తెలుగులో రేడియో పాఠాలు
తెలుగుతో కలిపి 105 ప్రపంచ భాషలలో అనుదిన రేడియో బైబిలు పాఠాలు… మీ ఆత్మీయ మేలు కొరకు తప్పక విని మేళ్ళు పొందండి.
తెలుగుతో కలిపి 105 ప్రపంచ భాషలలో అనుదిన రేడియో బైబిలు పాఠాలు… మీ ఆత్మీయ మేలు కొరకు తప్పక విని మేళ్ళు పొందండి.
ఈస్లాం ను గురించి అలాగే ముస్లీములు, ముస్లీముల ధార్మిక గ్రంథము ఖురాను, ఖురానులోని అల్లాహ్, మరియు ఇస్లాము మత ప్రవక్త ముహమ్మదును గురించిన ప్రాముఖ్యమైన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. వాటిలోని కొన్ని ఈ వెబ్సైటుద్వారా మీముందు ఉంచుతున్నాము. ముస్లీములకు 30 ప్రశ్నలు… ఒక ముస్లీము కొచ్చిన క్లిష్ట సందేహం… అల్లాహ్ కు భవిశ్యత్తు ముందే తెలుసా? ఖగోళ గందరగోళం… అబ్రహాము బలి: ఇస్సాకా లేక ఇష్మాయేలా?
ప్రపంచంలోనే అతి పెద్ద మాతాలు క్రైస్తవ్యం మరియు ఇస్లాం. మొదటిస్థానంలో ఉన్న క్రైస్తవ్యం ప్రభువైన యేసుక్రీస్తుద్వారా స్థాపించబడి ఆయననే మాదిరిగా కలిగి విస్తరిస్తున్నది. రెండవస్థానంలోని ఇస్లాం ముస్లీం ప్రవక్త ముహమ్మద్ ద్వారా స్థాపించబడి ఆయననే మాదిరిగా కలిగి విస్తరిస్తున్నది. ఈ రెండు మతాలలో అనేక వైవిధ్యాలుండటమేగాక వాటి స్థాపకుల మధ్య కూడా అనేక భేదాలున్నాయి. ఆ భేదాలే రెండు మతాలను/మార్గాలను విభజించటమేగాక రెండింటి గమ్యాలుకూడా వేరువేరు అన్న సత్యాన్ని నిర్దేశిస్థున్నాయి. ఆ భేదాలలోని కొన్ని క్రింద యివ్వబడినవి.…
Read more
ఖుర్’ఆన్ వాస్తవాలు ముస్లీములు ముఖ్యంగా దావా ప్రచారకులు తాము విశ్వసించే ఇస్లామీయ ధార్మిక గ్రంథమైన ఖురాను గత 1400 సంవత్సరాల వ్యవధిలో ఏమార్పులకు గురికాలేదు అని విశ్వసించటమేగాక తమ విశ్వాసాన్ని శాయాశక్తులా ఇతరులనుకూడా నమ్మబలికేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ ప్రయత్నములో “ఖురానులోని వాక్యాలలో, పదాలలో, ఇంకా అక్షరాలలో కూడా ఏ మార్పూ లేదు అంతేకాదు ప్రపంచములోని అన్ని స్థాలాలలో ఒకే ఖురాను ఉంది” అంటూ వీరావేశంతో గొంతుచించుకొని మరీ ప్రకటిస్తుంటారు. చాలావరకు ఈ రకమైన వీరవిశ్వాసానికి గల కారణం…
Read more
ముస్లీముల ధార్మిక గ్రంథం ఖుర్’ఆన్ ముస్లీంల ధార్మిక గ్రంథం. ముస్లీముల విశ్వాసమైన ఇస్లాము మతానికున్న రెండు మూలస్తంభాలలో మొదటిది ఖురాన్ [القرآن/అల్-ఖుర్’ఆన్]. రెండవ మూలస్తంభం, హదీసులు [أحاديث/అహదిత్ = సాంప్రదాయాలు; ఇతిహాసాలు; నివేదికలు; వ్యాఖ్యానాలు]. ఖురాను వాక్యాలు ఏడవ శతాబ్ధపు మొదటి అర్దభాగములో వ్రాయబడగా, వాటి సందర్భాలు, చరిత్ర, మరియు వ్యాఖ్యానాలతో కూడిన హదీసులు తొమ్మిదవ శతాబ్ధపు మొదటి అర్దభాగములో వ్రాయబడ్డాయి. ఈ వ్యాసములో ప్రధానంగా ఖురాను యొక్క చరిత్ర వివరాలు ఇస్లామీయ గ్రంథాల ఆధారంగా మీముందుంచబడుతున్నాయి.…
Read more
ఈ లోకములో అశాంతికి అరిష్టాలకు గురి అవుతూ నిరుత్సాహములో ఉన్నారా…? దురలవాట్లకు మరియు దుష్టక్రియలకు జీవితములో బానిసలై మీరు కష్టపడుతున్నారా…? జీవితములోని విరక్తిచేత లేక జిన్నులనబడే దురాత్మలచేత మానసిక వేదనను అనుభవిస్తున్నారా…? రాబోవు లోకములో పాపుల కొరకు సిద్ధపరచబడిన నరకయాతనను తప్పించుకోలేను అని భయపడుతున్నారా…? భయపడకండి! వీటన్నిటినుండి మీకు విడుదలను అందించే ఒక శుభవార్తను దేవుని [الله/אֱלֹהִ֑ים/Θεὸς/God] తరపున మీ ముందుంచుతున్నాము. ఈ శుభవార్తను ఆసాంతం చదివి గ్రహించి పాటించి దేవుని మేళ్ళు పొందండి… (1) దేవుడు…
Read more
ఈసా అల్-మసీహ్ దేవుని యొద్దనుండి [అల్లాహ్ యొద్దనుండి] ఈ లోకములోనికి రెండు పర్యాయాలు రావలసి ఉన్నది. అందులో మొదటిది 2000 సంవత్సరాల క్రితమే జరిగి పోయింది. అదే ఆయన మొదటి ఆగమనము. ఆ మొదటి ఆగమనానికి గల ముఖ్య కారణాలు ఇంజీలు గ్రంథములో పేర్కొనబడ్డాయి. అందులో కొన్ని క్రింద యివ్వబడినవి: (1) ధర్మశాస్త్రము క్రింద వున్న వారిని విడిపించుటకు (గలతీ.4:4-5) ? (2) మన పాపములకు ప్రాయశ్చిత్తముగా వుండుటకు (మార్కు.10:45; 1యోహాను.4:10) ? (3) లోకమును/పాపులను…
Read more
యూదులు యూదేతరులు అన్న భేదం ఈసా అల్-మసీహ్ నందు దేవుడు నిర్వర్తించిన రక్షణ పథకములో లేదు. ప్రభువైన దేవుడు [అదోనాయ్ ఎలోహిం] నరులందరిని ఒకే స్వరూపమందు ఒకే పోలిక చొప్పున సృష్టించి వారందరికి ఒకే అశీర్వాదాన్ని అధికారాన్ని అనుగ్రహించి వారందరితో ఒకే సార్వత్రిక నిబంధనను కూడా చేశాడు. ఆయన అందరికీ దేవుడు మరియు నాధుడు. ఆయనలో పక్షపాతం లేదు. అందుకే అందరినీ ప్రేమించి ఎవరూ నశించడం యిచ్చయించక అందరు మారుమనస్సు పొంది రక్షించబడాలని ఉద్దేశిస్తున్నాడు. అంతమాత్రమేగాక మెస్సయ్య…
Read more
క్రింది వ్యాసం ఒక ముస్లీముకొచ్చిన క్లిష్ట సందేహానికి క్రైస్తవ వివరణ. క్రైస్తవ దృక్కోణములో ధార్మికపద నిర్వచనాలు దేవుడు/సృష్టికర్త: సామాన్య లక్షణాలతో కూడిన నిర్వచనము ప్రకారం దేవుడు సర్వవ్యాప్తి, సర్వజ్ఙాని, మరియు సర్వశక్తిమంతుడు. తాత్విక లక్షణాలతోకూడిన నిర్వచనము ప్రకారము దేవుడు నిత్యుడు, అనంతుడు, మరియు అద్వితీయుడు. నైతిక లక్షణాలతోకూడిన నిర్వచనము ప్రకారం దేవుడు పరిశుద్ధుడు, న్యాయవర్తనుడు, మరియు ప్రేమామయుడు. సర్వజ్ఙానం: తెలియదగినదంతా తెలుసుకొని వుండటం. తెలియదగినదంతా దేవునికి తెలిసు. కాని, తెలియజాలనిది దేవునికికూడా తెలియదు. మరొక నిజమైన దేవున్ని…
Read more
Recent Comments