ్వబడిందే ఆ ప్రశ్న:  

“ప్రస్తుతం నా అలోచనాసరళి గందరగోళంగా వుంది. ఒక వ్యక్తిని సృష్టించకముందే ఆ వ్యక్తి తన మరణానంతరం జన్నతుకు వెళ్ళబోతున్నాడా లేక నరకానికి వెళ్ళబోతున్నాడా అన్నది నిస్సంకోచంగా అన్నీ తెలిసిన (اَلْعَلِيْمُ/Al-Alim = All Knowing) అల్లాహ్ కు ముందే తెలుసి వుండాలి. అల్లాహ్ (الله‎/Allah) కు పైన వెరెవ్వరూ లేరు గనుక ఈ జ్ఙానం తనలోనుండే ఉద్భవించి ఉండాలి. అంటే, అలా జరగాలన్న నిర్ణయం అల్లాహ్ తానే చేసి వుండాలి. అయితే, అలాంటిది అల్లాహ్ కు వున్న రెండు నామాలతో పొసగలేదు: అనంత కరుణామయుడు (الرَّحِيمُ/Ar-Raheem = The Most Merciful) మరియు అత్యంత న్యాయవంతుడు (الْعَدْلُ/Al-Adil = The Most Fair/Just).

“ఒకవేళ ఒక ఫలాని వ్యక్తి సృష్టించబడితే ఆ వ్యక్తి తన మరణానంతరము నరకంలో నిత్యయాతనను అనుభవించబోతున్నాడు అన్న వాస్తవం అల్లాహ్ కు ముందే తెలిసి కూడా ఆవ్యక్తిని అల్లాహ్ సృష్టిస్తే ఇక అల్లాహ్ అనంత కరుణామయుడు ఎలా అవుతాడు…?

“ఒక అబ్దుల్లా విధిని నిత్యనరకంలో యాతనను అనుభవించాలని, ఒక అహ్మద్ విధిని జన్నతులో నిత్యసంతోషాలతో సుఖించాలని అల్లాహ్ *నిర్ణయిస్తున్నట్లయితే అల్లాహ్ అత్యంత న్యాయవంతుడెలా అవుతాడు…?

“అవును మనకు నిర్ణయస్వేచ్ఛ (freewill) వుంది. కాని, అల్లాహ్ అన్నీ ముందే నిర్ణయించాడు కాబట్టి మన స్వేచ్ఛనుకూడా ఆయనే నియంత్రించడములేదని ఏలా చెప్పగలము…?

“ఈ ప్రశ్న నన్ను తీవ్రమైన మనస్థాపానికి మరియు కలతకు గురిచేస్తూ నా విశ్వాసానికే తీవ్రమైన ముప్పు తెచ్చిపెడుతున్నది!”    

ఒక ముస్లీముకు వచ్చిన పై క్లిష్ట సందేహానికి ముస్లీముగా మీ సమాధానమేమిటి…???

*[ఖురాను (సూరాహ్. 7:178-179; 10:99-100; 76:29-30; 81:28-29) మరియు హదీసులు (సహీ బుఖారి (4:54:430; 2:23:444; 6:60:473; 9:93:641) & సహీ ముస్లీము (33:6436; 33:6406)]

పై సందేహానికి క్రైస్తవ సమాధానాన్ని చూడాలని ఆశిస్తే క్రింది లింకును నొక్కండి:

ముస్లీము సందేహానికి క్రైస్తవ సమాధానం—>

 

6 Responses

 1. అంజి says:

  ఈ ప్రశ్నకి చివరిగా వచ్చే సమాధానం మానవ శక్తిని మించిన మానవాతీత శక్తి ఏదీ లేదు.

  ఈ విషయంలో జరిగిన క్రియ ప్రక్రియ ద్వారానే జీవం పుట్టింది మరియు అంతమవుతుంది కూడా.

  • Zakir Husain says:

   ఒక్క అల్లాహ్ తప్ప మరే శక్తీ లేదు.

  • Khaja says:

   Narakaniki lada jannath ke vallali aneadhe manavuni kriyalula midha adhara padhi unde .. allaha ki manavulu andharu jannath ku valli ane kankshisthadu.

  • Amar vali says:

   Niku కాస్తా కూస్తో బుర్ర ఉందనుకున్న అది లేదని తేలింది

 2. sridhar says:

  కొన్ని పనులు దేవుడు వోట్ వేసి మనం ఓటు వేయనివి.కొన్ని మనం ఓటు వేసినా దేవుడు వోట్ వేయనివి.కొన్ని పనులు దేవుడు, మనిషి ఇద్దరూ వోట్ వేసినవి.ఏ పని కి అయినా పనికి(కర్మ)కి ప్రతిఫలం తప్పదు.వద్దు అనుకున్నా కావాలి అనుకున్నా అనుభవించడం తప్పదు.స్వర్గం నరకాలతో జీవుని ప్రయాణం ఆగినట్టు కాదు.తప్పు ఒప్పులను సరి చూసి దేవునితో ఐక్యం (మోక్షం)(అనగా జనన మరణ రహిత స్థితి) చెందే వరకు పునర్జననం తనవరకూ చేరగలిగే అవకాశం ఉన్న ఇంట జీవుడిని ప్రవేశపెడతాడు. అందుకు తగిన ఎంపిక కూడా మన చేతే చేయిస్తాడు. మన ఇష్టపూర్వకంగానే మన తల్లిదండ్రులను ఎంపిక చేసుకుని జన్మిస్తామంటా…

 3. మానవుడికి జీవనాధారం నీరు కానీ నీటిని మానవుడు సృష్యించ లేదు కదా!అందువల్ల మానవుడు సృష్టికర్త కాదు.అంటె ఎదో అతీంద్రియ శక్తి ఉన్నట్లయి కదా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *