ముస్లీం జనాభా పెరుగుదల

ముస్లీం జనాభా పెరుగుదల

September 13, 2026 ఇస్లాం 0

1900లో ముస్లింల సంఖ్య కేవలం 200 మిలియన్ల (20 కోట్లు) అనుచరులు లేదా ప్రపంచ జనాభాలో 12% మాత్రమే. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న దేశాలలో అధిక జనన రేటు కారణంగా గత 100 సంవత్సరాలలో ఈ శాతం పెరిగి, 2025 నాటికి సుమారు 25% లేదా 2 బిలియన్లకు (200 కోట్లు) చేరుకుంది. ప్యూ రీసెర్చ్ (Pew Research) అంచనా ప్రకారం, 2030లో ఈ సంఖ్య సుమారు 2.2 బిలియన్లు (220 కోట్లు) మరియు 2050లో 2.8 బిలియన్లు (280 కోట్లు), లేదా ప్రపంచ జనాభాలో 30 శాతం ఉంటుంది. దీని అర్థం జనాభా పరంగా ఇస్లాం 2050లో దాదాపు క్రైస్తవ మతానికి సమానంగా ఉంటుంది.
(https://en.wikipedia.org/wiki/Muslim_population_growth)

ప్రపంచ వ్యాప్తంగా ముస్లీం జనాభా పెరగుదల ప్రప్రథమస్థానంలో కనిపించటానికి గల కారణాలు:

సంతానోత్పత్తి

  • విస్తారమైన సంతానోత్పత్తి
  • వేగవంతమైన సంతానోత్పత్తి
  • తొందరగా ప్రారంభమయ్యే సంతానోత్పత్తి

మత మార్పిడులు

  • బెదిరింపులు మరియు బలవంతాలు
  • రాయితీలు మరియు ప్రోత్సాహకాలు
  • ఏకపక్ష మత మార్పిడి కథనాలు

అజ్ఞాత మతభ్రష్టులు

  • సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ తిరస్కరణ, కఠినమైన చట్టపరమైన లేదా మరణశిక్ష విధించే మతభ్రష్టత్వ (apostasy) చట్టాలు
  • వారసత్వ సంపదను కోల్పోయే (loss of inheritance) ప్రమాదం
  • పరువు హత్యలు (honor killings) మరియు మతభ్రష్ట హత్యల (apostasy killings) ద్వారా ప్రాణభయం

అధిక సంతానోత్పత్తి రేట్లు: ముస్లిం మహిళలకు సగటున 2.9 మంది పిల్లలు ఉన్నారు; ఇది ఇతర ప్రధాన మత సమూహాల కంటే మరియు ముస్లిమేతరుల సగటు (2.2) కంటే ఎక్కువ.

తక్కువ సంతానోత్పత్తి వయస్సు: ముస్లీంలు అధిక సంఖ్యలో ఉన్న సమాజాలలో, దేశాలలో గణనీయ సంఖ్యలో ముస్లీం స్త్రీలకు 12 సంవత్సరాల వయస్సులోనే వివాహాలు జరుపుతారు, తదనంతరం సంతానోత్పత్తి మొదలవుతుంది. కాని, అధిక శాతం ముస్లీం స్త్రీలు 18 – 21 సంవత్సరాల మధ్య వివాహాలు చేసుకొని సంతానోత్పత్తి మొదలుపెడుతారు. ఇది ముస్లీం జనాభా యొక్క వేగవంతమైన పెరుగుదలకు ప్రధాన కారణం.

మతమార్పిడులు (conversions)

అనేకులు ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలోని వారు ఇస్లాం మతాన్ని స్వీకరించటానికి గల కారణాలు:

  1. ఖురానులోని దేవుడు (అల్లాహ్/ﷲ) పరిమితులు కలిగిన మానవ మేధ సులభంగా గ్రహించగలిగే విధానంలో అంటే ఒంటరివానిగా (lonely) మరియు ఏకాకిగా (single/singularity) చిత్రీకరించబడటం
  2. గత 1400 సంవత్సరాలుగా ఇస్లాం యొక్క ఆధ్యాత్మిక గ్రంథమైన ఖురానులోని ఒక్క అక్షరం కూడా మార్పు చేర్పులకు గురికాలేదు అన్న మూఢనమ్మకం
  3. సరళంగా అర్థవంతంగా మరియు నిర్మాణాత్మకంగా (structured) అనిపించే ఇస్లాం మత ఆచారాలు కట్టుదిట్టాలు
  4. ఇస్లాం మత ప్రచారకులు నమ్మబలికే అసత్యాలతో కూడిన ఖురాను గ్రంథ అద్భుతాలు
  5. ఈస్లాం మత ప్రచారకులు బైబిల్ పై మరియు క్రైస్తవ విశ్వాసంపై నిరంతరాయంగా జరుపుతున్న విష ప్రచారాలు
  6. ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా కొనసాగుతున్న క్రైస్తవ్యంలో అధిక సంఖ్యాకులు నామకార్థ క్రైస్తవులుగా ఉండి ఎలాంటి ఆత్మీయ పునాదులు లేకపోవటం
  7. దావా ప్రచారకులు, ఇస్లాం వక్తలు, మరియు ముస్లీం దేశ ప్రభుత్వాలు మతమార్పిడులను రాయితీలద్వారా, ప్రత్యేక సదుపాయాలద్వారా, బహుమతులద్వారా ప్రోత్సాహించటం

అమెరికాలో ఏటా దాదాపు 20,000 మంది అమెరికన్లు ఇస్లాంను స్వీకరిస్తున్నారు (https://en.wikipedia.org/wiki/Muslim_population_growth). ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇస్లాం మతంలోకి మారేవారికి మరియు ఆ మతాన్ని వదిలిపెట్టేవారికి మధ్య అమెరికాలో దాదాపు సమతుల్యత కనిపిస్తోంది – ఇస్లాంను స్వీకరించే అమెరికన్ల సంఖ్య, ఆ మతాన్ని వదిలిపెట్టే అమెరికన్ ముస్లింల సంఖ్యకు దాదాపు సమానంగా ఉంటుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Center) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

‘ది న్యూయార్క్ టైమ్స్’ (The New York Times) ప్రకారం, అమెరికన్ ముస్లింలలో సుమారు 25 శాతం మంది ఇస్లాంను స్వీకరించినవారు (మతం మారినవారు). బ్రిటన్‌లో ఏటా సుమారు 6,000 మంది ఇస్లాంను స్వీకరిస్తున్నారు; ‘బ్రిటిష్ ముస్లింస్ మంత్లీ సర్వే'(British Muslims Monthly Survey) లోని జూన్ 2000 నాటి ఒక కథనం ప్రకారం, బ్రిటన్‌లో కొత్తగా ఇస్లాంను స్వీకరించిన వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. గమనార్హమైన విషయం ఏమిటంటే, ఇంగ్లండు లాంటి ఐరోపా దేశాలలోని ఇస్లాం మతాన్ని స్వీకరించినవారిలో 70%-80% వరకు ఐదుసంవత్సరాలలో ఇస్లామును వదిలేస్తున్నారు.

యునైటెడ్ స్టేట్స్‌లోని ‘జనరల్ సోషల్ సర్వే’ (General Social Survey) గణాంకాల ప్రకారం, ముస్లింలుగా పెరిగిన వారిలో 32 శాతం మంది పెద్దయ్యాక ఇస్లాంను అనుసరించడం లేదు మరియు 18 శాతం మందికి ఎటువంటి మతపరమైన గుర్తింపు లేదు. ఇస్లాం స్వీకరించిన వారిలో 77% మంది క్రైస్తవ మతం నుండి వచ్చినవారు కాగా, 19% మంది ఏ మతానికీ చెందని వారి నుండి వచ్చినవారు. దీనికి భిన్నంగా, ఇస్లాంను వీడిన ముస్లింలలో 55% మంది ఏ మతానికీ చెందని వారిగా మారారు మరియు 22% మంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *