ముహమ్మద్ & జైనాబ్

ముహమ్మద్ & జైనాబ్

December 7, 2020 ఇస్లాం ముహమ్మదు విశ్వాసాలు 0

నేపథ్యం

ముహమ్మద్ భార్య ఖదీజ సంతలో జైద్ (ఇబ్న్ హరిథ) అనే ఒక బానిస యువకుని కొని తన భర్త అయిన ముహమ్మద్ కు బహుమానంగా యిచ్చింది. ముహమ్మద్ తనకన్నా పది సంవత్సరాలు చిన్నవాడైన ఆ బానిస యువకుని యిష్టపడి ఖదిజను ఒప్పించి కాబాలో అందరిముందు తమ దత్తపుత్రునిగా చేసుకున్నాడు. దాన్ని బట్టి, అది మొదలుకొని ఆ యువకుడు జైద్ ఇబ్న్ ముహమ్మద్ గా పిలువబడ్డాడు.

ఖదిజ చనిపోయిన తరువాత ముహమ్మద్ మదీనాకు వలస వెళ్ళి అక్కడ తన మేనత్త అయిన ఉమేమా యొక్క కూతురు భర్తను కోల్పోయి విధవరాలిగా ఉండిన జైనాబ్ బింత్ జాహ్ష్ తో జైదుకు పెళ్ళి జరిపించాడు. ఒకప్పుడు బానిసగా ఉన్నా తనకు కుమారునిగా దత్తత వచ్చిన జైద్ కు తన వంశపు అమ్మాయినే పెళ్ళిచేయడముద్వారా జైద్ సామాజిక స్థాయిని పెంచే ఉద్దేశం కూడా ఈ ప్రయత్నములో ముహమ్మద్ కు ఉండిందనే చెప్పవచ్చు. జైనాబ్ మొదట ఆ పెళ్ళికి యిష్టపడకపోవటముచేత “అల్లాహ్” ఆ పెళ్ళి చేసుకోవలసిందంటూ ముహమ్మద్ ద్వారా ఆమెకు తెలియచేసి మరీ ఒప్పించాడు అన్నట్లుగా ఖురాన్ లో ఉంటుంది [సురాహ్ 33:36].

జైద్ మరియు జైనాబ్ ల యొక్క వైవాహిక జీవితము రెండు సంవత్సరాలలోనే ముగిసింది. ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు రావటం, ముహమ్మద్ గారు నచ్చచెప్పటం, తిరిగి సమస్యలు మొదలవ్వటం కొనసాగింది. అలాంటి ఒక సందర్భములో ముహమ్మద్ గారు జైద్ లేని సమయములో అతని యింటికి వెళ్ళినప్పుడు ఎదురుచూడని విధానంలో జైనాబ్ ను చూడటం జరిగింది. ఆ విశయం యొక్క వివరాలు తరువాత జైద్ విని జైనాబ్ కు విడాకులు యిస్తానంటూ తన ఉద్దేశాన్ని మరియు సంసిద్ధతను తెలియచేయటముతో చివరికి ముహమ్మద్ వారి విడాకులకు ఒప్పుకున్నాడు.

విడాకుల తదనంతరం కొంత కాలం తరువాత జైనాబ్ ను ముహమ్మద్ పెళ్ళి చేసుకున్నాడు. సర్వసాధారణంగా అన్ని కాలాలలో అన్ని సంస్కృతులలో ఉన్నట్లుగానే 7వ శతాబ్ధములోని అరబ్బు సంస్కృతికికూడా అది ఏమాత్రము అంగీకారమై పెళ్ళి కాదు. ముహమ్మద్ తన దత్తపుత్రుడైన జైద్ చేత విడాకులు పొందిన జైనాబ్ ను పెళ్ళి చేసుకోవటాన్ని ఆ ప్రాంత అరబ్బులు విని విస్మయము పొందిన సందర్భములో తిరిగి “అల్లాహ్” తానే ఆ పని చేయమంటూ ముహమ్మద్ కు ఆజ్ఙాపించినట్లు ఖురాన్ లో వ్రాయబడింది [సురాహ్ 33:37]. ఈ సందర్భంగా ఖురాన్ ను అందించిందికూడా ముహమ్మద్ గారే అన్నది గమనములో ఉంచుకోవాలి. ఇదే సందర్భములో దత్తపుత్రులు స్వంతకుమారులు కాలేరు అంటూ కూడా “అల్లాహ్” ముహమ్మద్ ద్వారా ఒక క్రొత్త సూత్రాన్ని ప్రవేశపెట్టినట్లు ఖురాన్ లో చూస్తాము [సురాహ్ 33:4-5].

దురాచారాలతో తలమునకలుగా ఉన్న యేడవ శతాబ్ధములోని అనాగరిక అరబ్బు ప్రజలకే ముహమ్మద్ గారు చేసింది ఎంతో సంస్కారహీనమైనదిగా కనిపించింది. అయినా, ఆ కాలములో ఆనాటి పరిస్థితులలో ముహమ్మద్ గారు చేసినదాన్ని విమర్శించటానికి లేక స్వీకరించటానికి ఆనాటి సమకాలికులకే చెల్లు అని సర్దుకోవచ్చు. కాని, ఆనాటి ముహమ్మద్ గారి మాదిరి ఈనాటి మానవాళికికూడా పరిపూర్ణమైన మాదిరి అంటు దావా ప్రచారకులు ప్రకటిస్తున్నారు కాబట్టి ముహమ్మదు గారు ఈ సందర్భములో చేసిన పని ఎంతవరకు ఈనాటి సభ్యసమాజములో అంగీకారయోగ్యమోనన్నది విజ్ఙులైన చదువరులే నిర్ణయించుకోవాలి.

వాదప్రతివాదన

ముస్లీం: ప్రవక్త ముహమ్మద్ కు మరియు అయన  దత్తత కుమారుడు  జైద్ కు కేవలం 10 సం వయసే తేడా!
క్రైస్తవుడు: మంచిది! అయితే ఏమిటంటా…? ఆ కారణాన్ని బట్టి జైద్ ముహమ్మద్ కు నిజమైన దత్తపుత్రుడు కాదని చెప్పాలనుకుంటున్నారా…?! అయినా, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి దత్తపుత్రుడు కావాలంటే ఆ యిద్దరిమధ్య వయస్సులో ఎంత తేడా వుండాలి? ఒకవేళ, జైద్ ముహమ్మద్ కు దత్తపుత్రుడు అయ్యే అర్హత లేదని మీరభిప్రాయపడుతున్నట్లయితే, మరి ఆ జ్ఙానం జైద్ ను దత్తతతీసుకున్న ముహమ్మద్ గారికి లేదనేగదా మీ ఉద్దేశం…?  

ముస్లీం: ముహమ్మద్ ప్రవక్త – జననం – 570; జైద్ జననం – 581; తేడా -10 సంవత్సరాలు; తండ్రి కొడుకుల వయస అది? 
క్రైస్తవుడు: ఆ విశయం తనకన్న 10 సంవత్సరాల చిన్నవాడైన జైద్ ను దత్తతతీసుకున్న ముహమ్మద్ గారినే అడగాలి! జైద్ ను “ముహమ్మద్ కాబ లోని నల్లరాయి వద్దకు తీసుకువెళ్ళి చెప్పాడు: ఇక్కడున్న మీ అందరు సాక్షులు. జైద్ నా కొడుకు; అతనికి నేను నాకు అతడు హక్కుదారులము/వారసులము.” (W. Muir, The Life of Muhammad, ed. T.H. Wair, p. 35) ఆ తరువాత జైద్, జైద్ ఇబ్న్ ముహమ్మద్ గా పిలువబడ్డాడు. 

ముస్లీం: అబ్దుల్ ముతల్లిబ్ (కుమారుడు) అబ్దుల్లాహ్ (కుమారుడు) ముహమ్మద్ ప్రవక్త;  అబ్దుల్ ముతల్లిబ్ (కుమార్తె) ఉమైమ (కుమార్తె) జైనాబ్; జైనాబ్ గారితో  జైద్ వివాహం చేయడానికి ముందే;  ముహమ్మద్ ప్రవక్త & జైనాబ్ వరసకు బావ మరదలు; ముహుమ్మద్ ప్రవక్త 25 సం వయసు వున్నప్పుడు 40 సం వయసు వున్నా ఖతీజా గారితో వివాహం అవుతుంది ఆమె సంతలో  జైద్ అనే బానిసను కొంటుంది ముహమ్మద్ ప్రవక్త మాట మేరకు ఆమె అతన్ని దత్తత తీసుకుంటుంది అల అతను ముహమ్మద్ ప్రవక్తకు కూడా దత్తత కుమారుడు అవుతాడు; బానిసత్వాన్ని పోగొట్టాలనే బానిసగా ఉండిన జైద్ ను దత్తత తీసుకొని ఆ తరువాత జైద్ తో జైనబ్ పెళ్లి చేస్తారు ముహమ్మద్ ప్రవక్త.
క్రైస్తవుడు: బావుంది. ముహమ్మదుగారు తన జీవితములో బానిసత్వాన్ని కొనసాగిస్తూ దాన్ని ప్రోత్సహిస్తూ వచ్చినా, జైద్ విశయములో మాత్రం ఒక అభినందనీయమైన కార్యాన్ని జరిగించారనే చెప్పాలి. అందుకే ఆ తరువాత, జైద్ ఇబ్న్ ముహమ్మద్ గా జైద్ పిలువబడ్డాడు!   

ముస్లీం: బానిసత్వాన్ని పోగొట్టాలి అందరు సమానంగా ఉండాలి అనే సందేశం మానవులకు ఇవ్వాలనే ప్రవక్త తన అత్త కూతురు అంటే తన మరదలు అయినా జైనాబ్ వివాహం జైద్ తో చేస్తారు.
క్రైస్తవుడు: చాలా మంచి ఉద్దేశం. కాని, ఆ ఉద్దేశము ముహమ్మద్ గారికి నిజంగా ఉంటే తననుతాను ప్రవక్తగా ప్రకటించుకొంటూ జీవించిన సమయములో బానిసలను కొనటము మరియు అమ్మటము చేసి ఉండేవాడు కాదు. కాని, మీ గ్రంథాలు తెలియచేస్తున్న ప్రకారం అదే ఆయన చేసింది [Sahih Muslim, Book 10, Number 3901].  

ముస్లీం: కావాలంటే సొంత మరదలే  కదా అప్పుడే పెళ్లి చేసుకోవచ్చు ముహమ్మద్ ప్రవక్తయే ఆమెను కానీ అయన చేసుకోలేదు.
క్రైస్తవుడు: ముహమ్మద్ గారు జైనాబ్ ను ముందే పెళ్ళి చేసుకోకుండా ఉండటానికి కారణాలు సవాలక్ష వుండొచ్చు. మనకు తెలీదు. ముహమ్మద్ గారి మనసు మారిండొచ్చు! మొహమాటం అడ్డొచ్చిండొచ్చు! ఎప్పటినుంచో ముహమ్మద్ ను యిష్టపడుతున్న జైనాబ్ యొక్క ప్రయత్నాల ప్రభావ ఫలితం కావచ్చు! ముందే ఆమెను పెళ్ళి చేసుకోకపోవటానికి కారణం ఖచ్చితంగా ఇదే అని చెప్పలేము. అసలు కారణం దేవునికే తెలుసు.

ముస్లీం: తర్వాత జైనాబ్ & జైద్ ఇద్దరి మధ్య బంధుత్వం సరిగా ఉండదు కాబట్టి జైద్ విడాకులు ఇస్తా అంటే ముహమ్మద్ ప్రవక్త వద్దు అల్లాహ్ కు భయపడు అంటారు కానీ కొంతకాలం తర్వాత వాల్లు కలిసి వుండలేనప్పుడు  విడాకులు తీసుకోమంటారు  
క్రైస్తవుడు: అప్పుడప్పుడే ఒక మత పెద్దగా అలాగే ముస్లీం సమాజానికి నాయకునిగా స్థిరపడుతున్న సందర్భములో ముహమ్మద్ గారు ఈ విశయములో చాలా జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాడనే చెప్పాలి! అయినా, అత్-తబారి కథనం ప్రకారం ముహమ్మద్ గారు జైద్ లేని సమయములో జైనాబ్ ను ఎదురుచూడని విధానములో చూసి “హృదయాలను మార్చే అల్లాహ్ కు ప్రశంస” [Annals of al-Tabari, Edited by Mahmud Muhammad Shakir. vol. 2, p. 45] అంటూ మర్మగర్భితంగా పలుకుతూ వెళ్ళాడట. ముహమ్మద్ గారు ఆమాటలను పలుకుతూ వెళ్ళారన్న విశయం విన్న జైద్ జైనాబ్ కు విడాకులిస్తాను అంటూ ముందుకు వచ్చినట్లుంది.  

ముస్లీం: అప్పుడు అల్లాహ్ ఆజ్ఞ వస్తుంది
క్రైస్తవుడు: ఎవరిద్వారా…??? అదికూడా ముహమ్మద్ ద్వారానే కదా!!! 

ముస్లీం: జైనాబ్ గారిని ని పెళ్లి అయినతర్వాత  అప్పుడు ముహమ్మద్ ప్రవక్త లోకం తప్పుగా ప్రచారం చేస్తుంది  అనే సందేహం వ్యక్తం చేస్తారు అప్పుడు అల్లాహ్ నువ్వు లోకానికి కాదు నాకే భయపడాలి అని ఈ కింది ఆయత్ ను పంపుతారు దత్తత తీసుకున్నంత మాత్రం ఆ వ్యక్తి  అతనికి సొంత కుమారుడు కాడు అతనికి అతని సొంత తండ్రి పేరే ఉంటది కానీ మరొకరి పేరు పెట్టి ఇతని కుమారుడు అనడానికి లేదు అని సందేశం   
క్రైస్తవుడు: ఇలాంటి వాటినే స్వలాభ ప్రత్యక్షతలు [self-serving revelations] లేక స్వలాభ దైవ సందేశాలు [self-serving God’s messages] అంటారు! ఏ సమాజములోనైనా లేక ఏసంస్కృతిలోనైనా దత్తత తీసుకున్న పిల్లలను స్వంత పిల్లలుగానే పరిగణించటం అన్నది ఉత్కృష్ట విలువగ పరిగణించబడుతుంది. అలాంటి ఉత్కృష్ట విలువను కాలరాచే “ప్రత్యక్షత” అల్లాహ్ నుండి ఈ సందర్భములోనే రావాలా….? అంతకుముందు ఎందుకు రాలేదు…?! చేసిన తప్పిదాన్ని అల్లాహ్ పేరుతో సమర్దించుకునే ప్రయత్నం కాదా యిది….?   

ముస్లీం: ముహమ్మద్ ప్రవక్తకు అయన దత్తత కుమారుడికి 10 సం వయసే తేడా తండ్రి కొడుకుల వయసు కాదు
క్రైస్తవుడు: ఎవరి లెక్క ప్రకారం లేక ఎవరి నిర్వచనం ప్రకారం…?   

ముస్లీం: జైనాబ్ గారు జైద్ తో పెళ్ళికి ముందే ముహమ్మద్ ప్రవక్తకు మరదలు
క్రైస్తవుడు: అవుగాక!  అయితే…? 

ముస్లీం: (ఓ   ప్రవక్తా!   ఆ   సందర్భాన్ని   కాస్త   జ్ఞాపకం   చేసుకో)   అల్లాహ్‌   అనుగ్రహించిన   వ్యక్తితో,   నువ్వు   సయితం   ఉపకారం   చేసినవానితో  “నువ్వు   నీ   భార్యను నీ దగ్గరే   ఉండనివ్వు,   అల్లాహ్‌కు భయపడు”   అని   చెప్పేవాడివి.  కాని అల్లాహ్‌ బయటపెట్టాలని   ఉన్న   ఒక   విషయాన్ని   నువ్వు నీ మనసులోనే   దాచిపెట్టావు. నువ్వు జనులకు   భయపడేవాడివి.   నిజానికి   నువ్వు భయపడటానికి   అల్లాహ్‌యే ఎక్కువ హక్కుదారుడు. మరి   జైద్‌ ఆ   స్త్రీతో తన లాంఛనాలన్నీ   పూర్తి   చేసిన తరువాత,   మేము ఆమె   వివాహం   నీతో   జరిపిం చాము దత్తపుత్రులు   తమ భార్యల   లాంఛనాలన్నీ పూర్తిచేసిన   తరువాత (వారికి   విడాకులిచ్చిన   పిమ్మట)  వారి భార్యల (ను వివాహమాడే)   విషయంలో   ముస్లింలు ఎలాంటి   సంకోచానికీ   లోనుకాకుండా ఉండేటందుకు   మేమిలా   చేశాము.   అల్లాహ్‌   ఆజ్ఞ   అమలు   జరిగి తీరవలసిందే. (Quran – 33 : 37)  
క్రైస్తవుడు: ఈ ఖురాన్ వాక్యాల అవతరణను ముహమ్మద్ భార్య ఐషా విశ్లేషిస్తూ అన్న మాట, “నేను అన్నాను (ప్రవక్తతో), మీ ప్రభువు మీ కోరికలను మరియు ఆశలను తీర్చడానికి ఆత్రుతపడుతున్నట్లు నాకు అనిపిస్తోంది” అని అన్నాను.” [Sahih al-Bukhari, Vol. 6, Book of Prophetic Commentary on the Qur’an, Hadith 311] ఆమెకు అర్థమైపోయినట్లుంది అసలు సంగతి! మీకు మాత్రం అర్థం కావట్లేదు. మొత్తానికి, “అల్లాహ్” పేరుతో కొంతవరకైన ఆలోచించగలిగిన వారందరి నోర్లు మూయించగలిగాడు ఇస్లాం ప్రవక్త.

ముస్లీం: లోకం అసలు నిజాలు తెలుసుకోకుండా అప్పుడు కూడా ప్రవక్త మీద నిందలు వేసింది ఇప్పుడు కూడా వేస్తుంది అసలు నిజాలు బయట చెప్పరు 
క్రైస్తవుడు: ఒప్పుకోవలసిందే! అవును, ప్రవక్తలందరు చేయని తప్పులకు నిందపాలయ్యారనొచ్చు. కాని, నిజమైన ప్రవక్తలుకూడా తప్పులుచేసి శిక్షను అనుభవించారు లేక తప్పులను ఒప్పుకొని క్షమాభిక్ష పొందగలిగారు. నిజమైన ప్రవక్తలెవరు తప్పులు చేసి దేవుడే చెప్పాడంటూ సమర్ధించుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు!   

ముస్లీం: మీ చర్చిలలో ముహమ్మద్ ప్రవక్త మరియు అయన దత్తత కుమారుడు జైద్ వయసులో తేడా 10 సం అని చెప్తారా చెప్పరు 
క్రైస్తవుడు: మా చర్చిలలో ముహమ్మద్ గారిగురించే ప్రస్తావించరు ఇక జైద్ గురించి ఎందుకు చెప్తారు? ఒక వేళ చెప్పినా, పది సంవత్సరాల తేడాగురించి చెప్పాల్సిన అవసరతేంటో అసలు ఆ తేడాకున్న ప్రత్యేకతేంటో మీరింకా నిర్ధారించలేదు!

ముస్లీం: ముహమ్మద్ ప్రవక్త అత్త కూతురే జైనాబ్ అని చెప్తారా చెప్పరు 
క్రైస్తవుడు: దత్తత కుమారుని భార్య ఎవరి కూతురయితేనేమి? ఆ సమాచారం ఏరకంగా నీచమైన కార్యాన్ని మంచికార్యంగా మారుస్తుంది మహాశయా…?!

ముస్లీం: ముహమ్మద్ ప్రవక్త తండ్రి – అబ్దుల్లాహ్; మరియు జైనాబ్ గారి తల్లి ఉమైమ గారి ( అబ్దుల్లాహ్ & ఉమైమ ) తండ్రి ఒక్కరే  అబ్దుల్ ముతల్లిబ్ అనే విషయం చెప్తారా చెప్పరు
క్రైస్తవుడు: మా చర్చిలలో ఇస్లాము ప్రవక్తగారి ఆత్మకథను గురించి లేక ఆయనగారి వంశావళిని గురించి అదీగాక ఆయన సామాజిక (వ్యతిరేక)కార్యకలాపాలను గురించి చెప్పుకుంటూ గడిపే సమయం లేక అవసరత లేదు. 

ముస్లీం: ఈ నిజాలు చెప్పరు అసలు విషయం అర్ధం అవుతుంది అని
క్రైస్తవుడు: ముస్లీములు ప్రవక్తగా భావించే ముహమ్మద్ గారి గురించిన అనేకమైన విపరీత నిజాలున్నాయి. చెప్తే గిప్తే అన్నిరకాల నిజాలు చెప్పాల్సిందే. మీకు నచ్చిన నిజాలే కాదు లోగుట్టును బయలుపరచే పచ్చి నిజాలనుకూడా మీ గ్రంథాలలోనుండే చూపించవచ్చు. కాని అంత సమయం/అవసరత చర్చీలకుండదు.

ఇంతకు, దత్తపుత్రుల భార్యలను పెంపుడు తండ్రులు పెళ్ళి చేసుకోవలసిన ఆవశ్యకత యేమిటి? అందులో ఉన్న నీతి ఏమిటి, గొప్పతనం యేమిటి…?! 

పైగా, అలాంటి నీచమైన ఆచారాలను సమాజములో రూపుమాపటానికై వాటిని ఖండించాల్సింది పోగా “అల్లాహ్” తానే ఆ ఆచారాన్ని ప్రవేశపెట్టడములోని లోగుట్టు ఏమిటి…???!!!

అయినా, అలాంటి (దుర)ఆచారాన్ని తన భక్తులైన ముస్లీముల మధ్య ఆవిష్కరించటానికి కేవలం ఒక ఆజ్ఙ యిస్తే సరిపోయేదిగా. అలా కాకుండా ముహమ్మద్ గారి చేత పనిగట్టుకొని చేయించటమేమిటి…? 

ఈ ప్రణాళికంతా ముహమ్మద్ గారి స్వీయకల్పితం కాదు అనగలరా…సోదరా???!!! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *