స్త్రీలు: ఇస్లాం Vs. క్రైస్తవ్యం

స్త్రీలు: ఇస్లాం Vs. క్రైస్తవ్యం

February 17, 2021 ఇస్లాం ఖుర్'ఆన్ గ్రంథం విశ్వాసాలు స్త్రీలు 0


ఇస్లాంలో స్త్రీలు

ఇస్లాంలో స్త్రీల పాత్ర స్థాయిలు ప్రత్యేకమైనవి. స్త్రీపురుషుల మధ్య వైవిధ్యం ప్రస్పుటంగా కనిపించటమేగాక అది ఎప్పటికి పూరించలేనిది మరియు నిత్యత్వమంతా కొనసాగేది.

ఖురాన్ బోధ ప్రకారం:

(1) మొదటి మానవుడైన ఆదాముకు తప్ప మానవులందరికి తల్లిగా లెక్కించబడే మొట్టమొదట సృష్టించబడిన స్త్రీ పేరు లేదు! [ఖుర్’ఆన్ 2:35]
(2) మెస్సయ్య అయిన యేసు వారి తల్లి పేరు తప్ప వేరే యే స్త్రీ పేరు పేర్కొనబడలేదు! [ఖుర్’ఆన్ 3:42]
(3) ప్రవక్తలలోని ఒక్క స్త్రీనైనా గుర్తించలేదు!
(4) ఇద్దరు స్త్రీల సాక్ష్యం ఒక్క పురుషుని సాక్ష్యంతో సమానం. అంటే, ఒక స్త్రీ యిచ్చే సాక్ష్యం ఒక పురుషుడిచ్చే సాక్ష్యంలో కేవలం సగం విలువను మాత్రమే కలిగి ఉంటుంది! [ఖుర్’ఆన్ 2:282 = సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 1, బుక్ 6, హదిథ్ సంఖ్య 301; సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 3, బుక్ 48, హదిథ్ సంఖ్య 826; సహీహ్ అల్-బుఖారి 2658]
(5) స్త్రీలు మాత్రమే ప్రత్యక్షంగా చూసిన నేరాలను అంటే అక్రమ సంబంధము, వ్యభిచారము, నరహత్య మొదలైన వాటి విశయములో తీర్పుతీర్చేందుకు వారి సాక్షానికి పురుషుల సాక్షంతో సమానంగా గుర్తింపు లేదు.
(6) తన భార్యలలోని ఏభార్య అయినా అవిధేయతకు పాల్పడుతుందని భర్త భయపడితే అ భార్యను భర్త కొట్టవచ్చు లేక దండించవచ్చు! [ఖుర్’ఆన్ 4:34]
(7) భర్తలు భార్యలతో లైంగిక సంబంధాన్ని నాలుగు నెలల వరకు పరిత్యజించవచ్చు. ఈ హక్కు భార్యలకు యివ్వబడలేదు. [ఖుర్’ఆన్ 2:226]
(8) భర్తలకు మాత్రమే భార్యలను వదిలేసే లేక విడాకులు యిచ్చే హక్కు యివ్వబడింది! [ఖుర్’ఆన్ 65:1]
(9) భార్యకు విడాకులు యిచ్చే విశయములో భర్తకు ఒక ప్రత్యేకమైన కారణమేది యివ్వబడలేదు! [ఖుర్’ఆన్ 2:226-232]
(10) భార్యలు భర్తల యొక్క పొలంగా అభివర్ణించబడ్డారు. అంటే, భర్త తాను ఆశించిన ఏసమయములోనైనా ఏవిధంగానైనా భార్యతో సంభోగించవచ్చు! [ఖుర్’ఆన్ 2:223 = సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 6, బుక్ 60, హదిథ్ సంఖ్య 51; సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 4, బుక్ 54, హదిథ్ సంఖ్య 460; సహీహ్ ముస్లీం, బుక్ 008, హదిథ్ సంఖ్య 3367]
(11) వ్యభిచార దోషులైన భార్యలకు శిక్ష నిర్ధారించబడింది. కాని, అదే పాపం చేసిన భర్తలకు ఏ శిక్షా నిర్ధారించబడలేదు. [ఖుర్ ‘ ఆన్ 24:5; 4:15]
(12) జన్నతులో [పరలోకంలో] కూడా భర్తలు అనేకమంది భార్యలను తమ భక్తికి ప్రతిఫలంగా బహుమానంగా పొందబోతున్నారు! [ఖుర్’ఆన్ 2:25; 4:57; 44:51-57; 52:20; 55:56-58; 78:31-36]
(13) విశ్వాసురాలైన స్త్రీలు విశ్వాసులైన పురుషుల వలె జన్నతులోకి ప్రవేశిస్తారు. కాని, జన్నతులోకి ప్రవేశించే పురుషులతో సమానంగా జన్నతులోకి ప్రవేశించే స్త్రీలకు బహుమానాలుండవు! [ఖుర్’ఆన్ 3:195; 4:124; 55:70, 72, 74]
(14) ఖురాన్ లో అలాగే ఆథెంటిక్ హాదిసులలో రాబోవు లోకంలో విశ్వాసులైన ముస్లీం పురుషులు బహుమానంగా పొందబోయే భార్యల అందం మరియు వారి ఆకర్షనీయత అన్నవి పదే పదే వివిధ సందర్భాలలో వివిధ పదజాలాలతో వివరించబడ్డాయి. కాని, విశ్వాసులైన ముస్లీం స్త్రీలు బహుమానంగా పొందబోయే భర్తల అందం మరియు ఆకర్షనీయతలు మచ్చుకు కొంతైనా వివరించబడలేదు.

హదీసులలోని ముహమ్మద్ గారి బోధల ప్రకారం:

 1. స్త్రీలు తెలివిలో మరియు భక్తిలో పురుషులకంటే నిమ్నస్తాయిలో ఉన్నవారు. [సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 1, బుక్ 1, సంఖ్య 301; వాల్యూం 2, బుక్ 24, సంఖ్య 541; వాల్యూం 3, బుక్ 48, సంఖ్య 826]
 2. నరకాగ్నిలో బాధను అనుభవించేవారిలో అధిక సంఖ్యాకులు స్త్రీలే [సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 1, బుక్ 6, సంఖ్య 301; సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 2, బుక్ 24, సంఖ్య 541; సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 2, బుక్ 18, సంఖ్య 161; సహీహ్ ముస్లీం, బుక్ 036, సంఖ్య 6596]
 3. జన్నతులోకి ప్రవేశించే స్త్రీల సంఖ్య పురుషులకంటే తక్కువే [సహీహ్ ముస్లీం, బుక్ 036, సంఖ్య 6600]
 4. స్త్రీలు నాయకత్వం లేక పరిపాలన పాత్రను పోశించకూడదు [సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 9, బుక్ 88, స్నఖ్య 219]
 5. స్త్రీలు వంకర స్వభావులు [సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 7, బుక్ 62, సంఖ్య 113]
 6. ప్రార్థించే వ్యక్తి ముందు ఒక కుక్క లేక గాడిద వెళ్ళితే ఆ వ్యక్తి ప్రార్థనలు ఏరకంగా విలువను కోల్పోతాయో అదే స్థాయిలో స్త్రీలు వెళ్ళినా ఆ వ్యక్తి ప్రార్థనలు విలువను కోల్పోతాయి [సహీహ్ ముస్లీం 510అ; సహిహ్ ముస్లీం, బుక్ 4, హదిస్ సంఖ్య 1034]
 7. స్త్రీలలో అధిక శాతం కృతఘ్నులే [సహీహ్ అల్-బుఖారి, వాల్యూం 1, బుక్ 2, హదిథ్ 29]

క్రైస్తవ్యంలో స్త్రీలు

క్రైస్తవ్యం ప్రకారం పురుషుడు మరియు స్త్రీ అన్నవి ఈ భౌతిక ప్రపంచములోని జీవితకాల పాత్రలు, అవి వ్యక్తుల నిత్యత్వపు గుర్తింపులు కాదు. స్త్రీ పాత్ర పురుష పాత్రకు సహాయకరంగా ప్రవేశపెట్టబడింది. స్త్రీపురుషుల భేదం కేవలం ఇహలోకానికి భౌతిక శరీరాలకు చెందినది మాత్రమే.

బైబిల్ బోధ ప్రకారం:

(1) మొట్టమొదట సృష్టించబడిన స్త్రీ పేరు హవ్వ. [ఆది.కాం.3:20]
(2) అనేక మంది స్త్రీలు వ్యక్తిగత నామాలతో పేర్కొనబడ్డారు. [ఆది.కాం.4:19; 11:29…]
(3) కొందరు స్త్రీ ప్రవక్తలు కూడా పేర్కొనబడ్డారు. [మిర్యాం – ని.కాం.15:20; దెబోరా – న్యాయాధిపతులు 4:4; హుల్దా – 1రాజులు.22:14; 2ది.వృ.34:22; అన్నా – లూకా 2:36]
(4) స్త్రీపురుషు లిద్దరు దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృష్టించబడ్డారు. భూమిని యేలటానికి యిద్దరు నియమించబడ్డారు [ఆది.కాం.1:26-28; 5:1-2; 9:6]
(5) స్త్రీపురుషు లిద్దరు దేవుని ఎదుట క్రింది విశయాలలో సరిసమానులు:

 • గుర్తింపులో [ఆది.కాం.1:27; 9:6]
 • విలువలో [గలతీ.3:28; 1కొరింథి.11:11]
 • గమ్యంలో [మత్తయి.22:30; 1పేతురు.3:7]

(6) భార్యభర్త లిరువురు సమిష్టి అంగీకారంతో లైంగిక సంబంధాన్ని కొంత కాలం వరకు పరిత్యజించవచ్చు.[1కొరింథి.7:5]
(7) స్త్రీపురుషుల మధ్య కేవలం క్రింది అంశాలలో మాత్రమే తారతమ్యాలున్నాయి:

 • శారీర నిర్మాణాకృతిలో
 • శారీర సామర్థ్యాలలో [1పేతురు.3:7]
 • ఇహలోకములోని కుటుంభ మరియు సంఘ పాత్రలలో [ఆది.కాం.3:16; ఎఫెసి.5:22,24]

(8) విడాకుల విశయములో యిద్దరికీ సమాన హక్కులున్నాయి. [1కొరింథి.7:10,15]
(9) కేవలం వ్యభిచార కారణాన్నిబట్టి మాత్రమే తప్ప వేరే ఏకారణాన్నిబట్టికూడా విడాకులు యివ్వరాదు. [మత్తయి.19:9]
(10) వ్యభిచార పాపం విశయములో పురుషులే దోషులుగా, లెక్క అప్పగించాల్సిన వారిగా హెచ్చరించబడుతున్నారు. [మత్తయి.5:28,32; 19:9]
(11) భార్యభర్తలకు ఇద్దరికి సమానంగా లైంగిక పరమైన హక్కులున్నాయి. [1కొరింథి.7:3-5]
(12) స్త్రీపురుషులన్న భేదం అన్నది కేవలం ఈ లోకములో భౌతిక జీవితానికి సంబంధించినది. అయితే, రాబోవు లోకములో లేక పరలోకంలో అలాంటి భేదాలు లేకుండా విశ్వాసులందరు దేవదూతలవలె మార్చబడుతారు. [మత్తయి.22:30; మార్కు.12:25]

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *