మతహింసకు కారకులు ఎవరు?

మతహింసకు కారకులు ఎవరు?

August 28, 2021 Uncategorized 0

ముస్లీం అడిగిన ప్రశ్నలు & క్రైస్తవుడు యిచ్చిన జవాబులు

ముస్లీం:
1) మొదటి ప్రపంచ యుద్దాన్ని ఎవరు ప్రారంభించారు? కొన్ని లక్షల మంది చనిపోవడానికి కారణమైనది ఎవరు (ముస్లిమ్స్ కాదు)
క్రైస్తవుడు: అవును, ముస్లీంలు కాదు. పాపులైన మానవులందరికొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తూ శత్రువులను సహితం ప్రేమించమన్న ఆయన బోధలను పాటించే క్రైస్తవులు కూడా కాదు!

ముస్లీం:
2) రెండవ ప్రపంచ యుద్దాన్ని ఎవరు ప్రారంభించారు ? కొన్ని లక్షల మంది చనిపోవడానికి కారణమైనది ఎవరు (ముస్లిమ్స్ కాదు)
క్రైస్తవుడు: నిజమే ముస్లీంలు కాదు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తూ ఆయన బోధలను పాటించే క్రైస్తవులు కూడా కాదు!

ముస్లీం:
3) హోలోకాస్టలో 60 లక్షల యూదులని అన్యాయంగా చంపేసింది ఎవరు (ముస్లిమ్స్ కాదు)
క్రైస్తవుడు: అవును, ముస్లీంలు కాదు. అయితే మతాన్ని ముఖ్యంగా యేసు క్రీస్తును తిరస్కరించిన నాట్సీలు [నాజీలు] అనబడే నరరూప రాక్షసులు. వారు ఆసమయంలో యూదులను దాచిపెట్టి కాపాడిన క్రైస్తవులనుకూడా కాల్చిచంపారు. వారు, ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తూ ఆయన బోధలను పాటించే క్రైస్తవులు కానేకాదు!

ముస్లీం:
4) ఆస్ట్రేలియాలో 2కోట్ల ఆదివాసులను ఎవరు చంపారు (ముస్లిమ్స్ కాదు)
క్రైస్తవుడు: ఆస్ట్రేలియాలో అనేకమంది ఆదివాసులు సామ్రాజ్యవాదులచే చంపబడ్డారు. అయితే, మీరిస్తున్న కొన్ని లెక్కలలానే ఈ సందర్భంలో మీరిచ్చిన 2కోట్ల లెక్క అన్నదికూడా పచ్చి అబద్దం! పాపులైన మానవులందరికొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తూ శత్రువులను సహితం ప్రేమించమన్న ఆయన బోధలను పాటించే క్రైస్తవులు మాత్రం అలా చేయరు చేయజాలరు!

ముస్లీం:
5) ఉత్తరమెరికా, దక్షిణమెరికా లో కొన్ని కోట్ల భారతీయులను చంపింది ఎవరు (ముస్లిమ్స్ కాదు)
క్రైస్తవుడు: ఉత్తరమెరికా, దక్షిణమెరికాలో కొన్ని కోట్ల భారతీయులెందుకుంటారు? ఎప్పుడు చంపబడ్డారు…? తోచినవన్నీ రాసుకుంటూపోతేనే కదా మీ అసత్యాలు సత్యాలలా కనిపించే అవకాశముంటుంది?! మీరు చెపుతున్న అనేక అసత్యాలలో ఇది ఒకటి. అయినా, ఒకవేళ అలాంటిదేదైనా జరిగినా అది ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తూ ఆయన బోధలను పాటించే క్రైస్తవులు మాత్రం చేయరు. అలా చేసినవారు, ఎవరైనా ఉంటే గనుక, “మన మతం కొరకు మన దేవుని కొరకు ఎవరినైనా చంపండి” అంటూ ప్రకటించిన ఏ అబద్ధ ప్రవక్తనో వెంబడించినవారై ఉంటారు.

ముస్లీం:
6) కొన్ని లక్షల ఆఫ్రికన్ ప్రజలను బానిసలుగా చేసి అట్లాంటిక్ మహా సముద్రంలో పడేసి చంపేసింది ఎవరు (ముస్లిమ్స్ కాదు)
క్రైస్తవుడు: ఇందులోకూడా చాలా మట్టుకు అసత్యం ఉంది. ఆఫ్రికన్ ప్రజల బానిసత్వ వ్యాపరం అరబ్బులతో మొదలయ్యింది.
ఆమాటకొస్తే, క్రైస్తవుల మాదిరియైన ప్రభువైన యేసుక్రీస్తు బానిసలను కొనలేదు, అమ్మలేదు, వారిచేత ఊడిగం చేయించుకోలేదు. కాని, మీకు మాదిరిగా ఉన్న ఇస్లాం ప్రవక్త బానిసలను కొన్నాడు, అమ్మాడు, మరియు వారిచేత పనులు చెయించుకున్నాడు. అది నల్లజాతీయుల బానిస బ్రతుకులకు పునాది.

ముస్లీం: ఇలా చెప్పుకుంటూ పొతే అంతుచిక్కని అత్యంత క్రూరమైన ప్రజలెవరో ఈనాటి మీడియావాళ్ల కు అన్నీ తెలుసు కానీ మీడియాను కూడా కంట్రోల్ చేసేది వాళ్లే కాబట్టి బయటకు చెప్పడం లేదు ….అని చెప్పాడు
క్రైస్తవుడు: అవును నిజానిజాలను పరిశీలనగా చూసినవారికి “అంతుచిక్కని అత్యంత క్రూరమైన ప్రజలెవరో” వారి మతమేదో ఇట్టే తెలిసిపోతుంది. ముస్లీం దేశాలలో మీడియాలను 100% కంట్రోల్ చేస్తుండటాన్నిబట్టే అక్కడి మోసాలు, అన్యాయాలు, కృరత్వాలు బయటి ప్రపంచానికి ఇంకా బహిరంగం కావటం లేదు. అరోజు వస్తుంది. ఎదిరిచూద్దాం!

క్రైస్తవుడు అడిగిన ప్రశ్నలు

నాటి మరియు నేటి చరిత్రను పరిశీలిస్తూ పోతే జర్మన్ పండితులకేగాదు, ప్రపంచములోని ఏ పామరునికైనా అర్థమయ్యేవి క్రింది విషయాలు:   

? (1) విమర్శకులను, వ్యంగ్యోక్తులను పలికినవారిని వృద్ధులు, స్త్రీలు అన్న వివక్షకూడా లేకుండా కౄరంగా హత్యచేస్తూ ప్రారంభమైన మతం ఏది…? [క్రైస్తవ్యం కాదు] 

? (2) యూదులను దోచుకోవటంద్వారా, యూదులను చంపి వారి స్త్రీలను మరియు ఆస్తులను స్వంతం చేసుకోవటంద్వారా మొదలైన మతం యేది…? [క్రైస్తవ్యం కాదు]

? (3) ప్రారంభ తరంలోనే కారవానులపై దాడిచేస్తూ దోచుకోవటంద్వారా తన ప్రాభల్యాన్ని పట్టును పెంచుకున్న మతం ఏది…? [క్రైస్తవ్యం కాదు]

? (4) తమ మతాన్ని స్థాపించిన నాయకుడు మరణించగానే అసలు లక్షణాలను బయటపెడుతూ తమలో తాము కొట్లాటలతో వీడిపోయి ఇరుపక్షాలమధ్య ఈనాటికీ అంటే గత 1400 సంవత్సరాలుగా రగులుతున్న మారణహోమాన్ని సృష్టించిన మతం ఏది…? [క్రైస్తవ్యం కాదు]

? (5) తమ ప్రారంభ నాయకులనే ఘోరంగా చంపుకుంటూ పురిటిలోనే రక్తమడుగులు సృష్టించి ఆ మడుగుల తడితోనే పెరుగుతున్న మతం ఏది…? [క్రైస్తవ్యం కాదు] 

? (6) మతప్రారంభపు మొదటి తరంలోనే ఆస్థితగాదాలతో, హత్యలతో, యుద్ధాలతో, ఇంకా దారుణ మారణకాండతో పెట్రేగిపోయిన మతం యేది…? [క్రైస్తవ్యం కాదు]

? (7) ప్రారంభించబడిన మొదటి 150 సంవత్సరాలలోనే [7-8 శతాబ్ధాలలో] కయ్యానికి కాలు దువ్వుతూ మతం పేరిట యుద్ధాలు చేస్తూ పశ్చిమాన స్పెయిన్ మొదలుకొని తూర్పున భారతదేశం వరకు కొన్ని లక్షల ప్రాణాల వధతో విస్తరించిన మతం ఏది..? [క్రైస్తవ్యం కాదు]

? (8) ఈనాటికి తమ మతంలోనే ఉన్న యితర శాఖలవ్యక్తులను ఆత్మాహుతి దళాలచేత, మానవబాంబులచేత చంపి బుగ్గిచేస్తున్న మతం యేది…? [క్రైస్తవ్యం కాదు]

? (9) ఈనాటికీ మైనారిటీ మతాలకు చెందిన అబలలను, అమ్మాయిలను ఈజిప్టు, పాకిస్థాన్ వంటి దేశాలలో కిడ్నాప్ చేస్తూ బలవంతపు మతమార్పిడులను ఆ తరువాత మతవివాహాలను జరిపిస్తున్న అమానుష ప్రవర్తనవెనుక వున్న మతం యేది…? [క్రైస్తవ్యం కాదు] 

? (10) అరబ్బు విప్లవం ద్వారా ఈమధ్యే మొరాకోలో, లిబియాలో, ఈజిప్టులో, సిరియాలో లక్షలాది ప్రజల మారణహోమానికి అనూహ్యమైన విద్వంసానికి కారణభూతం ఏమతం…? [క్రైస్తవ్యం కాదు]

? (11) ప్రతిరోజూ కిడ్నాపులు, హత్యలు, మానభంగాలు, మానవబాంబులు, ఆత్మాహుతిదళాలలతో ప్రపంచములో భీబత్సాన్ని సృష్టిస్తున్న ఉగ్రవాద మూకలను పుట్టించి, పెంచి, పోశిస్తున్న మతం ఏది…? [క్రైస్తవ్యం కాదు]   

? (12) ఈరోజు ప్రపంచపు నలుమూలలా ఉగ్రవాద దాడులు చేస్తూ శాంతిభద్రతలకు భంగం వాటిళ్ళజేస్తూ ప్రపంచ అపఖ్యాతిని పొందిన అనేక హింసాత్మక ముష్కరుల మూకలకు పురుడుపోసి ఊపిరినిస్తున్న మతం ఏది…? [క్రైస్తవ్యం కాదు] 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *