సృష్టికర్త నామం
నామం
బైబిలులో నామము/పేరు అన్నది కేవలం…
– సిరా గుర్తుల సంకలనం కాదు
– హీబ్రూ/గ్రీకు అక్షరాల కూర్పు కాదు
– హీబ్రూ/గ్రీకు పదాల ఉచ్చారణ కూడా కాదు
నామము లేక పేరు అన్నది వ్యక్తి యొక్క గుర్తు/గుర్తింపు. వ్యక్తి యొక్క ముద్ర లేక ప్రాతినిథ్యం.
నామము అన్నది ఆ నామాన్ని ధరించిన వ్యక్తిని సూచిస్తుంది అంతే కాక ఒకరకంగా ఆ వ్యక్తితో అనుసంధానం చేస్తుంది. నామము సూచిస్తున్న “వ్యక్తి” విశయములో ఆ నామాన్ని వుపయోగిస్తున్న వ్యక్తికి స్పష్టత వున్నంతవరకు వుపయోగించబడిన “నామము” భాషాశాస్త్రానికనుగుణంగా మర్పుచెందితే తప్పుకాదు అందులో ఏ సమస్యాలేదు.
హీబ్రూ భాషలోని నోఅహ్, అవ్రహాం, యాకొవ్, అహరోన్, మోషె, దావిద్, శ్లోమొహ్ వంటి ప్రవక్తల పేర్లను తెలుగులో నోవహు, అబ్రహాం, యాకోబు, అహరోను, మోషే, దావీదు, సొలోమోను గా అలాగే అరబ్బీ భాషలో నుహ్, ఇబ్రహీం, యకూబ్, హరూన్, మూసా, దావూద్, సులెమాన్ గా అనువదించబడ్డాయి.
సృష్టికర్త ఒక భాషను అంటే హీబ్రూ భాషనుగాని లేక గ్రీకు భాషనుగాని లేక మరొక భాషనుగాని దైవభాషగ లేక ఆత్మీయభాషగా నిర్ధేశించలేదు. అందుకు సంబంధించిన ఆజ్ఙ మరియు సూచన అంటూ ఏదీ బైబిల్ లో లేదు. సంపూర్ణ దైవగ్రంథమైన బైబిల్ హీబ్రూ భాషలోనేగాక అరామిక్ [ఎజ్రా 4:8–6:18; దానియేలు 2:4–7:28] మరియు గ్రీకు [క్రొత్తనిబంధన గ్రంథము] భాషలలోకూడా వ్రాయబడింది. దీనికి కారణము భాషలన్నీ దేవునిముందు సమానమేనన్నది విజ్ఙులు గ్రహించగలరు!
సృష్టికర్త అద్వితీయుడు. ఆయనను వివిధ భాషలలో దేవుడు [אֱלֹהִ֑ים/Θεὸς/الله/God] అని పేర్కొంటారు. అధ్యక్షుడు అన్నది అధ్యక్షుని పేరు కాదు, రాజు అన్నది ప్రజలను పరిపాలించే నాయకుని పేరు కాదు, ఉపధ్యాయుడు అన్నది బోధించే వ్యక్తి పేరు కాదు, తల్లి, తండ్రి అన్నవి జన్మనిచ్చినవారి పేర్లు కావు, అలాగే దేవుడు, సృష్టికర్త, లేక సర్వలోక నాధుడు అన్నవి పేర్లు కావు. అవి బిరుదులు (titles).
పరిశుద్ధుడు, సర్వజ్ఙాని, సర్వశక్తిమంతుడు, అద్వితీయుడు, అనంతుడు మొదలైనవి సృష్టికర్త యొక్క గుణనామాలు (attributes).
సృష్టికర్త వ్యక్తిగత నామం
లోకంలో మానవులు తమ వక్రబుద్దినిబట్టి నిజదేవుడు కాని వారిని (వాటిని) అలాగే కొందరు వ్యక్తుల ఊహలలోనుండి ఉద్భవించిన ఊహాజనిత దేవున్ని కూడా దేవుడు అంటూ పేర్కోనటం మొదలుబెట్టడంతో అలాంటి అసత్య దేవుళ్ళ నుండి తననుతాను వేరు పరచుకొంటూ మానవులు తనను గుర్తించేందుకు వీలుగా తన స్వభావలక్షణాన్ని ప్రతిభింబించే తన పేరును/నామాన్ని ప్రకటించాడు. “ఉన్నవాడు” అన్న గుణలక్షణాన్ని తెలియచేసే హీబ్రూ భాషలోని యోద్, హే, వౌ, హే అన్న నాలుగు హల్లులతో కూడిన నామాన్ని [יְהוָֹה] తన వ్యక్తిగత నామంగా సృష్టికర్త తన ప్రవక్త అయిన మోషేకు [మూసా] సుస్పష్టంగా తెలియచేసాడు [నిర్గమాకాండము 3:14-15].
నామము యొక్క సంక్షిప్త రూపము
సృష్టికర్త నామము [יְהוָֹה] యొక్క సంక్షిప్త రూపము యహ్ [יָהּ] గా ప్రవక్తల లేఖనాలలో సూచించబడింది [ని.కాం.15:2, 17:16; కీర్తన.68:4, 150:6; యెషయా.12:2, 38:11]. ఈ సంక్షిప్తరూపమే దేవున్ని స్తుతించటములో ఉపయోగించబడిన దేవుని నామము.
హీబ్రూ భాషలో హల్లెలూయ [הַ֥לְלו יָ֨הּ] యొక్క భావార్థము “యహ్ స్తుతించబడును గాక” లేక “యహ్ కు స్తుతి!”
దేవుని నామము యొక్క సంక్షిప్త రూపము యేసు క్రీస్తు యొక్క హీబ్రూ నామములో [యహ్’షువ] ప్రస్పుటముగా చూడవచ్చు. యహ్’షువ లేక యెహోషువ [יְהוֹשׁוּעַ] అన్న హీబ్రూ నామము యొక్క భావము “యహ్ రక్షించును” లేక “యహ్ రక్షకుడు.” అదే నామము పుట్టబోయే శిశువుకు పెట్టాల్సిందిగా గబ్రియేలు దూత కన్యమరియను ప్రధానము చేసుకున్న యోసేపుకు ఆదేశించాడు [మత్తయి.1:18-21].
ప్రవక్త అయిన యోవేలు ద్వారా యివ్వబడిన భవిశ్యవాణి ప్రకారము దేవుని నామమునుబట్టి ప్రార్థన చేయువారందరు రక్షించబడుదురు [యోవేలు.2:32]. క్రొత్తనిబంధన కాలములో మనుషులు రక్షంచబడుటకు ఒకే నామము యివ్వబడింది, అది యేసు క్రీస్తు నామము [అపో.కా.4:10-12]. యోవేలు ప్రవక్తద్వారా యివ్వబడిన వాగ్ధానము యొక్క నెరవేర్పు యేసు క్రీస్తు నందు నెరవేర్చబడింది [రోమా.10:12-13]. ఈ విధంగా ప్రభువైన యేసు [యహ్’షువ] నందు దేవుని నామము సంక్షిప్త రూపములో యహ్ [יָהּ] గా క్రొత్తనిబంధనా గ్రంథములోకూడా అనేక సార్లు పేర్కొనబడింది.
నిజప్రవక్తల పరంపరద్వారా యివ్వబడిన లేఖనాలలో సృష్టికర్త తన నామాన్ని గురించి తెలియచేసిన మాటలు:
“కాబట్టి నా నామము యెహోవా [יְהוָֹה] అని వారు తెలిసికొనునట్లు నేను ఈ సారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును.” (యిర్మీయ.16:21)
“నేను యెహోవాను [יְהוָֹה], సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?” (యిర్మీయ.32:27)
“ఆయన పేరు యెహోవా [יְהוָֹה]; బలాఢ్యులమీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును.” (ఆమోసు.5:9)
“ఆకాశమందు తనకొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశమండలమునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద ప్రవహింపజేయువాడును ఆయనే; ఆయన పేరు యెహోవా [יְהוָֹה].” (ఆమోసు.9:6)
“యెహోవా [יְהוָֹה] అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము.” (హోషేయ.12:5)
“యెహోవాను [יְהוָֹה] నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను.” (యెషయా.42:8)
వాదప్రతివాదన
క్రైస్తవుడు: Brother, Al = the; ilah = god; Al+ilah = Allah = “the god”
ముస్లీం: ilaha అంటే god అని మీరే అన్నారు Allah అనే పదం Allah లో I అనే అక్షరం లేదు మీమ్మల్ని మొసం చేస్తున్నారు మీ బోధకులు The god అంటే Allah కాదు అరబ్బీ లో god ni ఇలాహ అంటారు ఆ ఇలాహ పేరు అల్లాహ్ అది తేలుసుకోండి మొసపోకండి మోసం చేయకండి ఇతరులను.
క్రైస్తవుడు: సలాంవలేకుం బ్రదర్! అరబ్బీ భాషలో ‘అల్ ‘ అంటే ఆంగ్ల భాషలోని ‘the ‘ [definite article] అని, అలాగే ‘ఇలాహ్ ‘ అంటే ‘god’ అని భావము. ఈ రండు అరబ్బీ పదాల సంక్షిప్త రూపము అల్లాహ్. అల్ + ఇలాహ్ = అల్లాహ్ [al+ilah = Allah]. ఇక్కడ రెండు అరబ్బీ పదాలకు వ్యాకరణ పరంగా జరిగిన రూపాంతర ఫలితం అల్లాహ్.
మీరు పైన వ్యక్తపరచిన మీ అభిప్రాయం మోసకరమైనది కాదు అదే సత్యమయినది అని రుజువు చేయలనుకుంటే దయచేసి ఖురానులో నుండి, “ఇలాహ్ యొక్క పేరు అల్లాహ్” అనిగాని లేక “నా పేరు అల్లాహ్” అనిగాని ఉన్న ఒక్క వాక్యానైనా చూపించండి. ఈ విశములో క్రైస్తవులు మోసం చేస్తున్నారు అంటూ మీరు చేస్తున్న నిరాధారమైన నిందారోపణలకు మీరు చెప్పే ఊహాగానాలన్నవి విజ్ఙులైనవారి దృష్టిలో ఆధారాలు కావు, అవి కేవలం సాకులు మాత్రమేనన్నది గమనించండి! మీ అభిప్రాయాలను ప్రక్కకు బెట్టి, ఖురాన్ లోనుండి రుజువులను చూపించండి, మీకు సాధ్యమైతే! దయచేసి క్రింది వెబ్సైటులలోని అల్లాహ్ అన్న అరబ్బీ పదానికున్న భావార్థాన్ని అలాగే వివరణను మీరే పరిశీలించి చూడండి:
https://www.britannica.com/topic/Allah
https://www.al-islam.org/image-god-quran-mohammad-ali-shomali-mahnaz-heydarpoor/allah-ilah-and-rabb
https://www.proz.com/kudoz/arabic-to-english/religion/112612-al-llah.html
ముస్లీం: la ilaha illAllah ఈ వాక్యం లో లా ఇలాహ పదం వచ్చింది అల్లాహ్ అనే పదం వచ్చింది అంటే ఏ దేవుడు లేడు అల్లాహ్ తప్పితే అని అర్థం కాని మీరేమో ఇలాహ అన్న దేవుడే అల్లాహ్ అన్ని దేవుడే అని అంటున్నారు మీ మాటలు అర్ధం లేనివి ఎందుకంటే మీ వాదన ప్రకారం చూస్తే ఏ దేవుడు లేడు దేవుడు తప్పితే అన్న అర్థం వస్తుంది అసలు ఏమైనా అర్థవంతమైన మాటలేనా అవి సో మీ వాదన అజ్ఞానమైనది మీ దేవుడు ఎవరు అని అడిగితే మీరు దేవుడు అని అంటారా ? లేక ఏసు అని చేబుతారా ? ఏసు అని అంటారు అంటే ఏసు అనేది పేరు అదే విధంగా అల్లాహ్ యే మీ దేవుడు అని మాకు స్వయంగా ఆయనే ఖురాన్ ద్వారా తేలియజేశాడు మీకు ఏవిదంగా అయితే ఏసే మీ దేవుడు అని అంటారో అదే విధంగా మేము ఇక్కడ పేరుని గుర్తించకపోవడం హాస్యం ఏసు పేరేమిటి అని అంటే ఎంత విచిత్రంగా ఉంటుందో మాకు మీ ప్రశ్న హాస్యం గా అనిపిస్తుంది మీ దేవుడ్ని దేవుడు దేవుడు అని పిలుస్తారా ?లేక పేరుతో పిలుస్తారా? అల్లాహ్ అని పిలవండి అని అన్నాడు మా దేవుడు అబ్రహం దేవుడ్ని ఏమని పిలిచాడు దేవుడు అని పిలిచాడు అని రాసుకున్నారు మీ పండితులు కాని అదోక అబద్దం .. కల్పిత దైవాలనే పేర్లు తో పిలుస్తుంటే అబ్రహం దేవునికీ పేరు లేకుండా అబ్రహం ఎలా తన వారికీ బోద చేశాడు మీ దైవాలు కల్పితాలు నేను ఆరాధించే దైవమే నిజం దైవం అని ఎలా చేబుతాడు ఏందుకంటే వారు ని దైవం ఎవరు అని అడుగుతారు మూసి ని అడిగినట్టు అప్పుడు పేరు చేప్పకుండా దేవుడు దేవుడు అని అంటారా అబ్రహం గారు హాస్యం కాకపోతే ఏంతో అమాయకులు మీరు నిజమైన గోర్రేలు మీరు అబ్రహం దైవం పేరు అల్లాహ్ అల్లాహ్ అనేది పేరు ఏ బాష మాట్లాడే వాడైన సరే అల్లాహ్ అనే పిలవాలి తేలుగు లో అల్లాహ్ పదం లేదుగా అని … జోక్ చేయకండి ప్రసన్న కుమార్ కీ ఏన్నొ సార్లు చేప్పాను కాని తేలిసి దారి తప్పిస్తున్నాడు మిమ్మల్ని ఆదం కీ కూడా తేలియాలి దేవుని పేరేమీటో ఏందోకో మీ సోంత బుర్ర తో ఆలోచన చేయండి అది లేకపోతే నాకు కాల్ చేయండి xxxxxxxx
క్రైస్తవుడు: అస్సలాం వలేకుం, బ్రదర్! అమాయక గొర్రెలను అజ్ఙాన బక్రాలను చేసే ప్రయత్నములో మీరు ఉన్నది లేనట్లుగా లేనిదాని ఉన్నట్లుగా చెపుతూ విస్తారమైన మాటలు ఉపయోగించారు. క్రైస్తవులు నిజమైన గొర్రెలా లేక ముస్లీములు నిజమైన బక్రాల అన్నది అంశముకాదు యిక్కడ. బ్రదర్, గాలిమాటలు వద్దు; యితరులపై దుమ్మెత్తి పోయటం వద్దు. అంశాన్ని గురించి ఖురానులోని ఆధారాలతో మాట్లాడండి, మీవల్ల అయితేనే! అది మీవల్ల కాకపోతే వదిలేసెయ్యండి, ఎందుకు అనవసరమైన మాటలు?!
అల్లాహ్ [الله] అన్నది ఇస్లామీయ పదం కాదు. అది అరబ్బీ భాషా పదం. ఆ మాటకొస్తే ఆపదం ఆరవ శతాబ్ధములోనే అంటే ఇస్లాము పుట్టకముందే, ముహమ్మదుగారు పుట్టకముందే యూదులు, క్రైస్తవులు, అలాగే అరేబీయా ప్రాంతములోని విగ్రహారాధికులు కూడా ఆ పదాన్ని తాము నమ్మే దేవునికి ఉపయోగిస్తూ వచ్చారు. ఆపదం మంచిదే, దాని భావం మంచిదే. కాని అది సృష్టికర్త యొక్క నామము కాదు. సెమెటిక్ భాషలైన హీబ్రూ భాషలో ‘ఎల్’ మరియు ‘ఎలోహిం’ అన్న రెండు పదాలున్నయి, అలాగే అరబ్బీ భాషలో ‘ఇలాహ్’ మరియు ‘అల్లాహ్’ అన్న రెండు పదాలున్నాయి. కొంతవరకు అదే కోవలో తెలుగులోని ‘దైవం’ మరియు ‘దేవుడు’ అన్న పదాలున్నాయి అని చెప్పవచ్చు. ఎల్, ఎలోహిం, ఇలాహ్, అల్లహ్, దైవం, మరియు దేవుడు అన్నవి ఆయా భాషలలోని సృష్టికర్తకున్న వ్యక్తిగత నామాలు కావు. ‘దేవుడు ‘ [אֱלֹהִ֑ים/الله/God] అన్నది దేవుని నామం/పేరు కాదు. సంపూర్ణ దైవగ్రంథమైన బైబిలులో తనను తాను ప్రత్యక్షపరచుకున్న నిజదేవుడు ‘ఉన్నవాడు ‘ అనే అర్థమిచ్చే “యోద్ హే వౌ హే” అనే నాలుగు హీబ్రూ అక్షరాలతో కూడిన తన పేరును/నామమును నిజమైన తన ప్రవక్తలకు విస్పష్టంగా తెలియచేసాడు [నిర్గమాకాండము 3:14-15]: ” కాబట్టి నా నామము యెహోవా [יְהוָֹה/యోద్ హే వౌ హే] అని వారు తెలిసికొనునట్లు నేను ఈ సారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును.” (యిర్మీయా.16:21) అదేవిధంగా మీరు నమ్మే ఖురాన్ లోని దేవుని పేరు ‘అల్లాహ్ ‘ అయితే అందుకు ఆధారంగా ఖురాన్ లోనుండి “ఇలాహ్ నామము/పేరు అల్లాహ్” అనిగాని లేక “నా నామము/పేరు అల్లాహ్” అనిగాని తెలియచేయబడిన ఒక్క వాక్యాని చూపించండి చాలు. దేవుని నామము తెలుసుకోవటానికి లేఖనాలలోని దేవుని మాటలే అసలైన రుజువుగా/ఆధారంగా లెక్కించబడేది. ఈ విశయములో మన ఊహలను లేక అభిప్రాయాలను రుజువులుగా/ఆధారాలుగా తీసుకోకూడదు. దయచేసి, మీ ఖురాన్ లోనుండే రుజువులను చూపించండి. గాలిమాటలు, యితరులపై దుమ్మేత్తిపోయటం, పేర్లుపెట్టడం వద్దు!
ముస్లీం: ఎల్ అంటే ఏమిటీ ఏలోహిం ఏమిటో తేలియదా మీకు అదేవిధంగా ఇలాహ అల్లాహ్ నా ఏం చేప్పారు మీరు అల్లాహ్ అని పిలవండి అని అన్నాడు అంటే అర్థం అది పేరని అర్థం కాదా ?? అది మీకు అర్థం అయిన ఒప్పుకోరు అల్లాహ్ అని ముందు నుండే పిలిచేవారు అని మీరే అన్నారు అంటే ప్రతి సమాజానికీ దైవం పేరుని అల్లాహ్ అని పిలిచే వారు
క్రైస్తవుడు: నా ప్రియమైన సోదరా, ‘అల్లాహ్’ అన్న పదం ఇస్లాంకంటే ముందే ఉండింది అన్నదాని భావం అది అన్ని భాషలలో ఉండింది అని కాదు, అరబ్బీ భాషలో ఉండింది అని. అలాగే అన్ని భాషలలో సృష్టికర్తను ఉద్దేశించి ఉపయోగించబడిన వివిధ పదాలు/బిరుదులు ఉన్నాయి. అలాంటివే దైవం, దేవుడు, ఎల్, ఎలోహిం, ఇలాహ్, అల్లాహ్, god/God మొదలైనవి. ఒకవేళ మీరు వ్యక్త పరచిన “ప్రతి సమాజానికీ దైవం పేరుని అల్లాహ్ అని పిలిచే వారు” అన్న మీ అభిప్రాయములో లేశమాత్రమైనా సత్యం ఉంటే తెలుగు భాష మాట్లాడే ఆంధ్ర సమాజానికికూడా ఇస్లాంకు ముందే దైవం పేరు ‘అల్లాహ్’ అని ఉండాలి మరి. అలాగుండిందని ఎవరు చెప్పారు మీకు, ఎక్కడ చూసారు మీరు? ఆధారాలతో వివరించండి. సలాం!
ముస్లీం: నిజ దైవం పేరు అల్లాహ్ అల్లోనిషిపత్ అని ఉంది గా. ఏసు నామముతో ప్రార్దిస్తారు మేము అల్లాహ్ పేరు తో.
క్రైస్తవుడు:
నా ప్రశ్న: ఒకవేళ మీరు వ్యక్త పరచిన “ప్రతి సమాజానికీ దైవం పేరుని అల్లాహ్ అని పిలిచే వారు” అన్న మీ అభిప్రాయములో లేశమాత్రమైనా సత్యం ఉంటే తెలుగు భాష మాట్లాడే ఆంధ్ర సమాజానికికూడా ఇస్లాంకు ముందే దైవం పేరు ‘అల్లాహ్’ అని ఉండాలి మరి. అలాగుండిందని ఎవరు చెప్పారు మీకు, ఎక్కడ చూసారు మీరు? ఆధారాలతో వివరించండి. సలాం!
మీ జవాబు: నిజ దైవం పేరు అల్లాహ్ అల్లోనిషిపత్ అని ఉంది గా
నా కామెంటు: పైన అడగబడిన నా ప్రశ్నకు మీ అద్భుతమైన ఇస్లామీయ జ్ఙానంతోకూడిన జవాబు “నిజ దైవం పేరు అల్లాహ్ అల్లోనిషిపత్ అని ఉంది గా” నా?! అది వివరణనా?! అది ఆధారమా?!
సత్యాన్ని ఒప్పుకుంటూ ఉన్నదాన్ని ఉన్నట్లుగా లేనిదాన్ని లేనట్లుగా చెప్పగలిగే యదార్థత ఎప్పుడు వస్తుంది మీకు…?!