ఖురాన్ సమస్యలు

ఖురాన్ సమస్యలు

November 12, 2019 ప్రశ్నలు ముస్లీంలకు ప్రశ్నలు 4


పెరుగుతున్న ప్రశ్నలు…కరువైన జవాబులు

ప్రియమైన ముస్లీం పాఠకులకు ఈసా అల్-మసీహ్ [యేసు క్రీస్తు] వారి నామములో, అస్సలాం వలేకుం!
అల్లాహ్ [దేవుడు] మిమ్ములను దీవించునుగాక!

ఈ విభాగములోని ప్రశ్నలు మీకు ఆశ్చర్యాన్ని విస్మయాన్ని కలిగించవచ్చు. ఇక్కడ అడగబడిన ప్రశ్నలలో చాలా వరకు మీరు ఎప్పుడు విననని ప్రశ్నలుండే అవకాశముంది. ప్రశ్నల విశయములో మీకు అభ్యంతరమున్నా లేక వివరణ కావలసినా దయచేసి మాకు వ్రాయండి.

ముస్లీంలను గాని లేక ముస్లీంల మతవిశ్వాసాన్ని గాని కించపరచే ఉద్దేశము మాకు లేదు. అలాంటిదేదన్నా జరిగితే అది ఉద్దేశపూర్వకమైనది కాదు కేవలము అనుకోకుండా జరిగిన పొరపాటు అని గ్రహించాల్సిందిగా మనవి. అలాంటి పొరపాటులేవైనా ఉంటే వాటిని మాదృష్టికి తీసుకురండి. మేము వాటిని సరిచేసుకుంటాము.

సత్యము చాలా వరకు కటువుగా, కష్టంగా, చేదుగా వుండే అవకాశముంది. అయితే, దానికి మేము క్షమాపణ చెప్పుకోవటము లేదు. సత్యాన్ని చెప్పే విధానములో లోటుపాటులుంటే దానికి మేము ముందే క్షమాపణ తెలియచేసుకుంటున్నాము.

మా ప్రయత్నమంతా సత్యాన్ని సవివరంగా తెలియజేయటం, అలాగే సత్యాన్ని వాడియైన ప్రశ్నలతో వెలికి తీయటం. ఈ వెబ్సైటులోని మా వ్యాసాలు ప్రశ్నలు ఆ దిశలోనే తయారుచేయబడ్డాయి. తమ విశ్వాసాన్ని ప్రకటించే హక్కు ముస్లీంలకు ఉంది. అదేవిధంగా, ముస్లీంల విశ్వాసాన్ని ప్రశ్నించే హక్కు కూడా యితరులకు [ముస్లీంలు కానివారికి] వుంది అన్నది గమనములో వుంచుకోవాలి.

దయచేసి గమనించండి, ఇది విమర్శ కాదు. విచారణ! మీరు ప్రకటించే మీ విశ్వాసాన్ని గురించి వివరాలను అడుగుతున్నాము. మీ వద్ద వాటికి జవాబులుంటే తెలియచేయండి. ఒకవేళ జవాబులు మీవద్ద లేకపోతే మీ మతపెద్దలను లేక పండితులను అడిగి తెలుసుకోండి. అప్పటికీ సరియైన జవాబులు లేకపోతే ఆత్మవిమర్శ చేసుకోండి. అసత్యాన్ని వదిలి సత్యం కోసం వెదకండి.

క్రింద యివ్వబడిన ప్రశ్నలు ప్రధానంగా దావా ప్రచారకులనుద్దేశించి యివ్వబడినవి. అయినా, ముస్లీంలుగా మీ విశ్వాసాన్ని గూర్చి అడగబడిన ప్రశ్నలకు మీరు సరియైన విధంగా సరియైన వివరాలతో జవాబులను తెలియపరచాలంటూ ఇస్లాం మతవిశ్వాసములో వున్న నిజమైన ముస్లీంలందరికి మా ప్రేమపూర్వక ఆహ్వానం.

అల్లాహ్ మీ అందరిని కనికరించి సర్వసత్యములోకి నడిపించునుగాక!

ప్రశ్న # 1

ఇబ్రహీం బలిసందర్భములో ఉన్న కుమారుడు

దేవుని ఆజ్ఙకు లోబడి అబ్రహాము బలిగా యివ్వబోయినది ఇస్సాకు [ఇషాఖ్] ను కాదుగాని ఇస్మాయిల్ [ఇష్మాయేలు] ను అని మీరు అభిప్రాయపడుతున్నట్లయితే, ఈ సంఘటనను పేర్కొంటున్న సందర్భములో (సురా.37:99-113) ఏకారణముచేత ఖురాను అసలు ఇస్మాయిల్ [ఇష్మాయేలు] పేరును ప్రస్తావించకుండానే కేవలము ఇస్సాకు [ఇషాఖ్] పేరును మాత్రమే ప్రస్తావించింది?

ప్రశ్న # 2

ఇబ్రహీం బలిసందర్భములో లేని కుమారుడు

ఇబ్రహీం [అబ్రహాము] తన కుమారుని బలిగా యివ్వబోయిన సందర్భాన్ని వివరుస్తూ ఖురాను ఇబ్రహీం కుమారునిగా స్పష్టముగా పేర్కొన్న ఇషాఖ్ [ఇస్సాకు] పేరును పట్టించుకోకుండా ఆసందర్భములో ఖురాను అసలు పేర్కొనని ఇస్మాయిల్ [ఇష్మాయేలు] పేరును (సురా.37:113) ఊహించుకొని ఇబ్రహీం [అబ్రహాము] బలిగా యివ్వబోయిన కుమారుడు ఇస్మాయిల్ [ఇష్మాయేలు] అంటూ ఎందుచేత మీరు అమాయకులను మోసం చేస్తున్నారు?

ప్రశ్న # 3

ప్రవక్తల పరంపరలో చేరిన వంశస్థులు

ఇస్సాకు [ఇషాఖ్] కుమారులను/వంశస్థులను దేవుడు ప్రవక్తల పరంపరలో చేర్చినట్లు ఖురాను స్పష్టమైన సాక్ష్యం యిచ్చింది (సురా.45:16). ఈ సత్యాన్ని బట్టే ఇస్సాకు [ఇషాఖ్] వంశములోనుండే నిజమైన ప్రవక్తల పరంపర కొనసాగింది. అందుకే వారిలోనుండే దేవుడు వాగ్ధానం చేసిన అల్-మసీహ్ [క్రీస్తు] అయిన ఈసా [యేసు] ఈ లోకములోకి వచ్చాడు. ఆయన గొప్పతనాన్ని బైబిలు మరియు ఖురాను రెండూ ప్రకటిస్తున్నాయి.

కాని, ఇష్మాయేలు [ఇస్మాయిల్] కుమారులకు/వంశస్థులకు దేవుడు ప్రవక్తల పరంపరలో స్థానమిస్తున్నట్లు బైబిల్ లో కాని ఖురానులోగాని ప్రకటించబడలేదు. మరి వారిలోనుండి వచ్చిన ముహమ్మదుగారు ప్రవక్త ఎలా అవుతాడు? గొప్ప ప్రవక్త ఎలా అవుతాడు? నిజమైన ప్రవక్తల పరంపరలో ఎలా చేరుతాడు?

ప్రశ్న # 4

కుమారుని శుభవార్త

అబ్రహాము కుమారులలో ఇష్మాయేలు [ఇస్మాయిల్] కన్నా ఇస్సాకు [ఇషాఖ్] గొప్పవాడు మరియు ప్రత్యేకమైనవాడు అన్న తౌరాత్ [తోరా] బోధకు ఖురానుకూడా సాక్ష్యమిస్తున్నది.

ఇస్సాకు [ఇషాఖ్] యొక్క పుట్టుకను గురించిన శుభవార్తను దేవుడు ఇస్సాకు తల్లికి మరియు తండ్రికి ఇద్దరికి ముందే తెలియచేసినట్లు ఖురాను విస్పష్టమైన పదజాలముతో దృవపరుస్తున్నది (సురా.11:71 & 37:112).

ఈ ప్రత్యేకత మరియు గొప్పతనము ఇష్మాయేలు [ఇస్మాయిల్] కు లేదు. అయినా, ఇస్సాకు [ఇషాఖ్] కన్నా ఇష్మాయేలు [ఇస్మాయిల్] గొప్పవాడని దేన్నిబట్టి అభిప్రాయపడుతున్నారు?

ప్రశ్న # 5

పెద్ద బలిపశువు అర్పణ

ఖురానులో అబ్రహాము కుమారున్ని “మేము ఒక పెద్ద బలిపశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాము” (సురా.37:107) అంటూ దేవుడు ప్రకటించినట్లు వ్రాయబడింది.

అయితే, ఖురానులోని ఈ సందర్భములో చెప్పబడిన…

(అ) ఒక పెద్ద ‘బలిపశువు’ ఏది? అసలు బలిపశువు యొక్క అవసరత యిక్కడ ఎందుకొచ్చింది? ఆ బలిని ఎవరు ఎవరికి యిచ్చారు?

(ఆ) దేవుడే యిచ్చిన ‘పరిహారం’ లేక ‘విమోచన వెల ‘ [ransom] ఎవరికి యివ్వబడింది? దేవుడు ‘పరిహారం’ చెల్లించాల్సిన అవసరత ఎందుకొచ్చింది…?

(ఇ) దేవుడు అబ్రహాము/ఇబ్రహీం కుమారున్ని ‘విడిపించింది’ ఎవరినుండి? కేవలం ఒక బాలున్ని విడిపించటానికి దేవుడు తన ఆజ్ఙను/శక్తిని/అధికారాన్ని/స్థాయిని ఉపయోగించకుండా ‘పరిహారం’ చెల్లించి విడిపించటమేమిటి…?!

ప్రశ్న # 6

సృష్టికర్త నామం

బైబిలులో [తవ్రాత్, జబూర్, ఇంజీల్] సృష్టికర్త అయిన దేవుడు [אֱלהִים/ఎలోహిం] తన వ్యక్తిగత నామాన్ని విస్పష్టముగా ప్రకటించాడు. ప్రవక్తలు ఆనామాన్ని ఉపయోగించటమేగాక అది దేవుని నామము అన్న సత్యాన్ని ధృవీకరించారు.

మోషేచిత్తగించుము; నేను ఇశ్రాయేలీయులయొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు [אֱלהִים/ఎలోహిం] మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో నే నేమి చెప్పవలెనని దేవుని [אֱלהִים/ఎలోహిం] నడిగెను. అందుకు దేవుడు [אֱלהִים/ఎలోహిం] నేను ఉన్నవాడను [יְהוָֹה/యోద్ హే వౌ హే] అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు [יְהוָֹה/యోద్ హే వౌ హే] మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. మరియు దేవుడు మోషేతో నిట్లనెనుమీ పితరుల దేవుడైన యెహోవా [יְהוָֹה/యోద్ హే వౌ హే = ఉన్నవాడు], అనగా అబ్రాహాము దేవుడు [אֱלהִים/ఎలోహిం] ఇస్సాకు దేవుడు [אֱלהִים/ఎలోహిం] యాకోబు దేవుడు [אֱלהִים/ఎలోహిం] నైన యెహోవా [יְהוָֹה/యోద్ హే వౌ హే = ఉన్నవాడు] మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.” (ని.కాం.3:13-15)
యెహోవాను [יְהוָֹה/యోద్ హే వౌ హే = ఉన్నవాడు] నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.” (యెషయా.42:8)
కాబట్టి నా నామము యెహోవా [יְהוָֹה/యోద్ హే వౌ హే = ఉన్నవాడు]అని వారు తెలిసికొనునట్లు నేను ఈ సారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్య మును ఎంతటివో వారికి తెలియజేతును.” (యిర్మీయ.16:21)
యెహోవా [יְהוָֹה/యోద్ హే వౌ హే = ఉన్నవాడు] అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము.” (హోషేయ.12:5)
ఆయన పేరు యెహోవా [יְהוָֹה/యోద్ హే వౌ హే = ఉన్నవాడు]; బలాఢ్యులమీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును.” (ఆమోసు.5:9)

అరాబిక్ భాషలోని ఖురానులో దేవుడు లేక సృష్టికర్త అన్న పదాన్ని సూచించటానికి అల్లాహ్ [الله‎=దేవుడు] అన్న అరాబిక్ భాషాపదము ఉపయోగించబడింది. ఇది అరాబిక్ భాషలోని సర్వసాధారనమైన నామవాచక పదం. కాని, ఇది సృష్టికర్త యొక్క వ్యక్తిగతనామము కాదు. ఖురానులో సృష్టికర్త ఎక్కడా అల్లాహ్ [الله‎=దేవుడు] అన్నది తన వ్యక్తిగతనామము అని ప్రకటించలేదు. అయితే, ఇస్లాము దావాప్రచారకులు మాత్రము అల్లాహ్ [الله‎=దేవుడు] అన్నది సృష్టికర్తయొక్క వ్యక్తిగత నామము అంటూ బోధిస్తుంటారు. ఇది ఖురానులో లేని బోధ!

గమనిక: “నేను అల్లాహ్ ను” అంటే, “నేను దేవున్ని” అన్న పదజాలం ఖురానులో ఉంది. అలాగే, “అల్లాహ్ నామములో” [దేవుని నామములో] లేక “అల్లాహ్ నామము” [దేవుని నామము] అన్న పదజాలముకూడా ఖురానులో ఉపయోగించబడింది. కాని, నా పేరు/నామము అల్లాహ్” అంటు విస్పష్టమైన ప్రకటన ఏదీ ఖురానులో లేదు.

బైబిలులో అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు/సృష్టికర్త తన వ్యక్తిగత నామమును స్పష్టముగా యెహోవా [יְהוָֹה/యోద్ హే వౌ హే = ఉన్నవాడు] అని ప్రకటించాడు. అల్లాహ్ [الله‎=దేవుడు] అన్నది మీరు బోధిస్తున్న ప్రకారము దేవుని/సృష్టికర్త యొక్క వ్యక్తిగత నామము అయితే ఖురానులో “నా నామము అల్లాహ్ [الله‎=దేవుడు]” అని దేవుడు/సృష్టికర్త ప్రకటించిన ఒక్క ఆధారమైనా చూపించగలరా?

ప్రశ్న # 7

నేనే దేవున్ని అని ఈసా ఎక్కడ చెప్పాడు?

ముస్లీము దావాప్రచారకులు క్రైస్తవులనుద్దేశించి, “యేసు తానే స్వయంగా ‘నేను దేవున్ని, నన్ను ఆరాధించండి’ అంటూ పలికినట్లు బైబిలులో ఎక్కడుంది?” అంటూ ప్రశ్నిస్తుంటారు. ఈ ప్రశ్న సత్యాన్ని తెలుసుకోవాలి అన్న యదార్థతతో అడిగిన ప్రశ్న కాదు అన్నది అటుంచి అసలు ఇది తప్పుదోవపట్టించే వేశధరాణతో కూడిన అజ్ఙానపు ప్రశ్న అన్నది సత్యాన్వేషకులు గ్రహించాలి.

ఈ సందర్భములో, పై శరతులను విధిస్తూ ప్రశ్నించే దావా ప్రచారకులు అవే శరతులతోకూడిన క్రింది ప్రశ్నలకు ముందు తాము జవాబుచెప్పాలి. అలా జవాబు చెప్పలేకుండానే క్రైస్తవులకు పై ప్రశ్నను వేస్తే అది వేశధారణతోకూడిన అజ్ఙానపు ప్రశ్న అన్నది వారే నిరూపించినట్లవుతుంది:

అ) ముహమ్మదుగారు చివరి ప్రవక్త అని ముస్లీములు విశ్వసిస్తారు. కనుక, మీరు విశ్వసిస్తున్న ప్రకారము ముహమ్మదుగారు తానే స్వయంగా, “నేనే చివరి దైవ ప్రవక్తను” అంటూ పలికినట్లుగాని లేక ఆరకంగా అల్లాహ్ ఆయనతో చెప్పమన్నట్లుగా కాని ఖురానులో ఎక్కడుంది చూపించండి?

ఆ) ముహమ్మదుగారు ఆఖరి దైవ సందేశకుడు అని ముస్లీములు విశ్వసిస్తారు. కనుక, మీరు విశ్వసిస్తున్న ప్రకారము ముహమ్మదుగారు తానే స్వయంగా, “నేనే ఆఖరి దైవ సందేశకున్ని” అంటూ పలికినట్లుగాని లేక ఆరకంగా అల్లాహ్ ఆయనతో చెప్పమన్నట్లుగా కాని ఖురానులో ఎక్కడుంది?

ఇ) ఈసా పైగాంబర్ ను ముస్లీములు మసీహ్ గా విశ్వసిస్తారు. అయితే, ఈసా పైగాంబర్ తానే స్వయంగా, “నేనే మసీహ్ ను” అంటూ పలికినట్లుగాని లేక ఆరకంగా అల్లాహ్ ఆయనతో చెప్పమన్నట్లుగా కాని ఖురానులో ఎక్కడుంది?

వివరణ: సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ బోధ ప్రకారం దేవునికి వేరుగా కాకుండా దేవుని యొక్క అంతర్భాగంగా ఉన్న దైవవాక్కే యేసు. దేవునిలో మమేకమై వాక్కుగా ఉన్న యేసు సృష్టికాదు, దేవుడు!

దేవునిలోనుండి ఉద్భవించిన ఆ వాక్కు దేవుని కుమారునిగా అభివర్ణించబడ్డాడు. ఆ కుమారుడే ఈలోకములోకి ప్రవేశించి శరీరధారిగా కన్యగర్భాన జన్మించి యేసు క్రీస్తుగా గుర్తించబడ్డాడు.

ఆ కారణాన్నిబట్టి “యేసు క్రీస్తు శరీరధారిగా ప్రత్యక్షమైన దేవుడు” అన్నది క్రైస్తవ విశ్వాసం!

ప్రశ్న # 8

ఆస్తి వాటాల పంపకం విశయములో ఖురాను విధానం

(1) “అల్లాహ్ మీ సంతానం విషయంలో మీకు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు: ఒక అబ్బాయి వాటా ఇద్దరు అమ్మాయిల వాటాకు సమానం. ఒకవేళ (మృతునికి) ఇద్దరుకన్నా ఎక్కువ మంది కుమార్తెలు మాత్రమే ఉంటే వారికి వారసత్వ ఆస్తిలో మూడింట రెండొంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ ఒకే కూతురుంటే ఆమెకు సగభాగం దక్కుతుంది. చనిపోయిన వ్యక్తికి గనక సంతానముంటే, అతని తల్లిదండ్రులలో ఒక్కొక్కరికి అతను వదలివెళ్ళిన ఆస్తిలో ఆరింట ఒక భాగం లభిస్తుంది. ఒకవేళ మృతుడు సంతానం లేనివాడై ఉండి, అతని తల్లిదండ్రులే అతని ఆస్తికి వారసులైనపుడు, అతని తల్లికి మూడింట ఒక భాగం ఇవ్వాలి. ఒకవేళ మృతునికి గనక అనేక మంది అన్నదమ్ములుంటే, అప్పుడు తల్లికి ఆరింట ఒక భాగం మాత్రమే దక్కుతుంది. చనిపోయిన వ్యక్తి వ్రాసిన వీలునామాను అమలు పరచి, అతను చేసి వున్న అప్పులను తీర్చిన మీదటే ఈ (ఆస్తి) వాటాలు లభిస్తాయి. మీ తండ్రులలో లేక కుమారులలో – మీకు ప్రయోజనం చేకూర్చటంలో ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. ఇవి అల్లాహ్ తరఫున నిర్ణయించబడిన వాటాలు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞాని, పరిపూర్ణ వివేకం గలవాడు.” (ఖురాను.4:11)

(2) “మీ భార్యలకు సంతానం లేనిపక్షంలో వారు వదలివెళ్ళిన ఆస్తిలో సగభాగం మీది. ఒకవేళ వారికి సంతానముంటే వారు విడిచిపెట్టిన ఆస్తిలో నాల్గోభాగం మీకు చెందుతుంది. వారు వ్రాసిపోయిన వీలునామాను అమలుపరచిన మీదట, లేదా వారు చేసిన అప్పుల్ని తీర్చిన మీదటే ఈ పంపకం జరగాలి. మీకు పిల్లలు లేని పక్షంలో మీరు వదలిపోయే ఆస్తిలో మీ భార్యలకు నాల్గో భాగం లభిస్తుంది. ఒకవేళ మీకు పిల్లలుంటే అప్పుడు మీరు వదలివెళ్ళే ఆస్తిలో మీ భార్యలకు ఎనిమిదో వంతు మాత్రమే లభిస్తుంది. మీరు వ్రాసి వెళ్ళిన వీలునామాను అమలు పరచి, లేదా మీరు చేసివెళ్ళిన అప్పుల్ని తీర్చిన తరువాతే మిగిలిన ఆస్తిలో పంపకాలు జరుగుతాయి. చనిపోయిన పురుషుడు లేక స్త్రీ ‘కలాలా’ అయి ఉండి (అంటే వారికి తండ్రిగాని, కొడుకు గాని లేకుండా ఉండి) వారికి ఒక సోదరుడు లేక ఒక సోదరి ఉన్నట్లయితే వారిలో ఒక్కొక్కరికి ఆరింట ఒక భాగం చొప్పున లభిస్తుంది. కాని వారు ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నట్లయితే అప్పుడు మొత్తం ఆస్తిలోని మూడో భాగాన్ని వారంతా సమానంగా పంచుకోవాలి. అయితే మృతుడు వ్రాసిన వీలునామాను అమలుపరచి, లేదా అతని అప్పులన్నీ తీర్చిన మీదటే.” (ఖురాను.4:12)

(3) “(ఓ ప్రవక్తా!) వీరు నిన్ను (‘కలాలా’ గురించి) ధర్మాదేశం అడుగుతున్నారు. అల్లాహ్ (స్వయంగా) ‘కలాలా’ గురించి మీకు ఆదేశం ఇస్తున్నాడని నువ్వు వారికి చెప్పు. ఏ వ్యక్తయినా సంతానం లేకుండా చనిపోతే, అతనికి ఒక సోదరి మాత్రమే ఉంటే, అతను వదలి వెళ్ళిన ఆస్తిలో సగభాగం ఆమెకు లభిస్తుంది. ఒకవేళ సోదరి-సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమె ఆస్తికి వారసుడౌతాడు. ఒకవేళ (మరణించిన వ్యక్తికి) ఇద్దరు సోదరీమణులుంటే, అతని మొత్తం ఆస్తిలో మూడింట రెండొంతుల భాగం వారిద్దరికీ దక్కుతుంది. ఒకవేళ సోదరీసోదరులు అనేకమంది వారసులుగా ఉన్నప్పుడు, ఒక పురుషుని భాగం ఇద్దరు స్త్రీలకు ఇచ్చే భాగాలకు సమానంగా ఉంటుంది. మీరు పెడదారి పట్టకుండా ఉండేందుకుగాను అల్లాహ్ మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు.” (ఖురాను.4:176)

పై ఆయతులలో యివ్వబడిన సూచనల ప్రకారం ఒక వ్యక్తి యొక్క ఆస్తి పంపకములో పాటించాల్సిన కొన్ని సూత్రాలు:

అ) తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి ఆరింట ఒక్క భాగం [4:11]
ఆ) పిల్లలుంటే, ఒక భార్యకు ఎనిమిదింట ఒక భాగం. పిల్లలు లేకుంటే, ఒక భార్యకు నాలుగింటా ఒక భాగం. [4:12]
ఇ) ఒక కుమారుని వాటా యిద్దరు కుమార్తెల వాటాకు సమానము. [4:11]
ఈ) ఒక కూతురు వాటా ఒక కుమారుని వాటాలొ సగం. [4:11]

ఉదాహరణ#1: అబ్దుల్లా అనే వ్యక్తి చనిపోయిన సందర్భములో అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె, ఒక భార్య, మరియు కేవలం తల్లి మాత్రమే బ్రతికి ఉన్నారు. బ్రతికి ఉన్న అబ్దుల్లా కుటుంబస్తులకు అతని ఆస్తిని [Rs.100000=00] పై సూత్రాలను అనుసరించి క్రింది విధంగా పంపకం చేయవచ్చు…

తల్లికి: 1/6 = 0.67 = Rs.16667
భార్యకు: 1/8 = 0.125 = Rs.12500
మొత్తం: Rs.29167 (1)

భార్యకు మరియు తల్లికి పంచగా మిగిలినది: Rs.100000 – Rs.29167 = Rs.70833

కుమారునికి: 2/3 [తల్లికి మరియు భార్యకు యివ్వగా మిగిలినదానిలో] = 0.67 = Rs.47222
కూతురుకు: 1/3 [తల్లికి మరియు భార్యకు యివ్వగా మిగిలినదానిలో] = 0.33 = Rs.23611
మొత్తం: Rs.70833 (2)

అందరికి పంచగా మిగిలినది = Rs.100000 – Rs.29167 (1) = Rs.70833; Rs.70833 – 70833 (2) = 0

ఖురాను సూచనలను అనుసరించి అబ్దుల్లా ఆస్తిని పై విధంగా వాటాలు చేసి పంచితే సరిగ్గా సరిపోతుంది.

ఉదాహరణ#2: అహ్మద్ అనేవ్యక్తి చనిపోయిన సందర్భములో అతనికి ముగ్గురు కుమార్తెలు, యిద్దరు తల్లిదండ్రులు, ఒక భార్య బ్రతికే వున్నారు. బ్రతికి ఉన్న అహ్మద్ కుటుంబస్తులకు అతని ఆస్తిని పై ఖురాను సూచనల ప్రకారం సరిగ్గా పంచిపెట్టడం ఎలా…?=

ప్రపంచములోని ఏ ముస్లీం అయినా లేక దావా ప్రచారకుడైనా కేవలం పై ఖురాను సూచనలను ఆధారం చేసుకొని సరిగ్గా పంచిపెట్టగలడా?

సరిగ్గా పంచిపెట్టగలిగితే వివరాలను తెలియచేయండి.

ఒక వేళ, ఖురాను సూచనల ప్రకారము సరిగ్గ పంచిపెట్టలేక పోతే ఖురానులో ఆ సూచనలిచ్చిన వ్యక్తికి లెక్కలు రానట్లే, కాదా…?!
లెక్కలు రాని వ్యక్తి దేవుడెలా అవుతాడు…?!
లెక్కలు రాని వ్యక్తి చెప్పిన విశయాలను సృష్టికర్తకు ఎలా అంటగడుతారు…?!

ప్రశ్న # 9

చరిత్రలో అత్యంత ప్రభావాన్ని చూపిన వ్యక్తి ఎవరు?

దావా ప్రచారకులు తమ ప్రవక్తను ప్రభువైన యేసు క్రీస్తుతో పోలుస్తూ ఆయన యేసు క్రీస్తుకన్న గొప్పవాడు అని నమ్మబలికేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగంగా, “చరిత్రలో ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఇస్లాము ప్రవక్త ముహమ్మదుది మొదటిస్థానం” అంటూ అభిప్రాయపడిన ఆధునిక రచయితలను తరచుగా పేర్కొనడం విరివిగా కనిపిస్తుంది. ఇందులో కొంత సత్యం వుంది!

అయితే, ఈ సందర్భములో సత్యాన్ని ప్రేమించే వారు అసలు సత్యాన్ని బహిర్గతం చేసేందుకు దావా ప్రచారకులను అడుగుతున్న ప్రశ్న:

చరిత్రలో ముహమ్మదు యేసు క్రీస్తు కన్నా ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి అని మీరు అభిప్రాయపడుతున్నారు. మంచిది!
అయితే, అది పొరుగువారిని/శత్రువులను ప్రేమించటములోనా లేక పొరుగువారిని/శత్రువులను సంహరించటములోనా….?

ప్రశ్న # 10

పరదైసులో బహుమానాలు

ఇస్లాము మతములో నమ్మకమైన ముస్లీము పురుషులు మరణించిన తరువాత వారికి దేవుడు అందమైన అమ్మాయిలను భార్యలుగాచేసి బహుమానంగా యిస్తాడు అన్నది ఖురాను బోధ. [సురాహ్.52:17-29; 78:31-33]

మరి, ఇస్లాము మతములో నమ్మకమైన ముస్లీము స్త్రీలు మరణించిన తరువాత వారికి ఖురాను బోధ ప్రకారము దేవుడు ఎలాంటి బహుమానాలు యిస్తాడు? ఈ విశయములో ఖురాను ప్రకటించే దేవుడు స్త్రీపురుషుల మధ్య పక్షపాతాన్ని కనపరచడం లేదని ఎలా చెప్పగలరు?

ఒక ముస్లీము స్త్రీ విడాకులద్వారానో లేక భర్త మరణించటముద్వారానో ఈలోకములో ఐదుమంది వ్యక్తులకు [భర్తలకు] వేరు వేరు సమయాలలో భార్యగా వుండి నమ్మకమైన ముస్లీముగా జీవించి ఖురానులోని అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని పొంది మరణిస్తే అదే సమయములో ఆమేకు భర్తగా వుండిన ఐదుగురు ముస్లీములుకూడా అల్లాహ్ అనుగ్రహాన్ని పొంది మరణిస్తే ఖురాను బోధ ప్రకారము జన్నా లో ఆమె ఎవరికి భార్యగా వుంటుంది….?

ప్రశ్న # 11

తనకు తనను వెంబడించే వారికి సంభవింపబోయేది

దేవుడు [అల్లాహ్] పంపిన రక్షకుడు, ప్రవక్త, మరియు ప్రభువు అయిన ఈసా అల్-మసీహ్ [యేసు క్రీస్తు] తనకు మరియు తనను వెంబదించే వారికి సంభవించబోయేది తెలిసినవాడు [లూకా.10:20; యోహాను.8:14; 14:1-3].

అయితే, ఇస్లాము ప్రవక్త ముహమ్మద్ గారి యొక్క పరిస్థితి అలా లేదు.

వారికి చెప్పు : “నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. నా పట్లా, మీ పట్లా జరిగే వ్యవహారం ఎలాంటిదో కూడా నాకు తెలీదు. నా వద్దకు పంపబడిన సందేశాన్ని మాత్రమే నేను అనుసరిస్తాను. నేను చాలా స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే.” [సురాహ్.46:9]

రాబోవు కాలములో తనకుగాని లేక తనను వెంబడిస్తున్న వారికి గాని ఏమి సంభవిస్తుందో నన్నది ముహమ్మదుగారికి కూడా తెలియదు అంటు ముహమ్మదుగారు తెచ్చిన ఖురానే బోధిస్తున్నది.

భవిశ్యత్తులోని తన వ్యవహారము గురించి ఖురానులో ఒప్పుకున్నముహమ్మదుగారు హదీసులో ఆ విశయాన్ని ఇంకా స్పష్టీకరిస్తున్నాడు…

‘ఉమ్ అల్ -అలా’ తెలియచేసిన కథనం:
వలసదారుల నివాస స్థలాల ఏర్పాటువిశయములో చీట్లు వేయటానికి ప్రవక్తతో ప్రతిజ్ఞ చేసిన అన్సారీ మహిళ: ‘ఉత్మాన్ బిన్ మజు’ఉన్ వారితో నివసించాలని నిర్ణయించుకున్నాడు (అనగా ఉమ్ అల్-అలా యొక్క కుటుంబముతో). ఉత్మాన్ అనారోగ్యానికి గురయ్యాడు మరియు అతను చనిపోయే వరకు నేను అతనికి సేవలందించాను. అతడు చనిపోయిన తదుపరి మేము అతనిని బట్టలతో కప్పాము. అప్పుడు ప్రవక్త మా వద్దకు వచ్చారు మరియు నేను (మృతదేహాన్ని ఉద్దేశించి), “ఓ అబూ అస్-సాయిబ్, అల్లాహ్ యొక్క దయ మీపై ఉండునుగాక! అల్లాహ్ మిమ్మల్ని గౌరవించాడని నేను సాక్ష్యమిస్తున్నాను” అన్నాను. దానికి ప్రవక్త, “అల్లాహ్ అతనిని గౌరవించాడని మీకు ఎలా తెలుసు?” అని అడిగాడు. నేను బదులిచ్చాను, “నాకు తెలియదు. నా తండ్రి మరియు నా తల్లి మీ కోసం బలి అవుగాక, ఓ అల్లాహ్ అపోస్తలుడా! అయితే దానికి ఎవరు అర్హులు (‘ఉత్మాన్’ కాకపోతే)?” అతను ఇలా అన్నాడు, “అల్లాహ్ సాక్షిగా, మరణం అతనిని అధిగమించింది. ఆయనకు ఉత్తమమైనది సంభవించాలని నేను ఆశిస్తున్నాను. అల్లాహ్ సాక్షిగా, నేను అల్లాహ్ యొక్క అపొస్తలుడైనప్పటికీ, అల్లాహ్ నాకు ఏమి చేస్తాడో నాకు తెలియదు.” అల్లాహ్ సాక్షిగా, నేను ఎవరి భక్తిని అతని భక్తి తరువాతే అంటూ ఎప్పటికీ నొక్కి చెప్పను.”
అది నాకు విచారాన్ని కలిగించింది. నేను నిద్రపోతున్నప్పుడు ఒక కలలో ‘ఉత్మాన్ బిన్ మజు’ఉన్’ కోసం ప్రవహించే ప్రవాహాన్ని చూశాను. నేను అల్లాహ్ అపొస్తలుడి వద్దకు వెళ్లి దాని గురించి చెప్పాను. “ఇది అతని (మంచి) పనులను సూచిస్తుంది” అని వ్యాఖ్యానించాడు. (సాహిహ్ అల్-బుఖారీ, వాల్యూమ్ 5, పుస్తకం 58, సంఖ్య 266)

కనుక, ఆయన మాదిరి ప్రకారం ఇస్లాము మతములో జీవిస్తున్నాము అని భావిస్తున్న మీ పరిస్థితి ఖచ్చితంగా ఆగమ్యగోచరమేగా! మీ పరిస్థితే ఇలా వుంటే ఇతరులనుకూడా మీ మాదిరిగానే ఆగమ్యగోచర పరిస్థితిలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నారు…?

ప్రశ్న # 12

గ్రంథాన్ని వ్రాసిపెట్టిన వారి పేర్లు

కొందరు దావా ప్రచారకులు సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులు తప్పుబడుతు, బైబిలులోని కొన్ని గ్రంథాలను వ్రాసిన వ్యక్తుల పేర్లు లేవు వాటిని ఎవరు వ్రాసారు…? ఎవరో అనామకులు వ్రాసిన వాటిని దేవుని వాక్యమని ఎలా విశ్వసిస్తారు? అంటూ ఎద్దేవా చేస్తుంటారు.

అదే పంథాలో వారికి ఈ ప్రశ్నలు. దావా ప్రచారకులారా మీరు దైవగ్రంథమని విశ్వసిస్తున్న ఖురాను లో 114 సురాహ్ లున్నాయి. వాటిలోని ఒక్కటికూడా ముహమ్మదుగారు వ్రాసిపెట్టలేదు. ఇస్లాము చరిత్ర ప్రకారము ఆయన వల్లించినవాటిని విన్న ఆయన శిష్యులు [సహబా] వాటిని తమకు అందుబాటులోవున్న [తాటి ఆకులు, ఎముకలు, తెల్ల రాళ్ళు, జంతు చర్మాలు మొదలనవి] వాటిపై వ్రాస్తూ వచ్చారట.

పై వివరాల వెలుగులో, ఖురాను యొక్క 114 సురాహ్ లలోని…

  • మొదటి సురాహ్ ను వ్రాసిన వ్యక్తి పేరు ఏమిటి?
  • రెండవ సురాహ్ ను వ్రాసిన వ్యక్తి పేరు ఏమిటి?
  • మూడవ సురాహ్ ను వ్రాసిన వ్యక్తి పేరు ఏమిటి?
ప్రశ్న # 13

హత్యకు న్యాయమైన శిక్ష

ఖురానులో ఖురానును గురించిన ప్రకటన క్రింది విధంగా వుంది:

“అలిఫ్‌ – లామ్‌ – రా. ఇది ఒక గ్రంథం. దీని వాక్యాలు నిర్దుష్ట మైనవిగా చేయబడ్డాయి. అవి వివేచనాపరుడు, సర్వం ఎరిగిన వాని తరఫు నుండి స్పష్టంగా విశదీకరించబడ్డాయి.” (ఖురాను – సురాహ్ 11:1)
“ఏమిటీ, నేను అల్లాహ్‌ను కాకుండా ఇంకొక న్యాయనిర్ణేతను వెతకాలా? యదార్థానికి ఆయన ఒక సంపూర్ణ గ్రంథాన్ని మీ వద్దకు పంపి ఉన్నాడు. అందలి విషయాలు స్పష్టంగా విపులీక రించబడ్డాయి. మేము ఎవరికి గ్రంథం వొసగామో వారికి, ఈ గ్రంథం నీ ప్రభువు తరఫు నుంచి సత్య సమేతంగా వచ్చిం దన్న విషయం బాగా తెలుసు. కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు శంకించేవారిలో చేరిపోకు.” ((ఖురాను – సురాహ్ 6:114)
“మేము ఈ జనుల వద్దకు, మా సంపూర్ణ జ్ఞానంతో బహు స్పష్టంగా విశదీకరించిన గ్రంథాన్ని చేరవేశాము. విశ్వసించినవారికి అది మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం.” (ఖురాను – సురాహ్ 7 : 52)

హత్య జరిగిన సందర్భములో ఇవ్వాల్సిన తీర్పును గురించి ఖురాను ఎంత ‘స్పష్టముగా’ విశదీకరిస్తున్నదో క్రింద చూడవచ్చు:

ఓ విశ్వాసులారా! హతుల విషయంలో ప్రతీకార న్యాయం (ఖిసాస్) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది. స్వతంత్రునికి బదులుగా స్వతంత్రుణ్ణి, బానిసకు బదులుగా బానిసను, స్త్రీకి బదులుగా స్త్రీని (మాత్రమే) హతమార్చాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే అతను రక్తశుల్కాన్ని న్యాయసమ్మతంగా అడగాలి. హంతకుడు కూడా రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు తరఫున ఇవ్వబడిన వెసులుబాటు, కారుణ్యం. ఆ తరువాత కూడా ఎవరయినా హద్దులు అతిక్రమిస్తే అతనికి వ్యధాభరితమైన శిక్ష ఉంటుంది. (ఖురాను – సురాహ్ 2:178)

పై ఆయాతులో హతునికి ప్రతీకారంగా హంతకున్ని హతమార్చాలి అని లేదు. ఎందుకు…?

పైగా ఖురానులో “స్వతంత్రునికి బదులుగా స్వతంత్రుణ్ణి, బానిసకు బదులుగా బానిసను, స్త్రీకి బదులుగా స్త్రీని (మాత్రమే) హతమార్చాలి” అనివుంది. స్వతంత్రుణ్ణి చంపితే ప్రతీకారం కోసం ఒక స్వతంత్రుణ్ణి హతమార్చాలి, బానిసను చంపితే ప్రతికారంగా ఒక బానిసను హతమార్చాలి, స్త్రీని చంపితే ప్రతీకారంగా ఒక స్త్రీని హతమార్చాలి అని భావమా…? అలా అయిన పక్షములో, ఒక స్వతంత్రుణ్ణి ఒక బానిస చంపితే ప్రతీకారంగా ఏ స్వతంత్రుణ్ణి హతమార్చాలి…? ఒక బానిసను ఒక స్వతంత్రుడు చంపితే ప్రతీకారంగా ఏ బానిసను హతమార్చాలి…? ఒక స్త్రీని ఒక పురుషుడు చంపితే ప్రతీకరంగా ఏ స్త్రీని హతమార్చాలి…?

సురాహ్ 2:178 లోని సూచనలలో స్పష్టత ఏది? అది ఎక్కడుంది…?

పొరపాటుగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి మరణానికి కారణం కావచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి కారును నడుపుతూ ప్రమాదవశాత్తు నడుచుకుంటూ వెళ్ళుతున్న మరొక వ్యక్తిని గుద్ది చంపటము లాంటివి. అలా కాకుండా, ఒక వ్యక్తి పగబట్టి లేక దుష్టాలోచనచేత మరొక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపడం జరుగవచ్చు. ఈ రెండు ఒకే విధమైన నేరాలు కావు. కనుక ఈ రెండు రకాలైన హత్యలను ఒకే గుంపులో చేర్చి ఒకే విధంగా తీర్పు తీర్చకూడదు. ఈ భేదం ఖురాను కన్నా రెండు వేల సంవత్సరాలకు ముందే యివ్వబడిన తోరాహ్ లో స్పష్టముగా పేర్కొనబడింది అంతే కాకుండా తదనుగుణమైన శిక్ష పరిష్కారాలనుకూడా తెలియపరచింది [తవ్రాత్ – సంఖ్యాకాండము.35:9-34].

ఖురానులో హత్య విశయములో పాటించాల్సిన తీర్పు వివరాలలో ఈ భేదం మరియు స్పష్టతలు ఎందుచేత కొరవడ్డాయి…?

ప్రశ్న # 14

హత్యాపరాధ ధనం

సమాజములో ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ప్రాణహాని కలిగించటమన్నది రెండు విధాలుగా జరుగవచ్చు:
1) ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై పగబట్టి లేక ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక పన్ని ఆ వ్యక్తిని చావుకు కారణం కావటం.
2) ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై ఎలాంటి ముందస్తు ప్రణాలికగాని లేక పగబట్టడం వలనగాని కాక కేవలం యాదృశ్చికంగా ప్రమాద వశాత్తు మరొక వ్యక్తి చావుకు కారణం కావటం.

మొదటిది హత్య [murder]; రెండవది మారణకాండ [manslaughter]. రెండు నేరాలె! కాని, రెండూ ఒకే విధమైన నేరాలు కావు.

రెండవ నేరానికి సుళువైన శిక్ష లేక హత్యపరిహార ధనం [blood money] చెల్లించుకోవటం శిక్షగా విధించబడుతుంది.

అయితే, మొదటి నేరానికి చట్టములోని అత్యంత తీవ్రమైన శిక్షను విధించటమన్నది సర్వసాధారణంగా అన్ని చట్టాలు సూచించే విశయం. ఈ మొదటి నేరానికి హత్యపరిహార ధనం చెల్లించుకునే వెసళుబాటు ఉండదు. అందుకు కారణాలు రెండు:

1) ఒక మానవ ప్రాణానికున్న విలువ మరొక మానవ ప్రాణానికున్న విలువక సమాంతరమైనది. మానవ ప్రాణాన్ని ధనరూపములో వెలకట్టజాలము. ఉద్దేశపూర్వకంగా ఒక మానవ ప్రాణాన్ని అంతం చేస్తే ఆ నేరస్తుడు ఒక మానవ ప్రాణానికున్న వెలను అంటే తన ప్రాణాన్ని చెల్లించుకోవలసిందే. ఒక హత్యకు ధనరూపములో శిక్షను విధించటమన్నది మానవ ప్రాణానికున్న విలువను కాలరాయటమే.

2) హత్యాపరిహార ధనము లేక రక్త ధనం అన్నది ఎవరికి యివ్వబడుతుంది? సమీప రక్తసంబంధులకు. కిరాయి దుండగులచేత చేయబడే హత్యలలో గుర్తించదగిన శాతం సమీప రక్తసంబంధుల చేతనే చేయబడుతాయి అన్నది ఆస్తుల తగాదాలను పరిశోధించే వారికి ప్రత్యేకంగా ఒప్పించాల్సిన అవసరం లేదు. కాబట్టి, హత్యలు జరిగిన సందర్భాలలో రక్త ధనం లేక హత్యాపరాధ ధనం అన్నదాని ద్వారా హతునికి ఎలాంటి న్యాయం జరుగక పోగా, అలాంటి వెసళుబాటును సమీప రక్తసంబంధులే దుర్వినియోగపరచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పై కారణాలనుబట్టి సర్వసాధారణముగా లోకములోని చట్టాలు అలాగే మోషేద్వారా యివ్వబడిన తవ్రాతులోకూడా హత్యలను పరిష్కరించే సందర్భాలకు చెందిన చట్టాలలో రక్త ధనం లేక హత్యాపరాధ ధనము అన్నదానికి అవకాశము కలిపించబడలేదు.

అయినా, ఖురానులో అలాగే ముస్లీముల చట్టాలలో హత్యల సందర్భములోకూడా రక్త ధనం లేక హత్యాపరాధ ధనం అన్నది ప్రవేశపెట్టి హతులైన వారికి అన్యాయం చేసే అవకాశాన్ని ప్రవేశ పెట్టడములోని విజ్ఙత ఏమిటి…?

ప్రశ్న # 15

తేనెటీగల శాస్త్రం

ఖురానులో తేనెటీగలకు దేవుడిచ్చిన సంకేతం గురించి క్రిందివిధంగా వుంది:

“ప్రభువు తేనెటీగకు ఈ సంకేతమిచ్చాడు: ”కొండల్లో, చెట్లలో, ప్రజలు కట్టుకున్న ఎత్తయిన పందిళ్ళలో నీ ఇండ్లను (తెట్టెలను) నిర్మించుకో. ‘అన్ని రకాల పండ్లను తిను. నీ ప్రభువు సులభతరం చేసిన మార్గాలలో విహరిస్తూ ఉండు.” వాటి కడుపులలో నుంచి పానకం ఒకటి వెలువడుతుంది. దాని రంగులు వేర్వేరుగా ఉంటాయి. అందులో ప్రజలకు స్వస్థత ఉంది. ఆలోచించేవారి కోసం ఇందులో (గొప్ప) సూచన ఉంది.” (ఖురాన్ – సురాహ్.16:68-69 )

సాధారణంగా తేనెటీగలు తియ్యగా ఉండే పదార్థాల వైపు ఆకర్షించబడుతాయి. ఉదాహరణకు, కేకులు, పండ్లు, శీతల పానీయాలు మొదలైనవి. కాని, ప్రధానంగా అవి పువ్వులలోని మకరందాన్ని పీల్చటంద్వారా తమ శరీరములోని ఒక ప్రత్యేకమైన అరలోకి సేకరించి సమీకరించటానికి చెట్లలలో పొదలలో సంచరిస్తుంటాయి. అలా సేకరించిన మకరందమే తేనెటీగ శరీరములోని అరలో కొంత ప్రక్రియకు లోనై తేనెగా మారుతుంది. సృష్టిలోని ఈ అద్భుతమైన అసలు సత్యాన్ని గుర్తించలేక “అన్ని రకాల పండ్లను తిను” అంటూ పండ్లలోనుండే తేనె ఉత్పత్తి అవుతుందన్నట్లుగా చెప్పే గ్రంథ అసలు దైవగ్రంథమెలా అవుతుంది? అలాంటి సందేశాన్ని సృష్టికర్తకు ఎలా అంటగడుతారు…?

ప్రశ్న # 16

మానవులకు లోబడే సూర్యచంద్రులు

“ఆయనే నిరంతర ప్రయాణం చేస్తూ పోతున్న సూర్యచంద్రులను మీకు లోబరచాడు. రేయింబవళ్ళను కూడా ఆయన మీ సేవకై కట్టుబడి ఉండేలా చేశాడు.” (ఖురాన్ – సురాహ్.14:33)

సూర్య చంద్రులు మానవులకు లోబడవు. మానవులు వాటిని వాటి గమనాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేరు. అయినా, ఖురాను పైవిధంగా ప్రకటిస్తున్నది. ఖురాను బోధ ప్రకారం ఖురానులోని అల్లాహ్ సూర్యచద్రులను ఎవరికి, ఎప్పుడు, ఏవిధంగా లోపరిచాడు…? పై ఖురాను ఆయలోని ప్రకటన ఏవిధంగా వాస్తవం?

ప్రశ్న # 17

పూర్వగ్రంథాల జ్ఙానం

ఖురాను పూర్వ గ్రంథాలైన తవ్రాత్ [తోరాహ్], జబూర్ [కీర్తనలు], మరియు ఇంజీల్ [సువార్త] దైవ గ్రంథాలు అన్న సత్యాన్ని తరచు నిర్ధారిస్తూ వచ్చింది [సురాహ్.5:43-47; 21:105].

ఇస్లాము ప్రవక్త ముహమ్మదు కాలములోనే అంటే క్రీస్తుశకము ఏడవ శతాబ్ధములో అరేబియా ప్రాంతములో పూర్వ గ్రంథాలు యూదులవద్ద అలాగే క్రైస్తవులవద్ద వుండటాన్ని వారు ఆ గ్రంథాలను చదువుతుండటాన్ని కూడా ఖురాను సాక్ష్యమిస్తున్నది [సురాహ్.2:113; 7:157; 10:94].

అంతకుముందే అంటే ఐదు మరియు ఆరు శతాబ్ధాలలో వ్రాయబడిన పూర్వ గ్రంథాల పురాతన వ్రాతప్రతులు ఈనాటికి అందుబాటులో వున్నాయి. ఈ నాడు క్రైస్తవులు ఆ యా భాషలలో ఉపయోగించే బైబిలు గ్రంథము ఇస్లాముకంటే దాన్ని స్థాపించిన ముహమ్మదుకంటే ముందునుండి వుంటున్న పూర్వ గ్రంథాల ప్రాచీన ప్రతులలోనుండే అనువదించబడింది.

అంతమాత్రమేగాక, దైవ వాక్కులను ఎవరు మార్చలేరు అంటూ ఖురాను ఘంటాపథంగా సెలవిస్తున్నది [సురాహ్.6:34,115; 10:64; 15:9].

చివరికి ఖురాను ఒక్కసారి అయినా “పూర్వ గ్రంథాలను లేక బైబిలును యూదులు మరియు క్రైస్తవులు మార్చివేసారు కనుక వాటిని విశ్వసించవద్దు లేక చదువవద్దు” అని ప్రకటించలేదు.

అయినా, ఈనాటి దావా ప్రచారకులు అల్లాహ్ చెప్పని విశయాన్ని, ముస్లీముల ప్రవక్త ముహమ్మదు బోధించని విశయాన్ని, చివరకు ఖురానుకూడా ప్రకటించని విశయాన్ని పూర్వ గ్రంథాలకు అంటే బైబిలుకు అంటగడుతు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారు. క్రైస్తవుల వద్దనున్న బైబిలు పూర్వ గ్రంథాలు కాదని లేక బైబిలు పూర్వ గ్రంథాల సంపుటేగాని వాటిని క్రైస్తవులు మార్చి వేసారని అల్లాహ్ గ్రంథాలపై అసత్యారోపణలు చేస్తు తాము నాశనమార్గములో నడవటమేగాక అమాయక ముస్లీములనుకూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.

పై వాస్తవాల వెలుగులో మీకు ఖురానుకన్నా, మీ ప్రవక్త ముహమ్మదుకన్నా, లేక అల్లాహ్ కన్నా పూర్వ గ్రంథాలను గురించి మీకే ఎక్కువ తెలిసు అని ఎందుకు భ్రమలో కొనసాగుతున్నారు…?

ప్రశ్న # 18

యూదులు ఈసాను చంపలేదు

సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలు ఈసా అల్-మసీహ్ [యేసు క్రీస్తు] మరణించి మరణాన్ని జయించి తిరిగిలేచాడు అని విస్పష్టముగా ప్రకటిస్తున్నది (లూకా.24:1-49; యోహాను.20:1-31; ప్రకటన.1:18, 2:8).

పై సత్యాన్ని ఖురాను ఎక్కడా ఖండించడము లేదు. నిజానికి బైబిలులోని ఈ సత్యాన్ని ఖురాను సమర్దిస్తూ ఈ క్రింది విధంగా వివరిస్తున్నది:

“‘మర్యమ్ పుత్రుడగు దైవప్రవక్త ఈసాను మేము హతమార్చాము’ అని అనటం వల్ల – (వారు శిక్షను చవిచూశారు) నిజానికి వారు [యూదులు] ఆయన్ని చంపనూలేదు, శిలువ పైకి ఎక్కించనూ లేదు.” (సురాహ్ 4:157)

గమనించాలి, పై ఖురాను వివరణ యూదులు ఎంతో గర్వంగా తామే ఈసాను చంపామంటూ చెప్పుకోవటాన్ని ఖురాను ఖండిస్తున్నది. అంతేగాని ఈసాను ఎవరు చంపనూలేదు ఎవరు శిలువకు ఎక్కించనూ లేదు అనిగాని లేక ఈసా అసలు మరణించనే లేదు శిలువ పైకి ఎక్కనే లేదు అనిగాని చెప్పడం లేదు. ఖురాను చెప్పింది “వారు [యూదులు] ఆయనను చంపలేదు.”

ఈ సందర్భముగా ఖురాను తెలియచేస్తున్నది వాస్తవమే అన్నది క్రైస్తవులు ఒప్పుకుంటుండగా ముస్లీములు మాత్రం దానికి స్వంత అభిప్రాయాలను కలుపుకొని ఖురాను ప్రకటనకు వేరైన బోధ చేసుకుంటున్నారు.

బైబిలు తెలియచేస్తున్న దాని ప్రకారం, ఈసా మసిహ్ ను చంపింది మరియు శిలువకు ఎక్కించింది యూదులు కాదు, రోమనులు. ఆనాటి యూదులకు ఒక వ్యక్తిని చంపే హక్కుగాని లేక శిలువకు ఎక్కించే అధికారముగాని లేవు. కనుక, వారు ఆ పని చేయలేక పోయారు. అయితే, ఆయనను శిలువకు ఎక్కించింది ఆనాడు యూదులను యేలుతున్న రోమా ప్రభుత్వము యొక్క సైనికులు. తద్వారా ఆయన శిలువపైనే ప్రాణాన్ని విడిచాడు.

యూదుల గర్వపుమాటలను మాత్రం ఖండించిన ఖురాను ఈసాను రోమీయులు శిలువకు ఎక్కించటాన్నిగాని లేక ఆయన మరణాన్నిగాని ఖండించటం లేదు అన్నది గమనార్హమైన అంశం. నిజానికి ఆనాటి క్రైస్తవ మరియు యూదుల ఎన్నో విశ్వాసాలను ఆచారాలను ఖండించిన ఖురాను లేక ముహమ్మదుగారు ఈసా మసీహ్ వారిని రోమనులు శిలువకు ఎక్కించి చంపటాన్ని గురించి ఎక్కడా ఒక్క మాటకూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు.

అయినా, దావా ప్రచారకులు సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలును తప్పుబట్టే తుచ్చబుద్దితో ఈసా అల్-మసీహ్ వారు అసలు శిలువ వేయబడ లేదు మరణించనే లేదు అంటు అసత్యప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా మీరు బైబిలుకే కాక, ఖురానుకుకూడా వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేయటానికి గల కారణమేమిటి…?

ప్రశ్న # 19

అల్లాహ్ ప్రార్థన

దావా ప్రచారకుల బోధ ప్రకారం ఖురాను గ్రంథమంతా అల్లాహ్ యొక్క మాటలు. అది వాస్తవమని మీరు విశ్వసిస్తే ఖురాను గ్రంథములోని మొదటి సురా అల్-ఫాతీహా లో 7 వచనాలు [ఆయతులు] ఉన్నాయి. అవి ప్రార్థన పలుకులు.

ఈ ప్రార్థన ఎవరు చేసిన ప్రార్థన…? ఈ ప్రార్థన ఎవరు ఎవరినుద్దేశించి చేసారు…?

ప్రశ్న # 20

అన్నీ అల్లాహ్ చిత్తమే

దావా ప్రచారకుల బోధల ప్రకారం ఈ లోకములో జరుగుతున్నవన్నింటిని నిర్ణయించేది అల్లాహ్ యే. మంచి చెడులన్నీ అల్లాహ్ యొక్క నిర్ణయాలు [ఖురాను (సూరాహ్. 7:178-179; 10:99-100; 76:29-30; 81:28-29) మరియు హదీసులు (సహీ బుఖారి (4:54:430; 2:23:444; 6:60:473; 9:93:641) & సహీ ముస్లీము (33:6436; 33:6406)]. అదే సమయములో అల్లాహ్ అపార కృపామయుడు మరియు అత్యంత న్యాయవంతుడు అనికూడా బోధిస్తుంటారు.

ఒక వ్యక్తి నరకానికి వెళ్ళాడు అంటే ఆ వ్యక్తి నరకములో శిక్షను అనుభవింపదగిన చెడును చేశాడని.
ఆ వ్యక్తి నరకానికి వెళ్ళదగిన చెడును చేశాడంటే అది అల్లాహ్ యొక్క నిర్ణయమే.
ఆ వ్యక్తి చేసిన చెడును అల్లాహ్ ముందే నిర్ణయించి ఉంటే ఇక ఆ వ్యక్తి దాన్ని తప్పించుకునే ప్రశ్నే లేదు.

కనుక, ఒక వ్యక్తి నరకానికి వెళ్ళాలని అలాగే ఆ వ్యక్తి నరకానికి వెళ్ళదగిన చెడును చేయాలని ముందే నిర్ణయించే దేవుడు నిజదేవుడెలా అవుతాడు….?
అలాంటి దేవుడంటూ ఉంటే అతడు అపార కృపామయుడు మరియు అత్యంత న్యాయవంతుడు ఎలా అవుతాడు…?

ప్రశ్న # 21

దత్తత తీసుకోవటం

అనాధలను దరికిచేర్చి పెంచి పెద్దచేసి స్వంత బిడ్డలలా చూసుకోవటమేగాక వారికి స్వంతబిడ్డలతో సమానమైన స్థానాన్ని యివ్వటమన్నది అన్ని కాలాలలో అన్ని సంస్కృతులలోను ఉత్కృష్ట మానవధర్మంగా గుర్తించబడింది. దత్తత తీసుకోవటమన్నది సరియైనది కాదు అనిగాని లేక దేవునిదృష్టికి వ్యతిరేకమైనది అనిగాని ఏ ప్రవక్తకూడా ఏకాలములోను ప్రకటించలేదు.

దత్తత కుమరునిగా పెరిగిన మోషేద్వారా యివ్వబడిన తవ్రాతునందు లేక అటుతరువాత వచ్చిన ప్రవక్తలద్వారా యివ్వబడిన గ్రంథాలలోను దత్తతతీసుకోవటాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు వ్యతిరేకించలేదు. పైపెచ్చు దత్తతలో పెరిగినవారిని గురించి అలాగే దత్తత తీసుకున్నవారిగురించి ప్రవక్తల గ్రంథాలలో ఉత్కృష్ట ధర్మముగానే చిత్రీకరించబడింది.

కాని, సమాజములో ఎంతో ఉత్కృష్ట ధర్మముగా గుర్తించబడిన దత్తత అన్నది దేవుని చేత రద్దుచేయబడినట్లు [సూరాహ్.33:4-5] ఖురాను చిత్రీకరించటము ఎంతవరకు సబబు…?
నిజానికి దత్తత అన్నది ఖురాను ప్రకారము ఎప్పుడు ఎందుకు రద్దు చేయబడింది…?
దత్తత రద్దుకు మరియు ముహమ్మదుగారు జైనాబును పెండ్లి చేసుకోవటానికి [సూరాహ్.33:36-40] గల సంబంధమేమిటి….?
కొందరు దావా ప్రచారకులు వ్యాఖ్యానిస్తున్నట్లు పిల్లలను పెంచవచ్చు కాని దత్తత తీసుకోకూడదు అన్నదాంట్లో ఉన్న విజ్ఙత ఏమిటి…?

[ముహమ్మదుగారి పెంపుడు కుమారుడు జయీద్. జయీద్ భార్య పేరు జైనాబ్. వివాహము తరువాత కొంతకాలానికి అంటే రెండు సంవత్సరాల లోపే జయీద్ తన భార్య అయిన జైనాబుకు విడాకులు యిచ్చాడు. అటుతరువాత ముహమ్మదుగారు జైనాబును పెండ్లిచేసుకున్నారు]

ప్రశ్న # 22

విడాకుల తరువాత తిరిగి వివాహము చేసుకోవటము

దైవ ప్రవక్త అయిన మూసా [మోషే] ద్వారా యివ్వబడిన దేవుని గ్రంథం తవ్రాత్ [తోరాహ్] లో అలాగే ప్రవక్తల గ్రంథములో [ద్వి.కాం.24:1-4&యిర్మీయ.3:1-2] విడాకుల తరువాత తిరిగి పెళ్ళిచేసుకోవటమును గురించి దేవుడు చాలా స్పష్టమైన ఆజ్ఙను యిచ్చాడు. అందులో భాగంగా, ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు యిచ్చిన తరువాత ఆ స్త్రీ మరొక వ్యక్తిని పెండ్లి చేసుకొని ఆ రెండవ భర్త చేతకూడా విడాకులు పొంది పంపివేయబడితే ఆ రెండవ వివాహము తరువాత మొదటి భర్త ఆమెను తిరిగి పెండ్లిచేసుకోవటమన్నది తనకు అసహ్యమైన కార్యమని ఇబ్రహీం, ఇషాఖ్, మరియు యాకూబ్ ల దేవుడు తేలియచేసాడు.

పై దైవ ప్రకటనను జబూర్ గాని లేక ఇంజీల్ గాని వ్యతిరేకించలేదు. అయినా, ఖురాను గ్రంథము అందులోని అల్లాహ్ ప్రకటన పై ప్రకటనకు పూర్తిగా వ్యతిరేకమైన ఆజ్ఙను యివ్వటము అన్నది [సూరాహ్.2:229-230] ఇబ్రహీం, ఇషాఖ్, మరియు యాకూబ్ ల దేవునికే వ్యతిరేకమైనది, కాదా….?

ఖురానులో అలాంటి ఆజ్ఙను యివ్వటములోని విజ్ఙత ఏమిటి….?

ప్రశ్న # 23

అల్లాహ్ యొద్ద పాపాలకు క్షమాపణ

ఖురానులోని క్రింది ఆయ ప్రకారం తెలియక/అవివేకం బట్టి చేసిన పాపాలను మాత్రమే అల్లాహ్ క్షమిస్తాడు. మరి ముస్లీములు చేసే పాపాలు చాలా వరకు తెలిసి చేసినవేకదా మరి వాటి మాటేమిటి…?

అవివేకం వల్ల ఏదైనా చెడు కార్యానికి పాల్పడి, వెనువెంటనే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందేవారి పశ్చాత్తాపాన్ని స్వీకరించే బాధ్యత మాత్రమే అల్లాహ్పై ఉంది. అటువంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. అల్లాహ్ మహాజ్ఞాని, గొప్ప వివేకవంతుడు.” (ఖురాను – 4:17)

ప్రశ్న # 24

హతమార్చబడబోతున్న ప్రవక్తలు

ఖురానులోని క్రింది రెండు ఆయతులు తెలియచేస్తున్న విశయాలు:

  1. కొందరు ముహమ్మదును ప్రవక్తగా తిరీస్కరిస్తూ “అల్లాహ్‌ పేదవాడు, మేము ధనికులం” అంటూ గొప్పలు చెప్పుకున్నారు.
  2. ముహమ్మదు ఎదుట తిరస్కార వైఖరితో వారు చెప్పిన మాటలను అల్లాహ్ విన్నాడు మరియు వాటిని గ్రంథములో వ్రాసుకోబోతున్నాడు.
  3. వారు ప్రవక్తలను అన్యాయంగా హతమార్చటాన్ని కూడా అల్లాహ్ నమోదు చేసుకోబోతున్నాడు.
  4. వారు దహించే అగ్నిని రుచిచూడబోతున్నారు.

”అల్లాహ్‌ పేదవాడు, మేము ధనికులం” అని అన్నవారి మాటను అల్లాహ్‌ విన్నాడు. వారి ఈ మాటను మేము వ్రాసు కుంటాము. వారు ప్రవక్తలను అన్యాయంగా హతమార్చటాన్ని కూడా మేము నమోదు చేసుకుంటాము. ”దహించే అగ్ని శిక్షను చవిచూడండి.” (ఖురాను – 3 : 181)

ముహమ్మదు కాలములో ఉన్న వ్యక్తుల తిరస్కారధోరణిని వారి మాటలను అల్లాహ్ నమోదు చేసుకోబోతున్నాడు. అలాగే, వారు అన్యాయంగా ప్రవక్తలను చంపటాన్నికూడా అల్లాహ్ నమోదు చేసుకోబోతున్నాడు. ముహమ్మదు కాలములోని ఆ వ్యక్తులు చంపిన ప్రవక్తలు ఎవరు?

ప్రశ్న # 25

ప్రమాణము చేయటం

తోడుగా/సాక్షిగా అంటూ ఒట్టుపెట్టుకోవటము లేక ప్రమాణము చేయటము అన్నది ఖురానులోను అలాగే పూర్వగ్రంథాలైన తవ్రాత్, జబూర్, మరియు ఇంజీలు గ్రంథాల సంపుటి అయిన బైబిలులోకూడా చూడగలము.

ఈనాడుకూడా న్యాయస్థానాలలో లేక సమాజము ఎదుట సాక్ష్యమిస్తున్న వ్యక్తులు కేవలం సత్యాన్నే పలుకుతున్నమంటూ తాము తెలియచేస్తున్న విశయాలకు యితరులముందు ఖచ్చితత్వాన్ని జతచేసెందుకుగాను ధార్మిక గ్రంథాలసాక్షిగా లేక తమ తల్లిదండ్రులసాక్షిగా ప్రమాణం చేయటం జరుగుతుంది.

సత్యాన్ని పలుకున్న సందర్భములో ప్రమాణము చేసేందుకు సాక్ష్యముగా లేక తోడుగా తమకన్న గొప్పవారిని లేక విలువైన వారినే ఎన్నుకుంటారు గాని ఎవరు తమకన్న తక్కువ స్థితి లేక విలువైన వారిని వాటిని ఎన్నుకోరు. ఉదాహరణకు, ప్రమాణము చేయటానికై ఒక చీమనో, జంతువునో, చెట్టునో లేక రాయినో ఎన్నుకోరు.

పూర్వ గ్రంథాలలోని [బైబిలులోని] దేవుడు ఇబ్రహీం [అబ్రహాము] కు ప్రమాణము చేస్తూ తనకంటే వేరే గొప్పవాడు లేడుగనుక తనతోడు అంటూ ప్రమాణము చేసాడు [తవ్రాత్: ఆదికాండము 22:16; యెషయా.45:23; ఇంజీల్: హెబ్రీయులకు 6:13-14,16]. ఈ సందర్భములో గుర్తుంచుకోవలసిన విశయము, పూర్వ గ్రంథాలలో దేవుడు ఒక్క సారికూడా తనకన్న తక్కువైన ఏ వ్యక్తి లేక సృష్టము సాక్షిగా ప్రమాణము చేయలేదు.

కాని, ఖురానులోని అల్లాహ్ సృష్టించబడినవాటి సాక్షిగా మాట యివ్వటాన్ని ఖురానులో ఎన్నో సార్లు చూస్తాము [గాలి, మేఘాల సాక్షిగా–సురాహ్ 51:1-2; పర్వతాల సాక్షిగా–52:1; చంద్రుని సాక్షిగా–74:32; నగరం సాక్షిగా–90:1; అత్తిపండు మరియు ఆలివు సాక్షిగా–95:1]. దీనికి గల కారణమేమి? ఇందులో ఉన్న విజ్ఙత ఏమిటి? ఈ భేదమే పూర్వ గ్రంథాలైన తవ్రాత్, జబూర్, మరియు ఇంజీల్ లోని దేవుడు మరియు ఖురాను ప్రకటిస్తున్న దేవుడు వేరు వేరు అన్నదానికి స్పష్టమైన ఋజువు కాదా…?

ప్రశ్న # 26

పూర్వ గ్రంథాలలో ముహమ్మదు

ఇస్లాము ప్రవక్త ముహమ్మదుగారికి ప్రవక్తల పరంపరలో స్థానాన్ని సంపాదించిపెట్టేందుకు అంతేగాక ఆయన తెచ్చిన గ్రంథానికి ప్రామాణికత్వాన్ని స్థాపించిపెట్టేందుకు దావా ప్రచారకులు బైబిలు గ్రంథాన్ని వక్రవ్యాఖ్యానాలతో తమ ఊహాగానాలను ప్రతిబింబించే విధంగా వివరిస్తూ విఫల ప్రయత్నాలలో కొనసాగుతున్నారు. అది సహజమే!

క్రైస్తవులు ప్రవక్త, మెస్సయ్య [మసీహ్], ప్రభువు, మరియు రక్షకుడు అని విశ్వసించే యేసు క్రీస్తు [ఈసా మసీహ్] తనగురించి తవ్రాత్, జబూర్, మరియు ప్రవక్తల గ్రంథములలో వ్రాయబడిన విశయాలను ఉటంకిస్తూ అవి తన జీవితములో నెరవేర్చబడటాన్ని సాక్ష్యాధారాలతో ప్రకటిస్తూ వచ్చాడు.

ఇస్లాము ప్రవక్త బైబిలు ప్రవక్తలపరంపరలోని వాడైతే ఆ ప్రవక్తలు వ్రాసిన లేఖనాలు తెలిసినవాడై ఉండాలి. అలాగే, ఆయనకు ప్రేరణ [వాహి] యిస్తున్న వారికైనా ఆ లేఖనాలు తెలిసుండాలి.

ముహమ్మదుగారికి తన కొచ్చిన వాహిద్వారా పూర్వ గ్రంథాలలోని లేఖనాల వివరాలు తెలుసుకోవటం సాధ్యం కాకపోయి ఉండవచ్చు. అయితే, ఆ దినాలలో మక్కా మరియు మదీనా రెండు నగరాలలోను యూదులు మరియు క్రైస్తవులు జీవిస్తుండే వారు, వారు తమ యొద్ద ఉండిన తవ్రాత్, జబూర్ మరియు ఇంజీలు గ్రంథాలు చదువుతుండేవారు అన్న సత్యాన్ని ఖురాను హదీసులు తరచు సూచిస్తున్నాయి. కనుక, ఆ గ్రంథాలలోనుండయిన ముహమ్మదుగారు తన రాకడను గురించి ప్రవక్తలు చెప్పిన మాటలను చుపించగలిగి ఉండాల్సింది.

ఇస్లాము ప్రవక్త ముహమ్మదుగారు పూర్వ గ్రంథాలను దైవ గ్రంథాలంటూ అల్లాహ్ ప్రేరణతో [వాహితో] ఒక్క మాటలో నిర్ధారించగలిగాడు కాని, అదే అల్లాహ్ ప్రేరణతో వాటిలోని లేఖనాలను ఉటంకిస్తూ అవి తన జీవితములో నెరవేరాయి అంటూ తన రాకడను ప్రవక్తలు ముందే తెలియచేసారు అన్న విశయాన్ని లేఖనాల సాక్ష్యాధారంగా ఒక్కసారికూడా చెప్పుకోలేదు. అలాగే, ఖురాను ఈ విశయములో ఎలాంటి ఆధారాలతోకూడిన వివరణ యివడం లేదు అన్నది గమనార్హమైన విశయాలు!

ముహమ్మదుగారే స్వయాన తవ్రాతులోనుండి, జబూర్లోనుండి, అలాగే ఇంజీలులోనుండి లేఖనాలను ఉటంకిస్తూ అవి తన జీవితములో నెరవేరుతున్నట్లు ఎందుచేత చెప్పలేక పోయాడు…?

ప్రశ్న # 27

యాజకులు యాజక ధర్మాలు

తవ్రాత్, జబూర్, మరియు ప్రవక్తల గ్రంథాలలో ప్రత్యక్షపరచుకున్న దేవుడు [יְהוָֹה/యెహోవా] తన ప్రజలకు ప్రవక్తలను రాజులనేగాక అతి ప్రాముఖ్యమైన యాజకులను యాజక ధర్మాలనుకూడా అందించాడు. [తవ్రాత్: నిర్గమాకాండము 29 & 40 అధ్యాయాలు; సంఖ్యాకాండము 18వ అధ్యాయము]

ఆ గ్రంథ ప్రవక్తలపరంపర కొనసగింపుగా వచ్చిన యేసుక్రీస్తు [ఈసా మసీహ్] మరియు ఆయన శిష్యులు/అపోస్తలులు యాజకులను గురించి యాజక ధర్మాలనుగురించి వివరించి వాటి నెరవేర్పులను ఇంజీలు గ్రంథములో వివరించారు. [ఇంజీల్: లూకా 17 & 19 అధ్యాయాలు; హెబ్రీయులకు 7వ అధ్యాయము; 1పేతురు 2వ అధ్యాయము]

ఇస్లాము ప్రవక్త ముహమ్మదుగారు ప్రవక్తల పరంపరలో భాగంగా యెహోవా దేవుని చేత పంపబడి ఉంటే యాజకులను గురించి యాజక ధర్మాలను గురించి అలాగే వాటి నెరవేర్పులను గురించిన వివరాలేవీ ఖురానులో యివ్వలేకపోయాడు ఎందుచేత…?

ప్రశ్న # 28

దేవుడు తండ్రిగా పోల్చబడటము

యూదు గ్రంథాలలో అలాగే క్రైస్తవ గ్రంథాలలో ప్రత్యక్ష పరచుకున్న సృష్టికర్త తాను తన ప్రజలకు తండ్రిగా ఉంటాను అని అలాగే తన ప్రజలు తనకు కుమారులుగా ఉంటారు అని అ గ్రంథాలలో ప్రకటిస్తున్నాడు.

దావా ప్రచారకులు నమ్మబలుకుతున్న విధంగా ఇస్లాము ధర్మము యూదు ధర్మము అలాగే క్రైస్తవ ధర్మముల పరంపరలో భాగంగా వచ్చిన ధర్మము అన్నది నిజమైతే, ఎందుచేత ఇస్లాము గ్రంథమైన ఖురానులో అల్లాహ్ ను తండ్రిగా లేక మానవులను అల్లాహ్ యొక్క కుమారులుగా పోల్చిన సందర్భాలు లేవు…?

ప్రశ్న # 29

సూర్యుని అస్తమయం

ఖురానులో జుల్‌ఖర్‌నైన్ అనే వ్యక్తి ప్రయాణాన్ని గురించి అల్లాహ్ వివరించాడు. ఆ వివరణ క్రింది విధంగా ఉంది:

(ఓ ప్రవక్తా!) వారు నిన్ను జుల్‌ఖర్‌నైన్‌ గురించి అడుగు తున్నారు. “నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తాన”ని వారికి చెప్పు. మేము అతనికి భువిలో అధికారం ఇచ్చాము. అన్ని రకాల సాధన సంపత్తుల్ని కూడా అతనికి సమకూర్చాము. అతను ఒక దిశలో పోసాగాడు. చివరకు అతను సూర్యుడు అస్తమించే ప్రదేశానికి చేరుకుని, సూర్యుడు ఒక బురద చెలమలో అస్తమిస్తుండగా చూశాడు. దాని సమీపంలో అతను ఒక జాతి వారిని కూడా కనుగొన్నాడు. “ఓ జుల్‌ఖర్‌నైన్‌! నువ్వు వీళ్లను శిక్షించవచ్చు. లేదా వీరి విషయంలో మరేదయినా ఉత్తమ వైఖరిని అవలంబించవచ్చు” అని మేమతనికి సెలవిచ్చాము. (ఖుర్ ‘ ఆన్ – 18 :83-86)

పై ఖురాను వాక్యాలలో సమస్యలుగా అనిపించేవి:

అ) ‘సూర్యుడు అస్తమించే ప్రదేశం’ అన్న ఒక ప్రదేశం ఉంటుందా…? లేక దాన్ని వేరుగా అర్థం చెసుకోవాలా…?

ఆ) ‘సూర్యుడు ఒక బురద చెలమలో అస్తమించటం’ జరుగుతుందా…? ఒక వేళ సూర్యాస్తమయం బురదతో కూడిన సరస్సుకు ఆవల జరిగిన విధానాన్ని చూసి అతను అలా అని భ్రమించి ఉండవచ్చు అనుకుంటే అతను సూర్యాస్తమయాన్ని మొదటిసారి చూసిన వ్యక్తి కాదు కదా అలా అనుకోవటానికి?! ఆ సంఘటనను వివరిస్తున్న గ్రంథకర్తకు అసలు విశయం తెలిసుండాలి కదా?!

లౌకిక జ్ఙానమున్న ఏ వ్యక్తినడిగినా సూర్యాస్తమయమన్నది సూర్యుడు నీటిలో మునగటం వలన జరిగే సంఘటన కాదని ఇట్టే చెప్పేసెయ్యగలడు.

సూర్యాస్తమయాన్ని గురించి శాస్త్రజ్ఙులను అడిగితే వారు సూర్యాస్తమయం అన్నది సూర్యుడు నీటిలో మునగటం వలన జరుగదు అని వివరించి చూపిస్తారు.

ఖురానులోని సూర్యాస్తమయ సంఘటనకు సంబంధించిన వర్ణను గురించి అడిగితే దావా ప్రచారకులు అది కేవలం జుల్‌ఖర్‌నైన్ యొక్క దృక్పథానికి చెందిన వర్ణన మాత్రమే అంటూ వివరిస్తారు.

అయితే, ఇదే విశయాన్ని గురించి ముహమ్మదుగారిని అడిగితే ఆయన క్రింది విధంగా తెలియజేసారు…

[సునన్ అబు ధావూద్; హదీసు సంఖ్య 3991]

అబు ధర్ తెలియచేసింది:
అల్లాహ్ సందేశకుడు సూర్యాస్తమయ సమయములో ఒక గార్ధభముపై స్వారీ చేస్తున్న సమయములో నేను ఆయన వెనకే కూర్చొని ఉంటిని. ఆయన నన్ను అడిగాడు: అది ఎక్కడ అస్తమిస్తున్నదో నీకు తెలుసా? నేను అన్నాను: అల్లాహ్ మరియు ఆయన సందేశకుడు బాగా ఎరుగుదురు. ఆయన అన్నాడు: అది గోరు వెచ్చని జలధారలో అస్తమిస్తుంది.

కనుక, ఇంతకు ఖురానులో సురాహ్ 18:83-86 లో ప్రస్తావించబడిన ‘సూర్యాస్తమయాన్ని ‘ గురించిన పై నాలుగు వివరణలలో ఏవివరణ సత్యం…???

ప్రశ్న # 30

ఈసా [యేసు] స్థానములో వేరొకరు చంపబడటము

ఇంకా – ”మర్యమ్ పుత్రుడగు దైవప్రవక్త ఈసాను మేము హతమార్చాము” అని అనటం వల్ల – (వారు శిక్షను చవిచూశారు). నిజానికి వారు ఆయన్ని చంపనూలేదు, శిలువ పైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే, వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు. ఈసా విషయంలో విభేదిం చినవారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు,
(ఖుర్ ‘ ఆన్ – 4 : 157)

పై తెలుగు ఖురాను వాక్యములోని “వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు” అన్న పదజాలం అరబ్బీ ఖురానులో లేకున్నా ఆవిధంగా కలుపుకొని ముస్లీము అనువాదకులు ఎందుచేత తాము నమ్మే ఖురానుకు అసత్యాలను అంటగడుతున్నారు….?

అంతమాత్రమేగాక, పై కల్పిత మాటలను ఆధారం చేసుకొని అల్లాహ్ ఈసాను [యేసును] చంపాలను చూస్తున్న వారి చేతిలోనుండి ఆయనను తప్పించి పరలోకానికి తీసుకు వెళ్ళటము కొరకై ఈసా [యేసు] స్థానములో వేరొక వ్యక్తిని ఆయనలా మార్చి వారి చేతిలో చంపబడేటట్లు చేసి ఈసాను [యేసును] మాత్రం అక్కడున్న వారికి తెలియకుండా పరలోకానికి తీసుకువెళ్ళాడు అంటూ ఊహాగానాలను ముస్లీములచేత నమ్మిపిస్తున్నారు. ఇలాంటి మోసకరమైన ప్రయత్నాన్ని అల్లాహ్ కు అంటగట్టడం సబబేనా…?

బైబిలులోని సృష్టికర్త తన ప్రవక్త అయిన ఏలియాను ఈ లోకములోనుండి పరలోకములోకి తీసుకు వెళ్ళటానికి అందరి ఎదుట అగ్నిరథమును పంపి తీసుకు వెళ్ళగలిగాడు. [2రాజులు.2:1-14]
మరి, ఖురానులోని అల్లాహ్ ఎందుచేత అందరు చూడగలిగే అలాంటి అద్భుతవిధానములో ఈసాను [యేసును] పరలోకానికి తీసుకు వెళ్ళలేక పోయాడు….?

ప్రశ్న # 31

జతల సృష్టి

ముస్లీంలు దైవ గ్రంథమని విశ్వసించే ఖురాను గ్రంథములో క్రింది విధంగా వ్రాయబడి ఉంది:

“మరి మీరు హితబోధను గ్రహించేటందుకుగాను మేము ప్రతి వస్తువునూ జతలు జతలుగా సృష్టించాము.” (ఖురాను – సురాహ్ 51:49) 

సృష్టిలో సర్వసాధారణముగా ప్రాణులు జతలుగా అంటే ఆడ మరియు మగలుగా సృష్టించబడ్డారు అన్నది అందరికి తెలిసిన విశయమే. అయితే, దైవ గ్రంథాలకు అంతకన్నా ఎక్కువే తెలిసి ఉండాలి. 

పై ఖురానులోని ప్రకటన ప్రకారము ‘వస్తువులు అన్నీ’ జతలుగా సృష్టించబడ్డాయన్నదానిలో “అన్నీ” అని పేర్కొనటములోనే పెద్ద సమస్య ఉంది. కారణము, సృష్టించబడిన వాట్లో అన్నింటికి జతలు లేవు!   

ఇక, నరుల విశయానికొస్తే స్వతహాగా పుట్టే నపుంసకులకు జతలు లేరు. ఈ వాస్తవము ఖురానులోని పై వాక్యాన్ని వ్రాసినవారికి తెలియదా…?

తెలిసిస్తే అలా వ్రాయటములోని భావమేమిటి…?

ప్రశ్న # 32

నపుంసకుల ప్రస్థావన

ప్రపంచములోని మానవులలో నపుంసకుల సంఖ్య అతి తక్కువే అయినా వారుకూడా దేవుని సృష్టిలోని భాగము. నపుంసకులు మూడురకాలు: 

యితరుల చేత నపుంసకులుగా చేయబడేవారు

భక్తిచేత తమనుతాము నపుంసకులుగా చేసుకునేవారు

తల్లి గర్భములోనుండే నపుంసకులుగా రూపించబడి పుట్టేవారు 

పూర్వ దైవ గ్రంథాలైన తవ్రాత్ మరియు ఇంజీల్ లలో [బైబిలులో] నపుంసకులను గురించి పేర్కొనబడింది. వారికి దేవుని వాగ్ధానాలు యివ్వబడ్డాయి.     

అయితే, ముస్లీంలు చివరి దైవగ్రంథము అని విశ్వసించే ఖురాను గ్రంథములో నపుంసకుల ప్రస్తావనే లేదు. అయినా, ఖురానులో క్రింది విధంగా వ్రాయబడి ఉంది:

“నిశ్చయంగా వీరి (ఈ జాతుల) గాథలలో విజ్ఞత గలవారికి గుణపాఠం ఉంది. ఈ  ఖుర్‌ఆన్ కల్పితమైన విషయం ఎంత మాత్రం కాదు. పైగా ఇది తనకు పూర్వం ఉన్న గ్రంథాలను ధ్రువీకరిస్తుంది, ప్రతి విషయాన్నీ స్పష్టంగా విడమరచి చెబుతుంది. విశ్వసించే జనులకు ఇది సన్మార్గం, కారుణ్యం.” (ఖురాన్ – 12 : 111)

ప్రశ్నలు:

1. ఇస్లాం ప్రకారం స్వతహాగా తల్లిగర్భములోనుండే నపుంసకులుగా పుట్టినవారిని ఎవరు సృష్టించారు?

2. ఖురానును వ్రాసినవారు నపుంసకులను ఖురానులో ఎందుకొరకు పేర్కొనలేదు మరియు వారి గురించి వ్రాయలేదు?

3. ఖురాను బోధ ప్రకారం స్వర్గంలో పురుషులకు అందమైన స్త్రీలు భార్యలుగా యివ్వబడుతారు. మరి, ఈ విషయములో ఖురాను బోధ ప్రకారం నపుంసకుల పరిస్థితి యేమిటి…?  

4. ఖురాన్ గ్రంథం తనగురించి తాను “ప్రతి విషయాన్నీ స్పష్టంగా విడమరచి చెబుతుంది” అంటు చెప్పుకుంటునే నపుంసకులగురించి ఒక్క ముక్కకూడా చెప్పలేకపోయింది. దీని ప్రకారం ఖురాన్ అసత్య ప్రకటన చేసినట్లే కాదా…?

ప్రశ్న # 33

దైవత్వములో బహుళత్వము

చరిత్రలో క్రైస్తవులు దాదాపు మొదటి శతాబ్ధము మొదలుకొని నేటివరకు క్రొత్తనిబంధన గ్రంథములోని లేఖనాధారాలనుబట్టి దేవుని [అల్లాహ్] తత్వము త్రిత్వముగా గ్రహించి దైవత్వములో అంటే ఒకే దేవునిలో తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్ముడు అన్న వ్యక్తులు ఉన్నట్లు విశ్వసిస్తారు. 

– క్రైస్తవుల విశ్వాసము సత్యమా కాదా అన్నది అటుంచి అసలు క్రైస్తవులు దేవున్ని [అల్లాహ్] తండ్రి, కుమారుడు, మరియు తల్లి మరియగా విశ్వసిస్తారు అనే భావం వచ్చే విధంగా సత్యదూరమైన ప్రకటన ఖురాను ఎందుచేత చేస్తున్నది? [సురాహ్.5:72-75, 116]

– క్రైస్తవులు దేవున్ని [అల్లాహ్] తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్ముడు అని విశ్వసిస్తారన్న వాస్తవాన్ని గురించిన సమాచారాన్ని ఒక్క సారైనా ఖురాను ఎందుచేత పేర్కొనలేకపోయింది?  అందుకుగల కారణము, ఖురాను వ్రాసినవారికి క్రైస్తవుల యొక్క అసలు విశ్వాసమేదో తెలియకపోవటమా లేక క్రైస్తవుల విశ్వాసాన్ని అపార్థము చేసుకోవటమా లేక క్రైస్తవుల విశ్వాసంపై బురద చల్లటమా…?   

సర్వజ్ఙాని అయిన సృష్టికర్తనుండి ఖురాను గ్రంథం వచ్చి ఉంటే తప్పకుండా అందులో క్రైస్తవుల విశ్వాసాన్ని గురించి సరియైన సమాచారాన్ని అందించాలి, కాని ఎందుచేత అలా యివ్వలేకపోయింది…?

ప్రశ్న # 34

సృష్టికర్త యొక్క తండ్రి పాత్ర 

ప్రవక్తల పరంపరలోని గొప్ప ప్రవక్తలు [మోషే, దావీదు, యేసు క్రీస్తు] దేవున్ని [అల్లాహ్] తండ్రిగా, భౌతికమైన భావార్థముతో కాకుండా ధార్మిక భావార్థములో, గుర్తించి సంబోధించగలిగారు. [ద్వితీయోపదేశకాండము 32:6; కీర్తన.89:26; యోహాను.17:3]   

ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ కూడా పై ప్రవక్తల పరంపరకు చెందివుంటే ఎందుచేత దేవున్ని [అల్లాహ్] ముహమ్మదుగారు “తండ్రీ” అని సంబోధించలేకపోయాడు…?

ప్రశ్న # 35

రాబోవు లోకములోని స్థితి 

ప్రవక్తలకు మరియు అపోస్తలులకు రాబోవు లోకములోని తమ స్థితి తెలుసు.

– మోషే [ద్వి.కాం.32:32-33]

– యోబు [యోబు.19:25-26]

– దావీదు [కీర్తన.17:15]

– యేసు క్రీస్తు [లూకా.10:20; యోహాను.8:14; 14:1-3]

– పౌలు [ఫిలిప్పీ.1:21-23; 2తిమోతి.4:8]

మరి, ఒకవేళ ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ కూడా వారి పరంపరకు చెందినవాడే అయితే రాబోవు లోకములో తన స్థితిని ఎందుచేత తెలుసుకోలోకపోయాడు…?  

ప్రశ్న # 36

ఋజుమార్గము కొరకు ప్రార్థన

ముస్లీంలు ప్రతి రోజు నమాజులో భాగంగా ఎన్నోసార్లు “మమ్ము రుజుమార్గములోకి నడిపించు” అంటూ అల్లాహ్ కు ప్రార్థిస్తారు. ఇది హర్షించదగిన ప్రార్థన. ముఖ్యముగా రుజుమార్గమును ప్రేమించే ప్రతి వ్యక్తి తాను రుజుమార్గమును చేరుకునే వరకు చేయాల్సిన ప్రార్థన.   

“మాకు రుజుమార్గం (సన్మార్గం) చూపించు.” (ఖురాన్ – 1 : 6)

పై నేపథ్యములో…

ఇస్లాం మతములోనివారికి [ముస్లీంలకు] అసలు రుజుమార్గం అన్నది ఎప్పుడు చూపించబడుతుంది…?

ఒకవేళ, ముస్లీంలు రుజుమార్గములోనికి నడిపించబడే అవకాశము ఉంటే అది ఎప్పుడు జరుగుతుంది….? 

ముస్లీంలు ఎప్పుడు “మమ్మును రుజుమార్గములోనికి నడిపించినందుకు కృతజ్ఙతలు” అంటూ అల్లాహ్ ను ఆరాధించే స్థాయికి చేరుకోగలరు…?

ప్రశ్న # 37

వినాశసంకల్ప విధానం

ఖురానులోని అల్లాహ్ క్రింది విధంగా ప్రకటిస్తున్నాడు:

మేము ఏదైనా ఒక పట్టణాన్ని నాశనం చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు,అక్కడి స్థితిమంతులకు (కొన్ని) ఆజ్ఞలు జారీ చేస్తాము. కాని వారేమో అందులో అవిధేయతకు పాల్పడతారు. ఆ విధంగా వారిపై (శిక్షకు సంబంధించిన) మాట నిరూపితమవుతుంది. ఆపై మేము ఆ పట్టణాన్ని సర్వనాశనం చేసేస్తాము.” (సూరాహ్ 17:16) 

పై ఖురాను మాటలనుబట్టి అర్థం చేసుకోగలిగేవి… 

(1) అల్లాహ్ పట్టణాలను నాశనం చేయాలని సంకల్పిస్తాడు, కారణమేదీ లేకపోయినా సరే!

(2) పట్టణాలను నాశనం చేయాలన్న తన సంకల్పాన్ని అల్లహ్ మూడు అడుగులలో సాధిస్తాడు:

మొదటి అడుగు: ఆ పట్టణములోని వారికి కొన్ని ఆజ్ఙలను ఇస్తాడు. 

రెండవ అడుగు: ఆ పట్టణములోని వారు అల్లాహ్ ఇచ్చిన ఆ అజ్ఙలను మీరుతారు. అందుకు కారణం, వారు అలా మీరాలని అల్లాహ్ వారివిధిని ముందే వ్రాసి ఉంచాడు [సురాహ్ 9:51].

మూడవ అడుగు: తాను నిర్ణయించిన విధి ప్రకారం ఆ పట్టణములోని వారు తన ఆజ్ఙలను మీరి దోశులయినతరువాత వారి దోశాలనుబట్టి వారిని అల్లాహ్ నాశనము చేస్తాడు. ఈ విధంగా అల్లాహ్ తాను ఆశించినదాన్ని నెరవేరుస్తాడు.      

విస్తుపోయే విశయమేమిటంటే, అదే ఖురాను అల్లాహ్ యొక్క గుణగణాలను వివరిస్తూ ఇలా అంటున్నది…

“భూమ్యాకాశాల సర్వసత్తాధికారం అల్లాహ్‌దే. తాను కోరిన వారిని ఆయన క్షమిస్తాడు, తాను కోరినవారిని శిక్షిస్తాడు. అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడు.” (సురాహ్ 48:14) 

ఒక పట్టణాన్ని నాశనం చేయాలని సంకల్పించిన సందర్భంలో భూమ్యాకాశాల సర్వసత్తాధికారం ఉన్న అల్లాహ్ కు సురాహ్ 17:16 లో వివరించబడిన విధంగా అంత అపసోపాలు పడాల్సిన పనియేమిటి…? 

తాను కోరిన వారిని శిక్షించగలిగే సర్వసత్తాధికారం ఉన్న అల్లహ్ ఒక పట్టణాన్ని అలవోకగా తాను కోరిన వెంటనే నాశనం చేయలేడా…? 

ఒక పట్టణాన్ని నాశనం చేయటానికి అల్లాహ్ కు మూడు అడుగుల బృహత్ప్రణాలిక అవసరమా…?

ప్రశ్న # 38

ప్రవక్తల మరణపు భవిశ్యవాణి

తవ్రాత్ లోని గొప్ప ప్రవక్త మూసా [మోషే]. అలాగే, ఇంజీల్ లోని గొప్ప ప్రవక్త ఈసా [యేసు]. ఈ ఇద్దరు ప్రవక్తల ద్వారా తన తరపున మానవులకు తన సందేశాన్ని అందించిన దేవుడు [అల్లహ్] ఈ లోకములో వారి మరణము ఎలా ఉండబోతుందో అన్నది వారికి ముందే తెలియజేసాడు [ద్వి.కాం.32:49-50; మార్కు.10:32-34]. ఇలాంటి భవిశ్యవాణులన్నది కేవలము సృష్టికర్త మాత్రమే అందించగలడు.    

ఖురాను ప్రకటించే దేవుడు [అల్లాహ్] ఒకవేల నిజంగానే మూసాను [మోషేను] మరియు ఈసాను [యేసును] పంపిన దేవుడే [అల్లాహ్] అయితే మరి ముహమ్మదుగారి మరణాన్ని ఎందుచేత ముందే ఆయనకు తెలియజేయలేకపోయాడు…? 

పైగా, ఖురాను ప్రకటించే దేవుడు [అల్లాహ్] ముహమ్మదుగారి మరణాన్ని సూచిస్తూ క్రింది విధంగా అడుగుతున్నాడు…

“ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా (చాలామంది) ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు – ఇస్లాం నుంచి – వెనుతిరిగిపోతారా?” (ఖురాన్ – 3:144)

పై ప్రశ్ననుబట్టి, ఖురాను దేవునికి [అల్లాహ్] తన ప్రవక్త అయిన ముహమ్మద్ చనిపోబోతున్నాడా [సాధారణంగా వయసు మించటముతో మరణము పొందుతాడా] లేక చంపబడబోతున్నాడా [అకాల మరణాన్ని అంటే వ్యాధితో లేక ప్రమాదవశాత్తు లేక శత్రువుల చేతిలో చనిపోతాడా] అన్న ఖచ్చితమైన సమాచారం తెలీదు.

తన ప్రవక్త యొక్క మరణ విధానము గురించిన ఖచ్చితమైన సమాచారం తెలియని దేవుడు నిజదేవుడు ఎలా అవుతాడు…? 

ప్రశ్న # 39

పాపక్షమాపణకు మార్గం 

ప్రవక్తల పరంపరద్వారా  యివ్వబడిన తవ్రాత్ [లేవీయకాండము 17:11], జబూర్ [కీర్తన.4:5], మరియు ఇజీల్ [హెబ్రీ.9:22] లలో దేవుడు [అల్లహ్] పాప క్షమాపణ అందించేందుకు బలియాగము లేక రక్త ప్రోక్షణ అవసరమన్నది పదే పదే తెలియచేయబడింది. 

అదే దేవుడు [అల్లాహ్] ప్రవక్తల పరంపరలో భాగంగా ముహమ్మద్ ను పంపాడు ఆయనద్వారా ఖురాను గ్రంథ సందేశాన్ని అందించాడు అంటూ ముస్లీము దావా ప్రచారకులు నమ్మబలుకుతుంటారు. అదే నిజమైతే, ఖురానులో లేక ముహమ్మద్ గారిద్వారా పాప క్షమాపణ అందించేందుకు బలియాగము లేక రక్త ప్రోక్షణ అవసరమన్నది తెలియచేయబడలేదు ఎందుచేత? 

నిజానికి ముహమ్మదుగారు గాని లేక ఆయన తెచ్చిన ఖురాను గ్రంథము గాని ప్రవక్తల పరంపరతో మరియు వారిద్వారా యివ్వబడిన గ్రంథాలతో ఎలాంటి సంబంధము లేదు అనటానికి ఈ భేదం దృఢమైన ఆధారం కాదా…? 

ప్రశ్న # 40

ప్రళయదినాన తారుమారు 

ఖురానులోని అల్లాహ్ తాను క్షమించాలనుకునే వారిని క్షమిస్తాను, శిక్షించే వారిని  శిక్షిస్తాను అంటూ ప్రకటిస్తున్నాడు…

“భూమ్యాకాశాల సర్వసత్తాధికారం అల్లాహ్‌దే. తాను కోరిన వారిని ఆయన క్షమిస్తాడు, తాను కోరినవారిని శిక్షిస్తాడు. అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడు.” (సురాహ్ 48:14) 

దీనిని బట్టి ప్రళయదినాన ముస్లీంలు నరకానికి అలాగే ముస్లీమేతరులు స్వర్గానికి వెళ్ళాలని దేవుని [అల్లాహ్] చేత నిర్ణయించబడే అవకాశం లేక ఆ విధంగా నిర్ణయించే అధికారం దేవునికి [అల్లాహ్] ఉందంటారా లేక లేదంటారా…?
ఒకవేళ ఉంటే, మీ పరిస్థితి మీ ప్రవక్త పరిస్థితి ఏమిటి…?!

ప్రశ్న # 41

సూచనలు వచ్చిన తరువాత పాపం చేస్తే

“అల్లాహ్ వారికి ఎలా సన్మార్గం చూపగలడు? ఏ జాతివారైతే, విశ్వాసం పొందిన తరువాత – మరియు నిశ్చయంగా, సందేశహరుడు సత్యవంతుడే, అని సాక్ష్యమిచ్చిన తరువాత మరియు వారివద్దకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా – సత్య-తిరస్కారం అవలంబించారో! మరియు అల్లాహ్ దుర్మార్గులైన వారికి సన్మార్గం చూపడు. అల్లాహ్ దుర్మార్గులైన వారికి సన్మార్గం చూపడు. అలాంటి వారి శిక్ష, నిశ్చయంగా, అల్లాహ్ మరియు దేవదూతల మరియు సర్వమానవుల శాపం వారిపై పడటమే! అందులో (నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్ష ఏమాత్రం తగ్గించబడదు మరియు వారికి వ్యవధికూడా ఇవ్వబడదు.” (ఖురాన్ – 3:86-88)

“(ఓ ప్రవక్తా!) గ్రంథ ప్రజలు నిన్ను ఆకాశం నుండి వారిపై ఒక గ్రంథాన్ని అవతరింపజేయమని, అడుగుతున్నారని (ఆశ్చర్యపడకు). వాస్తవానికి వారు మూసాను ఇంతకంటే దారుణమైన దానిని కోరుతూ: ”అల్లాహ్‌ను మాకు ప్రత్యక్షంగా చూపించు!” అని అడిగారు. అప్పుడు వారి దుర్మార్గానికి ఫలితంగా వారిపై పిడుగు విరుచుకు పడింది స్పష్టమైన సూచనలు లభించిన తరువాతనే వారు ఆవుదూడను (ఆరాధ్యదైవంగా) చేసుకున్నారు. అయినా దానికి మేము వారిని క్షమించాము. మరియు మూసాకు మేము స్పష్టమైన అధికారమిచ్చాము.” (ఖురాన్ – 4:153)

పై రెండు కూడా ఖురాన్ గ్రంథం యొక్క ప్రకటనలు. మరి, స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాతకూడా పాపం చేస్తే అల్లాహ్ క్షమిస్తాడా క్షమించడా…?

ప్రశ్న # 42

షిర్క్ పాపానికి క్షమాపణ

“నిశ్చయంగా, అల్లాహ్‌ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏమాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్‌ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహాపాపం చేసినవాడు!” ఖురాన్ – 4:48

“ఇలా అను: “స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశచెందకండి. నిశ్చయంగా, అల్లాహ్‌ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.” ఖురాన్ – 39:53

“మరియు ఈ విధంగా దృఢ నమ్మకం ఉన్న వారిలో చేరాలని, మేము ఇబ్రాహీమ్‌కు భూమ్యా కాశాలపై ఉన్న మా సామ్రాజ్య వ్యవస్థను చూపించాము. ఆ పిదప రాత్రి చీకటి అతనిపై క్రమ్ము కున్నప్పుడు, అతను ఒక నక్షత్రాన్ని చూసి: ”ఇది నా ప్రభువు!” అని అన్నాడు. కాని, అది అస్తమించగానే: ”అస్తమించే వాటిని నేను ప్రేమించను!” అని అన్నాడు. ఆ తరువాత ఉదయించే చంద్రుణ్ణి చూసి: ”ఇది నా ప్రభువు!” అని అన్నాడు. కాని అది అస్త మించగానే, ఒక వేళ నా ప్రభువు నాకు సన్మార్గం చూపకపోతే నేను నిశ్చయంగా, మార్గభ్రష్టులైన వారిలో చేరిపోయేవాడను!” అని అన్నాడు.” (ఖురాన్ – 6:75-77)

ఖురానులోని పై ప్రకటనలను బట్టి ఇంతకు అల్లాహ్ షిర్క్ అనే పాపాన్ని క్షమిస్తాడా లేక క్షమించడా…?

To be continued…

 

4 Responses

  1. Amar vali says:

    ప్రసన్న కుమార్ గారు ప్రధానమైన విశ్వాసం నిరూపించుకోవడం చేత కాలేదు మీకు

    దాని మీదే శ్రద్ద వహించండి

    • telugui says:

      అమర్ వలి గారికి సలాం!

      ప్రధానమైన విశ్వాసాన్ని నిరూపించే విశయములో ప్రసన్న కుమార్ గారి సామర్థ్యాన్ని గురించి మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియచేసినందుకు మీకు మా అభినందనలు. దానికితోడు, అదెలాగోనన్నది మీరు కొంతైనా ఆధారాలతో వివరించివుంటే మీ అభిప్రాయానికి కొంత విలువ వచ్చి వుండేది. మీ అభిప్రాయాన్ని ఆధారాలతో వివరించే సామర్థ్యము మీకు వుంటే దయచేసి ఆ ప్రయత్నము చేయండి, లేకపోతే వదిలేయండి.

    • telugui says:

      అమర్ వలి గారు, మీకు మరోసారి సలాం!

      ‘ఇతరులకు చాతకాదు’ అంటూ ఆధారరహిత వ్యాఖ్యానాలు చేయటమన్నది మాత్రమే మీకు చాతనైతే దానికి మేము ఏమీ చెప్పజాలము.
      ఒకవేళ, మీకు మీ స్వంత విశ్వాసాన్ని కొంతవరకైనా నిరూపించటము చాతనైతే దయచేసి పైన యివ్వబడిన ప్రశ్నలలోని ఒక్క దానికైనా సవివరంగా సమాధానాన్ని వివరించే ప్రయత్నం చేయండి, అదీ అడగబడిన ప్రశ్నలకు మీవద్ద జవాబులంటూ వుంటేనే. మీ జవాబు లేక మౌనముద్వారా పాఠకులకు అసలు విశయం అర్థమవుతుంది.

      అల్లాహ్ మీకు సహాయం చేయును గాక!

  2. Judson says:

    Can’t these Muslims even answer a single question?? It shows how hard and impossible to defend their faith, so should be pity on themselves for not researching for the truth to find salvation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *